-తుంగభద్ర నీటికి ఎసరు
-సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్‌కి సన్నాహాలు
-నడిగడ్డలో ఆంధ్రా అధికారుల దొంగచాటు సర్వేలు
కుట్రల బాబు మరో కుట్రకు తెరతీశారు. తుంగభద్ర మీద గుట్టుచప్పుడు కాకుండా బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్- మద్రాస్ రాష్ట్రం ఉమ్మడి సొత్తు అయిన తుంగభద్ర నీటిని ఏకపక్షంగా రాయలసీమకు మళ్లించేందుకుగాను అధికారులను సర్వేకు ఆదేశించారు. ఆంధ్రా అధికారులు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ ప్రాంతంలో దొంగచాటుగా చొరబడి గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు జరుపుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటికి రావడంతో ఈ ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. -సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్‌కి సన్నాహాలు
-నడిగడ్డలో ఆంధ్రా అధికారుల దొంగచాటు సర్వేలు
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లా సీ బెళగల్, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలాల మధ్య ప్రవహించే తుంగభద్ర నది నుంచి నీటిని మళ్లించేందుకు జీవో నంబర్100ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంలో అప్పుడు పెద్ద వివాదమే చెలరేగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పతనంతో ఆ విషయం కూడా కనుమరుగైంది.
అయితే శతవిధాలా తెలంగాణ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన చంద్రబాబు సీమాంధ్రలో అధికారం చేపట్టిననాటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రత్నాల గర్భగా ఉన్న తెలంగాణ ప్రాంతం దూరంకావడం జీర్ణించుకోలేక అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణకు కరెంటు ఆపి నానా యాతనలు పెట్టిన బాబు ఈసారి నీటివనరుల మీద దృష్టిసారించారు. అందులో భాగంగానే నడిగడ్డలో ఆంధ్రా అధికారులు సర్వే జరుపుతున్నారని తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు భారీ నష్టం వాటిల్లుతుంది.
నిజాం, మద్రాస్ రెసిడెన్సీ ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలను, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పును ఆంధ్రా పాలకులు ఏనాడూ గౌరవించిన పాపాన పోలేదు. ఏ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టి ఇప్పటికే తెలంగాణకు కృష్ణలో నీళ్లు దొరక్కుండా చేశారు. తాజాగా సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య సర్వే పనులు దొంగచాటుగా మొదలయ్యాయి. ఆ రిజర్వాయర్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగునీటిని తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
తుంగభద్ర నదికి అడ్డంగా మినీ ఆనకట్టను నిర్మించి అక్కడి నుంచి నీటిని సీ బెళగల్ వరకు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి నిల్వ చేస్తారు. ఇరు జిల్లాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో సర్వే పనులు మొదలుపెట్టారు. వడ్డేపల్లి మండలం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామాల మధ్య ఆనకట్ట వల్ల ఏమేరకు భూములు ముంపునకు గురవుతాయనే విషయాన్ని తెలుసుకునేందుకే ఈ దొంగచాటు సర్వేకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మూడు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు వర్క్ టు రూల్ పాటిస్తున్నారు. ఇది అవకాశంగా తీసుకున్న ఆంధ్రా ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా సర్వే పనులు చేస్తున్నట్టు ఆ గ్రామాల ప్రజలు టీ మీడియాకు సమాచారమిచ్చారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులు అధికారికంగా ఇతర రాష్ర్టాల్లోకి ప్రవేశించే ముందు ఆయా ప్రభుత్వాల నుంచి విధిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయినా అంతర్ రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా అధికారులు ప్రవేశించడం చట్ట ఉల్లంఘనకు దారి తీస్తున్నది.
వడ్డేపల్లి తహసీల్దార్ శాంతకుమారిని వివరణ కోరగా తమ సిబ్బంది వర్క్ టు రూల్ పాటిస్తున్నందున కర్నూలు జిల్లా అధికారుల సర్వే విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం వీఆర్వో ద్వారా విషయాన్ని తెలుసుకుంటానని తెలిపారు. ఇదే విషయాన్ని రాజోళి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విచారణ చేపడుతామని చెప్పారు.
అనుమతులు లేకుండానే..

సమాచారం తెలుసుకుంటా..: తహసీల్దార్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి