-విద్యామండలి కార్యదర్శి సతీశ్‌రెడ్డిపై కోవర్టు ముద్ర
-దోచేస్తున్న నిధులు అడ్డుకున్నారని కక్షసాధింపు
-అన్ని సంస్థల్లోనూ ఇదే తరహా అవమానాలు
ఉమ్మడి విద్యాసంస్థల్లోని తెలంగాణ అధికారులపై ఆంధ్రా పాలకులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. పొమ్మనలేక పొగ పెడ్తున్నారు. విద్యాసంస్థల విభజనలో భాగంగా ఏపీ ఉన్నత విద్యామండలిలో సెక్రటరీగా పనిచేసిన ప్రొఫెసర్ సతీశ్‌రెడ్డిపై కుట్ర చేసి మానసిక వేధింపులకు గురిచేశారు. స్వయంగా ఆయనే రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు. ముఖ్యమైన ఫైళ్ళు పంపకుండా, కింద స్థాయి ఉద్యోగస్థులతో క్లియర్ చేయించుకుంటున్నారు. తెలంగాణ సెక్రటరీని పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ నిధులను అడ్డదారిలో ఖర్చు చేశారు.-దోచేస్తున్న నిధులు అడ్డుకున్నారని కక్షసాధింపు
-అన్ని సంస్థల్లోనూ ఇదే తరహా అవమానాలు
చివరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కోవర్టుగా ఆరోపించారు. ఇదంతా చేసింది ఉమ్మడి నిధులు దోచుకుంటున్న ఆంధ్రా అధికారులను ప్రశ్నించినందుకే. ఇంకా రెండేండ్లు సర్వీసు ఉన్నా ఆంధ్రా అధికారుల తీరుపై తీవ్ర మనస్తాపానికి గురై తన సెక్రటరీ పదవికి సతీశ్‌రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యోగస్థులపై ఇలాంటి వేధింపులు అన్ని రకాల ఉమ్మడి విద్యాసంస్థలలో కొనసాగుతున్నాయి. కొంతకాలంగా తెలుగు యూనివర్సిటీలో కూడా ఇదే విధానం కొనసాగుతున్నది.
ఆంధ్ర సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చి, కోర్టు ఆదేశాలు ఉన్నా తెలంగాణ సిబ్బందిని పట్టించుకోలేదు. ఒకే రకమైన విధులలో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులలో ప్రాంతీయ పక్షపాతం చూపిస్తున్నారు. దీనిపై తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యోగులు శనివారం ఆందోళన నిర్వహించారు. తెలుగు యూనివర్సిటీ వీసీని అడ్డుకున్నారు. ఇలాంటి కుట్రలే ఆర్జీయూకేటీలో కూడా కొనసాగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వైస్ చాన్స్‌లర్ తెలంగాణ ఉద్యోగస్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి, సాంకేతిక విద్యామండలి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వంటి విద్యాసంస్థలలో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి.
దీనిపై స్పందించి, తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ను కలిసినా ఏం ప్రయోజనం లేకుండా పోతున్నదని తెలుగు యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి