-అదనంగా చేరింది కొన్ని పదాలే
-గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలేమీ లేవు
-తేల్చి చెప్తున్న న్యాయవాదులు
లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో ఏపీ నేతలది అందెవేసిన చెయ్యి! ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విషయంలో వారు మరోసారి ఆ ప్రయత్నం చేసేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే విభజన చట్టంలోని సెక్షన్ 8, రాజ్యాంగంలోని 163వ ఆర్టికల్ వేర్వేరనే ప్రచారాన్ని అందుకున్నారు. నిజానికి ఈ రెండింటికీ పెద్దగా తేడా లేదు. రాజ్యాంగంలోని 163వ అధికరణంలో పేర్కొన్న అంశాలకు కొన్ని పదాలు జోడించి ఏపీ విభజన చట్టంలోనూ చేర్చడం విశేషం. అంతేకానీ.. గవర్నర్‌కు ప్రత్యేకంగా అదనపు అధికారాలేమీ కట్టబెట్టలేదు. ఏపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు. -గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలేమీ లేవు
-తేల్చి చెప్తున్న న్యాయవాదులు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్8లో సైతం తెలంగాణ మంత్రిమండలి సలహా ప్రకారం గవర్నర్ వ్యవహరించాలని పేర్కొన్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం పేర్కొన్న అంశమేనని వారు తేల్చి చెప్తున్నారు. కొత్తగా సలహాదారుల ఏర్పాటు అంశాన్ని సెక్షన్ 8లో ప్రస్తావించారని వారు తెలిపారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్ 8 అంశాన్ని వివాదం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
-సెక్షన్8పై అనవసర రాద్ధాంతంసెక్షన్ 8లోని అంశాలు దాదాపుగా ఆర్టికల్ 163తో సమానంగా ఉన్నాయి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికే కల్పించారు. రాష్ట్ర మంత్రిమండలి సూచనలు, సలహాలమేరకే గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయాలను ఆర్టికల్ 163 (1)లో స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాన్ని కట్టబెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8పై కొంతమంది వ్యక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్8లో సైతం తెలంగాణ మంత్రిమండలి సలహా ప్రకారం గవర్నర్ వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం పేర్కొన్న అంశమే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్‌కు సలహాలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను నియమించాలనే అనే అంశాన్ని సెక్షన్8లో పేర్కొన్నారు. అంతేకానీ సెక్షన్ 8 అమలు చేయగానే.. హైదరాబాద్‌పై పూర్తి అధికారం గవర్నర్‌కు సంక్రమిస్తుందని చెప్పడం సరికాదు.
- అరుణ్, న్యాయవాది
- రవీందర్‌రెడ్డి, న్యాయవాది
- వీ శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు చట్టంలోని లేని విధంగా హైదరాబాద్‌లో అధికారాన్ని మొత్తం గవర్నర్ చేతులో పెట్టాలంటూ చంద్రబాబు సీమాంధ్ర ప్రజల్ని మభ్య పెడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, చేయకున్నా.. రాజ్యాంగబద్ధంగా హైదరాబాద్‌లో ఉండే ఎవరి హక్కులకూ ఇబ్బంది తలెత్తదు. ఉద్యమకాలం నుంచి మేం చెబుతున్నట్లు.. అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం.. అనే నినాదాన్ని పాటిస్తాం.
- జీవన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి