గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 09, 2015

ఏపీలో తెలంగాణ ఎంసెట్‌కు నోసెంటర్స్!!!



- ఏపీ ప్రభుత్వ లేఖను తిరస్కరించిన ఉన్నత విద్యాశాఖ
- ఏపీ కుట్రలకు తెలంగాణ సర్కారు దీటైన సమాధానం
- ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి 


కార్పొరేట్ విద్యాసంస్థల కొమ్ముకాస్తూ, తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 15 శాతం నాన్‌లోకల్ కోటా సీట్లు 100 శాతం కాజేయాలని ఏపీ ప్రభుత్వం పన్నిన కుట్రకు తెలంగాణ విద్యాశాఖ దీటుగా సమాధానం చెప్పింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సొంతంగా నిర్వహించుకొంటున్న ఎంసెట్-2015కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణ ఎంసెట్ కోసం ఏపీలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సమయం మించిపోవడంతో ఏపీలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేయడానికి అవకాశం లేదని, అదే విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి వివరించనున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి తిరిగి ఘాటుగా లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. నాన్‌లోకల్ కోటా కింద 15 శాతం సీట్ల కోసం పోటీ పడాలనుకొన్న ఏపీ విద్యార్థులు రాష్ట్రంలో ఎంసెట్ రాయాల్సి ఉంటుందన్నారు. 
2 లక్షలు దాటిన తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు:
రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఎంసెట్-2015 కోసం మంగళవారం రాత్రి 9 గంటల వరకు 2.04 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడం జరిగిందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి 1.23 లక్షల దరఖాస్తులు, మెడికల్ విభాగం కోసం 81 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇందులో ఏపీ కుట్ర ఏమిటో, పాపిరెడ్డిగారిచ్చిన ఘాటైన దీటైన సమాధానం ఏమిటో ఏమీ బోధపడలేదు. ఒక రాష్ట్రంలోని ప్రవేశపరీక్షలకి మరో రాష్ట్రపు విద్యార్థులు అప్లై చేసుకోవడం దేశమంతటా మామూలే. ఏపీ నిర్వహించే ఎమ్సెట్ కి తెలంగాణ విద్యార్థులు 19 వేలమంది అప్లై చేసుకున్నారు. పరరాష్ట్రాల విద్యార్థులు రాకపోతే ప్రైవేటు ప్రొఫెషనల్ కళాశాలలు ఆర్థికంగా నష్టపోతాయి కూడా. పాపిరెడ్డిగారు కూడా ప్రస్తుతానికి సెంటర్లు లేవన్నారు గానీ ఏపీ విద్యార్థుల్ని అప్లై చేసుకోవద్దనలేదు. ఎటొచ్చి అప్లై చేసుకున్న ఏపీ విద్యార్థులు ఈ సంవత్సరానికి హైదరబాదొచ్చి పరీక్ష రాస్తారంతే! ఈ విషయమై ఇతర పత్రికల్లో వచ్చిన వార్తాకథన శైలికీ నమస్తే తెలంగాణలో వచ్చిన శైలికీ చాలా తేడా ఉంది. ఏపీ ప్రభుత్వం ఆలస్యంగా లేఖ రాయడం వల్ల ఇంత తక్కువ వ్యవధిలో పరీక్షాకేంద్ర్రాలు ఏర్పాటు చేయడం తమకు సాధ్యం కాదనీ, వచ్చే సంవత్సరమైనా త్వరగా ప్రతిపాదనలు పంపితే ఏర్పాటు చేయగలమనీ ఆయన అన్నట్లు సమాచారం. గొడవ లేని విషయాల మీద గొడవలు జరుగుతున్నట్లు అభివర్ణించడం ఏ రకమైన పాత్రికేయ ప్రమాణాలో నాకర్థం కాదు. ఊరికే ఆంధ్రావాళ్ల మీద గొడవ పడుతున్నట్లు కనిపిస్తేనే తెలంగాణాలో హీరో అనిపించుకుంటారా? ఏమీ మరి!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇందులో బోధపడనిది ఏమీ లేదు. ఆంధ్రాలో పరీక్ష రాయడం వేరు...తెలంగాణలో పరీక్ష రాయడం వేరు. అంతేగాక ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడం వల్ల తెలంగాణ ఆదాయంలో హెచ్చింపు ఉంటుంది. అక్కడ రాయడం వల్ల ఎన్నైనా జిమ్మిక్కులు చేయవచ్చు. ఇక్కడ ఆ పప్పులేవీ ఉడకవు. ఇక తెలంగాణ పత్రికకీ, ఆంధ్రా కొమ్ముకాసే పత్రికలకీ వార్తల ప్రచురణలో తేడా తప్పక ఉంటుంది. ఇప్పటికీ ఆ తేడా ఆంధ్రజ్యోతిలాంటి పత్రికల్లో స్పష్టంగా కనబడుతోంటే ఇంకా బోధపడడం లేదనడం హాస్యాస్పదం. తెలంగాణులు సౌమ్యులు...అమాయకులు...నిరపాయకారులు. ఆంధ్రావాళ్ళు (కొందరు) విషం కక్కే త్రాచుపాములు...అపాయకారులు...కుటిలులు. అందుకే వాళ్ళను కొంతలో కొంత నిరోధించగలిగితే తెలంగాణులకు మేలుచేసినట్టే మరి! తెలంగాణులు హీరోలు కాబట్టే తెలంగాణను సాధించుకున్నారు. స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఆంధ్రాపాలకుల కుట్రలకు బలైన తెలంగాణ గురించి తెలుసుకోవాలంటే...

"బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ"ను చదవండి...ఇదే బ్లాగులో కొంతసేపటిక్రిందటే ప్రచురించడం జరిగింది...http://ratnaalaveena.blogspot.in/2015/04/blog-post_3.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి