తెలంగాణ సోదరుడా,
శుభాకాంక్షలందుకొనుము!
పార్లమెంటులోన తెలం
గాణ బిల్లు ప్రవేశించె!!
గందరగోళము మధ్యన
సీమాంధ్రుల దుశ్చేష్టల
లక్ష్యపెట్టకుండ బిల్లు
పార్లమెంటు ప్రవేశించె!
ఆటంకము కలుగుననిరి,
బిల్లు తప్పు తడక యనిరి!
లక్ష్యపెట్టకుండ బిల్లు
పార్లమెంటు ప్రవేశించె!!
సుప్రీంకోర్ట్ ఆపుననిరి,
రాష్ట్రపతియె పంపడనిరి!
లక్ష్యపెట్టకుండ బిల్లు
పార్లమెంటు ప్రవేశించె!!
మన నేతల పరిశ్రమతొ
కేంద్రం సహకారంతో
లక్ష్యము చేరగను బిల్లు
పార్లమెంటు ప్రవేశించె!
బీజేపీ మద్దతిడిన,
యిడకున్నను ఏదోలా
కేంద్రమిపుడు తప్పకుండ
తెలంగాణ రాష్ట్రమిడును!
మన సవరణములతోడను
పార్లమెంటులోన నెగ్గి
విజయమ్మును సాధించును!
మనకు సంతసము గూర్చును!!
ఇట్టి దినము త్వరలోనే
మనకిప్పుడు రానున్నది!
తెలంగాణమేర్పడునయ
మన కల నెరవేరునయా!!
బంగరు తెలగాణ కలను
సాకారము చేసికొనగ
మనమంతా నడుముకట్టి
పూనుకొనగవలెనయ్యా!
తెలంగాణ సోదరుడా,
శుభాకాంక్షలందుకొనుము!
అరువదేండ్ల తెలంగాణ
కాంక్షను నెరవేర్చుకొనుము!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..
బాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు నెగ్గుతుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాటి పరిణామాలతో బిల్లు సభామోదం పొందుతుందా? లేదా? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఇప్పటి వరకు సభలో పోటాపోటీగా ఉన్న సమీకరణాలు గురువారం నాటి పరిణామాలతో తారుమారయ్యాయి.
*బిల్లుకు అనుకూలంగా ..
238 మంది సభ్యులు
సస్పెండైన 2 మంది తెలంగాణా సభ్యులను మైనస్ చేయగా
238-2=236.
నిన్న బాజపాతో సీపీఐ కూడా స్పీకర్‌ను కలవడం జరిగింది. ఒకవేళ సీపీఐ 4ఎంపీలు వ్యతిరేకంగా ఓటువేసినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
అంటే మద్దతు దారుల సంఖ్య..236-4=232
*బిల్లుకు వ్యతిరేకంగా..
ఇందులో బాజపా కూడా ఉంది.
238 మంది సభ్యులు
సస్పెండైన 14 మంది సీమాంధ్ర సభ్యులను మైనస్ చేయగా
238-14=224
+ బిల్లుకు అనుకూలంగా=232 మంది
_ బిల్లుకు వ్యతిరేకంగా=224 మంది.
ఇక్కడోక విషయాన్ని వ్యతిరేకులు గుర్తించాలి. సోమవారం మరికొంతమంది సీమాంధ్ర సభ్యులను కూడా సస్పెండ్ చేయవచ్చు. తద్వారా బిల్లుని వ్యతిరేకించేవారి సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. అంటే బాజపా మద్దతు లేకుండా కూడా తెలంగాణా బిల్లు పార్లమెంటులో నెగ్గుతుంది. అదే సమయంలో బిల్లుపై తటస్థంగా వ్యవహరిస్తాయని భావిస్తున్న డీఎంకే(18), నేషనల్ కాన్ఫరెన్స్(3) సభలో అదే వైఖరిని కొనసాగిస్తాయా లేదా అన్నది కీలకంగా మారనుంది. తెలంగాణ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. బిల్లుపై ఓటింగ్ జరిగే సమయానికి సభలో ఉండే సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది బిల్లుకు మద్దతిస్తే తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..
("బహుజనబంధు"గారి సౌజన్యంతో...)
కామెంట్‌ను పోస్ట్ చేయండి