సవరణములు అట్లె యుండె!
మిఠాయి పొట్లం ఇచ్చిరి,
మిఠాయిలే లేకయుండె!!
గాయమ్ములు తెలగాణకు,
మందునిడిరి సీమాంధ్రకు!
తెలంగాణనిత్తుమనిరి,
తెలంగాణయే యిచ్చిరి!!
లొసుగులతో కూడినట్టి
తెలంగాణ మన కిచ్చిరి!
చంద్రునిలో మచ్చలవలె
తెలగాణను మిగిలించిరి!!
చివరకు గాయము మానెను,
మచ్చలు మాత్రమె మిగిలెను!
కాలమ్మే యీ మచ్చల
నెటులొ మాన్పగా జాలును!!
కేంద్రమె మన కిత్తుమన్న
కానుకయే తెలంగాణ!
నిరంతరము శ్రమియించియు
బాగుచేయవలెనన్నా!!
బంగారపు తెలంగాణ
వలయునన్నచో మనమిక,
దోపిడులను ఆపవలెను,
స్వార్థమ్మును వీడవలెను!
లక్ష్యసాధనము గల్గిన,
నిబద్ధతను నిలుపుకొన్న,
అభివృద్ధియె ధ్యేయమైన
నాయకులను ఎన్నుకొనుడు!
భావి తెలంగాణమునకు
బంగరు బాటలు పఱచెడు
నాయకత్వముండవలెను!
న్యాయమ్మే చేయవలెను!!
సీమాంధ్రుల పాలనమే
తెలగాణకు గుణపాఠము!
నాడు చేసినట్టి తప్పు
అరువదేండ్ల శాపమాయె!!
సుఖశాంతులు మనకిచ్చెడు,
పురోగామిగా నిలిచెడు,
స్వర్ణయుగం తలపించెడు
నేతలనే ఎన్నుకొనుడు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
Congratulations... but Save Hyderabad.
Keep below in mind and Save Hyderabad now.
Modi - Rahul Bhai Bhai. Find my analysis below.
I guess BJP and Congress(North India parties) want to grab Hyderabad into their hands.
Reason:
For past 10 years lot of funds from central govt were pumped into Hyderabad even after knowing that AP is going to be devided. This made me to think that following plot is made by Congress and BJP.
Plot:
1: First give Telangana.
2: Later create a demand to make Hyderabad as second capital of country.
3: Create Hyderabad as seperate state/UT.
4: Take over state and dominate by North Indians.
5: Get grip over south India.
- A Hyderabadi
ధన్యవాదాలు హైదరాబాదీగారూ! హైదరాబాదును మనమందరం కలిసికట్టుగా ఉండి, కాపాడుకుందాం. హైదరాబాదును కేంద్ర పార్టీల చేతుల్లో పెట్టడానికి ఇక్కడెవరూ చేతులు ముడుచుకొని లేరు. హైదరాబాదును పరాయివాళ్ళ చేతుల్లో పెట్టడానికే మనం ఇంతకాలం కొట్లాడామా? హైదరాబాద్ మనది. దీనిపై మన ఆధిపత్యం మాత్రమే ఉండాలి. ఇదే మన ఆశయం. స్పందించి సలహా నిచ్చినందుకు కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి