శ్లో||
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే,
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి||
చం.
కనకపు లంకయైన మఱి కాంచను నేను రుచించ లక్ష్మణా!
జననియు జన్మభూమియును స్వర్గముకన్నను మిన్నయౌ సుమా!!
రావణ వధానంతరం లక్ష్మణుడు శ్రీరాముని లంకకు అధిపతియై రాజ్యమేలుమనగా, అంగీకరింపక రాముడు "లక్ష్మణా! ఇది బంగారు లంకయినా నేను ఇష్టపడను! ఎందుకంటే, జననీ, జన్మభూమీ స్వర్గంకన్నా ఎక్కువగదా! కాబట్టి మనం మన జన్మభూమి అయోధ్యకే వెళదాం!" అన్నాడు.
ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. నాగరికులైనా... గిరిజనులైనా...! వాళ్ళను ముంచడానికి...వాళ్ళ జన్మభూమినుండి వేరు చేయడానికి ఎవరికీ హక్కులేదు! మానవ హక్కుల్ని కాలరాయడానికి ప్రభుత్వం పూనుకొనడం అమానుష చర్య! ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు! ఇక్కడి ప్రజలు మనుషులు కారా? సీమాంధ్రులే మనుషులా? ఇది ప్రభుత్వం తేల్చుకోవలసిన అంశం. ఏది న్యాయమో తక్షణమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుంది.
మానవత్వము లేని కేంద్రము
పోలవర ప్రజలకును అన్యా
యమ్ము జేయగ నిశ్చయించుట
తగని పనియయ్యా!
ముంపునకు గురియయెడు గ్రామ
మ్ములను సీమాంధ్రులకు నిడుటయె
మానవత్వము లేని పనియయ!
తగనిపనియయ్యా!
జననియును మఱి జన్మభూమియు
స్వర్గమున కన్నను విశిష్టత
గలవి యంచును తెలిసి తెలిసియు
నిట్లు చేయుదురా?
భద్రగిరిలో మునిగిపోయెడు
గ్రామముల నివసించు జనులకు
జన్మభూమిని ముంపునకు గురి
చేయ న్యాయమ్మా?
జన్మభూమిని వీడుమనుటయె
మానవత్వము లేని చేతయ!
మీరు మీ జన్మస్థలమ్మును
వీడిపోయెదరా?
కేంద్రమిట్టుల చేయుచో మా
తెలంగాణ నిసర్గ రూపము
మార్పుచెందును గాన మేమిది
యొప్పుకొనమయ్యా!
పోలవరపు డిజైను మార్చిన
నెట్టి నష్టము లుండబోవయ!
సులభమైన యుపాయముండగ
నష్టపరిచెదరా?
పోలవరప్రాజెక్టు నిర్మా
ణమ్ము జేసిన కలుగునెన్నో
నష్టములు, గ్రహియించి వెంటనె
ఆపుడోయయ్యా!
ప్రజాభీష్టమ్ము కనుగొంటిరె?
వారు తెలగాణమ్ము నందున
నుండ గోరిరి! వారి కోరిక
కూలద్రోయుదురా?
బ్రతుకు దెరువిచ్చటనె యున్నది!
ప్రాణములు వారికిట నున్నవి!
తల్లి నేలను వీడలేరయ!
ఒప్పుకొనరయ్యా!!
సీమకును న్యాయమ్ము కొరకయి
వారి కన్యాయమ్ము చేతురె?
వారి నోటను మట్టి గొట్టగ
చేతులెటులొచ్చెన్?
ప్రజల హక్కును కాలరాయుట
ప్రజాస్వామ్యము కాలరాయుటె!
ప్రజాపాలకులైన మీరలు
ప్రజల నణచెదరా?
వారు ప్రజలుగ కనంబడరే?
తెలంగాణులు ప్రజలు కారే?
ప్రజలు సీమాంధ్రులే యగుదురె?
పక్షపాతమిదే!
మార్చుకొనుడయ యభిప్రాయము!
పోలవరపు డిజైను మార్చుడు!
సకల జనులకు న్యాయమును మీ
రిపుడు చేయుడయా!!
మార్పు చేయక యున్నచో తెల
గాణమందున నుద్యమమ్ములు
తీవ్రతరమై నింగికెగయును!
మీకు సమ్మతమా?
ప్రభువులైనటువంటి మీరలు
ప్రజాభీష్టమ్ములును దెలిసియు
మసలుకొనుటే న్యాయమగునయ
మారుడోయయ్యా!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
హ్రస్వదృష్టి కలవారికి భద్రాచలంలో ముంపునకు గురికాబడే ఏజన్సీ ప్రజలు ప్రజల్లా కనబడరు. తెలంగాణులు సీమాంధ్రలోని ఏ ప్రాంతంలోని చిన్న భాగాన్నైనా కోరడం లేదు. కానీ సీమాంధ్రులు మాత్రం కోరుతున్నారు. వాళ్ళకు అమాయకులైన గిరిజనులు మనుషుల్లా కనబడటం లేదు. ఈ విషయం హ్రస్వదృష్టి కలవారికి తెలియదా? సీమాంధ్ర ముఖ్యమంత్రి ఎన్ని దగుల్బాజీ పనులు చేస్తున్నాడో ఈ హ్రస్వదృష్టి కలవారికి కనబడడంలేదా? తగుదునమ్మా అని తెలంగాణ బ్లాగుల్లోకి వచ్చి విషం వెళ్ళగక్కడమే పనిగా పెట్టుకొన్న ఈ హ్రస్వదృక్కులకు ఈ సీమాంధ్రులు తెలంగాణులకు ఎంత ద్రోహం చేసిందీ తెలియదా? ఎర్రగురివిందలా నీతులు చెప్పేముందు, కింద నలుపు కూడా ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన హృదయంతో, న్యాయంగా మాట్లాడాలి. పక్షపాతంతో మాట్లాడి, ఉన్న గౌరవం కాస్తా ఊడప్ప చేసుకోవద్దు ఈ హ్రస్వదృక్కులు!
అరవై ఏళ్ళు తిని తిని కడుపు నిండి ఉన్నారు సీమాంధ్రులు. ఆకలితో మాడి, చిక్కిపోయి ఉన్నారు తెలంగాణులు. కడుపునిండినవానికి అన్నం పెట్టాలో, కడుపు ఎండిన వానికి అన్నంపెట్టాలో కుసంస్కారులు తెలుసుకోవాలి. విషం కక్కడం మాని, తెలంగాణ పాటపాడండి. తెలంగాణ తిండి తింటూ, సీమాంధ్రపాటపాడే కుసంస్కారం ఎవరికుందో తెలుస్తూనే ఉంది. తినేది మొగుడి సొమ్ము, పాడేది మిండని పాట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి