గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఫిబ్రవరి 22, 2014

ఏకపక్షం...

(కేంద్రం తెలంగాణ పట్ల ఏకపక్షంగా వ్యవహరించిన విషయం కేంద్రమంత్రి జై రాం రమేశ్‍గారి మాటలవల్ల సుస్పష్టమవుతోంది. సీమాంధ్రకు న్యాయం చేసి, తెలంగాణకు మొండి చేయి చూపడం ఏకపక్షం కాదా?)


అన్యాయము పొందినట్టి
తెలగాణకు న్యాయమిడక,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేసితిమన నేమనవలె?

సీమాంధ్రకు న్యాయమిడిన,
తెలగాణకు న్యాయమేది?
కేంద్రమేకపక్షముగా
వ్యవహరించినట్టుకాదె?

తెలగాణులు తెలిపినట్టి
సవరణముల మాటెత్తక,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేసితిమన నేమనవలె?

మన జై రాం రమేశ్‍గారు
పలికినట్టి మాటలన్ని
ఏకపక్షవ్యవహారము
నకు సాక్ష్యములగును కదా!

1. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూశాము.

న్యాయమిపుడు సీమాంధ్రకు
చేసిరి, కని, తెలగాణకు
అన్యాయము చేసినట్లు
కాదా మరి తెలుపుడయ్య!

2. విద్య, ఉద్యోగాలు, సాగునీటి విషయంలో సీమాంధ్రకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషమ్మున
సీమాంధ్రకు ఎట్టివేని
ఇబ్బందులు ఉండవనిన,

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషయమ్మున
తెలగాణకు ఇబ్బందులు
ఉండుననియు చెప్పినట్లె!

3. ఆర్థిక సాయంలోనూ సీమాంధ్రకు చాలా మేలు జరిగింది.

ఆర్థిక సాయమ్ములోన
సీమాంధ్రకు చాల మేలు
జరిగినదన, తెలగాణకు
కీడు జరిగినట్లేకద!

4. సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుంది.

సీమాంధ్రకు ఐదేడులు
ప్రత్యేకపు హోదానిడి,
తెలగాణకు ఈయకుంట
న్యాయమ్మెటులగునయ్యా?

5. తెలంగాణ, సీమాంధ్రలకు ఉద్యోగుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఉద్యోగుల పంపిణిలో
సీమాంధ్రకు ఇబ్బందులు
ఉండవు; మరి తెలగాణకు
ఇబ్బందులె...ఇబ్బందులె!

జనాభాను ప్రాతిపదిక
గా కొనుటే అన్యాయము!
స్థానికతను ప్రాతిపదిక
గా కొనుచో న్యాయమగును!

***      ***      ***      ***

ఈ రీతిగ కేంద్రమిపుడు
ఏకపక్షముగ నుండియు,
సీమాంధ్రకు న్యాయ మిడిన,
తెలగాణకు న్యాయమగునె?

రాజుగారి పెద్దభార్య
మంచిదియన, చిన్నభార్య
చెడ్డదనియు చెప్పినట్లు
కాదా మరి తెలుపుడయ్య!

సీమాంధ్రకు న్యాయమిడిన
అభ్యంతరమే లేదయ!
తెలగాణకు అన్యాయము
చేయుటె అభ్యంతరమయ!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

6 కామెంట్‌లు:

వజ్రం చెప్పారు...

పళ్ళెం లో పరమాన్నం పెట్టుకుని పక్కోడి ఎండు రొట్టెముక్క గురించి ఆలోచించే వాళ్ళకి ఎప్పటికైనా తృప్తి కలుగుతుందా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చాలా బాగా చెప్పారు! ఇది సీమాంధ్రులకు చక్కగా సరిపోతుంది. సీమాంధ్రులకు పరమాన్నం ఉన్నా, తెలంగాణుల ఎండు రొట్టెముక్కలను దోచుకున్నారు. తృప్తికలిగిందా అంటే, తెలంగాణులకు స్వయంపాలన రాకుండా అడ్డుపడి, హైదరాబాదును యూటీ చెయ్యమన్నారు...పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటింపజేసుకున్నారు...హైదరాబాద్‍లోని రెవెన్యూలో భాగం ఇవ్వమన్నారు...ఇలా..చాలా కోర్కెల చిట్టానే ఉంది...మే ఇంకా బానిస బతుకులు బతికితేనే వాళ్ళకు తృప్తికలుగుతుందేమో? ఆ దైవం చల్లగా చూచి, మా తెలంగాణ మాకిప్పించాడు! వాళ్ళ గొంతులో పచ్చివెలక్కాయ పడింది!

hari.S.babu చెప్పారు...

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషమ్మున
సీమాంధ్రకు ఎట్టివేని
ఇబ్బందులు ఉండవనిన,

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషయమ్మున
తెలగాణకు ఇబ్బందులు
ఉండుననియు చెప్పినట్లె!
-----
ఆర్థిక సాయమ్ములోన
సీమాంధ్రకు చాల మేలు
జరిగినదన, తెలగాణకు
కీడు జరిగినట్లేకద!
------
ఇంత స్పష్టంగా సీమాంధ్రకు న్యాయం జరిగితే తెలంగాణాకు కీడు జరిగినట్టే నంటున్నారు.అయినా అంటున్నది మీరు కాబట్టి న్యాయం అనే అనుకోవాలి.

Trader చెప్పారు...

mee telangana meeku ichesaka kuda inkaa mee edupu endho artham kavaltehdu. Hyderabad meedha vache dabbulu anni telangana ke ani rasicharu kuda kadha. memu develop chesina resources anni theeseskoni malli maa meedha edupu endhi saaru... burra petti aalochinchandi.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఖచ్చితంగా,,,!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నీకెందుకర్థమవుతుంది నాయనా? అరవై ఏండ్లనుండి అన్యాయానికి గురైనా, రాష్ట్రం ఏర్పడింతర్వాత కూడా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం జరుగుతున్నదో స్పష్టంగా చెప్పినా కూడా అర్థం కాకపోతే ఏమనుకోవాలి? మరోసారి టపాను చదివి బుర్రపెట్టి ఆలోచించుబాబూ అర్థమవుతుంది!

కామెంట్‌ను పోస్ట్ చేయండి