గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జనవరి 21, 2014

మీ అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధి అననేల?


అన్ని రకముల యభివృద్ధి నందినట్టి
హైదరాబాదులో మీర లడుగుపెట్టి
వృద్ధి చేసితిమనఁగఁ జెవినిఁక పూలు
పెట్టుకొన్నట్టి వారలు వేరె కలరె?

హైద్రబాదును మీరు చేయంగ వృద్ధి,
కోస్త సీమల వృద్ధినిఁ గోరలేదె?
ఏల యభివృద్ధి కాలేదు? హెచ్చులకును
మీరు పోనేల? దోపిడీదారు లీరె!

భూములను దోచి, దందాలు పొసఁగఁ జేసి,
మీరె ధనవంతులైతిరి! మీర లెట్టి
వృద్ధిఁ జేసితి రోయయ్య? యిచట మీర
లన్ని ప్రైవేటు సంస్థల నమరఁ జేసి,
లాభమార్జించి యెదిగితిరనుట నిజము!

వైద్యశాలలు, కాలేజ్‍లు, పాఠశాల
లెన్నొ నిర్మించి, విద్యుత్తు నిడె నిజాము!
మీరు ప్రైవేటు సంస్థలఁ గోరి పెట్టి
నారు సర్కారు సంస్థల తీరు మార్చి!!

వృద్ధి, యభివృద్ధి యనుచును విఱ్ఱవీఁగి,
వదరఁగా నేల? మీరలే బాగు పడియు,
హైద్రబాదును పెంచితి మనఁగ నేల?
మాయకులు గారె? మీరలే  మాయగాండ్రు!

మా తెలంగాణమును ముంచి, నీతి వాక్య
ములను బలుకంగఁ బూనితి రిలను మీరు!
చాలు చాలు నసత్యాలు చాలునయ్య!
కూఁత లాపియు రాష్ట్రమ్ముఁ గోరుకొనుఁడు!

దయ్యములవలె పట్టితి రయ్య మీరు
మా తెలంగాణమునకును! మమ్ము వీడి
తొలఁగి పోయిన మాకునుం గలుగు వృద్ధి!
మా తెలంగాణ మాకగు మానితముగ!!

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

దయ్యములవలె పట్టితి రయ్య మీరు
మా తెలంగాణమునకును! మమ్ము వీడి
తొలఁగి పోయిన మాకునుం గలుగు వృద్ధి!
మా తెలంగాణ మాకగు మానితముగ!!

మీరు రాసిన పై నాలుగు పంక్తుల సారాంశం యేమిటో విపులంగా చెబుతారా?
సీమాంధ్ర ప్రజలు తెలంగాణా వదిలి వెళ్ళిపోవాలా?

Unknown చెప్పారు...

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, బూతు, పక్కదారి పట్టించే, ****అపఖ్యాతికర, దూషణ **** విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు/ప్రకటనలు లేదా ఏవైనా అసంగత అభియోగాలను జోడించే వ్యాఖ్యాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.


మీరు ఇలాంటి 'disclaimer' పెట్టి దయ్యాలు అని సంబోధించడం యెంత వరకూ సమంజసం?

శ్యామలీయం చెప్పారు...

బహుశః నా వ్యాఖ్యను మీరు ప్రచురించరు.
కాని వ్రాయకుండా ఉండటం కష్టంగా ఉంది.
చివరకు రజాకార్లవారసుల బొమ్మలు వేసి వారిని పొగడుకొనే దుస్థితికి తెలంగాణావాదులు దిగజారటం చూస్తుంటే, పృధ్వీరాజుమీద వైరంతో ఘోరీకి సలాంచేసి దేశద్రోహానికి వెనుదీయని జయచంద్రుడు గుర్తుకు వస్తున్నాడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే దాని దిశా దశా ఎలాగుంటాయన్నది తెలుస్తూనే ఉన్నది!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి rprhp!

దయ్యములవలె తెలంగాణమును పట్టి పీడిస్తున్నవారు సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు మాత్రమే. సీమాంధ్ర ప్రజలు మా సోదరులు! వాళ్ళను ఎందుకు వెళ్ళమంటాం? మా తెలంగాణలో మేం వదలమంటున్నది సీమాంధ్రుల పాలనని! పాలకుల,పెత్తందార్ల అజమాయిషీలో తెలంగాణ మనలేకున్నది. అరవై ఏండ్ల నుండి మా ఆత్మగౌరవాన్ని మంటగలిపి, తమ అధికారాన్ని మాపై రుద్ది, మా నీళ్ళు, నిధులు, భూములు, కొలువులు మొదలైనవి కొల్లగొట్టారు. వాళ్ళ అధికారదాహం వల్ల తెలంగాణ బలైంది. అందుకే వాళ్ళను దయ్యాలతో పోల్చాను. దైవానికి వికృతి దయ్యం. దైవానికి ఉండే ఉదాత్తమైన భావాలు లేని ఈ పాలకులకు, దయ్యాలకు ఉండే తద్వ్యతిరేకమైన భావాలున్నవి కాబట్టే మా తెలంగాణ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారన్నది నా భావన. ఇది హేళన అనుకుంటే పొరపాటే! ఇది మా తెలంగాణ ప్రజల ఆవేదన.
నన్ను నిందించే ముందు, అరవై ఏండ్ల నుండీ తెలంగాణ ప్రజలు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్నవారైతే ఇలా అనేవారు కారు. ఇప్పటికైనా మాకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి స్పందించండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మా ముస్లిం సోదరులను రజాకార్ల వారసులు అనడం, వారి పట్ల మీకున్న చులకన భావానికి, ఏహ్యభావనికి తార్కాణం.
నిజాం రాజుల పాలనలో మాకు కలిగిన ఇబ్బందులతో పోల్చుకుంటే, సీమాంధ్రుల పాలనలోనే తెలంగాణ ఎక్కువ నష్టపోయింది.
నిజాం రాజులు ప్రజా క్షేమం కోరినవారుకాబట్టే వ్యవసాయం విషయంలోనూ, పరిశ్రమల విషయంలోనూ, విద్య విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ , విద్యుత్తు విషయంలోనూ, ఆఖరికి దేవాలయాల (భద్రాచలం మొ.) విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సీమాంధ్రులు తెలంగాణ వాళ్ళ హక్కుల్ని, అస్తిత్వాన్ని కాలరాశారు. నీళ్ళు, నిధులు, భూములు, కొలువులు కొల్లగొట్టారు.
ఇకపోతే, నిజాం వారసులు అని మీరంటున్నది ఎవరిని? ఎంఐఎం పార్టీ నేతలనా? వాళ్ళు ఈ తెలంగాణ ప్రజానీకంలో భాగస్థులన్నది మీరు గుర్తుంచుకోవాలి. మనదేశం అన్ని కులాలకూ, మతాలకూ, వర్గాలకూ, జాతులకూ నిలయం అన్నవిషయం మీరు మరచినట్టున్నారు.
ఇంతకు మునుపు మీరు ఒక సందర్భంలో హైదరాబాదును పాకిస్తాన్‍తో పోల్చారు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరుల ప్రాబల్యం, ఉర్దూ భాష కలిసిన తెలుగు యాస... దీన్ని మీరు జీర్ణించుకోలేక అక్కసుతో భేదభావం ప్రదర్శిస్తున్నారు.
మమ్మల్ని మహమ్మద్ ఘోరీకి సాయం చేసిన జయచంద్రులతో పోల్చడం మీ సంకుచితత్త్వానికి అద్దం పడుతున్నది. మేం దేశద్రోహులమో, మీరు దేశద్రోహులో మీ వ్యాఖ్యతోనే తెలిసిపోతున్నది. ముస్లింలంటే మీకింత ఏహ్యభావం, చులకనభావం ఉండడం మీ అల్పత్వాన్ని తెలుపుతోంది. వివిధ కుల మతాలకు ఆలవాలమైన భారతదేశంలో..ముఖ్యంగా హైదరాబాద్‍లో నివసిస్తూ ఇలా మాట్లాడడం మీకు తగదు. వెంటనే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని భావిస్తున్నాను.
ఇప్పుటి వరకు ఏ సీమాంధ్రుడిపైనైనా మా తెలంగాణ ప్రజలు దౌష్ట్యాన్ని ప్రదర్శించారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటారు.
సీమాంధ్రలో దౌష్ట్యాన్ని ప్రదర్శించింది మీ సీమాంధ్రులే నన్నది మరచిపోయారా? తెలంగాణ యాత్రికులను అడ్డుకోవడం, పేడకొట్టడం, గర్భిణులకు వైద్యం చేయకపోవడం, నాయకులను అడ్డుకోవడం... ముఖ్యంగా ఈ మధ్య జరిగిన సంఘటన...బెజవాడలో ఏళ్ళతరబడి కూలి చేసుకొని బతుకుతున్న తెలంగాణ హమాలీలను వెళ్ళిపొమ్మనడం..ఇవి మీ కంటికి కనిపించడం లేదా? మా తెలంగాణ వాళ్ళు అమాయకులు. కలుపుగోలు వాళ్ళు. ఇలాంటి మాపై దౌర్జన్యం మీరు చేస్తూ, మమ్మల్ని నిందించడం మీ అహంకారానికి పరాకాష్ఠ. ఇకనైనా మా తెలంగాణ వారిని, ముస్లిములను చిన్నచూపుచూడటం మానండి.

తోట భరత్ చెప్పారు...

దయ్యములు నీతిఁ బల్కు విధమ్ము గాదె
హైదరాబాదు నభివృద్ధి నందఁజేసి
నార మనుచు సీమాంధ్రులు మీరి పలుక!
చిత్రమే! తెలిసికొనరు చరిత్ర సుంత!

మీరలు అడుగుపెట్టి అని సంధిచేయకుండా వ్రాశారు.
హైదరాబాదులో మీర లడుగుపెట్టి... అనవచ్చును కదా.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తోట భరత్‍గారూ! మీ పద్యము బాగున్నది. అభినందనలు. మీ సూచన...

అవును మీరన్నది నిజమే! దానిని సవరించుకొనుచున్నాను. ధన్యవాదములతో...

కామెంట్‌ను పోస్ట్ చేయండి