గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 09, 2015

నిమ్స్‌లో "ఆంధ్రా" డాక్టర్ల హైడ్రామా...!!!

-మూడంచెల ప్రమోషన్ల విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
-వాటినే డైరెక్టర్‌కు వ్యతిరేకంగా తీసుకున్నట్లు బిల్డప్
-2011నాటి ఈబీ తీర్మానంపై ఇప్పుడు రచ్చ

niims

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదిదాటినా ఆంధ్రా ఉద్యోగులు, సంఘాల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మున్సిపల్ సమ్మెలో ఆంధ్రా సంఘాల కుయుక్తులు మరువక ముందే నిమ్స్‌లోనూ ఇదే తరహా కుట్ర బయటపడింది. నాలుగంచెల ప్రమోషన్ల విధానమే కావాలని, మూడంచెల విధానం రద్దు చేయాలని కోరుతూ ఇటీవల నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్వర్యంలో పలువురు డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. ఇందులో అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్లే ఉన్నట్లు సమాచారం. ఇక శనివారం పలువురు డాక్టర్లు నిమ్స్‌లో మూడంచెల విధానానికి వ్యతిరేకంగా ఫ్యాకల్టీతో సంతకాల సేకరణ చేపట్టారు. నాలుగంచెల విధానాన్ని కోరుతున్నవారంతా సంతకాలు చేశారు. అయితే, ఫ్యాకల్టీ అసోసియేషన్ కీలక నేతలు కవరింగ్ లెటర్‌ను మార్చేశారు. ఇందులో డైరెక్టర్ ఫ్యాకల్టీ వ్యతిరేక చర్యలు, నిమ్స్ వ్యతిరేక చర్యలు చేపడుతున్నందుకు, మీడియాకు, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నందుకు మేం మంగళవారం నుంచి క్యాజువల్ లీవ్‌లో వెళ్తున్నాం అని రాశారు. ఈ లెటర్‌ను తిరిగి డైరెక్టర్‌కే ఇవ్వడం కొసమెరుపు. అయితే దానిని ఆయన పరిశీలించకుండా పక్కన పెట్టారు. అనంతరం నిమ్స్ ఫ్యాకల్టీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌ను కలిసేందుకు వచ్చినప్పుడు ఆందోళనపై చర్చించారు. 


ఈ సమయంలో లెటర్‌లో ఉన్న అంశాన్ని చూసిన ఆ ఫ్యాకల్టీ డైరెక్టర్‌కు అసలు విషయం చెప్పేశారు. తాము సంతకాలు పెట్టింది డైరెక్టర్‌కు వ్యతిరేకంగా కాదని, మూడంచెల ప్రమోషన్ల విధానానికి వ్యతిరేకంగా అని వెల్లడించారు. లెటర్‌ను, సంతకాలను పరిశీలించగా, పాత లెటర్‌ను చించి వేసినట్లు కనిపించింది. దీనిపై వెంటనే డైరెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్‌చందాకు సమాచారం ఇచ్చారు. 2011లోనే నిమ్స్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మూడంచెల ప్రమోషన్ల విధానంపై తీర్మానించారని, ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ధర్నా చేయడం తెలంగాణ పీజీ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి