గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 08, 2015

పేచీకోరు బాబు!

babu


-తెలంగాణపై పగబట్టిన ఏపీ సీఎం
-ఏడాదిగా ఎన్ని కుట్రలో!
-పోలవరం నుంచి పాలమూరుదాకా
 అడుగడుగునా అడ్డంకులు
-బాబు కుతంత్రాల జాబితాకు అంతేలేదు
- ఇదిగో బాబు కుతంత్రాల జాబితా...
ఆత్మగౌరవం నినాదంతో, నీళ్లు.. నిధులు.. నియామకాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ సమరంతో వచ్చిన రాష్ట్రం తెలంగాణ! దశాబ్దాల కల సాకారమైన రోజు 2014 జూన్ 2..! సీమాంధ్ర పార్టీల తెలంగాణ శాఖలూ సంబురాల్లో రంగులు జల్లుకున్న సందర్భం! తెలంగాణను వ్యతిరేకించినవారుసైతం అన్యమనస్కంగానో.. అర్ధమనస్సుతోనో నాలుగు కోట్ల ప్రజలకు శుభాకాంక్షలందించిన సమయం! కానీ.. ఆ సంతోషాన్ని భరించలేకపోయిన శక్తులూ ఉన్నాయి! ఆ సంతోషాన్ని చల్లార్చాలని కుయుక్తులు మొదలుపెట్టిన వ్యక్తులూ ఉన్నారు!


అలాంటి వారిలో అగ్రస్థానంలో నిలిచారన్న అపప్రథ మూటకట్టుకున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు! ఆయన మాటలు.. చేతలు.. రచించిన కుతంత్రాలు.. కొనసాగించిన కుట్రలు.. ఒకటా రెండా! పగ.. తెలంగాణ రాష్ట్రమైందని! ఉక్రోషం.. మిగులు బడ్జెట్‌తో ముందుకు సాగిపోతుందని! వెరసి తెలంగాణ ఆవిర్భవించడానికి ముందే పోలవరం ముంపు మండలాల విలీనంతో మొదలైన పేచీలు.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుదాకా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి! తెలంగాణ ప్రగతి రథానికి అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నాలు నిస్సిగ్గుగా సాగుతూనే ఉన్నాయి! నీళ్లపై గోల.. నిధుల్లో మాయ.. నియామకాల్లో రాద్ధాంతం! ఆత్మగౌరవాన్ని హత్యచేసేలా.. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే అస్థిరపర్చే కుట్ర! ఏడాదికాలంలో బాబు పన్నాగాలు ఎన్నని...!! వాటన్నింటినీ ఒకపరి పరిశీలిస్తే...


babu2

పాలమూరు పథకాన్ని దెబ్బతీయడానికి పన్నిన కుట్రలతో చంద్రబాబు తానేంటో మళ్లీమళ్లీ నిరూపించుకుంటున్నారు. తెలంగాణ మీద ఆయనలో పేరుకున్న కక్ష ఎంతటిదో చాటుకుంటున్నారు. బాబు మీద ఇంకా ఎవరికైనా ఎలాంటి భ్రమలైనా మిగిలి ఉంటే వాటిని పటాపంచలు చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏడు మండలాలను రాత్రికిరాత్రి కలిపేసుకున్న చంద్రబాబు ఏనాడూ తన తెలంగాణ వ్యతిరేకతను దాచుకోలేదు. కరెంటుకు ఆపేసి.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి అడ్డుపడి.. ఉద్యోగుల విభజనకు, హైకోర్టు విభజనకు, ప్రాజెక్టులకు, ఆటంకాలు కల్పించి.. చివరకు ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెగించి ఆయన పన్నుతున్న కుట్రల జాబితా చాలా పెద్దది. ఎన్టీఆర్ పేరుతో అవహేళన చేయడానికి సాహసించారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.. పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నా ఆంధ్ర పాలకుల పీడ ఇంకా తెలంగాణను వీడడం లేదు. వెన్నెముకలేని కుక్కమూతి పిందెల వత్తాసుతో చెలరేగుతున్న బాబు సాగించిన కుట్రల తీరుతెన్నులు ఇవీ..


రాజీనామాలు కృత్రిమ ఉద్యమాలు..


babu3

కాంగ్రెస్ చేతిలో రెండుసార్లు చావుదెబ్బలు తిని, టీఆర్‌ఎస్ మద్దతులేకుండా గెలవలేని పరిస్థితి ఏర్పడినపుడు 2009కి ముందు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. కేసీఆర్ దీక్ష తారస్థాయికి చేరినపుడు బిల్లు పెట్టండి అని అసెంబ్లీలో దబాయించి.. అఖిలపక్షంలో మద్దతు పలికి, తీరా తెలంగాణ ప్రకటన వెలువడగానే నాలుక తిప్పేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించారు. రాత్రికి రాత్రి ఎలా విభజిస్తారంటూ ప్రెస్‌మీట్‌లో రాద్ధాంతంచేశారు. కృత్రిమ ఉద్యమాన్ని ఎగదోసి.. వచ్చిన ప్రకటన వెనుకకు పోయేవరకు నిద్ర పోలేదు.


జాతీయ నాయకుల వద్ద పైరవీలు..


2014లో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పటినుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్న చంద్రబాబు.. దేశంలోని అనేక రాష్ర్టాలు తిరిగి, జాతీయ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ ఆపేందుకు యథాశక్తి యత్నించారు. చివరకు ఢిల్లీలో దీక్ష కూడా చేశారు. 


ఖమ్మం మండలాల కైంకర్యం..


విభజన జరిగి, అధికారికంగా ఇంకా రాష్ట్రం ఏర్పడకముందే ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి కుట్ర చేసి, భౌగోళికంగా తెలంగాణలో కలిసి ఉన్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపే ఆర్డినెన్సు జారీ చేయించుకున్నారు. లోయర్ సీలేరు పవర్ ప్లాంటు ను కొట్టేసి తెలంగాణకు మరింత విద్యుత్ కష్టాలు కలిగించారు. 


ఐఏఎస్‌ల విషయంలో..


ఐఏఎస్‌ల పంపిణీలోనూ చంద్రబాబు తెలంగాణకు ఉత్తమ అధికారులు దక్కుకుండా విశ్వప్రయత్నం చేశారు. సమర్థురాలైన పూనం మాలకొండయ్య తెలంగాణలో ఉంటానన్నా ఉద్దేశపూర్వకంగా ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసి ఏపీకి తీసుకువెళ్లారు. ఏపీపీఎస్సీ విభజనలోనూ చంద్రబాబు, ఆయన అధికారులు చేసిన రభస అంతాఇంతా కాదు. కనీసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కుర్చీ, బల్ల లేకుండా చేసి, నీచంగా వ్యవహరించారు.


ఉమ్మడి సంస్థల కబ్జాకు యత్నాలు..


భౌగోళికంగా ఎక్కడ ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆ ప్రభుత్వానికే చెందుతాయని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంచేసింది. దాన్ని అడ్డుపెట్టుకుని కృష్ణపట్నంలాంటి పవర్ ప్లాంటు తనదేనని మొండికేసిన చంద్రబాబు తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌లోని న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) మాత్రం కావాలని కుట్రలు పన్నాడు. న్యాక్ చైర్మన్ తానేనంటూ జీవోను సైతం జారీ చేశారు. సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి డైరెక్టర్ జనరల్‌ను నియమించి వివాదం రాజేశారు. 


బ్యాంకుల్లో చోరీలు..


కార్మికశాఖకు చెందిన ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మిక సంక్షేమ బోర్డు ఖాతాలో నిధులను ఎవరికీ చెప్పకుండానే ఆంధ్రకు మళ్లించుకున్నారు. వాస్తవంగా వీటిని కేంద్రప్రభుత్వ అనుమతిలేనిదే ఏ రాష్ట్రమూ ఏకపక్షంగా ఖర్చు చేసుకోవడానికి వీలులేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులను వినియోగించుకుంది. కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఆ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. 


శంషాబాద్‌మీద పెత్తనం..


శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెడుతూ టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌గజపతిరాజు మంత్రిగా ఉన్న పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసి అనవసర గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది. తెలంగాణమీద ఆంధ్ర పెత్తనం కొనసాగిస్తామని చాటుకున్నారు.


సర్కారును కూల్చే యత్నం..


ఇక తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్నే అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్రలేపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల మొత్తంతో అడ్డంగా ఏసీబీకి దొరికిపోయారు. చంద్రబాబు సూత్రధారిగా రూ.150 కోట్లతో టీఆర్‌ఎస్‌కు చెందిన 20మందికిపైగా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బాబు కుట్ర పన్నాడనే వాస్తవం కూడా బట్టబయలైంది. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు సంభాషించిన ఆడియో టేపులు కూడా బట్టబయలయ్యాయి.


ప్రాజెక్టుల మీద కన్నెర్ర..


అధికారంలో ఉన్నన్నాళ్లు ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం వడివడిగా ప్రాజెక్టులను చేపడుతుంటే ఓర్వలేక అడ్డం పడ్డారు. తాను గోదావరి బేసిన్‌నుంచి 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌లోకి మళ్లించేందుకు పట్టిసీమ చేపట్టి తెలంగాణ ప్రాజెక్టులపై మాత్రం గగ్గోలు పెట్టారు. రెండు కండ్లు, ఇద్దరు కొడుకుల సిద్ధాంతాలు పక్కనపెట్టి నిస్సిగ్గుగా పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తన ఎంపీ సీఎం రమేశ్‌తో రాజ్యసభలో ప్రశ్నకూడా లేవనెత్తించారు. ఈ రెండు ప్రాజెక్టులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర జల వనరుల శాఖను సీఎం రమేశ్ డిమాండు చేయడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ఠ. 


ఇదే సమయంలో గత ఏడాదికాలంలో తెలంగాణకు అనుకూలమైన ఏ ఒక్క అంశంలో కూడా ఏపీ ప్రభుత్వం సహకారం అందించిన దాఖలాలు లేవు. వందలమంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రభుత్వంలో అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకున్నా పాపాన పోలేదు. సూపర్‌న్యూమరీ పోస్టులతో తెలంగాణ వారినందరినీ తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ముందుకువస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం సహకరించడం లేదు. ఆంధ్రలో పాలన గాలికి వదిలేసి, తెలంగాణ మీద కుట్రలతోనే చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని ఆంధ్ర ప్రాంత ప్రజలే విమర్శిస్తున్నారు.


సాగర్ మీద దాదాగిరి..


కేటాయించిన వాటా కంటే ఎక్కువ కృష్ణాజలాలను వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది నాగార్జునసాగర్ డ్యాంపై సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, మాచర్ల ఎమ్మెల్యే ఏపీ పోలీసు బలగాలతో డ్యాంపైకి వచ్చి దౌర్జన్యంగా గేట్లు ఎత్తారు. రెండు రాష్ర్టాల పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి చంద్రబాబే సూత్రధారి. గత ఏడాది వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పులిచింతలలో ఏకపక్షంగా పది టీఎంసీల నీటిని నిల్వ చేసింది. 


విద్యుత్ చౌర్యం..


రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమస్య ఉంటుందని తెలిసీ తెలంగాణకు రావలిసిన కరెంటుకు గండికొట్టారు. ఏకపక్షంగా, పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)లను రద్దు చేసుకుని తెలంగాణను అంధకారంలో నెట్టాలని కుట్రలకు పాల్పడ్డారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి దక్కాల్సిన కరెంటుకు గండికొట్టారు. కృష్ణపట్నంలో 40% కరెంటు తెలంగాణకు దక్కుతుందనే కక్షతో దానిని అధికారికంగా ప్రారంభించకుండా అనధికారికంగా విద్యుత్ వాడేసుకున్నారు.


జల విద్యుత్‌కు ఆటంకం..


విద్యుత్ కోతలు నివారించడానికి నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద తెలంగాణ చేపట్టిన విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయించడానికి చంద్రబాబు చేయని కుట్రలు లేవు. చంద్రబాబు ఫిర్యాదు వల్లనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మూడు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది.


హైదరాబాద్ మీద కుట్ర..


రాష్ట్ర విభజన తర్వాత ఏడాదిపాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించేందుకు సెక్షన్-8 పేరిట చంద్రబాబు బ్యాండ్‌మేళం గత్తర లేపింది. ఆంధ్ర పోలీసులను హైదరాబాద్‌లో దింపి యుద్ధానికి తెర తీశారు. కేంద్రం దగ్గర పైరవీలు చేసి హైదరాబాద్‌పై పెత్తనానికి విఫలయత్నం చేశారు. 


కోర్టుల విభజనకు ససేమిరా..


హైకోర్టు విభజన ఎప్పుడో ముగియాల్సిన ప్రక్రియ. కానీ చంద్రబాబు కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై జాప్యం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తామే ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేసుకుంటామని చెప్పినా అడ్డుపడుతూనే ఉన్నారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి