గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

తెలంగాణలో కాంగ్రెస్సూ, బీజేపీ, టీడీపీలు మట్టిగొట్టుకుపోవడం ఖాయం...


[తెలంగాణులు సూచించిన సవరణములు బిల్లులో చేయకపోవడం తెలంగాణకే అవమానకరం. తెలంగాణకు ఈ బిల్లు నష్టం కలిగించేదే...మళ్ళీ బానిసత్వంలోనికి నెట్టేదే! కాబట్టి ఏ ఆంక్షలు లేని తెలంగాణకై తక్షణమే తెలంగాణులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణులను ఉద్యమించే దాకా తెచ్చిన కాంగ్రెస్‍కూ, బీజేపీకీ, టీడీపీకీ తెలంగాణలో నూకలు చెల్లాయి! ఉద్యమమే శరణ్యం! జై తెలంగాణ! జై జై తెలంగాణ!]

తెలంగాణ బిల్లులోన
ఆంక్షలన్ని తొలగించియు
సంపూర్ణపు తెలగాణకు
సహకరించుచో నిలుతురు!

తెలంగాణ ప్రజల కాంక్ష
నెరవేరకపోయినచో
తెలంగాణలో వీటికి
మనుగడయే దుర్లభమగు!

తెలగాణను నష్టపరచు
అంశాలను తొలగించియు
సవరించినచో సరియే!
లేకున్నచొ ఉద్యమమే!!

అంతదాక తెచ్చినచో
కాంగ్రెసునకు పుట్టగతులు
తెలంగాణలో ఉండవు!
పుట్టి మునుగుటే ఖాయము!!

రాజకీయ ప్రయోజనాల్
ప్రక్కనిడియు నేతలంత
సంపూర్ణపు తెలంగాణ
సాధనకై పూనుకొనుడు!

క్షణమాలస్యము చేసిన
అవకాశము తొలగిపోవు!
తెలంగాణ శాశ్వతముగ
బానిసగా మిగిలిపోవు!!

పద పద పద, పద పద పద!
త్వర త్వర త్వర, త్వర త్వర త్వర!
ఉద్యమమే శరణ్యమ్ము!
ఉద్యమమే మన ఊపిరి!!

ఉద్యమించు, ఉద్యమించు!
రాష్ట్రముకై ఉద్యమించు!
సంపూర్ణపు తెలంగాణ
సాధించుటకై శ్రమించు!!

ఉద్యమింతుమనుమాటను
కేంద్రమునకు వినిపింపుము!
కేంద్రము దిగిరావలయును!
తెలంగాణమేర్పడవలె!!

తెలంగాణ అమరవీర
బలిదానమ్ముల ఫలితము
తెలంగాణ మేర్పడుటే!
ఉద్యమించు! ఉద్యమించు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి