హస్తినలో డ్రామాలను
ఆడునట్టి ముఖ్యమంత్రి!
నీ ఉన్మాదపు చేతల
సహింపదీతెలంగాణ!!
దొంగలెక్కలెన్నొచూపి,
అబద్ధాలనెన్నొఆడి,
కపటనాటకములాడుట
సహింపదీతెలంగాణ!
చెల్లని నీ తీర్మానము
అహంకార ధోరణితో
కేంద్రమునకు తెలుపగాను,
వారలు అజ్ఞానులా?
కలిసిఉండమనువారల
ఏకపక్ష వాదనతో
కలిసిఉండుమని చెప్పుట
నీ దురహంకారమగును!
రాజ్యాంగము ప్రకారమే
తెలంగాణ బిల్లు పంప,
ధిక్కరించినట్టి నీవు
రాజద్రోహివి కావా?
సంప్రదాయమును విడచియు
అడ్డగోలు తీర్మానము
చెల్లనట్టి తీర్మానము
చేయుట మూర్ఖత కాదా?
చర్చలు ముగిసిన పిమ్మట
చేసినట్టి తీర్మానము
చెల్లదనియు తెలిసికూడ
కేంద్రమెట్లు స్వీకరించు?
నీవు ఎంత యత్నించిన
ఫలితముండదని తెలిసియు
పిచ్చిపట్టినట్టి రీతి
నటియించుట సహియింపము!
తెలంగాణ నొక రీతిగ,
సీమాంధ్రను నొక రీతిగ
చూచునట్టి పక్షపాతి!
తక్షణమే దిగవయ్యా!!
సిగ్గు శరము లేక నీవు
ముఖ్యమంత్రి పీఠమ్మును
గబ్బిలమ్ము పట్టినట్టు
పట్టుకొనుట సహియింపము!
మూర్ఖమైన ముఖ్యమంత్రి
చేతలతో హస్తినలో
జంతరు మంతరు మ్రోలను
డ్రామాలాడగ తగునా?
నల్లికుట్ల వేషముతో
మూగదీక్ష బూను నిన్ను
వలదని వారింప వచ్చు
మంత్రుల నవమానింతువె?
రాష్ట్రానికి ముఖ్యమంత్రి
వయ్యు నీవు మహిళలపై
సెక్యూరిటి నుసిగొల్పియు
చోద్యము చూచుట తగునా?
మహిళా మంత్రులపైనను
నీవు చేయు దుష్కృత్యము
భరతజాతి క్షమియించదు!
ఇది ఒక ఉన్మాదచర్య!!
సాటి మంత్రిపైనను నీ
అహంకారమును జూపుట
క్షమార్హము కాదయ్యా!
ముఖ్యమంత్రిగా తగవయ!!
మహిళలకింతటి అవమా
నమ్ము చేసినట్టి నీవు
ఒక్క క్షణము కూడ మాకు
ముఖ్యమంత్రిగా తగవయ!
మహిళామంత్రులకింతటి
అవమానమ్మును జరుగగ
వాహనమ్మునుండి దిగని
నీవు ముఖ్యమంత్రివెట్లు?
మంత్రికి గౌరవమునిడవు,
ప్రజలనెట్లు పాలింతువు?
మంత్రులకే రక్ష లేదు,
ప్రజలనెట్లు రక్షింతువు?
మౌనదీక్ష పేరుచెప్పి,
కబుర్లతో గడిపినావు!
నీదొక మౌనపు దీక్షా?
అహంకారి దిగవయ్యా!!
ముఖ్యమంత్రి అర్హతయే
కోలుపోయినావు నీవు!
తత్క్షణమే దిగిపోనిచొ
సహింపదీ తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి