- 28న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అపాయింటెడ్ డే
- పర్మిట్లు ముగియగానే ఏపీ బస్సుల నుంచి టాక్స్
- కార్మికుల కష్టాలు చూసే సీఎం ఫిట్‌మెంట్ ఇచ్చారు
- ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాష్ట్రంలో చార్జీలు తక్కువ
- త్వరలో 60 ఏసీ, 10 గరుడ ప్లస్ బస్సుల కొనుగోలు
- ఆర్టీసీ లోగో ఆవిష్కరణలో మంత్రి మహేందర్‌రెడ్డి
రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని, ప్రభుత్వాన్ని చూస్తుందన్నారు. మే 28న టీఎస్ ఆర్టీసీ అపాయింటెడ్ డే ఉంటుందన్నారు. - పర్మిట్లు ముగియగానే ఏపీ బస్సుల నుంచి టాక్స్
- కార్మికుల కష్టాలు చూసే సీఎం ఫిట్‌మెంట్ ఇచ్చారు
- ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాష్ట్రంలో చార్జీలు తక్కువ
- త్వరలో 60 ఏసీ, 10 గరుడ ప్లస్ బస్సుల కొనుగోలు
- ఆర్టీసీ లోగో ఆవిష్కరణలో మంత్రి మహేందర్‌రెడ్డి
గురువారం బస్‌భవన్‌లో టీఎస్ ఆర్టీసీ లోగో, కొత్త రంగులతో రూపొందించిన పల్లెవెలుగు బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారని, ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయడంలో ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ 44 శాతం ఇచ్చారని అన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ లాభాల్లోకి తెచ్చుకుందామని సూచించారు.
బస్సు చార్జీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న మంత్రి మహేందర్‌రెడ్డి..
ఎంత శాతం పెంచుతామనే విషయంపై స్పష్టత ఇవ్వలేనన్నారు. చార్జీల విషయంపై ఈ వారంలో సమావేశమవుతామన్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. డీజీల్ రేటు అనేకసార్లు పెరిగినా రెండేండ్లుగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్నారు. మే 28న ఆర్టీసీ తాత్కాలిక విభజన జరుగుతుందని, త్వరలోనే కేంద్రం నుంచి విభజనకు అధికారిక ఉత్తర్వులు వస్తాయని పేర్కొన్నారు.
ఆర్టీసీ లోగోతోపాటు పల్లె వెలుగు బస్సుల్లో బంగారు తెలంగాణ చిహ్నాలు ఉన్నాయని, హరిత హారం వంటి పథకాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. సీఎం ఇచ్చిన రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నా రు. అందులోనుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల వ్యయంతో 60 కొత్త రాజధాని ఏసీ(ఇంద్ర) బస్సులు, రూ.10 కోట్లతో 10 అత్యాధునిక, సౌకర్యవంతమైన మల్టీయాక్సిల్ గరుడ ప్లస్, వోల్వో ఏసీ బస్సులు ఈ నెలాఖరులోగా ప్రవేశపెడ్తామని చెప్పారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి