గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జనవరి 15, 2014

"బిల్లు ప్రతులు కాల్చడం తప్పా?" అనడం కూడా తప్పే!


మా తెలంగాణమ్ము కొరకై
అరువదేడుల నుండి జరిగెడి
ఉద్యమము నపహాస్యముకు గురి
చేయుటిది కాదా?

మా తెలంగాణమ్ము కొరకై
ఆత్మబలిదానమ్ము చేసిన
అమరులను అపహాస్యముకు గురి
చేయుటిది కాదా?

మా తెలంగాణమ్ము కొరకై
పరితపించెడి సకల జనముల
ఆశలను అపహాస్యముకు గురి
చేయుటిది కాదా?

మా తెలంగాణమ్ముకొరకై
పదవులను సైతమ్ము విడచిన
నేతలను అపహాస్యముకు గురి
చేయుటిది కాదా?

తెలంగాణా బిల్లు వచ్చుట
అరువదేడుల త్యాగఫలమే!
కలలు సాకారమ్ములౌటకు
వరము ఇది కాదా?

బిల్లు ప్రతులను కాల్చినప్పుడు
మీరు పైశాచికానందము
పొందగోరుట తప్పుకాదా?
ఇదొక సంతసమా?

తెలంగాణపు ఆశయమ్ముల,
ఆత్మఘోషల, ఉద్యమమ్ముల
బిల్లు కాల్చుట ద్వార పొందిన
దిదొక సంతసమా?

"తెలంగాణా కాంక్ష బిల్లు"ను
కాల్చుటకు మీ కిప్పు డెవ్వరు
ఎట్టి అధికారమ్ము నిడిరయ?
దౌష్ట్యమిదికాదా?

తెలంగాణపు ఆశ కూల్చుట,
తెలంగాణపు బిల్లు కాల్చుట.
ద్వేష పూరిత దౌష్ట్య చర్యయె!
విషము కక్కుటయే!!

బిల్లు కాల్చిన, రాష్ట్రమాగునె?
మనసు విరిచిన, రాష్ట్రమాగునె?
ఎన్ని చేసిన తెలంగాణము
ఆగబోదోయీ!

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆటవిక చర్యకు తక్కువ కాదు.
సౌతాఫ్రికాలో గాంధీగారు ఐడెంటిటీ కార్డులను తగలబెట్ట ప్రయత్నిస్తేనే ఆనాటి అక్కడి ప్రభుత్వం ఊరుకోలేదు, గాంధీగారి నిరశనకి జాతి వివక్షత బలమైన కారణం అయినప్పటికీ. మనస్తత్వాలు ఎంత మారిపోయాయి!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బాగా చెప్పారు రావుగారూ! గాంధీగారు ఐడెంటిటీ కార్డులను తగలబెట్ట ప్రయత్నిస్తేనే ఆనాటి అక్కడి ప్రభుత్వం ఊరుకోలేదంటే, ఈనాడు కేంద్రప్రభుత్వం రాష్ట్రపతిద్వారా పంపిన బిల్లు ప్రతులను ఈ సీమాంధ్రులు తగలబెట్టినా రాష్ట్రప్రభుత్వం చోద్యం చూస్తోందే తప్ప, ఏ చర్యా తీసుకోలేదు. అందుకే ఇది మన సర్కారు కాదు. మనకు అన్యాయం జరిగినా, మన ఆశలకు విఘాతాలు కలిగినా, ఈ ప్రభుత్వం పట్టించుకోదు. కాబట్టే తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కావాలంటున్నారు.

స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.

జై తెలంగాణ! జై జై తెలంగాణ!.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఓయి Trader! మా తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు లేని మీ టాంక్ బండ్‍పై, మీ విగ్రహాలు ఒకటో రెండో శిథిలపరిచినందుకే మీరు ఇంత దొంగ్గ ఏడుపు ఏడుస్తున్నారు. వాళ్ళు మీకు గొప్ప గొప్ప వాళ్ళైతే, మాకేం కారు. మా గొప్పవాళ్ళ విగ్రహాలు మీరు పెట్టి మీ ఔన్నత్యం మీరు చాటుకోలేదు కాబట్టి!
మా వేయిమంది అమరవీరులు అగ్నికి ఆహుతైతే మీ కంటినుండి ఒక్క నీటి చుక్కైనా వచ్చిందా? మా వాళ్ళ విగ్రహాలకూ సమప్రాధాన్యమిచ్చి విగ్రహాలేర్పాటు చేయనందుకే, మమ్మల్ని కించపరిచినందుకే టాంక్ బండ్‍పై అలా జరిగిందన్నది వాస్తవం. ఆ వాస్తవాన్నిగుర్తించకుండా, దొంగ ఏడుపులు ఏడవడం మీకే చెల్లింది. మా వేయిమంది ఆత్మబలిదానం ముందు, ప్రాణంలేని మీ విగ్రహాలెంత? కాలికి చిన్నముల్లుగుచ్చితేనే మీకు బాధకలిగితే, మరి మా కంఠాలు మీ మొండి కత్తులతో కోస్తున్నట్లున్న మీ చేతలు మాకెంత బాధ కలిగించాలి? మాది ఆవేదనైతే, మీది అహంకారం. మాది బానిసత్వమైతే, మీది ఆధిపత్యం. అందుకే మారాష్ట్రం మాకు కావాలంటున్నాం. శ్రీరంగ నీతులు నావి కావు, నీవి!
తగుదునమ్మా అంటూ మా బ్లాగుల్లోకి వచ్చి, మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోసారి చేయకు. తప్పు మీ సీమాంధ్రులదే. అరవై ఏండ్లనుండి మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, నీళ్ళు, నిధులు, కొలువులు, భూములు దురహంకారంతో, దౌర్జన్యంతో, దౌష్ట్యంతో దోచుకున్నది సీమాంధ్ర ఆధిపత్యం. మకు జరిగింది అన్యాయం. మీకు మేం మా ఆవేదనను ప్రదర్శించాం పై సంఘటన ద్వారా. ఇది తెలుసుకో. నీతులు వల్లించకు. మాకు జరిగింది ద్రోహం. మీకు జరిగింది కాదు. ఎందుకంటే మా వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా మీరు దురహంకారం చాటుకున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడే అర్హతకోల్పోయారు. అజ్ఞానం అనే గుడిసెల్లో ఉన్నది మీరు. కళ్ళు తెరిచి చూడండి. నిప్పులాంటి నిజాలు దర్శనమిస్తాయి. గుడిసెల్లోనుండి మీరే బయటికి రండి.
మళ్ళీ మా బ్లాగుల్లోకి వచ్చి ఉచిత సలహాలివ్వకు. మమ్మల్ని రెచ్చగొట్టకు.

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి