గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 29, 2015

ఏపీ పుస్తకాల్లో తెలంగాణ నిషేధం

AP-txt


సమైక్యాంధ్ర నినాదాల డొల్లతనం వెల్లడైంది. తెలుగుతల్లి అంటూ వాదనలు చేసినవారి బండారం నగ్నంగా బయటపడింది. నిన్నటిదాకా తెలంగాణ-ఆంధ్ర రెండు కండ్లు అన్న పెద్దమనిషి నేతృత్వంలోని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 6నుంచి 10 వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ గుర్తులన్నీ చెరిపివేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్‌గా మారిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠాలు, పాఠ్యాంశాల జాబితా ఒకటి విడుదల చేసింది.


-ఇక్కడి కవులు, సంస్కృతుల పాఠాలకు మంగళం
-హైదరాబాద్ చరిత్ర కూడా తొలగింపు
-రెండు కండ్ల రాజ్యంలో ఇక ఒంటి కన్ను చదువే!
సదరు జాబితాలో ఉన్నవన్నీ తెలంగాణ అంశాలే కావడం గమనార్హం. వీటి ప్రకారం నిన్నటిదాకా తెలుగు వైతాళికులు అని తామే కీర్తించిన తెలంగాణ నాయకుల పాఠాలను తొలగించారు. విశాలాంధ్ర కోసం పదవీత్యాగం చేసిన బూర్గుల పాఠం అవసరం లేదన్నారు. కవులకు ప్రాంతీయభేదాలా? అంటూ రచ్చరచ్చ చేసిన పెద్దలు తెలంగాణవాడన్న కారణంగా బసవేశ్వరుడి పాఠం నిష్కర్షగా తీసేశారు. చివరికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరుపొందిన సరోజినీనాయుడు రాసిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ పద్యానికి సైతం అదే దుస్థితి ఏర్పడింది. 19వ శతాబ్దం తొలిపాదంలో పాశ్చాత్య దేశాలను సైతం ముగ్ధులను చేసిన ఈ గీతం ఏపీకి కేవలం హైదరాబాద్ స్థానికంగా కనిపించింది. 


ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీలు, మన దేశంలోని సివిల్ సర్వీస్ సిలబస్‌లోనూ చోటు చేసుకున్న ఈ పద్యరాజం వాళ్లకు పనికి రావడం లేదు. ఒక్క తల్లి బిడ్డలం అంటూ ఆరు దశాబ్దాలు చెప్పుకుంటూ బతికినవాళ్లకు ఇపుడు తెలంగాణ మాండలికం అర్థం కావడం లేదట. అందుకని సదరు పాఠాలు వద్దట. ఆఖరుకు సింగరేణి గనుల ప్రస్తావన కూడా వాళ్లు సహించమని అంటున్నారు. 


ఏపీ తొలిగించిన తెలంగాణ పాఠాలు..ఏపీ పదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్ రాసిన నగరగీతం, పీపీ నరసింహారావు రచించిన నేనెరిగిన బూర్గుల, పాలకుర్తి సోమన రచించిన బసవకళ్యాణం తొలగించారు. తొమ్మిదో తరగతిలో వట్టికోట అళ్వార్‌స్వామి రాసిన చిన్నప్పుడే అనే పాఠం ఎత్తేశారు. అలాగే తెలంగాణ కవులు రాసిన మన సంస్కృతి, బాల్య క్రీడలు అనే పాఠాలు రద్దు చేశారు. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఖనిజాలు, గనుల తవ్వకం అనే పాఠంలో సింగరేణి బొగ్గు గనులు పాఠం తీసివేశారు. సింగరేణి బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించినది కాదు అనే కారణాన్ని చూపించారు.


బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు అనే పాఠంలో హైదరాబాద్ దొరల ప్రస్తావన ఉందంటూ దాన్ని తొలగించారు. తెలంగాణ ఉద్యమం గుర్తుకు తెస్తుందనేమో వలసపాలిత ప్రాంతాలలో విముక్తి ఉద్యమాలు అనే సార్వజనీన పాఠం కూడా తీసేశారు. ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలో చిన్నప్పుడే అనే పాఠాన్ని ఏపీ స్థానికతకు సంబంధం లేదని కారణం చూపుతూ తొలిగించారు. ఎనిమిదవ తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. ఇక తొమ్మిదవ తరగతి ఉపవాచకంలో ఉన్న కాపు రాజయ్య, మిద్దెరాములు పాఠాలు కూడా తీసేశారు. అరవ తరగతి ఇంగ్లీష్‌లో ఉన్న ఇన్ ది బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే సరోజినీ నాయుడు పద్యాన్ని కూడా తొలిగించినట్లు ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. 


తెలంగాణ సిలబస్‌లో సార్వజనీనత..తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చింది. అయితే ఈ విషయంలో విశాల దృక్పథాన్ని చూపించింది. తెలుగు భాష అంశానికి సంబంధించి మహా కవుల ఎంపికలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని విస్మరించలేదు. ఆ ప్రాంతానికి చెందిన కవులు, వారి రచనలను కూడా తెలంగాణ పాఠ్యాంశాల్లో చేర్చారు. మన తెలుగు పుస్తకాల్లో నన్నయ్య, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, చేమకూర వేంకట కవి, శ్రీనాథుడు, వేమన, సుమతి తదితర శతకాలనుంచి పద్యాలు, గద్యభాగాలు తెలంగాణ పాఠాల్లో చోటు దక్కించుకున్నాయి.జై తెలంగాణ!    జై జై తెలంగాణ!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి