గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

బీజేపీ కుటిల రాజనీతి?


బీజేపీ కేంద్ర నాయకత్వం...చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుటిల బోధలు తలకెక్కించుకుని, సీమాంధ్రకు న్యాయం చేస్తేనే తెలంగాణకు మద్దతిస్తామనడం...నిజంగా బ్లాక్ మెయిలింగ్‍కు పాల్పడడమే. "తెలంగాణ బిల్లు పెట్టండి, మేం బేషరతుగా మద్దతిస్తాం" అన్న నాటి మాటలకూ, షరతులతో కూడిన మద్దతిస్తామన్న నేటి మాటలకూ ఏమాత్రం పొంతనలేకుండా ఉండడం బీజేపీ ద్వంద్వ రాజనీతికి నిదర్శనమని భావించక తప్పదు. అందరూ ఒకేమాటపై లేకుండా రకరకాల వ్యూహాలతో, మాటలతో తెలంగాణులను ఇరకాటంలో పెట్టడం, ఆచరణ సాధ్యంకాని సవరణలు ప్రతిపాదించడం వెనుక చంద్రబాబు, వెంకయ్య నాయుడుల పాత్ర ఉంది. చంద్రబాబుకూ, వెంకయ్యనాయుడుకూ సీమాంధ్రలో ఓట్లు పడవుగానీ,  రాళ్ళు పడడం ఖాయం. ఈసారి సీమాంధ్రలో వైయెస్సార్సీపీపై ఉన్న క్రేజీ వల్ల బీజేపీకీ, తెలుగుదేశానికీ ఓట్లు రాలవనడం అతిశయోక్తి కాదు. అలాంటి సీమాంధ్ర నాయుడు ద్వయాన్ని నమ్మి, అన్యాయానికి గురైన తెలంగాణకు...బీజేపీ కేంద్రనాయకత్వం...ఇంకా అన్యాయం చేయాలా? అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా, అరవై ఏండ్లుగా తెలంగాణను  దోచుకున్న సీమాంధ్రకే న్యాయం చేయాలనడం...అలా చేస్తేనే మద్దతిస్తామనడం...వారి కుటిల రాజనీతికి దర్పణం పడుతుంది. ఇలాంటి అవకాశవాద రాజకీయానికి బీజేపీ పాల్పడుతుందని తెలంగాణులు ఏనాడూ ఊహించలేదు. బీజేపీ చెప్పినట్లుగా బేషరతుగానే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తుందని తెలంగాణులు ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని బీజేపీ వమ్ముచేసుకోదనే ఆశిద్దాం.


ఈ అంశంతో సంబంధం ఉన్న ఈ క్రింది టపాలను కూడా చదవండి:
(చదవదలచిన టపాపై క్లిక్ చేయండి)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

reachrala rudhurudu చెప్పారు...

I AM ALSO THINKING THAT CONGRESS PASSING TELANGNA BILL TO GET VOTES IN TELANGANA.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిజమే. ఐతే కాంగ్రెస్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఇతర పార్టీలు కట్టుబడిలేవన్నది వాస్తవం. ఏమంటారు? ఇకపోతే, అన్ని రాజకీయపార్టీలూ తెలంగాణను రాజకీయంగా ఓట్ బ్య్తాంక్ గానే చూస్తున్నాయి తప్ప మానవీయకోణంలో చూడటం లేదు. ఇలాగైనా మా తెలంగాణకు విముక్తి లభిస్తోందనే సంతోషాన్ని మాకు దక్కనీయకుండా, బీజేపీ, సీమాంధ్రుల కుట్రలకు, కుటిల కుతంత్రాలకు తలఊపుతోందే ననే మా బాధ. అరవై ఏండ్లు దోచారు. ఇంకా తెలంగాణ దోపిడీకి గురికావాలా? అనేది ఎవరికీ పట్టడం లేదు. బీజేపీ స్టాండులో మార్పు వస్తుందనే మా ఆశ. సీమాంధ్రలో రాజకీయాలు, వోట్లు కుక్కలు చింపిన విస్తరిలా ముక్కలు ముక్కలు కావడం ఖాయం. అలాంటి సీమాంధ్రపై, నక్కజిత్తుల చంద్రబాబుపై నమ్మకం పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఏ లాభమూ చేకూరదనే విషయం కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా..తెలంగాణ ఆశలపై నీళ్ళు చల్లడానికి పూనుకుంటుందా..లేక బేషరతుగా మద్దతిస్తుందా నేడు తేలిపోతుంది. మా నమ్మకం బీజేపీ విషయంలో వమ్ము కాదని మా ఆశ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి