గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 01, 2015

168 కోట్ల ఎస్‌ఎఫ్‌సీ నిధులకు ఏపీ టెండర్!! అడ్డుకున్న తెలంగాణులు!!!

- ఏపీకి 70శాతం.. తెలంగాణకు 30శాతం పంచాలని వార్షిక సమావేశంలో కుట్రలు
- అడ్డుకున్న రాష్ట్ర ఎస్‌ఎఫ్‌సీ ఉద్యోగులు
- సెక్షన్ 82 తుంగలో తొక్కారని ఆరోపణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ నిధులపై ఏపీ కన్ను వేసింది. చెరి సగం పంచుకోవాల్సిన నిధులను ఏకమొత్తంలో కొల్లగొట్టేందుకు కుట్రలు చేసింది. సంస్థ వార్షిక సమావేశంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.168కోట్లను ఏపీకి 70శాతం, తెలంగాణకు 30శాతం పంచాలని తీర్మానం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, తెలంగాణ ఎస్‌ఎఫ్‌సీ ఉద్యోగులు అడ్డుపడటంతో సీమాంధ్ర అధికారులు తోకముడిచారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హాల్‌లో గురువారం షేర్‌హోల్డర్ల 59వ వార్షిక సాధారణ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఉమ్మడి ఆదాయమైన రూ.168 కోట్లను చెరి సగం విభజించాల్సి ఉండగా, ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయిస్తూ తీర్మానం చేసేందుకు ప్రయత్నించడంతో తెలంగాణ ఎస్‌ఎఫ్‌సీ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

tsfc


ఓటింగ్ విధానం చేపట్టి ఆ డబ్బులు ఏపీకి మళ్లించేందుకు ఏపీ అధికారులు కుట్రపన్నారని, ఇది తగదంటూ సమావేశాన్ని అడ్డుకున్నారు. ఉద్యోగులు మీటింగ్ హాల్‌లోకి ప్రవేశించి అడ్డుకుని నినాదాలు చేయడంతో ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ పీఎస్ అప్పారావు డీమెర్జర్ అంశాన్ని వాయిదా వేసి సమావేశాన్ని మధ్యలోనే ముగించారు. రెండు రాష్ర్టాలకు సంబంధించి ఉద్యోగుల విభజన చేపట్టిన సందర్భంలోనూ తెలంగాణకు 120 మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్‌కు 240 మందిని కేటాయించారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగుల విభజనతో మొదలైన పక్షపాత ధోరణి ఆ తర్వాత కార్యాలయం, ఇతర అంశాల్లోనూ కొనసాగుతున్నదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన విభజనలో ఆంధ్రా మేనేజ్‌మెంట్ అవలంబిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా తెలంగాణ ఎస్‌ఎఫ్‌సీ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి