ప్రభుత్వానికి కమర్షియల్ సేల్స్‌ట్యాక్స్ ఎగ్గొట్టడం జన్మహక్కు అన్నట్లుగా ఏపీ వ్యాపారులు జులుం ప్రదర్శించారు. నకిలీ వే బిల్లులతో పత్తిలోడ్లను సరిహద్దు దాటిస్తూ సర్కారుకు పన్నులు ఎగ్గొడుతున్నారు.
- మేము లేకుంటే తెలంగాణకు గతిలేదంటూ దురుసు వ్యాఖ్యలు
- సీఎస్టీ చెల్లించకుండానే పత్తిలోడ్లు సరిహద్దు దాటింపు
- ఆంధ్రా అధికారి జోక్యంతో ప్రభుత్వానికి రూ.3 లక్షలు నష్టం
- సీఎస్టీ చెల్లించకుండానే పత్తిలోడ్లు సరిహద్దు దాటింపు
- ఆంధ్రా అధికారి జోక్యంతో ప్రభుత్వానికి రూ.3 లక్షలు నష్టం
నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన వాణిజ్యపన్నులశాఖ చెక్‌పోస్టు వద్ద ఏపీ వ్యాపారుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. పన్ను కట్టాలని బండ్లు ఆపిన సిబ్బందిపై శుక్రవారం దౌర్జన్యానికి దిగి ట్యాక్స్ చెల్లించకుండానే వాహనాలను సరిహద్దు దాటించారు.
ఒక్కసారికి క్షమించాలని ఆంధ్రా అధికారి రాయబారం
ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నకిలీ వే బిల్లులతో ఆంధ్రాకు అక్రమంగా పత్తి లోడ్లను తరలిస్తున్న వైనంపై ఈ నెల1న నమస్తే తెలంగాణలో వంద కోట్ల పన్ను ఎగవేతకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేశారు. బుధవారం రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజాము వరకు పన్ను చెల్లించకుండా ఆంధ్రాకు తరలిస్తున్న 46 పత్తి లోడ్లను చెక్‍పోస్ట్ వద్ద ఆపేశారు. ఆంధ్రా పత్తి వ్యాపారులు శుక్రవారం వచ్చి చెక్‌పోస్ట్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.
మేము లేకుంటే తెలంగాణకు గతిలేదు.మేం రాకుంటే పత్తి కొనుగోలు చేసేవారు లేరు...అని ఆగ్రహంతో ఊగిపోతూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దీంతో సుమారు గంటపాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్కెటింగ్ పన్ను చెల్లిస్తున్నామని, టిన్ నెంబర్ ఉందని.. కమర్షియల్ సేల్స్‌ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ గొడవపడ్డారు. తెలంగాణలో కొనుగోలు చేసే పత్తికి ఇక్కడి నుంచే వే బిల్లులుండాలని, చిలకలూరిపేట, పొందుగుల వే బిల్లులను అనుమతించబోమని సిబ్బంది తేల్చిచెప్పారు. చివరకు మిర్యాలగూడలో పనిచేస్తున్న సీమాంధ్రకు చెందిన ఓ అధికారి చొరవ చేసుకొని సిబ్బందికి నచ్చజెప్పాడని సమాచారం. ఈ ఒక్కసారికి క్షమించేయండని చెప్పడంతో లారీలను వదిలేశారు. పత్తిలోడ్లు సరిహద్దు దాటడంతో సర్కారుకు రూ.3లక్షల నష్టం వాటిల్లింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి