గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

చిరంతన ప్రజాభీష్ట సాకారం...త్వరలోనే!


అరువదేండ్ల క్రింద తెలం
గాణ గొంతు నొక్కినారు!
అమాయకపు తెలంగాణ
నాంధ్రలోన కలిపినారు!!

ప్రజాభీష్ట మడుగకుండ
పెత్తందార్లయ్యారు!
వ్యతిరేకించినను గూడ
దుష్పాలన చేశారు!!

అన్నదమ్ములం అంటూ
అణచివేసినారయ్యా!
అండీ గిండీ అంటూ
తొండి జేసినారయ్యా!!

అన్యాయాలక్రమాలు
దోపిడీలు దౌర్జన్యాల్
ఎన్నొ చేసి తెలగాణను
పీల్చి పిప్పి చేసినారు!!

అరువదేండ్ల పోరాటం
తెలంగాణ కొరకు సాగె!
చిరకాలపు ప్రజాకాంక్ష
దినదినమ్ము పెరుగసాగె!!

పోరాటం ఫలితంగా
కేంద్రం తెలగాణానిడగ
సమ్మతించి బిల్లు పంప
నానా యాగీ చేసిరి!!

విషం కక్కినారయ్యా,
కుట్ర చేసినారయ్యా!
దుష్టమైన కుతంత్రాల
దౌర్జన్యం చేసిరయా!!

దైవం మన పక్షముండె,
ధర్మం మన పక్షముండె!
రాజ్యాంగం మనకిచ్చిన
అధికరణం మూడు ఉండె!!

సీమాంధ్రుల చేతలలో
న్యాయమ్మే లేదయ్యా!
సీమాంధ్రుల మాటలలో
న్యాయమ్మే లేదయ్యా!!

ఎన్ని కూతలను కూసిన,
వెర్రి చేతలను చేసిన,
న్యాయపక్ష తెలంగాణ
రాష్ట్రమ్మేర్పడునయ్యా!!

అనుభవజ్ఞు లనుచుండిరి
మేధావులు అనుచుండిరి
న్యాయమూర్తు లనుచుండిరి
తెలంగాణ మేర్పడునని!!

అన్యాయాంధ్రుల మాటలు
చెల్లవనుచు పలుకుచుండ్రి!
అన్యాయాంధ్రుల పాలన
సాగదనుచు పలుకుచుండ్రి!!

కేంద్రము సంకల్పించిన
మహాయజ్ఞమందు అన్ని
రాజకీయ పార్టీలిక
జతకట్టియు గెలిపింతురు!!

దుష్ట వాదనల బూచులు
యజ్ఞమందు నశియించును!
పసలేని కుతర్కమంత
మాడి మసై నశియించును!!

తెలంగాణ సోదరా,
బెంగ పడుట మానరా!
మన రాష్ట్రం మనకేర్పడి
చింత తొలగు నిజమురా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి