గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఏప్రిల్ 07, 2015

మనిషి ఒక్కడు...నాల్కలు వెయ్యి!

-మాయలు నేర్చిన మరాఠీ
- దుష్ప్రచారాల ఘనాపాఠి
-తెలంగాణ విఫలప్రయోగం కావాలనేదే ఆయన లక్ష్యం
- కాలుతీసి కాలువేస్తే దుష్ప్రచారాలు






రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని.. రాధాకృష్ణ ఏమైనా చెప్పగలడు. ఏమైనా చేయగలడు. రాధాకృష్ణ అవతారాలు వేనవేలు. ఆయనే ఉద్యమకారుడు, ఆయనే దళితోద్ధారకుడు, ఆయనే దేశోద్ధారకుడు, ఆయనే సంధానకర్త, ధర్మాధికారి, సమాజ సేవకుడు, మహిళా ఉద్ధారకుడు.ఆయనకు వేయి నాలుకలు..వేల తలలు. ఓసారి ఆయనే విప్లవకారుడి అవతారంఎత్తుతాడు.

radha-krishna

విప్లవకారుడికంటే నాలుగాకులు ఎక్కువే మాట్లాడుతాడు. ఓసారి దేశోద్ధారకుడి అవతార మెత్తుతాడు. పదో తరగతి పరీక్ష లీక్ కేసు గాళ్లు స్పాన్సర్ చేసిన కార్యక్రమం తీసుకుని కాలేజీలు తిరిగి విద్యార్థులతో సంఘము సమాజము నైతిక విలువల మీద చర్చలు పెడతాడు. ఊదు కాలదు.. పీరి లేవదు.. అయినా ఉద్యమాల వేళ తానే వేదికలు పెట్టి పెద్దరికం తీసుకుంటాడు. వాళ్లను వీళ్లను కూర్చోబెట్టి ధర్మపన్నాలు చెప్తాడు. ఓసారి దళిత ఉద్ధారకుడినంటాడు.. మళ్లీ తన పత్రికల్లో వాళ్లనే బాడుగ నేతలని నిందిస్తాడు. తెలంగాణ ఉద్యమం అవసరమని ఓ నోటితో చెప్తూనే ఉద్యమ నేతలు, జేఏసీ నేతల మీద విషం చల్లుతాడు. తాము ఎవరి పక్షం కాదంటాడు. మళ్లీ తానే బాబు విజనరీ అంటాడు. చిరంజీవి రా..రా అని బొమ్మలతో పండుగ చేసి మురిపిస్తాడు. తీరా జెండా పీకేస్తున్నాడని తానే గొయ్యి తీస్తాడు. మహిళల స్వేచ్ఛ, సాధికారత, ఆత్మ గౌరవం అంటాడు. వయసు కూడా చూడకుండా ఇంటర్వ్యూల్లో లైంగిక సంబంధాల ప్రస్తావనలు తెస్తాడు. రేప్ నటన అనుభవాలను నటులనుంచి తరచి తరచి వాకబు చేస్తాడు. 

andhrajyothi

విషసర్పంలా..: తెలంగాణ విషయంలో ఆయనది వేయి తలల విషసర్పం పాత్రే. మమ్మల్ని కాదని రాష్ట్రం తెచ్చుకుంటారా?.. ఎలా పాలిస్తారో చూస్తాం..! ఎలా ముందుకు వెళ్తారో చూస్తాం! అన్న వైఖరి. ఆ పాత్రను, ఆ వైఖరిని ఆయన చాలా ఘనంగా రక్తి కట్టించాడు. ఆయన ఆశయం బహిరంగ రహస్యమే. తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా పాలన కొనసాగించవద్దు. ఇక్కడ సర్వే జరపవద్దు. పింఛన్లు ఇవ్వవద్దు. ఆహార భద్రత కార్డులు ఇవ్వవద్దు. వాటర్ గ్రిడ్ చేపట్టవద్దు. మిషన్ కాకతీయ అనవద్దు. కృష్ణానదినుంచి నీరు తీసుకోవద్దు. సాగర్ డెల్టాకు అంకితం చేయాలి.
బయ్యారం విశాఖకు ధారపోయాలి. ఇంటర్‌మీడియట్ ఏపీ చేతిలో పెట్టాలి. ట్రావెల్స్ ఎన్ని పాలెం దుర్ఘటనలకు కారణమైనా పట్టించుకోవద్దు .. వాటికి పన్నులు వేయవద్దు. గురుకుల్ వంటి అక్రమ భవనాలు కూల్చవద్దు. సచివాలయం సౌకర్యవంతమైన ప్రదేశానికి తరలించవద్దు. హుస్సేన్‌సాగర్ అలాగే మురికి కూపంగా ఉండాలి. 

desapathi


వర్సిటీలన్నింటికీ ఆంధ్రా పేర్లే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవంతో పాలన చేసుకోవద్దు. తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విషాదాంతంగా మిగిలిపోవాలి. అదే వ్యూహం తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచే ఆయన అమలు చేశాడు. ఏ పని చేపట్టినా ఏదో ఒక నింద. ఏ పథకం ముందుకు తెచ్చినా ఏదో ఒక బురద. పాలన పడకేసిందంటాడు. అదే నోటితో అధికారులను శక్తికి మించి ఉరికిస్తున్నారంటాడు. నేల విడిచి సాములు అంటాడు. అంతా వట్టిదేనంటాడు. తాను కలగన్నట్టు కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కాలేదని ఆయన బాధ. చంద్రబాబును వెనక్కి తోసి ఎదిగిపోతున్నాడని ఏడుపు. 

కక్షతో వెంటాడి..


తెలంగాణ ప్రజలు తమను ధిక్కరించి రాష్ర్టాన్ని సాధించుకున్నారనే దుగ్ధతో పగబట్టి వెంటాడారు. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన ఇంటిపార్టీకి. అధికారం చేపట్టిన నాడు కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్.. అంటే దోమ కుత్తుకలో ఏనుగుల గుంపు చొచ్చినట్టుగా ఉండేది . పేరుకు రాష్ట్ర విభజన. ఎక్కడా స్పష్టత లేదు. ఏ సంస్థ ఎవరి అధీనంలో ఉన్నది తెలియదు. ఏ కార్యాలయం ఎవరికి చెందుతుందీ తెలియదు. అధికారులు లేరు. ఉద్యోగుల విభజన జరుగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరం. ఎంత ఆదాయం ఉంటుంది ఎంత అప్పులు ఉండేది ఇదమిత్థంగా తెలియదు. ఉమ్మడి విద్య, ఉమ్మడి న్యాయం, ఉమ్మడి జల నిర్వహణ.. ఇలా ఏదీ స్పష్టత లేదు. విద్యుత్ లోటు పెద్ద సమస్య. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని రాధాకృష్ణ అత్యంత క్రూరమైన దాడులకు దిగాడు.

కేసీఆరే లక్ష్యంగా నిప్పులు చల్లాడు. ప్రభుత్వం వచ్చిన మూడు రోజులకే నీలి వార్తలతో ప్రజలను రోడ్ల మీదికి తెచ్చాడు. అధికారంలోకి రాగానే ఖరీఫ్ సీజన్‌లో రైతు రుణాల అవసరాన్ని గుర్తించి కేసీఆర్ బ్యాంకర్లతో జరిపిన సమావేశాన్ని వక్రించి ఇష్టారాజ్యంగా నీలివార్తలు చెలామణి చేశాడు. ఆ వెంటనే రైతు ఆత్మహత్యల పరంపరకు దారి వేసి పుణ్యం మూట కట్టుకున్నాడు. నోటికి వచ్చిన ప్రచారాలు.. మనసుకు ఏది తోస్తే ఆ రాతలు.. రైతులకు రుణాల చెల్లింపునకు బదులు బాండ్లు ఇస్తారని, రూ.30 వేలలోపే నగదు ఇస్తుంది.. మిగితావి రైతులే కట్టుకోవాలని.. ఇలా ఏది తోస్తే అది ప్రచారం చేసి కసి తీర్చుకున్నాడు. ఈ ప్రచారం ఎన్ని గుండెలను ఆపేసిందో లెక్కేలేదు

కరెంటు కోతలే ఆయనకు పండుగ..


తెలంగాణ కరెంటు కోతల మీద రాధాకృష్ణ పండుగ చేసుకున్నాడు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంనాటినుంచే కేసీఆర్ విద్యుత్ సమస్యను ప్రజలకు విడమరిచి చెప్తూ వచ్చారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ ఒక విఫల రాష్ట్రం అని నిరూపించడానికి చంద్రబాబు గ్యాంగ్ కరెంటు ప్యూజులు పీకే కుట్రలకు పాల్పడి రైతుల ఉసురు తీసింది. ఆయన పెంపుడుకుక్కలు ఇక్కడ నానా యాగీ చేశాయి. రాధాకృష్ణ తన కొత్తపలుకులో చంద్రబాబు తెలివిగలవాడు ముందే ఢిల్లీ వెళ్లి కరెంటు తెచ్చుకున్నాడు అంటూ నిప్పులు చల్లాడు. మొత్తానికి మొత్తం సీమాంధ్ర మీడియా రైతుల చితిమంటల మీద చలికాచుకుంది. 

ఆనందం నిలువనివ్వకుండా..


మొదటినుంచి సీమాంధ్ర మీడియా అనసరించే పద్ధతి ఒకటుంది. తెలంగాణవాదానికి లేదా టీఆర్‌ఎస్‌కు ఏదైనా మేలు జరిగితే చాలు. ఆ వెంటనే వారి ఆనందాన్ని ఆవిరి చేసే .. కంగారు పెట్టే కథనాలు వేసి శునకానందం పొందడం. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ఉప ఎన్నిక మెదక్ స్థానానికి జరిగింది. అనేక విషప్రచారాలను ఎదిరించి రికార్డు స్థాయి విజయం సాధించింది. అయితే టీఆర్‌ఎస్‌కు ఈ ఆనందాన్ని దక్కనీయడం రాధాకృష్ణకు రుచించలేదు. ఆ ఫలితం వెలువడిన మరుసటిరోజే మెట్రో రైలు తరలిపోతున్నదని సిద్ధంగా ఉంచుకున్న కథనాన్ని ప్రచురించి కక్ష తీర్చుకున్నాడు. వాస్తవానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిననాటినుంచి చంద్రబాబు గ్యాంగు మెట్రోకు పుల్లలు పెడుతూనే వచ్చాయి. ఏపీలో మెట్రో ఎర వేసి ఇక్కడి మెట్రోను దెబ్బతీయాలని యథాశక్తి ప్రయత్నించాయి. మెట్రోలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఆ ఘనత చంద్రబాబుకు తప్ప మరొకరికి దక్కరాదన్న ఆరాటం.

ఆ రాతలు నభూతో నభవిష్యతి..


సిగ్గూ ఎగ్గూ లేని రాతలు అని జర్నలిజం కోర్సులో ఓ చాప్టర్ చేర్చాలని ఎవరైనా భావిస్తే దానికి పెద్ద పరిశోధనలు చేయాల్సిన పనిలేదు. ఆసరా పథకం మీద రాధాకృష్ణ రాయించిన రాతలు చేరిస్తే సరిపోతుంది. దేశంలో ఎక్కడన్నా లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఒక పథకం ప్రవేశపెట్టినపుడు దరఖాస్తులు స్వీకరించని సందర్భం ఉన్నదా? కానీ రాధాకృష్ణ దరఖాస్తులు తీసుకోవడం పాపమని అంటాడు. లక్షల మందికి ఒక పథకం అమలు చేయాలంటే క్యూ అనే పద్ధతి లేకుండా ఇచ్చిన రాష్ట్రం ఉన్నదా? క్యూలో నిలబెట్టి వృద్ధులను చంపేస్తున్నారని ప్రచారం చేస్తాడు. 

ఒక పథకానికి దరఖాస్తు వచ్చినపుడు ధ్రువీకరించుకోవడం కోసం అధికారులు ఇండ్లకు వచ్చి వివరాలు తనిఖీలు చేయరా? అలా వచ్చి అధికారులు పింఛన్లు ఎగ్గొడుతున్నారంటాడు. ఆ రాతల ప్రకారం దరఖాస్తులు తీసుకోకూడదు. క్యూలు అమలు చేయకూడదు. అధికారులు సర్వే కూడా చేయకూడదు. అర్హులైనా కాకున్నా అడిగితే చాలు ఇదిగో పింఛన్ అని పువ్వుల్లో పెట్టి ఇచ్చేయాలి. ఇక అనర్హుల ఏరివేత.. లేదా కొందరికి పింఛన్ రాకపోవడం మీద రాసిన రాతలు నభూతో నభవిష్యతి. రేషన్ కార్డుల విషయమూ అంతే. ప్రభుత్వం ఏమీ చేయవద్దు. చేస్తే వెంట పడతా అన్నది ఆయన పాలసీ.

చంద్రన్న బంటుగా..


చంద్రబాబు నమ్మిన బంటుగా ఉన్న రాధాకృష్ణ ఏపీ ప్రయోజనాల విషయంలో ఏనాడూ తనను తాను దాచుకోలేదు. రంగా వర్సిటీ పేరు మార్పుల నుంచి ఇంటర్‌మీడియట్ పరీక్షల విభజన దాకా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగానే వార్తలు గుప్పించాడు. వాస్తవానికి కిరణ్ అధికారంలో ఉన్ననాడు బయ్యారం వివాదం వస్తే జాతీయ ప్రయోజనాలు అంటూ అక్కడి ఇనుపఖనిజాన్ని విశాఖకు తరలించేందుకే ఓటు వేసిన చరిత్ర ఎటూ ఉంది. వాటర్‌గ్రిడ్ మీద అవే రాతలు.. తెలంగాణలో వర్షపాతం చాలా బాగుంది.. ఇక్కడ గ్రిడ్ అవసరమే లేదని రాతలు. సచివాలయాన్ని తరలించాలని ప్రతిపాదించినా గగ్గోలు. కానీ చాలామంది సన్నాసులకు తెలియంది ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరుగుతున్న సమయంలో కర్నూలు నుంచి ఆంధ్రా అధికారులు తరలి వస్తున్న సమయంలోనే సచివాలయాన్ని తరలించాలని నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిపాదించారు.

అయితే నాడు ఆంధ్రా అధికారులకు, ఎమ్మెల్యేలకు వసతి భవనాల నిర్మాణానికే నిధులు సరిపోగా నెహ్రూ ప్రభుత్వం విలీనమవుతున్న రాష్ట్రంలో ఏర్పాట్లకు నిధులు ఇవ్వడం లేదని సమాచారం ఇచ్చి ఉన్నదాంట్లో సర్దుకోవాలని చెప్పడంతో ఆ ప్రతిపాదన విరమించి ఉన్న సచివాలయంలోనే అదనపు ప్లోర్ వేసుకున్నారు. లేకుంటే ఆనాడే ఇప్పటి సచివాలయం వదిలేసి హుస్సేన్ సాగర్‌కు అటువైపు విశాలమైన సచివాలయం వచ్చి ఉండేది. 

అబ్రకదబ్ర..


ఇక రాధాకృష్ణ గాల్లోంచి తీసే వార్తలకు లెక్కేలేదు. అధికారంలోకి రాగానే ఏపీనుంచి వచ్చే వాహనాలకు పన్నులు వేయబోతున్నారని రూ.500 కోట్లు బాదబోతున్నారని వార్తలు రాశాడు. కానీ 2015 మార్చి దాకా ఉమ్మడి పన్ను అనేది అప్పటికే విడుదలైన జీవోలో ఉన్నది. అలాగే వాహనాలకు టీఎస్ మార్పు పేరిట ఏకంగా 500 కోట్లు బాదబోతున్నారని ప్రచారం చేశాడు. కానీ పాత నంబర్ల మార్పుకు ఫీజు లేదని అప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయినా అదే ప్రచారం. తెలంగాణలో కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని 3,500 కోట్ల భారం మోపబోతున్నారని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చీ రాగానే రాసేశాడు. తాను రాసిందే రాత. తాను గీసిందే గీత.

ఏపీ కోసం ఎంత బెంగ..


రాధాకృష్ణది ఎంతటి కుట్రస్వభావమంటే జూన్ 2న రాష్ట్రం వచ్చింది. అదేనెల 11నాడే రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయంటూ వార్తలు రాసుకున్నాడు. అప్పటికే 800 కంపెనీలు వెళ్లిపోయాయని ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతుంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈ కారణంతో దిగజారి పోబోతున్నదని విష ప్రచారం చేశాడు. అంటే తెలంగాణ కంపెనీలకు పనికిరాదు.. అని సీమాంధ్ర దురహంకార బుద్ధి చాటుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి రాష్ట్రంలోని ఫార్మా మొత్తానికి మొత్తం కర్ణాటకకు తరలిపోతుందని వార్తలు రాశాడు. ఎందుకు? కేసీఆర్ ఇక్కడ ఫార్మాసిటీ ప్రతిపాదించారు. దాన్ని దెబ్బ కొట్టాలి. కర్ణాటకలోని యాద్గిర్‌లో ఎన్ని రకాల మినహాయింపులు ప్రోత్సాహకాలు ఉన్నాయో ఈయనే ఉచిత ప్రచారం చేసిపెట్టాడు. 

చరిత్ర మలుపులో ఉన్నాం..


రాధాకృష్ణ కావొచ్చు.. మరొకరు కావొచ్చు అర్థం చేసుకోలేకపోతున్నది ఒకటుంది. తెలంగాణకు ఇది ఒక చారిత్రక సందర్భం. చరిత్ర మలుపులో తెలంగాణ ప్రజలు నిలబడి ఉన్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణ కీలక సందర్భం. ఇపుడు వేసే అడుగే రాబోయే అనేక దశాబ్దాల భవిష్యత్తుకు పునాది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ రేపటి భవిష్యత్తుకు పునాది వేసుకునే తపస్సులో లీనమైన ప్రభుత్వాన్ని భంగపరిచే శక్తులు యథాశక్తి తమ ప్రయత్నాలు చేస్తాయి. రాధాకృష్ణ లాంటి మందమతులకు ఇది.. ఆ.. ఏముంది ఓ ముక్క విడిపోయింది. ఓ పార్టీ అధికారం చేపట్టింది అన్నంత మామూలు విషయం కావొచ్చు. అధికారం కోసం అర్రులు చాచే మరుగుజ్జులకు కేసీఆర్ కార్యక్రమాలు నిజాం పోకడలు, తుగ్లక్ చర్యలు కావొచ్చు. కానీ మిషన్ కాకతీయలు, వాటర్ గ్రిడ్‌లు, హరిత హారాలు, రహదారుల విస్తరణలు, విశ్వ నగర ప్రణాళికలు, విశాల సచివాలయాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనలు, నూతన పారిశ్రామిక విధానాలు, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌లు.. ఇవన్నీ భవిష్యత్తుకు పునాదులు. ఈ పునాదుల మీదనే రేపటి తరం మహోజ్వల భవిష్యత్తు ఉంది. ఈ పునాదులను ఆదిలోనే కూల్చే యత్నాలు చంద్రబాబు నమ్మిన బంట్లు రాధాకృష్ణల రూపంలో చేస్తూనే ఉంటారు. అలాంటి చరిత్రహీనులను అర్థం చేసుకోవడం.. తిప్పి కొట్టడం ఇవాళ తెలంగాణవాసుల కర్తవ్యం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్య్హంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి