రాష్ట్రపతియె తెలంగాణ
బిల్లు నసెంబ్లీకి పంప,
చర్చలు చేపట్టకుండ
కాలము గడుపుటె చర్చా?
సమైక్యాంధ్రపై ముందుగ
ఓటింగును చేపట్టుట
జరిపినచో చర్చలకును
ఒప్పుదుమనుటే చర్చా?
చర్చ మొదలుపెట్టి, అభి
ప్రాయము తెలుపుమని కోర,
పోడియమును చుట్టుముట్టి,
గోలచేయుటే చర్చా?
కాలమంత సాగదీసి,
అనవసరపు మాటలాడి,
తమనైజము బయటపెట్టి,
ఓటింగ్ కోరుట చర్చా?
బిల్ అంశం మాట్లాడక,
ఒకరినొకరు దూషించుచు,
మర్యాదలు మరచి, గొంతు
పెంచి తిట్టుటే చర్చా?
బిల్లుపైన చర్చచేయ
కుండ కాలమంత గడిపి,
సమయం సరిపోలేదంటూ
గడువు పెంచుమన, చర్చా?
పరీక్షలో మొదటి పేజి
రాయకయే, అదనపు ప
త్రము కోరిన రీతి, గడువు
పెంచుమనుటయే చర్చా?
దుర్మార్గమునిపుడు వీడి,
పరనిందను చేయ మాని,
త్రికరణశుద్ధిగ బిల్‌పై
మాట్లాడుట చర్చ యగును!
స్వార్థమ్మును వీడి, స్వపర
భేదమ్ములు చూపకుండ,
కేంద్రము పంపిన బిల్‌పై
మాట్లాడుట చర్చయగును!
చర్చించియు, అభిప్రాయ
ములను తెల్పి, మీ గౌరవ
ములను నిల్పుకొనుట మీకు
గౌరవ ప్రద మగునయ్యా!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
కరెక్ట్. ఇప్పటి తీరు గురించి ఆబ్జెక్టివ్ గా చెప్పారు.
ఇదంతా "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు...." అన్న రీతిలో సాగుతున్న పొలిటికల్ డ్రామా.
ఔనండీ విన్నకోటవారూ,
సిగ్గులేనివారికి ఎందరు నవ్వుకుంటే ఎంత? వాళ్ళకు కావాల్సింది వోట్లు, సీట్లు..ఆ తర్వాత నోట్లు!! అంతే. అందుకే ఇన్ని ఊసరవెల్లి వే॑షాలు, రంగులు మార్చడాలు! కళ్ళుమూసుకొని పిల్లి పాలు తాగుతూ, నన్నెవరూ చూడడం లేదు అనుకొన్నట్లుంది ఈ నాయకుల డ్రామా. వోటర్లే వీళ్ళకు తగిన బుద్ధి చెపుతారు. చూస్తూవుండండి.
స్పందించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి