కేంద్రమిపుడు తెలంగాణ
రాష్ట్రమిడగ సంతోషమె!
కాని, గతపు అన్యాయాల్
పునరావృతి కారాదయ!!
గతంలోన తెలంగాణ
పొందిన అన్యాయాలకు
న్యాయమ్మును చేయు కొఱకు
కేంద్ర మిట్లు చేయవలెను!
1. ఉమ్మడి రాజధానికి పదేళ్ళు కాక, మూడేళ్ళ కాల పరిమితి చాలు.
రాజధాని పదేండ్లుంట
సమయమ్మెక్కువ అగునయ!
మూడేండ్లకు కుదించినచొ
న్యాయముగా సరిపోవును!!
ఉమ్మడిగా రాజధాని
మూడేండ్లకు మించవద్దు!
మించినచో సీమాంధ్రులు
ఇల్లంతా మాదందురు!!
జీహెచ్‍ఎంసీ పరిధిన
వలదయ్యా వలదయ్యా!
ఖైరతబాద్ వరకె దీని
పరిధి నుంచవలెనయ్యా!!
2. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలు గవర్నర్‍కు అప్పగించరాదు.
గవర్నరుకు శాంతిభద్ర
తలను అప్పగించరాదు!
రాష్ట్ర కైవసమున నుంట
అందరికీ మేలయ్యా!!
మానిటరింగ్ కమిటీనిట
నియమించిన సరిపోవును!
ఇతర రాష్ట్రముల కిచ్చిన
హక్కు రాష్ట్రమున కీయుడు!!
3. ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్ట్ ఆలోచనమాని, వేర్వేరుగా ఏర్పాటు చేయాలి.
గవర్నరును, హైకోర్టును
ఉమ్మడిగా ఉంచవలదు!
విభేదాలు మరల పుట్టు!
వేరుగానె ఉండవలయు!!
4. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో చేర్చడం కన్నా, డిజైనును మార్చడం మేలు.
పోలవరము ముంపు గ్రామ
ముల నేపీ జేర్చుకన్న,
దాని డిజైనును మార్చిన
నిరపాయమ్మగునయ్యా!!
గ్రామాలను ఏపిలోన
చేర్చుటయే సరికాదయ!
గ్రామస్థుల కన్యాయం
తప్పకుండ జరుగునయ్య!!
5. జనాభా ప్రాతిపదికగా కాక, స్థానికత ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను పంపకం చేయుట న్యాయం.
జనాభ ప్రాతిపదికగను
పంపిణీని చేపట్టిన
తెలంగాణకన్యాయము
కేంద్రమె చేసినయట్లగు!
గత అన్యాయములె తిరిగి
కేంద్రమిపుడు చేయరాదు!
స్థానికతయె ఆధారము
గా పంపిణి చేయవలయు!!
గతంలోన జరిగినట్టి
అన్యాయము సరిదిద్దగ
వలయునన్న మీకిప్పుడు
స్థానికతయె ఆధారము!
6. తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించడం అన్యాయం.
టీ విద్యాసంస్థల్లో
ఏపీ విద్యార్థులకును
స్థానము కల్పింపబూను
టన్యాయమె అగునయ్యా!
ఉన్నత విద్యారంగము
నుమ్మడి ఎంట్రెన్సు వలదు!
ఇట్లు చేసినచొ మరలను
తెలగాణకె నష్టమగును!!
7. హైదరాబాద్‍ను "తాత్కాలిక" ఉమ్మడి రాజధాని అని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
హైద్రబాదు "తాత్కాలిక
రాజధాని" అని బిల్లున
పేర్కొనంగ వలయునయ్య!
సందేహము తొలగునయ్య!!
8. కృష్ణా గోదావరీ నదీజలాల గురించిన బోర్డు వగైరా ప్రతిపాదనలను తొలగించాలి.
కృష్ణాగోదావరిజల
వినియోగము గూర్చి పర్య
వేక్షణ బోర్డులు ఎందుకు?
ప్రతిపాదన వలదయ్యా!!
9. ఏ.పీ. భవన్‍గా మార్చబడిన హైదరాబాద్ భవన్‍ను తెలంగాణకే అప్పగించాలి.
నిజాం రాజు నిర్మించిన
హైద్రబాదు భవనమ్మును
ఏపీ కీయంగ వలదు!
అది తెలగాణదె యయ్యా!!
9. ఏ.పీ. భవన్‍గా మార్చబడిన హైదరాబాద్ భవన్‍ను తెలంగాణకే అప్పగించాలి.
నిజాం రాజు నిర్మించిన
హైద్రబాదు భవనమ్మును
ఏపీ కీయంగ వలదు!
అది తెలగాణదె యయ్యా!!
*** *** *** *** *** *** ***
పైన తెలిపినవి "తొమ్మిది
సవరణములు" తప్పకుండ
కేంద్రమిపుడు చేసినచో
తెలంగాణ శాంతించును!
సవరింపక తెలంగాణ
ఇచ్చినచో లాభమేమి?
ఇచ్చి, ఈయకున్నట్టులె!
కాన, వేగ సవరింపుడు!!
సవరణములు చేపట్టని
పక్షమందు తెలంగాణ
అగ్నిగుండమగునయ్యా!
పెనుతుఫాను రేగునయ్య!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
3 కామెంట్‌లు:
8. కృష్ణా గోదావరీ నదీజలాల గురించిన బోర్డు వగైరా ప్రతిపాదనలను తొలగించాలి
8. కృష్ణా గోదావరీ నదీజలాల గురించిన బోర్డు వగైరా ప్రతిపాదనలను తొలగించాలి.
కృష్ణాగోదావరిజల
వినియోగము గూర్చి పర్య
వేక్షణ బోర్డులు ఎందుకు?
ప్రతిపాదన వలదయ్యా!!
(గొట్టిముక్కలవారూ ఈ సవరణమును కూడ చేయవలసినదే...ఇప్పుడే చేర్చుతున్నా)
మరొకటి కూడా చేర్చవలసి ఉన్నది.
9. ఏ.పీ. భవన్‍గా మార్చబడిన హైదరాబాద్ భవన్ తెలంగాణకే అప్పగించాలి.
నిజాం రాజు నిర్మించిన
హైద్రబాదు భవనమ్మును
ఏపీ కీయంగ వలదు!
అది తెలగాణదె యయ్యా!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి