గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

కుటిల రాజకీయాలు మానండి!


టీబిల్లును పార్లమెంటు
లోన పెట్టగాను గొడవ
జరిగినచో నొప్పుకొనము
అని బీజేపీ పలికెను!

గొడవ జరుగునపుడు బిల్లు
చర్చ సేయ నొప్పుకొనము!
గొడవచేయు వారిని స
స్పెండుచేయ నొప్పుకొనము!

సకాలమున తెలంగాణ
బిల్లు పెట్టకున్న మేము
ఒప్పుకొనము మద్దతిడము
అని బీజేపీ పలికెను!

సీమాంధ్రులు పిచ్చి పట్టి
నట్లు ప్రవర్తించుచుండ్రి!
సభలో వారిని సస్పెండ్
చేయుటయే శరణ్యమ్ము!!

బిల్లు పెట్టగాను మేము
దౌర్జన్యము చేతుమనియు
పలికెడు సీమాంధ్రులకును
సస్పెండే శరణ్యమ్ము!

కాంగ్రెస్సే వారినిపుడు
దారిలోన పెట్టవలయు!
దానికి బీజేపీయే
యిపుడు తోడు పడగవలయు!!

బీజేపీ కాంగ్రెస్సులు
వారల కాపాడుచుండ్రి!
తెలంగాణ కన్యాయము
చేయగాను బూనుచుండ్రి!!

బీజేపీ అట్లనుటకు
వెనుక కారణములున్నవి!
చంద్రబాబు వెంకయ్యలు
చక్రము త్రిప్పుచు నుండిరి!!

సీమాంధ్రుల దుడుకు చేత
లకు కేంద్రము బ్రేకు వేయ
జాలకున్నదా యేమీ?
అదుపు చేయలేద యేమి??

తెలంగాణ సూచించిన
సవరణములు చేయకయే
బిల్లు పార్లమెంటులోన
పెట్టగాను ఏమనవలె?

దీని వెనుక సీమాంధ్రుల
కుట్ర దాగి యున్నదయా!
దీని వెనుక సీమాంధ్రుల
లాబి దాగి యున్నదయా!!

తెరచాటున సీమాంధ్రుల
కేంద్రము తలదాల్చుచునే,
బయటికి వ్యతిరేకించుట
నాటకమయ, బూటకమయ!

బిల్లుకు మద్దతు తెలుపుచు
కొర్రీలను పెట్టుచుంట,
బీజేపీ ద్వంద్వనీతి
చెప్పకయే చెప్పుచుండె!

అరువది యేడులనుండియు
మా కన్యాయము జరుగగ,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేతుమనుచు పలుకుటేల?

న్యాయము చేయగ వలసిన
వారికి అన్యాయమ్మును
చేయుచు, సీమాంధ్రులకును
న్యాయము చేతుమననేల?

ఎవరు దోపిడికి గురైరొ
వారలకన్యాయమిడియు,
దోచుకున్నవారలకే
న్యాయము చేతుమననేల?

ఆకలితోనున్నవాని
కాహారమ్మీయకుండ,
కడుపు నిండినట్టి వారి
కే తిండిని పెట్టనేల?

తక్షణమే షరతులేవి
విధియింపక తెలంగాణ
రాష్ట్రమ్మును ఏర్పరించి,
మా కిడుచో న్యాయమగును!

ఇట్లు జరుగకున్న మీరు
తెలంగాణలోన గెలుపు
సాధించుట కల్లయయ్య!
అధికారము పొందరయ్య!!

బీజేపీ టీడీపీ
కాంగ్రెస్సులు తెలిసికొనియు
మసలుకొనినచో నెగ్గుట
ఖాయమగును విజయమ్ములు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి