గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 11, 2015

పన్ను చెల్లించాల్సిందే!!!

HIGH-COURT


రాష్ట్రంలోకి ప్రవేశించే ఇతర రాష్ట్ర ప్రైవేట్ వాణిజ్య రవాణా వాహనాలపై వాహనపన్నును వసూలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇతర రాష్ట్ర వాణిజ్య రవాణా వాహనాలకు పన్ను విధించడంపై ధర్మాసనం ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 15 ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో యథాతథంగా అమలుకానుంది. 
-ఏపీ వాణిజ్య వాహనదారులకు హైకోర్టు ఆదేశం
-పన్ను వసూళ్లకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి
-మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం
-యథాతథంగా అమలుకానున్న జీవో 15

తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి ప్రవేశించే వాణిజ్య రవాణా వాహనాలకు రవాణా పన్నును విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు మార్చి 30న జీవో 15ను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్‌చేస్తూ ఏపీకి చెందిన కాంట్రాక్ట్ క్యారేజ్ వాహనాల యాజమానులతోపాటు పలువురు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, రవాణా వాహన యాజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీకి చెందిన వాహనాలకు వాహనపన్ను వసూలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం రవాణాపన్ను వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 1న విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జీవో 15పై హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్‌దారులకు చెందిన వాహనాలు తెలంగాణ పరిధిలోకి ప్రవేశించే సమయంలో టాక్స్‌కు సంబంధించిన ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలని యాజమానులకు స్పష్టంచేసింది.
మధ్యంతర ఉత్తర్వులు వెలువరించే వరకు ఈ తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అదే రోజు హైకోర్టు స్పష్టంచేసింది. ఏప్రిల్ 1న జారీచేసిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టును ఆశ్రయించిన ఏపీకి చెందిన ప్రైవేట్ వాణిజ్య రవాణా వాహనాల నుంచి రవాణాపన్ను వసూలు చేసేందుకు అనుమతించింది. పన్నును చెల్లించేందుకు పిటిషనర్లకు పదిరోజులు గడువు ఇచ్చింది. వసూలు చేసిన పన్నును ప్రత్యేక ఖాతాలలో జమచేయాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రధాన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇది వాస్తవానికి ఆంధ్రావాళ్ళ గొడవ కాదు. తెలంగాణవాళ్ళ ఇబ్బందే. ఈ పన్నుల వల్ల తెలంగాణలో అన్నింటి ధరలూ ఛార్జీలూ రెండుమూడురెట్లు పెరుగుతాయి. అంటే తెలంగాణ ప్రభుత్వం లాభపడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు నష్టపోతారు. అది తెలుసుకోకుండా భలే చేశామని సంతోషపడుతున్నారు. అయితే తెలంగాణ నుంచి వచ్చే వాహనాల మీద ఆంధ్రా ప్రభుత్వం విధించదల్చుకోలేదు గనుక ఆంధ్రవాళ్ళకి ధరలు పెరగవు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రాయే ప్రజల శ్రేయస్సు కోరి ఇలాంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణకి ఏంటి అభ్యంతరం? అని అందరూ అడుగుతున్నారు. ఆంధ్రా తెలంగాణలకి నాన్-తెలుగు రాష్ట్రాలతో ఉన్న సంబంధమూ (అది ఆర్థిక సంబంధమైనా సరే) తమలో తమకి ఉన్న సంబంధమూ ఒక్కలాంటివి కావు. కనుక నాన్-తెలుగు రాష్ట్రాలతో మనం అవలంబించాల్సిన వైఖరీ, తోటి తెలుగురాష్ట్రంతో అవలంబించాల్సినదీ ఒకటి కావు. అయితే టి.ఆర్.ఎస్. పాలన కింద ఉన్నంత కాలం ఈ సత్యం తెలంగాణవాళ్ళకి ఎక్కకపోవచ్చు. సరే, ఫోనివ్వండి. ఏదైనా అనుభవం నుంచి నేర్చుకోవాల్సిందే కదా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణవాళ్ళకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలంగాణ పాలకులకు తెలియదా? మీరేమీ బాధపడిపోవలసిన అవసరం లేదు.

ఇకపోతే ఆంధ్రా ప్రభుత్వం వాహనాల మీద పన్నును వదులుకోవడానికి సిద్ధపడి ఏమీలేదు. పన్నులు వసూలు చేస్తూనేవుంది. మీరేలోకంలో ఉన్నారో....

ఇది చదవండి:అక్కడ వసూళ్ళు...ఇక్కడ గగ్గోలు...http://ratnaalaveena.blogspot.in/2015/04/blog-post_10.html

తోటి తెలుగు రాష్ట్రాలతో అవలంబించాల్సిన వైఖరి గురించి నంగనాచి కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు. మా తెలంగాణకు ఈయవలసిన విద్యుత్ వాటా మాటేమిటి? తెలంగాణ నీటివాటాను ఈయకుండా ఆంధ్రాకు తరలించుకొన్న విషయం మరచిపోయారా?

ఇది చూడండి:ఆంధ్రాపాలకుల హయాంలో శ్రీశైలం కబ్జా http://ratnaalaveena.blogspot.in/2015/03/blog-post_29.html

ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను ఆంధ్రాకు రప్పించుకోకుండా...తాత్సారం చేయడంలో ఆంధ్రాపాలకుల మతలబేమిటి? బీజేపీ ప్రభుత్వం ఏర్పడీఏర్పడగానే భద్రాచలంలోని ముంపుప్రాంతాలూ, మాకు లాభకరమైన ప్రాంతాలూ ఆంధ్రాలో కలుపు కుట్ర పన్ని విజయంసాధించిన బాబు వైఖరి ఏలాంటిదనాలి? తోటి తెలుగు రాష్ట్రంతో అవలంబించాల్సిన సక్రమమైన వైఖరి మీ ప్రభుత్వం అవలంబించడంలేదు. ఇది తెలుసుకోకుండా మీరు ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం ఏకపక్షమే. పిల్లి కళ్ళుమూసుకొని పాలుతాగడమే.

మీరు చేసిన మోసాల అనుభవం నుంచి తెలంగాణ ఎన్నో కొత్తపాఠాలు నేర్చుకుంది. మా పాలకులు తెలంగాణులకు, తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించరు...ముఖ్యంగా మీ ఆంధ్రాపాలకులు కలిగించినన్ని ఇబ్బందులు మాత్రం కలిగించరు. స్వస్తి.

Jai Gottimukkala చెప్పారు...

తెలంగాణలో బయటి నుండి వచ్చే సరుకుల రేట్లు పెరుగుతాయని బాధ పడుతున్న మిత్రులకు ఊరట కలిగే విషయం ఇదిగో.

మహోజాస్ గారు ఊహించినట్టు తెలంగాణకు ఆంధ్రతోనే కాదు అన్ని రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆంద్ర వాహనాల మీద రవాణా పన్ను వేయడం వల్ల ఏళ్లుగా ఆంద్ర వ్యాపారులకు ఉన్న అడ్వాంటేజ్ తగ్గినా మిగిలిన రాష్ట్రాల వారికి లాభమే.

పూర్తి వివరాలు నా కింది టపాలో చూడగలరు:

http://jaigottimukkala.blogspot.in/2015/04/andhra-ruckus-on-telangana-road-tax.html

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిక్కము వక్కాణించితిరి మిత్రమా!

ఇకపోతే, మహోజస్‍గారూ! వ్యర్థవ్యాఖ్యలు రాయకుండా, గొట్టిముక్కలవారి బ్లాగును దర్షించండి:
http://jaigottimukkala.blogspot.in/2015/04/andhra-ruckus-on-telangana-road-tax.htmlపై క్లిక్ చేయండి. సందేహాలు వారినే అడగండి. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి