గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జనవరి 04, 2014

ఈ నాటకాలన్నీ బూటకాలే!


రాజకీయ క్రికెట్టులో
పెరిగినులే దూకుడు!
కిరణ్ బాబు జగన్ బాబు
చంద్రబాబు దౌడు!!

తెలంగాణ ఇండియగా
మారెనయ్య చూడు!
సీమాంధ్రయె పాకిస్తాన్
రూపెత్తెను నేడు!!

మూడువందలయె పరుగులు
ఇండియాకు ససిగా!
ముప్పది పరుగులు మాత్రమె
పాకిస్తాన్ పొందెగా!

కిరణ్ బాబు చేతిలోన
ఒక్క బంతి ఉండెగా!
సిక్సర్ సాధించినా
గెలుచునెట్లు దండిగా?

టీమిండియ పరుగులే
ఉండెనులే మెండుగా!
పోటీపడి పాకిస్తాన్ గొ
ప్పలు చెప్పుట దండుగ!!

మున్నూరగు పరుగులలో
ముప్పది పరుగులు ఎంత?
ఓటమి ఖాయమ్మైనను
గప్పాల్ సెప్పుట వింత!!

కిరణ్ బాబు జగన్ బాబు
చంద్రబాబు డ్రామ,
లేదయ్యా వారికి సీ
మాంధ్ర పైన ప్రేమ!

ఓట్ల కొరకె, సీట్ల కొరకె
ఆడుచుండ్రి నాటకం!
తెలంగాణ నడ్డుకొనెడి
చేతలన్ని బూటకం!!

పలురీతుల సీమాంధ్రులు
బిల్లడ్డుట అసత్యం!
తెలంగాణ రాష్ట్రమింక
ఏర్పడుటయె సత్యం!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

గుండువారు,

"తెలంగాణ ఇండియాగ మారెనయ్య చూడు! సీమాంధ్రయె పాకిస్తాన్ రూపెత్తెను నేడు!!"

ఇటువంటివి అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు. ఆ సంగతి మీకూ తెలుసు. ఐతే, ప్రస్తుతం సీమాంధ్రులను ఏమాటపడితే ఆమాట అన్నా చెలామణీ అయ్యేందుకు తగిన వాతావరణం ఒకటి ఉందని భావించి ఇలా అసహ్యకరమైన పోలికలు తేవటం భావ్యంకాదు.

నిజం చెప్పాలంటే, ఈ నాటికి కొంత తగ్గి ఈ (అ)భాగ్యనగరంలో తగినంత తెలుగు వినిపిస్తున్నా, ఇప్పటికీ అనేక మంది ఉర్దూభాష మాత్రమే తెలిసినవాళ్ళున్నారు - తరతరాలుగా ఇక్కడే తెలుగువారితో సహజీవనం చేస్తున్నా కూడా! నేను నలభైయేళ్ళ క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఏ బజారులో చూసినా ఎనభైశాతం మందికి ఉర్దూ తప్ప తెలుగురాని పరిస్థితి, ఇప్పుడు తెలంగాణా వస్తే ఉర్దూ ఎంత పుంజుకుంటుందో చెప్పలేను కాని ఖచ్చితంగా తెలుగు వెనకడుగు వేస్తుంది. కాలక్రమేణా మీరంతా అభిమానించి నెత్తి కెక్కించుకును భజనచేస్తున్న నిజాం శైలి పరిపాలనావ్యవస్థ వచ్చి తెలంగాణాయే ఒక పాకిస్థాన్‌గా మారినంత పని కావచ్చును. ఏమంటారు?

సీమాంధ్రలోనూ బోలెడు మంది ముస్లిములు ఉన్నా అందరూ తెలుగే మాట్లాడతారు. అక్కడ అంతా తెలుగువారి సంస్కృతీసంప్రదాయాలకే పెద్దపీట వేస్తారు. అక్కడ పాకిస్థాన్ పోకదలు వచ్చే అవకాశం లేదు.

ఇకపోతే హైదరాబాదుని మినీఇండియాగా సంబరంగా చెప్పుకునే పరిస్థితిని తెలంగాణావాదులు పూర్తిగా కూలద్రోసారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తాడిగడపవారు, మమ్మల్ని తెలబాన్‍లని, పాకిస్తానీలని, తాగుబోతులని, గోచిగాళ్ళని, సోమరిపోతులని, ఇంకా అనేక రకాలుగా మీ సీమాంధ్రులు అనడం అభ్యంతరకరం కాదా? ఈ టపాలో సీమాంధ్రులంటే మా ఉద్యోగాల్ని, నీళ్ళను, నిధులను, భూములను అక్రమంగా కొల్లగొట్టి, మమ్మల్ని ఇంకా బానిసలుగా చూస్తున్న సీమాంధ్ర అవకాశవాదుల్నీ, పెట్టుబడిదారుల్నీ, ఏకపక్ష్జనేతల్నీ అంటున్నానని అర్థం చేసుకోండి. వాళ్ళనే క్రికెట్ ఆటలో పాకిస్తాన్ జట్టులో ఉన్నట్టుగా అన్నాను. మీకు ఇందులో అభ్యంతరకరం ఏముంది? మమ్మల్ని అంటే మేం నోరు మూసుకోవాలి. మిమ్మల్ని ఏమీ అనకూడదు. నిజానికి నేను సీమాంధ్ర ప్రజలని ఏమీ అనడంలేదు. మాకు అన్యాయం చేసిన వాళ్ళే సీమాంధ్రులు నా దృష్టిలో! హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర ప్రజలు, ముస్లిం ప్రజలు మా సోదరులే. మాకు ద్రోహం చేసిన వాళ్ళే మా విరోధులు.
ఐనా సీమాంధ్ర నాయకుల్ని పాకిస్తాన్ టీంతో పోల్చడంలో అసహ్యకరం ఏముంది? మీ వాళ్ళనే గుడుంబాగాళ్ళు, గోచీగాళ్ళు, తెలబాన్‍లు, సోమరిపోతులు మొదలైనవి అనడం అసహ్యకరం. వాళ్ళలా అంటుంటే "పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?" అని ఊరకున్నామే కానీ ఇలా అనడం అసహ్యకరం అంటూ వాదనకు దిగలేదు.
తెలంగాణ వస్తే ఉర్దూకే పెద్దపీట వేసుకుంటాం. మాకు మతపరమైన అభ్యంతరాలు ఏం లేవు. హిందూ, ముస్లిం భాయి భాయి అంటాం. ఇది పాకిస్తాన్‍గా మారినంత పని కావచ్చు అని మీరనవలసిన అవసరం లేదు. అక్కడ అంతా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకే పెద్దపీట వేస్తారు అంటే, ఇక్కడి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు సరియైనవి కావని మీ అభిప్రాయమా? నిజానికి మమ్మల్ని అవమానిస్తున్నది మీరే! ఉర్దూ పట్ల మీకున్న ఏహ్యభావం మీ ఈ వ్యాఖ్యలో కనిపిస్తున్నది. మమ్మల్ని ఇంతకుముందు ఎన్నో రకాలుగా సీమాంధ్రులు అవమానించారు. అసహ్యకర పదజాలంతో ఇంకా అవమానిస్తున్నారు. ఐనా మేం ఏమీ అనడం లేదు. మా సంస్కారం ఇది. కలసి మెలసి ఉండడంలో ప్రేమపూర్వకవాతావరణం ఉంటుంది. అది ముస్లిములైనా, సీమాంధ్రులైనా, మరొకరైనా అంతే. మీరు మమ్మల్నే పాకిస్తానీయులని అనాలని మీ అభిప్రాయమా? ఎప్పుడైనా తక్కువ మంది ఉన్న పాండవులు పాండవులే, ఎక్కువమంది ఉన్న కౌరవులు కౌరవులే! ధర్మం మా పక్షాన ఉంది. అధర్మం సీమాంధ్ర పక్షాన ఉంది. ఇవి నిందలు కావు. పచ్చి నిజాలు.
తెలంగాణ వచ్చిం తర్వాత మేం ఉర్దూ ఎక్కువగా మాట్లాడతాం. మీరు మీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడండి. ఇందులో వాదించడానికి ఏం ఉంది? ఎద్దేవా చేయల్సిన అవసరం ఏం ఉంది?
ఎవ్వరేం చేసినా, ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా మా తెలంగాణ ఏర్పడడం ఖాయం. స్వస్తి.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

మధుసూదన్ గారు భారత పాకిస్తాన్ ప్రస్తావన క్రికెట్ జట్టుల పోలికతో తెచ్చారనుకుంటా. కిరణ్ రెడ్డి గారి క్రికెట్ భాష దృష్ట్యా ఈ అర్ధమే తట్టాలి. (ఆయన కేవలం రంజీ ట్రాఫీ స్తాయి ఆటగాడు అనేది వాస్తవం, అయినా అది వేరే విషయం). Perhaps you prefer Andhra politicians being compared to Zimbabwe team?

ఉరుదూ భాష మీకు ఇష్టం కాకపోవోచ్చు కానీ అది భారతీయ భాష కాదనడం సబబు కాదు. హైదరాబాదులో అందరికీ తెలుగు వచ్చే తీరాలని శాసించడం అంతకన్నా అసమంజసం. ఎ భాషకున్న గొప్పదనం దానిది, ఒకే భాష రాజ్యం ఏలాలనడం ఆదిపత్వ ధోరణి తప్ప ఇంకోటి కాదు.

తెలుగు మాట్లాడితే దేశప్రేమ ఉన్నట్తనో, ఉరుదూ మాట్లాడితే పాకిస్తాన్ పోకడనో వాదించడం వల్ల అలా అన్నవారి దురభిమానం బయటపడుతుంది. ఏనాడో "మహానుభావుడు" కరుణశ్రీ ఇలాంటి తిక్కరాతలు రాసాడు మళ్ళీ ఇప్పుడు కొందరు ఆంధ్రులు అదే వినిపిస్తున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి