గాదెను త్రోయ నగౌరవం బన్న,
అమరవీరుల త్యాగ మపహసించుటయె!
గాదెను త్రోయ నగౌరవం బన్న,
తెలగాణ బిల్ చింపు టేమియౌనయ్య?
గాదెను త్రోయ నగౌరవం బన్న,
నీళ్ళను, కొలువులన్, నిధుల, భూములను
దోచిన వారెట్టి దోషులు కారె?
గాదెను త్రోయ నగౌరవం బన్న,
తెలగాణ భాషను ధిక్కరించియును,
హేళన చేయుట హేయమ్ము గాదె?
గాదెను త్రోయ నగౌరవం బన్న,
అరువదేఁడులనుండి యాధిపత్యమున,
దెలగాణ నణచుట దేని చిహ్నంబు?
గాదెను త్రోయ నగౌరవం బన్న,
మా బాస, మా యాస, మా పండుగలను
అవహేళనము సేయు టది యేమిటయ్య?
తెలగాణ కొఱకు మే మిల పోరు సలుప,
నఱువదేఁడుల నుండి యఱచుచునుండ,
మా సమైక్యాంధ్రమే మాకు ముద్దనుచు,
కలిసుండు డన్న మీ కండ కావరము
నేమనవలెనయ్య? ఇది యగౌరవమె?
మీరేమి యనకుండ మేమె రెచ్చితిమె?
మమ్మవమానింప మాకు రోసమ్ము
రాకుండ నుండునే గ్రక్కున నిపుడు?
మము రెచ్చఁగొట్టియు మమ్మన నేల?
సభ్యత సంస్కార సారహీనులయి,
మమ్మేల యందురు మందబలమున?
మీ యహంకారమ్ము మీ దౌష్ట్య మిపుడు
సభలోన జూపుట సంస్కార మగునె?
మా తెలంగాణు లమాయకులయ్య!
కుడుమన్నచో పండుగోయందురయ్య!
ఇట్టి వారలపైన ఈ ప్రతాపమ్ము
జూపుట హేయమ్ము సుమ్ము సీమాంధ్ర!
అణువంత దాని మహత్తంతఁ జూప
నీకె తగినదయ్య నిజముగా నేఁడు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
11 కామెంట్లు:
నిను గిచ్చెద గిల్లెద తూ
లనాడెదను వేళకోళముల సంధింతున్
విని యూరకుండవలె లే
దన నప్రజాస్వామ్యమౌను తెలగాణ్యుడా!
నిజం చెప్పారు శ్రీకాంత్ చారిగారూ,
మొగుణ్ణి కొట్టి మొరమొర అన్నట్టున్నది ఈ సీమాంధ్రుల డ్రామా. నేనేమన్నా నోర్మూసుకొని ఉండాలి. ఏమైనా అంటే వీథిలో అరిచి గోలచేస్తా! అన్నట్టున్నది ఈ సీమాంధ్రుల హై టెక్కు డ్రామా.
"నే చెప్పిన నువు వినవలె!
నీ చెప్పిన నేను వినను! నెఱి బానిసవై
నా చొప్పున నడువ వలెను!
నీచుఁడ సీమాంధ్రుఁ డనెడు నీతి రహితుఁడన్!!"
అని బాహాటంగా అంటూ, తెలంగాణులను అవమానపరుస్తుంటే ఎంతకాలమని చూస్తూ ఊరకుంటారు మన నేతలు? వాళ్ళు రెచ్చ్గగొట్టే నాటకాలాడి, మనను దోషుల్ని చేయాలనే ఈ డ్రామా ఆడారు. మనవాళ్ళు వాళ్ళ ట్రాప్‌లో పడ్డారు. "అందరికీ అత్తగారి ఆరళ్ళే కనిపిస్తాయి కానీ, కోడలు చేసే కొంటెతనం ఏమాత్రం కనిపించదు" అన్నట్టు, తప్పు మనవాళ్ళదిగానే చూపారు. రెచ్చగొట్టింది వాళ్ళు. ఇలా రెచ్చగొట్టవచ్చా? అని ఎవరూ అనడం లేదు. మన వాళ్ళే మన తప్పైనట్టుగా ఒప్పుకుని, వాళ్ళకు సర్ది చెప్పడం బాగాలేదు. ఇది వాళ్ళు అలుసుగా, మన బలహీనతగా తీసుకోడానికి అవకాశం ఇచ్చినట్టైంది. ఎంతైనా సీమాంధ్ర కుతంత్రాలు కుటిలమైనవే. ఇకనుండైనా మనవాళ్ళు ఆవేశానికి లోనుకాకుండా, సంయమనంతో ఉంటారని ఆశిద్దాం.
స్పందించినందుకు ధన్యవాదాలు.
తెరాస శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డి గల్లా పట్టుకోవడం ఖచ్చితంగా తప్పే. అయితే ఇంతకన్నా ఘోరాలు ఎన్నో జరిగినప్పుడు మీడియా ఇంత స్పందించలేదు. ఉ. సాక్షాత్ దివంగత ముఖ్యమంత్రి సోదరుడు & బాబాయి గారు సీనియర్ నాయకుడు & మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడిపై చేయి చేసుకున్నప్పుడు ఇంత రాద్దాంతం కాలేదు. క్షమాపణలతో సర్దేసుకున్నారు అందరూ.
ఎందుకంటే దొందూ దొందే కాబట్టి. మేం చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అనే ధోరణి వాళ్ళ మాటల్లో, చేతల్లో నిరంతరం ధ్వనిస్తున్నా, మన వాళ్ళు తొందరపడ్డారు. వాళ్ళు మన అమరవీరులను అనడం తప్పేకదా! దీనిపై మనవాళ్ళు రాద్ధాంతం చేయాల్సింది. వాళ్ళు అలా అనడం తప్పు అని ఒప్పించాల్సింది. మనవాళ్ళు వాళ్ళను ఊరకే వదిలేసారు. వాళ్ళు పట్టుబట్టినప్పుడు, మనవాళ్ళు కూడా మనవైపునుండి పట్టుబట్టినట్లైతే బాగుండేది. వాళ్ళ పాచిక పారకుండేది. అవకాశం జారవిడిచారు. పోనీలెండి. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళుకారు.
స్పందించినందుకు ధన్యవాదాలు.
rowdyism mee culture ani indirect ga oppukuntunnaru ga.. very good.
రౌడియిజం మీ సంస్కృతి కాబట్టే మా తెలంగాణను అరవై ఏళ్ళుగా దోచుకున్నారు...దోచుకుంటున్నారు. రౌడీయిజం మా సంస్కృతి ఐతే ఎప్పుడో మిమ్మల్ని తన్ని తగలేసేవాళ్ళం. మేం అమాయకులం కాబట్టే మీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఉడతపరుగు ఎంతదాకా...? మా తెలంగాణ ఏర్పడేదాకా! తెలంగాణ ఏర్పడడం మీలాంటి ఉడుకుమోతు వాళ్ళకు పెద్ద చెంపపెట్టు. సరేనా?
వంగవీటి రంగా & దేవినేని నెహ్రూ వారసులు రౌడీఇజం గురించి మాట్లాడడం ఎబ్బట్టుగా ఉంది. పరిటాల-సూరి పరస్పర హత్యాకాండలు గుర్తుండే మాట్లాడుతున్నారా మాస్టారూ?
అన్నా, అవతలోడు ఏమి మాట్లాడినా మనం నోళ్ళు వెళ్ళబెట్టి కూసోవాలని నేను అంటలేను. గల్లా పట్టుకోవడం మాత్రమె తప్పు పట్టిన. మనం గనక ఈన్ట్ కా జవాబ్ పత్తర్ సే అనుకుంటే ఎవళ్ళు ఉండరు కానీ గది మన తెహ్జీబ్ కాదు.
అరువదేండ్లనుండి యాగక దోపిడి
చేసిన యలవాటు దోసమనుచు
నిపుడు తొలఁగుడన్న హితముగాదయ సమై
కాంద్రమే శరణ్య మందు మెపుడు.
అరువదేండ్లనుండి యాగక దోపిడి
చేసిన యలవాటు దోసమనుచు
నిపుడు తొలఁగుడన్న హితముగాదయ సమై
క్యాంధ్రమే శరణ్య మందు మెపుడు.
(ఇంతకు ముందరి పద్యంలో టైపు దోషాలున్నాయి. మన్నించండి.)
మమ్ము జలగల వలె నిమ్ముగాఁ బట్టియు
రక్తమంత పీల్చి, బ్రతుకుఁ గూల్చి,
తొలఁగుఁడనుచు ననఁగఁ దొలఁగకయే సమై
క్యాంధ్ర పాట పాడు యములు మీరె!
మమ్ము దోచి, దోచి, మానవత్వము వీడి,
బానిసలను జేసి, బలముఁ జూపి,
యింత వరకు మీ రహితమునుం గూర్చిన
పాలనమ్ము చాలు! వదలి పొండు!!
హద్దు మీరి మీ సమైక్యాంధ్ర పాటను
పాడ, దాని యొక్క భావ మేమి?
మాకు లేని మీ సమైక్యాంధ్ర మెట్లగు?
హద్దు తెలిసికొనుమ! యాంధ్రవాఁడ!!
ప్రజల పట్ల మాకు ఱవ్వంత యైనను
ద్వేష భావ మేమి పెరుగ దయ్య!
పాలకులును, పెట్టుబడిదార్ల పైననే
పోరు సలుపుచుంటి మోయి వినుము!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి