గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 16, 2015

ఏపీ పాపం...తెలంగాణ విద్యార్థులకు శాపం!!!

-గడువు దాటిన తర్వాత తెలంగాణ కాలేజీల్లో సీట్లు కేటాయింపు
-తెరపైకి వచ్చిన రాటిఫికేషన్ల సమస్య..40 వేల సీట్లపై ప్రభావం 
ఏపీ ఉన్నత విద్యామండలి గత విద్యాసంవత్సరంలో చేసిన పాపం.. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది అడ్మిషన్లు పొందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 వేల సీట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీని ప్రభావం అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులపై పడింది. తెలంగాణ రాష్ట్రంలో గడువు ముగిసిన తర్వాత కూడా యాజమాన్య కోటాలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు చేపట్టాయి. ఆ విధంగా 30 వేల సీట్లు యాజమాన్య కోటాలో భర్తీ చేసుకొన్నారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 172 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించుకోవాలన్న ఆదేశాలు జారీచేశారు. ఆ విధంగా తెలంగాణ కాలేజీలలో కన్వీనర్ కోటాలో దాదాపు 5 వేల పైచిలుకు అడ్మిషన్లు చేపట్టారు.
ఇవి కాకుండా యాజమాన్య కోటాలో మరో 5 వేల వరకు అడ్మిషన్లు చేపట్టారు. అన్ని కలిపి 40 వేల సీట్ల భర్తీపై రాటిఫికేషన్ల వివాదం కొనసాగుతున్నది. ఈ సీట్లను ఎవరు ఆమోదించాలన్న అంశంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నది. మరో పక్క ఆ సీట్లను రాటిఫికేషన్లు చేయడానికి ఏపీ విద్యామండలిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో సీట్లను కచ్చితంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి రాటిఫికేషన్లు చేపడుతుందని, ఆ మేరకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగకుండా.. అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్య్హంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి