గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఫిబ్రవరి 13, 2014

చవకబారు రౌడీయిజం!


దేశంలో అత్యున్నత
సభలోపల సీమాంధ్రులు
చవకబారు రౌడీయిజ
మును చేయుట సిగ్గుచేటు!

తెలంగాణ బిల్లు పార్ల
మెంటులోన పెట్టగానె
సీమాంధ్రకు చెందినట్టి
నేతలపని సిగ్గుచేటు!

అత్యున్నత సభలోననె
రౌడీయిజమును చేసిరి!
అమాయకపు తెలగాణతొ
నెటులుండిరొ గ్రహియింపుడు!!

అరువదేండ్ల నుండి తెలం
గాణ సహించుచునున్నది!
ఇంక దుష్ట జనులతోడ
నెట్లు కలిసి యుందురయా?

సీమాంధ్రుల దుశ్చర్యలు
అరువదేండ్లుగా చూడని
కేంద్రమునకు విదితమాయె
స్పష్టముగా నేటిరోజు!

మొగుడిని కొట్టియు మొఱ మొఱ
యనుచును మొగసాలకెక్కు
రీతిగాను ఎంపిలిట్లు
చేయుటయే సిగ్గుచేటు!

గౌరవప్రదమైన సభను
కత్తులిట్లు తెచ్చుటేల?
సభ్యులపై దాడి జరిపి
పెప్పర్ స్ప్రే చేయుటేల??

చవకబారు రౌడిలవలె
ప్రవర్తించి ఈ ఎంపీ
లయిరయ్యా తీవ్రవాద
దేశద్రోహులే నిజముగ!

ఇట్టి దౌష్ట్యమును జేసిన
ఎంపీలకు పార్లమెంటు
తీవ్రమైన శిక్షవేసి
తీరవలెను నేటిరోజు!

తీవ్రవాదులకు వీరికి
తేడాయే లేదయ్యా!
రాజద్రోహులకిచ్చెడు
శిక్షవేయవలెనయ్యా!!

రౌడీలకు దొంగలకును
టిక్కెటిచ్చి సభకు దెచ్చు
పార్టీలకు బుద్ధిచెప్పు
నట్లు శిక్షయుండవలెను!

అవమానము, సిగ్గు, సిగ్గు!
దుర్మార్గపు చేతలివియె!
తెలగాణుల మిట్టి చర్య
లను వేగమె ఖండింతుము!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి