గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 29, 2013

ఇందుకే మేం స్వరాష్ట్రం అడుగుతున్నాం!


ఇన్ని చేసితి! నన్ని చేసితి!
రాష్ట్రమును అభివృద్ధిచేసితి!
అనుచు పలికెడు ముఖ్యమంత్రియె
తెలంగాణములో

మొన్న ’ఫైలిన్’ తుఫానుకు తన
పంట నాశనమైన రైతుకు
ఒక్క పైసయు ఈయకుండెను!
నిరంకుశుడయ్యా!

కాని, సీమాంధ్రకును పరిహా
రమ్ము నిచ్చిన ముఖ్యమంత్రికి
యెఱుకలేదా, తెలంగాణను
ఆదుకొన నిపుడున్?

పక్షపాతము లేక యున్నచొ
నష్టపరిహారమ్ము ఎందుకు
అందజేయడు? ఖచ్చితమ్ముగ
పక్షపాతియెగా!

ఇట్టి పాలన మాకు వలదని;
ఇందుకే మా రాష్ట్ర మడుగుచు
పోరుచుంటిమి! ఆంక్ష లుండని
తెలంగాణముకై

కేంద్రమును మఱి కోరుచుంటిమి!
ఇట్టి సీమాంధ్రుల ’కుపాలన’
సాగుచో నష్టమ్ము లింకను
పెరుగు నో యయ్యా!

మమ్ము గావని, మమ్ము జూడని,
మాకు పైసా నీయ బూనని,
ఇట్టి సీమాంధ్రుల ’కుపాలన’
మాకు వలదయ్యా!

జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

vaaammmoo

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఓయీ అజ్ఞాతా! మీ స్పందన ఇలా తెలిపినందుకు సంతోషం. ముఖ్యమంత్రి వైఖరి మిమ్మల్ని ఇంతగా ఆశ్చర్యపరిచింది. కాని, నష్టపోయిన వాళ్ళెంత బాధకు గురయ్యారో ఆలోచించండి. సానుభూతి తెలపండి. సాయానికై అడగండి.

అజ్ఞాత చెప్పారు...

Andhukee ee dondrula paalana mankau vaddhu.

e roju paper lo appu karchu pettina daggare vasool ani chepparu.. papam dondula gundello rallu paddayi.

Nice sir. keep it up

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కుతంత్రాలకు పుట్టినిల్లు సీమాంధ్ర నాయకుల మెదళ్ళు. పరాన్నభుక్కులు వాళ్ళు. ఇన్నేండ్లపాలనలో ఏయే జిల్లాకు ఎంత ఖర్చు పెట్టారో...తెలంగాణకు రావాలిసింది ఎంత తమ జిల్లాలకు మళ్ళించుకెళ్ళారో అన్ని లెక్కలూ తేలుతాయి. హైదరాబాదు ఆదాయం తేరగా తిందామని లెక్కలేసుకొంటున్నారు. తిన్నవన్నీ కక్కాలి. తినబోయేవి ఏవీ ఉండవు. మనం చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టుకొని వున్నామా, ఇంకా మోసపోవడానికి? ముందున్నది ముసుర్ల పండుగ.
స్పందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి