గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

ఎవరి పిచ్చి వారికి...!


తెలంగాణ ఏర్పడుటయె
తథ్యమనియు తెలిసికూడ
అసత్యప్రచారములను
సీమాంధ్రులు చేపట్టిరి!

హస్తినలో జరుగునట్టి
బిల్ ఏర్పాటులను చూసి
కూడ నేడు సీమాంధ్రులు
పుకారులను పుట్టించిరి!

బిల్ తిరస్కరించిరనియు,
తెలంగాణమేర్పడదని,
నోటికొచ్చినట్టుగాను
పుకారులను పుట్టించిరి!

కాని కేంద్రయోచనములు
మరో విధముగానుండెను!
తెలంగాణకనుకూలము
గా యోచన లున్న వయ్య!!

బిల్లు యథాతథముగానె
మార్పులు చేర్పులు లేకయె
పార్లమెంటులోన పెట్టి
ఆమోదముకోరుదురట!

అడ్డుకున్న సస్పెండులు!
మూజువాణి వోటింగులు!
బిల్ తొందరగా నెగ్గుట!
ఇవియె కేంద్ర యోచనములు!!

ఇవి యన్నియు చూచుచునే
అసత్యంపు పుకారులను
సీమాంధ్రులు పుట్టించుట
కుట్రతోడి పిచ్చికాదె?

ఎవరి పిచ్చి వారలకును
ఆనందము కలిగించును!
తెలంగాణ ప్రజలారా,
నమ్మకుడయ పుకారులను!!

తెలంగాణ మేర్పడునయ!
కల సాకారమ్మగునయ!
తెలంగాణలోన దివ్య
కాంతి వెల్లివిరియునయ్య!!

జై తెలంగాణ!  జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

తివిరి ఇసుమున తైలమ్ము దీయవచ్చు -
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు -
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు -
చేరి మూర్ఖుల మనము రంజింపలేము!
- ఏనుగు లక్ష్మణ కవి

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తాము కూర్చున్న చెట్టు కొమ్మనే నఱకుకొను మూర్ఖులు ఈ సీమాంధ్ర నేతలు! తమకు ఆశ్రయం కల్పించిన వాళ్ళపైననే దౌర్జన్యం చేసే రకాలు ఈ సీమాంధ్ర నేతలు! కేంద్రం తెలంగాణపై నిర్ణయం త్వరిత గతిని మునుముందుకు పోతుంటే, దోచుకొనడానికి తెలంగాణ తమ చేతినుండి జారిపోతోందే అనే కలవరంతో కల్లు తాగిన కోతుల్లా కుప్పిగంతులేస్తున్నారు! తెలంగాణపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐనా మన తెలంగాణను వాళ్ళు ఆపలేరుగాక ఆపలేరు. త్వరలోనే తెలంగాణ ఏర్పడుతుంది. జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి