గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

ఇలాగైతేనే మేం నమ్ముతాం!


బీజేపీ అసహనమును
వ్యక్తము చేయుట ఎందుకు?
షరతులు పెట్టుట నిజముగ
అపనమ్మకమునకె తావు!

బేషరతుగ మద్దతిత్తు
మని చెప్పియు షరతులిపుడు
పెట్టుట మరి నిజముకాదె?
అపనమ్మకమిదియె యిచ్చె!

చేయి కోసి యీయవలదు!
రక్తముతో రాయవలదు!
తెలగాణకు నష్టమిడెడి
అంశమ్ముల సవరింపుడు!!

చంద్రబాబు వెంకయ్యలు
చక్రము తిప్పుచు నుంటకు
వెంటనె కళ్ళెము వేయుడు!
తెలగాణను రక్షింపుడు!!

తెలంగాణ సూచించిన
సవరణములు చేయకయే
కాంగ్రెస్ బిల్ పెట్టుచుండె!
అన్యాయము చేయుచుండె!!

కాంగ్రెస్సుకు తెలంగాణ
తగిన బుద్ధి చెప్పు సుమ్ము!
బీజేపీయైన చిత్త
శుద్ధి నిరూపింపవలెను!!

తెలగాణకు నష్టమిడెడు
చేతలు చేసెడివారలె
తెలంగాణలోన మిగుల
నష్టపోదురనుట నిజము!

తెలగాణకు నష్టమిడని
రీతిని మెలగుచును మీరు
తెలంగాణ అభివృద్ధికి
బాటను చూపిన చాలయ!

తెలంగాణ మీపట్లను
కృతజ్ఞతను ప్రకటించును!
మేలు చేసినట్టి మిమ్ము
తప్పక గెలిపించు సుమ్ము!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి