గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 08, 2015

ఏసీబీవద్ద ఉన్న మరో బ్రహ్మాస్త్రం...!!!

-సండ్ర రిమాండ్ డైరీలో సంచలనాలు
-రేవంత్, సెబాస్టియన్, సండ్రతో బాబు స్కెచ్?
-పదే పదే బాబు పేరు జపించిన ఎమ్మెల్యే
-కాల్ రికార్డింగ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే
-బయటికి వచ్చిన జనార్దన్ పేరు
ఓటుకు నోటు కేసులో ఇప్పుడు ఏసీబీ వద్ద మరొక బ్రహ్మాస్త్రం ఉన్నది!! ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ ఈ రిమాండ్ షీట్‌లోనే ఉన్నాయి! కుట్ర మొదలైన దగ్గర నుంచి కొనుగోలుకు యత్నం జరిగిన దాకా చోటు చేసుకున్న పరిణామాలన్నీ దీనిలో ఏసీబీ పూసగుచ్చిందని తెలిసింది. దీనిని మంగళవారం ఏసీబీ కోర్టుకు సమర్పించింది. స్టీఫెన్‌సన్ కొనుగోలుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ మహానాడు వేదికగానే కుట్ర జరిగిందని, చంద్రబాబు నివాసం కూడా ఈ కుట్రలో ఉందని రిమాండ్ డైరీలో ప్రస్తావించిన సంభాషణల్లో తేటతెల్లమవుతున్నది. 

babugate


సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ మంగళవారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడుతూ సమర్పించిన రిమాండ్ డైరీ.. ఈ కుట్రలో ఎమ్మెల్యే సండ్ర పాత్రను కళ్లకు కట్టింది. మహానాడులోసైతం చంద్రబాబు మనసంతా కుట్ర చుట్టూనే తిరిగిందని డైరీలో ప్రస్తావించిన నేతల సంభాషణల్లో వెల్లడవుతున్నదని సమాచారం. మే 31న రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను అరెస్ట్ చేసిన ఏసీబీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, సెల్‌ఫోన్ల నిశిత పరీశీలనతో సెబాస్టియన్ ఫోన్‌లో మే 23 నుంచి 31 వరకు రికార్డ్ అయి ఉన్న ఆడియోలు, ఫోన్ కాల్ నంబర్లను బట్టి సీడీఆర్ (కాల్ డాటా రికార్డ్)లను తీసుకుంది. సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కూడా సెబాస్టియన్, రేవంత్, సండ్ర కాల్స్ వివరాలు తీసుకొని పరిశీలించినట్టు ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో స్పష్టంచేసింది. 


ఎవరెవరితో ఎప్పుడు.. ఎన్నిసార్లు..


సండ్ర మొబైల్ నంబర్ 8790825678 నుంచి రేవంత్ ఫోన్ (9505900009)కు 24వతేదీ నుంచి 31 వరకూ 18 కాల్స్ వెళ్లాయి. సండ్ర రెండో నంబర్ 9440625955 నుంచి రేవంత్‌రెడ్డి రెండో నంబర్ (8790900009)కు 24వతేదీ నుంచి 31వరకు రెండుసార్లు కాల్స్ వెళ్లాయని కాల్ డాటాను బట్టి తేలింది. సండ్ర తన మొబైల్ నంబర్ 8790825678 నుంచి 27.5.2015 నుంచి 31.5.2015వరకు సెబాస్టియన్ ఫోన్ 9394326000కు 19సార్లు, 9440625955 నుంచి ఇదే నంబర్‌కు 12సార్లు కాల్ చేశారు. 


సండ్ర సంబంధీకుల స్టేట్‌మెంట్...


స్టీఫెన్‌సన్ వ్యవహారంలో సండ్ర మే 27నుంచి 30వరకు ఎక్కడెక్కడ తిరగారు? ఎవరెవరిని కలిశారు? అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆయన గన్‌మెన్‌తో పాటు పీఎస్‌వో, మరో వ్యక్తిని విచారించారు. వారి స్టేట్‌మెంట్లను సైతం రికార్డు చేసినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. స్టీఫెన్‌సన్‌కు ఇరవై ఏండ్లుగా పరిచయస్తుడైనా సెల్వన్‌తన్ ఆంటోనీని సెబాస్టియన్ మే 28న సంప్రదించాడు. స్టీఫెన్‌సన్‌ను తనకు పరిచయం చేయాలని ఆంటోనీని సెబాస్టియన్ కోరాడు. దీనితో సెబాస్టియన్‌ను స్టీఫెన్‌సన్ ఇంటికి తీసుకెళ్లి ఆయన్ను పరిచయం చేశాడు. అయితే సెబాస్టియన్ సండ్రకు చెప్పినట్టు ఆంటోనీ ద్వారా స్టీఫెన్‌సన్‌ను పరిచయం చేసుకొని కొనుగోలు వ్యవహారం ప్రారంభించాడని ఏసీబీ రిమాండ్ డైరీలో తెలిపింది. ఎమ్మెల్యే సండ్ర గన్‌మెన్ పీ లచ్చును సైతం ఏసీబీ అధికారులు విచారించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. 29న వెంకట వీరయ్య మహానాడుకు హాజరయ్యారని, మరునాడు 30న ఉదయం 9గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి, అక్కడినుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లారని లచ్చు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబును ఆయన క్యాంప్ ఆఫీస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వెళ్లి కలిసినట్టు లచ్చు తెలిపాడు. సాయంత్రం 6గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారని, ఆ హోటల్లో టీడీపీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి ఉన్నారని, 31వ తేదీ సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఇంటికి సండ్ర బయలుదేరారని చెప్పాడు. అదే సమయంలో సండ్రకు ఓ ఫోన్ వచ్చిందని, రేవంత్ అరెస్ట్ విషయం తెలిసి ఏసీబీ కార్యాలయం వద్ద ధర్నాకు ఆయన వెళ్లారని లచ్చు పేర్కొన్నాడు.

సండ్ర, సెబాస్టియన్ల ఫోన్ సంభాషణల పర్వం..
మే 27 రాత్రి 9.45గంటలకు సండ్ర-సెబాస్టియన్ మధ్య ఫోన్ సంభాషణ



సెబాస్టియన్: ఎమ్మెల్యే గారా అండి.. సార్

సండ్ర: ఆ... ఏమైంది..?



సెబాస్టియన్: సార్, ఇప్పుడు మనకు ఏం ఇన్‌ఫర్మేషన్ కావాలి ఆయన(స్టీఫెన్‌సన్) గురించి?

సండ్ర:ఎమ్మెల్సీఎలక్షన్స్‌లోఆయనకు ఓటు ఉండాలి.


సెబాస్టియన్: అవును సార్.

సండ్ర: ఇంగా, ఆయనేమన్నా మనకు అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి.


సెబాస్టియన్: హోహో అదా.

సండ్ర: ఎందుకంటే ఆయనకు ఫర్‌దర్ రాజకీయాలు అవసరం లేదు కదా. మేమంటే ఎలక్షన్‌లో గెలవాలి. ఆయన(స్టీఫెన్‌సన్)ఒక్కసారి నామినేటెడ్ అయిపోతే అయిపోద్ది, డబ్బు ముఖ్యం కదా ఆయనకు.



సెబాస్టియన్: అది అయితే కరెక్ట్.

సండ్ర: ఆయన సోర్స్ మనకు కావాలి.



సెబాస్టియన్: మనకు ఎంత టైమ్ ఉంది సార్?

సండ్ర: మనకు ఒకటో తారీఖు పోలింగ్.



సెబాస్టియన్: ఓకే ఈ లోపు మనం ట్యాప్ చెయ్యాలి.

సండ్ర: ఈలోపు ఆయనతో మీటింగ్ ఏర్పాటుచేస్తే.



సెబాస్టియన్: ఓకే సార్, ఎట్లా.. ఎక్కడన్నా హోటల్లో టైం ఇద్దామా మాట్లాడటానికి?

సండ్ర: ఆ.. మనం ఆయనతో డీల్ చేసి సక్సెస్ కావాలి, ఫెయిల్ కావద్దు..



సెబాస్టియన్: ఓహో అదా.. నేను మాట్లాడితే గనుక, రెస్పాన్సిబులిటీ మీరు తీసుకుంటారా సార్..

సండ్ర: ఆ అమౌంట్, ఆయన ఓటుకు రెస్పాన్స్ ఇస్తే అమౌంట్‌కు రెస్పాన్సిబులిటీ నాదైతది. ఆయన ఎవరి పేరు చెపితే అదే బేరం, మధ్యవర్తి ఖాయం ఉంటది.



సెబాస్టియన్: ఆహా.. ఇప్పుడు ఆయన ఓటు మనకెయ్యాలా. మన ఎంఎల్‌సీకీ..

సండ్ర: మన అభ్యర్థికి ఆయన వెయ్యాలి.



సెబాస్టియన్: ఇన్ కేస్.. లేదు అంటే ఎస్కేప్ చేపియ్యాలే. మనం ఆరోజు ఆయనకు యే బాంబేనో, కల్‌కత్తా వెళ్లిపోయేట్లు ఏర్పాట్లు చెయ్యాలి. ఆబ్సెంట్ అయినా ఫర్వాలేదు కదా ఓటింగ్‌కు..

సండ్ర: ముందు మీరు ఓటుకు అడగండి. లేకపోతే ఆబ్సెంట్‌కు అడుగుదాం. ముందు ఓటు కావాలి.



సెబాస్టియన్: ఓకే ఓటే కావాలి.

సండ్ర: ఊం..ఊం



సెబాస్టియన్: సరే సరే నాకిప్పుడు రెండు రోజులు మహానాడు బిజీ కదా సార్, అయినా కూడా నేను..

సండ్ర: మహానాడు ఉన్నది.. నేను సెపరేట్‌గా పర్మిషన్ తీసుకుంటాను.



సెబాస్టియన్: హా సరే..

సండ్ర: నాకు రేపటికి పని కావాలి.



సెబాస్టియన్: సరే రేపుమార్నింగ్ ఎన్‌టీఆర్ ఘాట్‌లో ప్రేయర్ చేయడానికి సార్ రమ్మన్నారు.

సండ్ర: సార్ ఎన్నింటికి ఘాట్‌కు వస్తున్నారు?



సెబాస్టియన్: ఏమో సార్ అయితే నన్ను ఏడు గంటలకే రమన్నారు.

సండ్ర: ఓకే మీరు మీ పనిచేసుకోండి. మిగతా పని తర్వాత చూద్దాం.



సెబాస్టియన్: ఓకే సర్. మంచిది. నేను టచ్ ఉంటా మీకు. ఓకే.


మరుసటి రోజు(మే 28న సాయంత్రం 6.10గంలకు) సండ్రకు సెబాస్టియన్ ఫోన్ కాల్..రికార్డు...




సెబాస్టియన్: ఎంఎల్‌ఏ గారు, నమస్కారం సార్.

సండ్ర: నమస్కారం.. మీ మెసేజ్ చూశాను. ఎక్కడున్నారు?



సెబాస్టియన్: మోతీనగర్‌లోని మా ఆఫీస్‌లో ఉన్నాను. పొద్దుగాల సమాధి దగ్గరికి పోయినా, ఈ రోజు అందరి మతాల పెద్దలు వచ్చి ప్రార్థన చేశాం. అందులో మాది కూడా ఉండే.. సారు వచ్చారు.. మాకు అక్కడే పది అయి పోయింది.

సండ్ర: ఓకే ఓకే..



సెబాస్టియన్: సార్ వెంటనే సమాధిని చూసేసి, ఫ్లవర్ చల్లి వెళ్లిపోయారు. మేమక్కడే ఉన్నాం. అక్కడి నుంచి మీరు చెప్పిన పని.. నేను ఇక్కడికి పోయిన.

సండ్ర: అదే మనకు ముఖ్యంలేండి..



సెబాస్టియన్: మీరు చెప్పారు కదా.. అందుకొరకు నేను పోయాను. మాట్లాడినా.

సండ్ర: ఆ.. ఆ..



సెబాస్టియన్: ఆయనకు.. మనకు చెప్పకుండా అల్‌రెడీ ఎవరో ఈ రోజు ఉదయం పోయిడ్రంటా.

సండ్ర: ఆ.. ఆ..



సెబాస్టియన్: వాళ్ల వెర్షన్‌కు నా వెర్షన్‌కు డిఫరెన్స్ ఉంది.

సండ్ర: ఆహా..ఆహా..



సెబాస్టియన్: ఆయన (స్టీఫెన్‌సన్‌ను ప్రస్తావిస్తూ) ఏమన్నాడంటే నువ్వు మాకు బిషప్, నువ్వు చెప్పేది మాకు నమ్మకం ఉంటది. వాళ్లు (ముందువచ్చినవాళ్లు) చెప్పేది ఏమో.. నిజమా కాదా.. మళ్లీ నాకు చెడ్డపేరు వస్తదేమో అని ఒక మాట అన్నాడు.

సండ్ర: ఊ..ఊ..



సెబాస్టియన్: ఆయన్ను ఎట్లయినా మేనేజ్‌చేస్తా సార్. ఇన్‌కేస్, బీజేపీలో అట్కిసన్ అనే ఓ రాజ్యసభ మెంబర్ ఉండే. నామినేటెడ్ అంగ్లో. ఆయన్ను మా బిషప్‌లకు చెప్పి ప్రమోట్ చేసిన.

సండ్ర: ఓకే



సెబాస్టియన్: మాకు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది.. మీకు కావాలంటే ఎక్కడపోయినా కూడా ఢిల్లీ వరకు రికమండ్ చేయగలుగుతాం.. మొదటి హమీగా మైనారిటీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా, రెండోది ఆంధ్రాలో ఇంకా అంగ్లో ఇండియన్‌కు సీటు ఇవ్వలేదు. మీలో ఎవరైనా, మీ బంధువులుంటే రికమండ్ చేయి, బాబుతో మాట్లాడుతా..

సండ్ర: ఓకే.



సెబాస్టియన్: మూడోది, మొత్తం మన ప్రభుత్వం ఆంధ్రాలో నీకే పని కావాలన్నా చేసి పెడుతుంది.

సండ్ర: అవును..



సెబాస్టియన్: నాల్గోది, వచ్చే ఎన్నికల్లో 100శాతం టీడీపీనే వస్తది ఈడ, వస్తే మళ్లీ మీ పేరే ప్రపోజ్ చేస్తాం.

సండ్ర: అవును



సెబాస్టియన్: ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన సార్. ఇచ్చేవరకు మస్త్ ప్లీజింగ్ అయిపోయిండు ఆయన. మీరు చెప్పింది చాలా బాగుంది నాకు నచ్చింది, పొద్దుగాల వచ్చిన వాళ్లు వేరే విధంగా మాట్లాడినారు అని అన్నారు.

సెబాస్టియన్: నేను ఏం చేస్తానో, అది అవుతది, నీ ఇష్టం మరీ అని అన్నాను. నాకు మీరు టైమివ్వండి అన్నాను. ఆయన ఈ రోజు నేను మా ఫ్యామిలీలో మాట్లాడతా, మా వెల్ విషర్స్‌తో కూడా మాట్లాడి, డిస్కస్ చేసుకొని ఈ రోజు గానీ లేదా రేపు పొద్దుగాల కల్లా చెప్తా అని అన్నాడు సార్.

సండ్ర: ఓకే ఓకే. వెరీ గుడ్.


సెబాస్టియన్: నో అని అయితే అనలేదు. నేను చెప్పినా నీ లైఫ్ బాగు అయిపోతది.. మేమెప్పుడు నీకు అండగా ఉంటాం. మా పార్టీ తరఫున వచ్చిన నేను. నేను, నువ్వు బిషప్‌గా లేకపోతే ఓటు ఇక పక్కకు పెట్టేసెయ్యండి. ఒక్క వెల్‌విషర్.. నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్. నీకు ఏం కావాలంటే కూడా డైరెక్ట్ బాబు దగ్గరకు తీసుకువెళ్లే సత్తా నాకుంది. నీకు ఏం కావాలో చెప్పు.
సండ్ర: అందుకనే మీరు రేపటికల్లా ఓ లైన్‌అప్ చేస్తే రేపు సిట్టింగ్ పెట్టుకుందాం...


28 మే 6.15గం.లకు, ఔట్‌గోయింగ్ కాల్ 9440625955 (సండ్ర- సెబాస్టియన్)




సెబాస్టియన్: సార్, రాత్రికి ఏమన్నా కలుసుకోవచ్చా? మనం సిటీలో ఎక్కడైనా!

సండ్ర: ఓకే, ఎన్నింటికి రావాలో చెప్పు.. వచ్చేస్తా..



సెబాస్టియన్: అచ్చా.. మీరు ఎక్కడున్నారు సార్..

సండ్ర: మహానాడు దగ్గరే ఉన్నా.



సెబాస్టియన్: మహానాడు అయిపోయాకా, మనకు ఎనిమిది అయితది కదా. ఎట్లయినా 7, 8 అయితది.

సండ్ర: అవునవును. మనం ఎక్కడ కూర్చోవచ్చు?



సెబాస్టియన్: మీరు చెప్పండి సార్. ఎక్కడైనా ఫర్వాలేదు. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకొని మనం ఎట్లా చేద్దాం ఎంటిది మరి.. ఎందుకంటే మీరు సడెన్‌గా రేపు కాల్ చేస్తే, మనం మళ్లీ మహానాడులో ఉంటాం.. ఎక్కడైనా అదే పరిస్థితి.

సండ్ర: అహా.. అహా.. మనం వున్నగానీ అంతే! అదే ప్రయారిటీ. సార్ మనకు అది ప్రయార్టీ అని చెప్పిండు. మనం మన పద్ధతిలో వెళ్దాం.



సెబాస్టియన్: అచ్ఛా.. ఓకే! మీకు ఎన్ని గంటలకు మహానాడు అయిపోతది చెబితే..

సండ్ర: అది అయిపోయినంక సార్ దగ్గర ఎమ్మెల్యేల మీటింగ్ అంటున్నారు..



సెబాస్టియన్: అహా... అహా..

సండ్ర: నేను కాగానే చెబుతా..



సెబాస్టియన్: ఓకే... ఇప్పుడు మీరు సార్ తో..

సండ్ర: మీరు ఏ ఏరియాలో ఉంటారు..



సెబాస్టియన్: మోతీనగర్ సార్..

సండ్ర: ఆయన(స్టీఫెన్‌సన్‌ను ఉద్దేశించి)..



సెబాస్టియన్: ఆయనొచ్చి సికింద్రాబాద్‌లో ఉంటాడు..

సండ్ర: మనకు, ఆయనకు, మీకు కామన్ ప్లేస్ ఎక్కడ?



సెబాస్టియన్: అట్లంటారా..

సండ్ర: ఆయన ఓకే అంటే రేపు ఏ టైం అయినా, మహానాడు అయినా ఎగ్గొట్టి వచ్చేస్తా. మీరు ముందు ఆయనతో ఓకే చేస్తే.. ఆయన డౌట్స్‌గానీ.. ఆయనకు క్లారిఫికేషన్స్ గావాల్నో, అన్నింటికీ నేను హామీగా ఉంటా.



సెబాస్టియన్: ఓకే.. ప్రాబ్లమ్ ఏందంటే.. మీరు లైన్‌లో దొరుకుత లేరు.. పొద్దుగాలనుంచి ఎన్నోసార్లు ట్రై చేసిన..

సండ్ర: మహానాడులో రావట్లేదు..



సెబాస్టియన్: అవును.. అక్కడ జాంబర్ (జామర్) ఉంటది.. నాకు తెలుసు..

సండ్ర: మీరు ఒక పనిచేయండి.. మా డ్రైవర్ నంబర్ ఇస్తాను.. అది రాసుకోండి.. 8186825560



సెబాస్టియన్: ఏం పేరు సార్ అయనది

సండ్ర: బాషా



సెబాస్టియన్: ఓకే. టైమ్ ఎప్పుడు.. నేనడిగింది ఎందంటే... రేపు మరి నేను మహానాడులో ఉండాల్న. మళ్లీ సార్‌కు తెలువదు కదా..! సార్ లేడని.. నన్ననొద్దు నీవు రాలేదని..! మళ్లీ బావుండది కదా.. ఎట్లమరి నీవు సార్‌కు..

సండ్ర: ఆల్రెడీ ఈ బాధ్యతఅప్పజెప్తున్నట్లు చెప్పి..



సెబాస్టియన్.. హా.. హా.. హా..

సండ్ర: అక్కడ జామరొస్తే.. సార్‌తోటి మీకు ఫోన్ చేపిస్తా..



సెబాస్టియన్: ప్లీజ్ ఆ పనిచేయించండి. ఎందుకంటే జనార్దన్ సార్ కూడా ఇవ్వల అడిగిండు.. నీవెందుకు రాలేదని! నాకు ఇవాల మధ్యాహ్నం ఫోన్ చేసిండు..

సండ్ర: లే.. లే.. నేను చెబుతా.. నేను చెబుతా..



సెబాస్టియన్: నేను ఆయనకు చెప్పలేదు.

సండ్ర: మీరెవరికీ చెప్పొద్దు. నేను సారుతోటి చెబుతా..



సెబాస్టియన్: ఇట్ల క్రిస్టియన్స్ ప్రెసిడెంట్ బిషప్ గారు ఈ పనిచేస్తున్నరు.. అందుకే రాలేదని చెప్పండి..

సండ్ర: లే.. లే.. నా బాధ్యత.. నేను ఒప్పజప్త..



సెబాస్టియన్: మీటింగ్‌కు ఎందుకు రాలేదంటే, మళ్లీ నాకు బాగుండదు..

సండ్ర: మీరు నాకు వదిలేసేయండి.. ఇప్పుడు నేను జనార్దన్‌గారికి కూడా చెబుతా..



సెబాస్టియన్: ఆ.. చెప్పడి. జనార్దన్‌గారికి చెప్పండి..

సండ్ర: అందరికి చెప్త



సెబాస్టియన్: అందరికీ చెప్పండి.. జనార్దన్ గారికి ఈ విషయం చెప్తున్నారా ఏమైనా?

సండ్ర: ఏమవసరం లేదు.. మనం మ పనిలో ఉన్నట్లు నేను చెప్తలే.. నీకెందుకు..



సెబాస్టియన్: అంతే చెప్పండి.. సార్ ఒక పని అప్ప చెప్పిండు.. ఆ పనిమీద ఉన్నాడని చెప్పండి...


ప్లీజ్ కాల్ మీ రిగార్డింగ్.. ద ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే..సెబాస్టియన్‌నుంచి సండ్ర సెల్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్‌ల వివరాలు



సమయం: 27వ తేదీ రాత్రి 9.45 నిమిషాలు: ఎమ్మెల్యే గారు దిసీజ్ బిషప్ సెబాస్టియన్. టీడీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్. ప్లీజ్ కాల్ మీ రిగార్డింగ్.. ద ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే..
సమయం: 28వ తేదీ రాత్రి 9 గంటలకు: ఎమ్మెల్యే గారు, లాబీయింగ్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే వర్క్ ఈజ్ 50% ఓకే.. కాల్ మీ బ్యాక్.. వెన్ యూ ఆర్ ఫ్రీ.
సమయం: 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు: 9000976929 న్యూ నంబర్, బిషప్ సెబాస్టియన్


30వ తేదీ అవుట్ గోయింగ్ కాల్.. ఉదయం 10.35 గంటలకు (08790825678)



సండ్ర: హాలో..



సెబాస్టియన్: రేవంత్‌రెడ్డిగారికి ఫోన్ చేశాను సార్.. బాబు గారింటి దగ్గర ఉన్నాడటా..

సండ్ర: ఆహా.. ఆహా..



సెబాస్టియన్: అది మీరు ఒక్కసారి మాట్లాడి.. ఎందుకంటే.. మనం 11 గంటలకు టైమ్ ఇచ్చాం..

సండ్ర: ఒక్క నిమిషం నా ఎదురుగానే ఉన్నాడు.



సెబాస్టియన్: హా.. ఓకే.. ఓకే.. సరే మాట్లాడండి

సండ్ర: ఒక్క నిమిషం లైన్‌లో ఉండూ..



సెబాస్టియన్: హా.. హా..

(రేవంత్‌కు ఫోన్ ఇచ్చిన సండ్ర)



సండ్ర ఫోన్‌లో రేవంత్: హలో



సెబాస్టియన్: సార్ చెప్పండి..

సండ్ర ఫోన్‌లో రేవంత్: అదే.. అదే.. ఇక్కడున్నాం సార్ దగ్గర.. పది నిమిషాలు మాట్లాడేసి బయలుదేరుతాం..



సెబాస్టియన్: మరి మీరు అటొచ్చేస్తారా.. నేను బయలుదేరాల్నా? ఆయన ఎదురు చూస్తున్నాడు..

సండ్ర ఫోన్‌లో రేవంత్: అవును.. మీరెక్కడున్నారు?



సెబాస్టియన్: మేమిక్కడ మోతీనగర్.. ఎర్రగడ్డ..

సండ్ర ఫోన్‌లో రేవంత్: మోతీనగరా?.. అయితే ఒక పనిచేయండి.. మీరు అటు పార్టీ అఫీస్ దిక్కు రండి.. నేను అటు వచ్చేస్తా. కారులో కూర్చొని పోదాం..



సెబాస్టియన్: పార్టీ అఫీస్‌లోన సార్?

సండ్ర ఫోన్‌లో రేవంత్: అఫీస్ దగ్గర్నే బండి ఆపుకోండి



సెబాస్టియన్: హా..

సండ్ర ఫోన్‌లో రేవంత్: మనం వెళ్లాల్సింది ఎటువైపు?



సెబాస్టియన్: బోయగూడ

సండ్ర ఫోన్‌లో రేవంత్: ఓకే.. అయితే మీరు పార్టీ ఆఫీస్‌కాడికి రండి.. నాకు ఈజీ అయితది.. ఇది చూసుకొని అడికి వచ్చేస్తా..

సెబాస్టియన్: మంచిది సార్..



సండ్ర ఫోన్‌లో రేవంత్: ఒక్క నిమిషం


సెబాస్టియన్: హా..

(సండ్ర తన ఫోన్ తీసుకున్నాక) సండ్ర: అన్నగారు.. ఒక పనిచేయండి. మీరు ఈ అడ్రస్‌కు మనం ఒక సీక్రెట్ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్ వెతుక్కోకూడదు.. డైరెక్టుగా పోయేటట్టు ఉండాలి. మీరు ఆఫీస్ కాడికొచ్చి బయట ఉండండి. మనోడు వచ్చేస్తాడు.



సెబాస్టియన్: నేను బయటనే ఉంటా.. ఆడికొచ్చి ఫోన్ చేయలా?

సండ్ర: హా.. పార్టీ ఆఫీస్ ముందు చెట్లు ఉంటాయి కదా.. క్యాంటీన్ పక్కెంబడి.. నీడలో చెట్టు కాడ ఉండండి.



సెబాస్టియన్: మీరక్కడున్నారా?

సండ్ర: లే.. లే.. నేను సారింటికాడ ఉన్న. నీవు... డబుల్ పని వద్దులే..



సెబాస్టియన్: హా.. ఓకే... ఓకే

సండ్ర: ఇద్దరం వద్దులే.. బాగోదు..



సెబాస్టియన్: మీ ఇష్టం.. మీరేమంటే అది..

సండ్ర: మాకేమీ ఇబ్బంది లేదు.. ఎవరు చేసినా పార్టీ పని.. మనోడొస్తాడు..



సెబాస్టియన్: (నవ్వు..)

సండ్ర: మీరు చేసినా.. అన్న చేసిన.. నేను చేసినా ఒకటే, మనది కామన్ ఎజెండా.



సెబాస్టియన్: సరే.. సరే..


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి