గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

తెలంగాణ బిల్లు నెగ్గినట్టే...


తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..


భాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు నెగ్గుతుంది.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాటి పరిణామాలతో బిల్లు సభామోదం పొందుతుందా? లేదా? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఇప్పటి వరకు సభలో పోటాపోటీగా ఉన్న సమీకరణాలు గురువారం నాటి పరిణామాలతో తారుమారయ్యాయి.


*బిల్లుకు అనుకూలంగా ...

238 మంది సభ్యులు

సస్పెండైన 2 మంది తెలంగాణా సభ్యులను మైనస్ చేయగా

238-2=236.నిన్న భాజపాతో సీపీఐ కూడా స్పీకర్‌ను కలవడం జరిగింది. ఒకవేళ సీపీఐ 4ఎంపీలు వ్యతిరేకంగా ఓటువేసినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.


అంటే మద్దతు దారుల సంఖ్య..236-4=232


*బిల్లుకు వ్యతిరేకంగా...


ఇందులో భాజపా కూడా ఉంది.

238 మంది సభ్యులు

సస్పెండైన 14 మంది సీమాంధ్ర సభ్యులను మైనస్ చేయగా

238-14=224
+ బిల్లుకు అనుకూలంగా=232 మంది


_ బిల్లుకు వ్యతిరేకంగా=224 మంది.ఇక్కడొక విషయాన్ని వ్యతిరేకులు గుర్తించాలి. సోమవారం మరికొంతమంది సీమాంధ్ర సభ్యులను కూడా సస్పెండ్ చేయవచ్చు. తద్వారా బిల్లుని వ్యతిరేకించేవారి సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. అంటే భాజపా మద్దతు లేకుండా కూడా తెలంగాణా బిల్లు పార్లమెంటులో నెగ్గుతుంది. అదే సమయంలో బిల్లుపై తటస్థంగా వ్యవహరిస్తాయని భావిస్తున్న డీఎంకే(18), నేషనల్ కాన్ఫరెన్స్(3) సభలో అదే వైఖరిని కొనసాగిస్తాయా లేదా అన్నది కీలకంగా మారనుంది. తెలంగాణ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. బిల్లుపై ఓటింగ్ జరిగే సమయానికి సభలో ఉండే సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది బిల్లుకు మద్దతిస్తే తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..జై తెలంగాణ!    జై జై తెలంగాణ!("బహుజనబంధు"గారికి కృతజ్ఞతలతో...బహుజనబంధుగారి ఫేస్‍బుక్‍ను చూడండి)

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

విజ్ఙప్తి:

మీ టపాలకు సంబంధించిన సమాచారం ఇ-మెయిళ్ళుగా నాకు అందుతున్నది. మీరు అనునిత్యం నిర్విరామంగా వ్రాస్తున్న కారణంగా మీ మెయుళ్ళు నాకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. మీరు నా సర్కిళ్ళలో లేరు. నన్ను మీరు మీ సర్కిళ్ళలో చేర్చుకొని ఉండవచ్చును. దయచేసి నా ఐడిని మీ సర్క్యులేషన్ లిష్టుల్లోంచి తొలగించవలసింది. (మీకే కాదు, ఇలా నా ఐడిని తొలగించవలసిందిగా మరికొందరికీ విజ్ఞప్తిని చేస్తున్నానని గ్రహించగలరు) నాకు వృత్తిపరమైన కార్యక్రమాలకు అవాంచిత సమాచారపు మెయిళ్ళు ఆటంకం కలిగిస్తూ ఉండటం వలన ఇలా విజ్ఞప్తి చేయవలసి వస్తున్నది.

ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి