ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(పీజేపీ)కు నేటి(బుధవారం)తో 20 ఏండ్లు నిండాయి. 1996 ఆగస్టు 5న అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అసంపూర్తి ప్రాజెక్టును ప్రారంభించారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. 1996లో ప్రాజెక్టు ప్రారంభించినా 2015 నాటికి కూడా పూర్తి కాలేదంటే అసంపూర్తి ప్రాజెక్టు ప్రారంభించినట్టే. 1974లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.70 కోట్లు. 1981 జనవరి 6న అప్పటి ముఖ్యమంత్రి టీ అంజయ్య దీనికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.120 కోట్లు. అప్పట్లో ఇదే భారీ బడ్జెట్‌గా ప్రభుత్వం పేర్కొన్నది. నత్తకు నడక నేర్పిన ప్రాజెక్టుగా దీనికి పేరుంది.
2014-2015 నాటికి జూరాల వ్యయం రూ.1,568 కోట్లకు చేరుకున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది జూరాలకు రూ.122 కోట్లు కేటాయించింది. ప్రారంభోత్సవం నాటికి జూరాల వ్యయం రూ.340 కోట్లుగా నాటి టీడీపీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత రూ.1,228 కోట్లకు చేరుకున్నది. ప్రారంభం నాడు చంద్రబాబు జూరాల కాల్వలకు నామకరణం చేశారు. కుడి ప్రధాన కాల్వను సోమనాద్రి(గద్వాల వ్యవస్థాపకులు)కెనాలనీ, ఎడమ కాల్వకు ఎన్టీఆర్ కెనాలని పేర్లు పెట్టారు. ఎన్టీఆర్ కాల్వ ముఖద్వారంపై ఎన్టీఆర్ కెనాల్ అని ఇంగ్లిష్‌లో అక్షరారాలను పొందుపర్చారు. కుడి కాల్వ ముఖ ద్వారం వద్ద ఆ అక్షరాలు కనిపించవు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి