గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

రెంటికి జెడిన రేవళ్ళు కావద్దు!


బీజేపీవారు! మీరు
పగటి కలలు కనుచుంటిరి!
ఇద్దరు నాయుళ్ళ నమ్మి
సర్వం కోల్పోనుంటిరి!!

తెలగాణకు మద్దతునిడి
కాతుమనుచు నాడు పలికి,
నేడు మాట మార్చు తీరు
సందేహం కలిగించెను!

ఎప్పటినుంచో మద్దతు
నిత్తుమనుచు చెబుతూనే,
ఈనగాచి నక్కలపాల్
చేయనెంతురేలండీ?

చంద్రబాబు వెంకయ్యల
మాట విన్నచో నిక్కడ
తెలంగాణలో పార్టీ
గల్లంతౌ సుమండీ!

సీమలోన వెంకయ్యకు
ఒక్క ఓటు కూడ రాదు!
చంద్రబాబు ముఖం చూచి
ఒక్క సీటు కూడ రాదు!!

బీజేపికి శాపమగును
ఇద్దరు నాయుళ్ళ దోస్తి!
వరమగునని తలంచుచో
చేతురు ప్రజ తగిన శాస్తి!!

ఇచ్చిన మద్దతు మీరలు
తుంగలోన తొక్కినచో,
సీమాంధ్రులు, తెలగాణులు
లేవకుండ తొక్కుదురయ!

అందితేను జుట్టనుచో,
అందకున్న కాళ్ళనుచో,
అవకాశపు వాదమగును!
రెంట జెడిన రేవళ్ళగు!!

సుష్మ ఒక్క మాట పలుక,
అద్వాని మరొక్కటనగ,
రాజనాథుడింకొకటన,
కుక్కచింపు విస్తరియగు!

మందిమాట పట్టుకొనియు,
మారు మనువు పోయి, చెడియు,
మరలి వచ్చి చూడగాను
ఇల్లు కాలిపోవునండి!

మీరు మద్దతీయకున్న
కాంగ్రెస్సుకు నష్టమేమి?
వారల వ్యూహములు వారె
సిద్ధపరచుకొనిరండీ!

మాట నిలుపుకొనకున్నచొ
మరణమ్మే మేలందురు!
ఆడి తప్పబోకండీ!
మద్దతీయగారండీ!!

ముగ్గురు నేతలిపుడొక్క
మాటపైన నిలబడండి!
తెలగాణకు మీ మాటను
మరల నొక్కి చెప్పండీ!!

తెలగాణను నష్టపరచు
మార్గమ్మును వీడండీ!
భావి విజయములకు నేడె
మార్గములను వేయండీ!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

5 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..
బాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు నెగ్గుతుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాటి పరిణామాలతో బిల్లు సభామోదం పొందుతుందా? లేదా? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఇప్పటి వరకు సభలో పోటాపోటీగా ఉన్న సమీకరణాలు గురువారం నాటి పరిణామాలతో తారుమారయ్యాయి.

*బిల్లుకు అనుకూలంగా ..
238 మంది సభ్యులు
సస్పెండైన 2 మంది తెలంగాణా సభ్యులను మైనస్ చేయగా
238-2=236.
నిన్న బాజపాతో సీపీఐ కూడా స్పీకర్‌ను కలవడం జరిగింది. ఒకవేళ సీపీఐ 4ఎంపీలు వ్యతిరేకంగా ఓటువేసినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
అంటే మద్దతు దారుల సంఖ్య..236-4=232

*బిల్లుకు వ్యతిరేకంగా..
ఇందులో బాజపా కూడా ఉంది.
238 మంది సభ్యులు
సస్పెండైన 14 మంది సీమాంధ్ర సభ్యులను మైనస్ చేయగా
238-14=224

+ బిల్లుకు అనుకూలంగా=232 మంది
_ బిల్లుకు వ్యతిరేకంగా=224 మంది.

ఒక్కడోక విషయాన్ని వ్యతిరేకులు గుర్తించాలి. సోమవారం మరికొంతమంది సీమాంధ్ర సభ్యులను కూడా సస్పెండ్ చేయవచ్చు. తద్వారా బిల్లుని వ్యతిరేకించేవారి సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. అంటే బాజపా మద్దతు లేకుండా కూడా తెలంగాణా బిల్లు పార్లమెంటులో నెగ్గుతుంది. అదే సమయంలో బిల్లుపై తటస్థంగా వ్యవహరిస్తాయని భావిస్తున్న డీఎంకే(18), నేషనల్ కాన్ఫ్‌రెన్స్(3) సభలో అదే వైఖరిని కొనసాగిస్తాయా లేదా అన్నది కీలకంగా మారనుంది. తెలంగాణ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. బిల్లుపై ఓటింగ్ జరిగే సమయానికి సభలో ఉండే సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది బిల్లుకు మద్దతిస్తే తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..

("బహుజనబంధు"గారి సౌజన్యంతో...)

శ్యామలీయం చెప్పారు...

ఈ క్రింది వ్యాఖ్యను ప్రచురిస్తారో, యథాప్రకారం బుట్టదాఖలు చేస్తారో మీ యిష్టం.

సమీకరణాలు గురువారం నాటి పరిణామాలతో తారుమారయ్యాయన్న మాట నిజం. అలా తారుమారు చేయటానికే ఆపరిణామాలకు దారితీసేలా పరిస్థితులను కల్పించారన్నది అసలు సిసలు నిజం.

"సోమవారం మరికొంతమంది సీమాంధ్ర సభ్యులను కూడా సస్పెండ్ చేయవచ్చు. తద్వారా బిల్లుని వ్యతిరేకించేవారి సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. " ఈ మాటకూడా నిజం. ఇందులో అనుమానం ఏమీ లేదు.

బిల్లుకు అనుకూలంగా లేని వారినందరినీ ఏదోఒక మిషమీద బయటకు గెంటి అనుకూలురను మాత్రం సభలో ఉండనిచ్చి బిల్లును నెగ్గించుకోవటం తప్పక జరుగుతుంది.

తాము కోరిన బిల్లులు గట్టెక్కటమే ముఖ్యం అందుకుగాను ఎన్ని కుయుక్తులు పన్నినా తప్పులేదన్న భావనలో ఉన్నవారి రాజ్యం నడుస్తున్నదన్న విషయం అందరికీ తెలుసు.

ఎప్పటినుండో చెబుతున్నాను. సీమాంధ్రులందరికీ ఉరిశిక్ష విధించినా ఆశ్చర్యపోనవసరం‌ లేదు. ఇదంతా కాలవైపరీత్యం. ముందేమి జరుగుతుందో భగవంతుడికే తెలుసు. ఏమైనా విషవృక్షాలకు అమృతఫలాలు కాయవు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరించడానికి మీ సీమాంధ్ర ముఖ్యమంత్రి, సభామంత్రి, స్పీకర్ కుట్రపన్ని, మంత్రివర్గంతో చర్చించకుండా, సభ ఆర్డర్‍లో లేకున్నా, పది రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా రూల్సుకు విరుద్ధంగా, "ముఁహ్ ౙబానీ" వోటును ప్రయోగించినప్పుడు మీకు తప్పుగా తోచనిది, అరవై ఏండ్లుగా బానిసత్వంలో మ్రగ్గిన తెలంగాణులకు రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధపడిన కేంద్రం చర్యలు తప్పుగా తోచడం మీ సీమాంధ్ర బుద్ధి ప్రత్యేకత.

పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఎర్రగురివిందకు తన క్రింది నలుపు కనిపించనట్టే, మీ తప్పులు మీకు కనిపించవు. ఎదుటివాడికి మాత్రం నీతులు చెపుతూనే ఉంటారు.

సీమాంధ్రులకు ఉరిశిక్ష ఎందుకు విధిస్తారు? ఉరిశిక్ష విధించేటంతటి తప్పు చేస్తే తప్పక విధిస్తారు.

భగవంతుడు అరవై ఏళ్ళ తర్వాత మమ్మల్ని దోచిన, హింసించిన వాళ్ళకు శిక్షవిధిస్తున్నాడు. ఇది వట్టి కాలవైపరీత్యం కాదు...అరవై ఏళ్ళ కాలవైపరీత్యం. అరవై ఏళ్ళకు సీమాంధ్రుల పాపం పండింది. సత్యం...ధర్మం...న్యాయం..జయించింది.

విషవృక్షాలు సీమాంధ్రులు...అందుకే తెలంగాణులపై విషం కక్కుతున్నారు...దానికి మీరే ఉదాహరణ! కాబట్టి మీనుండి విషఫలాలే లభిస్తాయి గానీ అమృతఫలాలు ఎలా వస్తాయి?

అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఎవరు అధర్మపరులో, అన్యాయవర్తనులో ఆయనకే తెలుసు. తప్పక శిక్ష విధిస్తాడు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. చూస్తూ ఉండండి.

విశ్వరూప్ చెప్పారు...

ఎవరిసంగతి ఏమిటో గానీ లగడపాటికి మాత్రం చట్టసభల బహిష్కరణ శిక్ష ఖాయం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తథాఽస్తు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి