గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 08, 2014

లోకాయుక్త చెప్పినా కదలని అధికారులు...!

-ఎగవేస్తే ఏందట!
-సీమాంధ్ర అక్రమ మైనింగ్‌పై అంతా గప్‌చుప్
-రూ.32 కోట్లు ఎగవేసినా చర్యలు శూన్యం
-పోయేది తెలంగాణ సొమ్మేగా?
-పోతూపోతూ తెలంగాణ ఆదాయానికి గండిపెట్టిన సీమాంధ్ర మంత్రి
-సొంత సామాజికవర్గ కంపెనీకి భారీగా మేలు
-అక్రమ మైనింగ్‌లో రికవరీపై స్టే
-స్టే ఎత్తివేసి సొమ్మును రాబట్టాలని ఆదేశించిన లోకాయుక్త
-ఆదేశాలు వచ్చి నెలయినా పట్టించుకోని అధికారులు

సీమాంధ్ర మైనింగ్ బాబులు తెలంగాణను అడ్డంగా దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వారు ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి నిబంధనలకు గండి కొడుతుంటే నోట్లో వేలేసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఒక్క రాక్‌శాండ్ సంస్థనే మైనింగ్ చేసి ప్రభుత్వానికి రూ. 32.84 కోట్లు ఎగవేసింది. చివరకు ఈ వ్యవహారాలపై మండిపడ్డ లోకాయుక్త.. వారి ఆగడాలను అరికట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా అధికారుల్లో చలనం రావడంలేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన దోపిడీ స్వరాష్ట్రంలో కూడా కొనసాగడంపై తెలంగాణ వాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాస్త్రంలాంటి ఆదేశాలను లోకాయుక్త ఇచ్చినా కదలిక లేని అధికారులను దుమ్మెత్తిపోస్తున్నారు.

mining
లోకాయుక్త దృష్టికి..

ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. దీనిపై లోకాయుక్త విచారణకు ఆదేశించారు. లోకాయుక్తకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం రాక్‌శాండ్ మినరల్స్ రూ.32.84 కోట్లు ఎగవేసినట్లు వెల్లడైంది. మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు కంపెనీపై చర్యలకు ఆదేశించినా క్షేత్రస్థాయి అధికారి ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామూల్ జాకబ్ ఈ కంపెనీకి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించారని బయటపడింది. దీని ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో నష్టం వాటిల్లింది. ఇక ఈ కంపెనీ శంషాబాద్ ఎయిర్ పోర్టు అథారిటీ పరిధిలో కూడా కొంత మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నది. ఇందుకు నిబంధనల ప్రకారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఆ ఆనవాయితీ కూడా పాటించలేదు. ఇక అగ్రిమెంటు ప్రకారం 248 సర్వే నంబర్‌లోని 8 ఎకరాల బిట్‌లో 1,84,922 క్యూబిక్ మీటర్లు మాత్రమే మైనింగ్ చేయాల్సి ఉండగా 8,52,913 క్యూబిక్ మీటర్లు అక్రమంగా మైనింగ్ చేశారు. ఇదే సర్వే నంబర్‌లోని 15 ఎకరాల బిట్‌లో 1,86,756 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఉంటే 3,72,929 క్యూబిక్ మీటర్లు అక్రమంగా మైనింగ్ చేశారు. మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు గీర్మాపూర్‌లోని ఈ సంస్థ క్వారీకి చెందిన చాలానా పుస్తకాలు 47,148,149లను పరిశీలించి అక్రమంగా కార్యకలాపాలు చేశారని ప్రభుత్వ అధికారులు నిర్దారించారని నివేదికలో పేర్కొన్నారు.

సీమాంధ్ర మంత్రి ఘనకార్యం...

అయితే ఈ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారం అంతకు ముందే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి రాగా రాక్‌శాండ్ మినరల్ సంస్థ అక్రమ కార్యకలాపాలు చేసినందున మొత్తం రికవరీ వెంటనే చేయాలని ఈ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. అయితే ఆనాడు మైనింగ్ శాఖ మంత్రిగా సీమాంధ్రకు చెందిన గల్లా అరుణకుమారి ఉన్నారు. తన సొంత సామాజికవర్గానికే చెందిన ఈ కంపెనీ యజమానులకు మేలు చేసేలా ఆమె తన అధికారాన్ని ఉపయోగించి అధికారులు ఇచ్చిన రికవరీ ఆదేశాలపై స్టే ఇచ్చారు. నాలుగు రోజులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్నందున పోతే తెలంగాణ సొమ్మేగా అన్నట్టు నిరంతరాయంగా దోచుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు.

ఫలితంగా కోట్లాది రూపాయల విలువైన భూగర్భ సంపద కొల్లగొట్టబడింది.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా సీమాంధ్రుల దోపిడీ ఆగలేదు. ఆ అక్రమార్కులను కాపాడడానికి సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను లోకాయుక్త తప్పు పట్టింది. వెంటనే స్టే ఎత్తివేసి, ఎగవేసిన సొమ్మును రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సదరు సంస్థ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా ఆదేశించింది. సర్కారు భారీ ఎత్తున ఆదాయాన్ని ఎగవేసిన రాక్‌శాండ్‍కు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వవద్దని ఆదేశించింది. కంపెనీ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయించాలని, సహకారం అందించిన అందరు అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వీటన్నింటిపైన తమ ఆదేశాలపై చేపట్టిన చర్యలపై పూర్తి స్థాయి నివేదికను జూలై 22వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశించింది. లోకాయుక్త ఆదేశాలు వెలువడ్డ రెండు రోజులకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

అధికారులు కదుల్తారా?..

అయితే ఆదేశాలు వచ్చిన నెల రోజులు దాటినా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు ఎగవేసిన సొమ్మును వసూలు చేస్తారా? అన్న సందేహాలు తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సర్కారుకు ఆదాయం రాబట్టాలని ఫోరమ్ ఫర్ రూల్ ఆఫ్ లా, తెలంగాణ యువశక్తి పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది, లోకాయుక్త పిటిషనర్ బీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ అక్రమదారులపై తెలంగాణ ప్రభుత్వం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను దోచుకునే వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దన్నారు.

ఎక్కడిదీ రాక్‌శాండ్?

కృష్ణా జిల్లాకు చెందిన పీ పూర్ణచంద్ అనే వ్యక్తి ఎండీగా ఉన్న కంపెనీ రాక్‌శాండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కంపెనీకి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగరకలాన్‌కు చెందిన సర్వేనంబర్ 300లో 7 ఎకరాల 20 గుంటలు, సర్వేనంబర్ 300/1లో 7 ఎకరాల 20 గుంటల భూమిలో క్వారీ నిర్వహించడానికి లీజుకు ఇచ్చారు. ఇదే తీరుగా మేడ్చల్ మండలం బండమేడారం 248 సర్వేనంబర్‌లో ఒకచోట 15 ఎకరాలు, మరోచోట 8 ఎకరాల భూమి, ఇదే మండలానికి చెందిన గీర్మాపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 345లో 19 ఎకరాల 20 గుంటల భూమిని సీమాంధ్ర సర్కారు లీజుకు ఇచ్చింది. అధికారం వారిది. సర్కారు వారిదన్నట్టు అంతా ఇష్టారాజ్యంగా ఆగమేఘాల మీద సాగిపోయింది. లీజు అగ్రిమెంట్ల ప్రకారం ఎంత మైనింగ్ చేస్తే ఆంత రాయల్టీ (సీవరేజి ఫీజు) ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ కంపెనీ వారు అక్రమ పద్ధతుల్లో మైనింగ్ చేపట్టారు. దానికితోడు కోట్ల రూపాయల మేర ఫీజులు ఎగ్గొట్టారు. అయినా నాటి ఉమ్మడి సర్కారు వారికి అభయమిచ్చింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

సోమవారం, జులై 07, 2014

సామ్రాజ్యవాదులు, పెత్తందారులకే పోల "వరం"...!

-పార్లమెంట్‌లో చర్చించకుండానే ఆర్డినెన్స్ జారీ దారుణం
-బాబు, వెంకయ్యలదే కుట్ర.. కేంద్రానిది నిరంకుశ ధోరణి
-భద్రాచలం రాముడిని జలసమాధి చేయడం విడ్డూరం
-పోలవరం వ్యతిరేక సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్
పార్లమెంట్‌లో చర్చించకుండానే దొడ్డిదారిలో కేంద్రం పోలవరం పై ఆర్డినెన్స్ జారీచేసిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం అక్రమ ఆర్డినెన్స్ వ్యతిరేక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల పెట్రో కెమికల్, కోస్టల్ కారిడార్ అవసరాల కోసమే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని విమర్శించారు. రాముడి పేరు చెప్పి గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం..పోలవరం నిర్మాణం పేరుతో భద్రాచల రాముడినే జలసమాధి చేయడానికి పూనుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ తెచ్చారని, దీని వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల కుట్ర దాగిఉందన్నారు. 
tpfffపోలవరం నిర్మాణంతో అక్కడి రైతులకు పెద్దగా ఉపయోగంలేదని కేవలం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర పాలకులకు నిజంగా రైతులను ఆదుకునే ఉద్దేశం లేదని, వారి దృష్టంతా ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించే రూ.16 వేల కోట్ల నిధులపైనే ఉందన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ నడిపిన ఉద్యమానికి సమాంతరంగా మన్యంలో ఆదివాసీలు ఉద్యమించి బ్రిటీషర్లను తరిమికొట్టిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ఆదివాసీ చట్టాలను గౌరవించకుండా అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సమైక్యంగా ఉద్యమించి ఆదివాసీలకు అండగా నిలవాలని కోరారు. ఆదివాసీలకు నష్టం జరగకుండా పోలవరం డిజైన్ మార్చి నిర్మించవచ్చని జలవనరుల శాఖ మాజీ ఇంజినీరు హన్మంతరావు పేర్కొన్నారని, ఆయన ఆంధ్రా ప్రాంతంవాడేనని గుర్తుచేశారు. సదస్సులో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండారెడ్డి, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు

పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం డివిజన్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లిలో రెండ్రోజులుగా కొనసాగుతున్న దీక్షలను యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ నర్సింహారావు సందర్శించి మాట్లాడారు. దీక్షలో పాల్గొన్న సర్పంచ్‌లకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడానికి అక్రమ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన కేంద్రం ప్రజల పక్షాన ఉంటుందో, ప్రజలను ముంచాలనుకుంటుందో తేల్చాలని డిమాండ్‌చేశారు. ఆర్డినెన్స్‍ను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలోనే ముంపు ప్రాంతాన్ని కొనసాగించాలని కోరారు. భద్రాచలంలో కొనసాగుతున్న దీక్షలను టీపీటీఎఫ్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తెలంగాణలో "గవర్నర్ పాలన"కు...సీమాంధ్ర సర్కారు కుట్ర!

-బాబు లాబీయింగ్‌కు తలొగ్గుతున్న కేంద్రం..
-గవర్నర్ అధికారాల పేర రాష్ర్టానికి సర్క్యులర్
-సీమాంధ్రుల పరోక్ష పాలనకు రంగం సిద్ధం?
-సినీ, రాజకీయ పెద్దల చీకటి సమావేశం.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టు
-కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. భూ పరిపాలన గవర్నర్‌కు ఇవ్వాలని డిమాండ్
-రాష్ర్టానికి అందిన కేంద్రం సర్క్యులర్
-రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి పోలీసింగ్ గవర్నర్‌కు
-హైదరాబాద్‌కు జనాభా దామాషాలో సీమాంధ్ర పోలీసులు
-ఉమ్మడి పోలీస్ సర్వీస్ బోర్డు ప్రతిపాదన
-తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్
-ప్రతిపాదనలకు దీటైన జవాబు పంపడానికి సిద్ధం

తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది. కాకపోతే గవర్నర్ పాలన ముసుగులో.. మరో రూపంలో. ఆరు దశాబ్దాలుగా తాము కట్టుకున్న అక్రమ సామ్రాజ్యాలను తెలంగాణవాడు బద్దలుకొడుతుంటే.. గురుకుల్, గోకుల్, ఎన్‌కన్వెన్షన్, ఎఫ్‌డీసీ.. ఇలా ఒక్కటొక్కటిగా చేజారిపోతుంటే గుండెజారిన సీమాంధ్రబాబులు, అక్రమ రియల్టర్లు, సినీ, మీడియా, పెట్టుబడిదారులు రహస్య సమావేశాలుపెట్టి పథకాలు పన్నుతున్నారు. అలుపెరుగని ఉద్యమం, పన్నెండు వందల మంది బలిదానాలతో సాధించిన స్వరాష్ట్రం గుండెలమీద సీమాంధ్రులు రాజ్యం సాగించే కుట్రచేస్తున్నారు. సందేహం లేదు.. ఈ చీకటి కుట్రకు కథానాయకుడు మళ్లీ చంద్రబాబే. స్వాతంత్య్రం సాధించిన ఆనందం తెలంగాణవాసుల ముఖంమీద తాజాగా ఉండగానే కండ్ల ముందే దాన్ని కబళించే కుట్రకు ఆయనే తెరతీశారు. గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మీదకు ఉసిగొల్పుతున్నారు. ఈ విపత్కర స్థితిలో తెలంగాణ సమాజానికి అప్రమత్తత అవసరం. తస్మాత్ జాగ్రత్త.

babu
(ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి): తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సీమాంధ్ర కుట్రలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ను దొంగదారిలో ఏలేందుకు పచ్చమూకలు కుట్రలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కబ్జాలపై యుద్ధం ప్రకటించడంతో బెంబేలెత్తిన సీమాంధ్ర శక్తులు నగరంలో తెలంగాణ సర్కారే లేకుండా చేయాలని పథకం రచించాయి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ అధికారాలు పెంచాలని, కీలకమైన రెవెన్యూ భూపరిపాలన కూడా గవర్నర్‌కే అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. శాంతిభద్రతలు పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టాలని, నగరంలోని ఇద్దరు కమిషనర్లు సహా డీఎస్‌పీలు, సీఐలుకూడా గవర్నర్ అధీనంలోనే ఉండాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం వద్ద బలమైన లాబీయింగ్ జరిపారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు అనేక అధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలున్న 12 అంశాలతో కూడిన ఒక సర్క్యులర్‌ను కేంద్రం రాష్ర్టానికి పంపింది. ఇందులోని అంశాలే కనుక అమలు చేస్తే తెలంగాణ రాజధానిలో తెలంగాణ ప్రభుత్వమే ఉండదు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలను గవర్నర్ చేతికి అప్పగించాల్సి వస్తుంది. రాజధానిపై తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కూడా గవర్నర్ రద్దు చేయవచ్చునంటూ ఇందులో పొందుపరిచిన ఒక్క నిబంధనే చాలు.. ఈ సర్క్యులర్ ఎవరికోసం..ఎందుకోసం రెక్కలు కట్టుకుని వాలిందో...! ఈ ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్థికి విరుద్ధంగా చేసిన ప్రతిపాదనలకు కేంద్రానికి దీటైన జవాబు పంపడానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పార్లమెంటులో పోరాడాలని ఆ పోరాటం దేశమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు.

అసలు కథ ఏంటి?

తెలంగాణ భూములు అడ్డంగా కబ్జా చేసి కోట్లు కొల్లగొట్టిన సినీ పరిశ్రమ పెద్దలు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, రెండు ముఖ్య పార్టీల రాజకీయ పెద్దలు ఇటీవలే ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల స్వాధీనం అంశాన్ని ప్రముఖంగా చర్చించారు. ప్రభుత్వం ఇంకా పలు కబ్జాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలంటే రాజధానిని యూటీగా మార్చేలా ఒత్తిడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

సాధ్యపడని పక్షంలో విభజన చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించి గవర్నర్ చేతికి హైదరాబాద్ పాలన అప్పగించేలా లాబీయింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా తమ అక్రమ ఆస్తులు రక్షించుకోవడంతో పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ చీకటి సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారని నిఘా వర్గాల సమాచారం. తర్వాత ఈ కుట్రదారులంతా కేంద్రం పెద్దలను కలిసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగానీ ఆ తరహా విధానం కానీ అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని నామమాత్రంగా మార్చాలని వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఈ కుట్రకు లాబీయింగ్ జరిపిన వారిలో సినీ హీరో పవన్ కల్యాన్, నాగార్జున వంటి వారు కూడా ఉన్నట్టు తెలిసింది.

కేంద్రానికి చంద్రబాబు లేఖ...

ఈ సమావేశాలు, లాబీయింగ్ తర్వాత ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పాత్ర, అధికారాలపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ పరిపాలన గవర్నర్ చేతికి అప్పగించాలని అందులో కోరారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్‌కే అప్పగించాలని, ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రాంతాల పోలీస్ సిబ్బందిని నియమించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని స్ఫూర్థి నిలపాలంటే రాజధానికి సంబంధించిన రెవెన్యూ, భూ పరిపాలన అంశాలు కూడా గవర్నర్‌కే అప్పగించాలని ఆయన అందులో కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీలు తెలంగాణ ప్రభుత్వంతో పనిలేకుండా నేరుగా గవర్నర్‌కే రిపోర్ట్ చేసేలా సిఫారసు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు.

కేంద్ర హోంశాఖ నుంచి లేఖ...

ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదేళ్ల ఉమ్మడి రాజధానిలో తన పాత్ర, అధికారాల పరిధిపై కేంద్ర హోంశాఖను కొన్ని వివరాలు గతంలో అడిగారు. అపుడు సమాధానం పంపని కేంద్రం చంద్రబాబు లేఖ అందగానే గవర్నర్ లేఖను సాకుగా చూపుతూ కేంద్ర హోంశాఖ పేరు మీద తెలంగాణ ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ పంపింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని పోలీస్ వ్యవస్థలో కామన్ పోలీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ఇరు రాష్ర్టాల పోలీస్ అధికారులకు స్థానం కల్పిస్తామని ప్రతిపాదించింది. ఇంకా అందులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం...హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి ఎస్పీలు శాంతి భద్రతల నివేదికలు నేరుగా గవర్నర్‌కే సమర్పిస్తారు. తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఆదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి. పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. వీటి పరిధిలోని పోలీసుల బదిలీలన్నింటిపైనా అధికారం గవర్నర్‌దే. రాజధాని అంతా జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను నియమిస్తారు. తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా అవసరమైతే శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలను గవర్నర్ నేరుగా అడగవచ్చు. మొత్తంగా రాజధానిని సీమాంధ్ర పోలీసులతో నింపడం. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం అనేదే లేకుండా చేయడం ఈ సర్క్యులర్ ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. 
సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన...

ఈ సర్క్యులర్‌లోని అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది తీవ్ర విఘాతమని ఆయన భావిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశంపై ఆయన విస్తృతంగా చర్చ జరిపారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఎక్కడా అమల్లో లేని వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనడం చూస్తే కేంద్రం కక్షకట్టినట్లే అవుతుందని అన్నట్లు సమాచారం. ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైన అంశాలతో కేంద్ర పంపిన సర్క్యూలర్‌కు దీటైన సమాధానం పంపిస్తామని, సర్క్యూలర్‌లోని అంశాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణ పోలీసుల్లో అలజడి...

ఇదిలాఉంటే హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి పోలీస్ వ్యవస్థను గవర్నర్‌కే అప్పగిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై తెలంగాణ పోలీసుల్లో అలజడి మొదలైంది. 60 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఏకపక్షనిర్ణయాలతో తెలంగాణ పోలీసులను తీవ్ర ఇబ్బందులు గురిచేసిన వైనాలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారులను మార్చి, వారికి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ట్ర ఐపీఎస్‌లను ఆ పోస్టుల్లో నియమించేందుకే గవర్నర్ పాలనకు తెరదీస్తున్నారని ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు.

సర్క్యులర్‌లోని అంశాలు....

-ఉమ్మడి రాజధాని పరిధిలో తీసుకునే నిర్ణయాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను కూడా సమీక్షించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. -హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీలు శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికలను గవర్నర్‌కే అందించాలి-తీవ్రమైన, అత్యంత తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఇచ్చే అదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు (హేట్‌క్రైమ్) పెరిగినప్పుడు నిరోధించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి ఐజీస్థాయి ర్యాంకు అధికారి బాధ్యుడిగా ఉంటారు. హేట్‌క్రైమ్ విషయంలో సత్వర చర్యల అధికారం గవర్నర్‌దే-అంతర్గత భద్రత విషయంలో కూడా స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి కూడా ఐజీస్థాయి అధికారి బాధ్యుడిగా ఉంటారు.-పోలీస్ సర్వీస్‌బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓల బదిలీల అధికారం గవర్నర్‌దే
-రెండు కమిషనరేట్ల పరిధిలో జాయింట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ర్టాల ఫేర్‌షేర్ ప్రకారం డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలు ఉండాలి-గవర్నర్ అవసరం అనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదనపు బలగాలను అడుగవచ్చు-శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నివేదికలను కోరవచ్చు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఉమ్మడి హైకోర్టులో సీమాంధ్ర ఉద్యోగుల మరో కుట్ర...!

-రిటైర్మెంట్ వయసు పెంపునకు ప్రయత్నం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ హైకోర్టులో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు మరో కుట్రకు తెరలేపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ఆంధప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన జీవో ఆధారంగా మరో రెండేండ్లు ఉమ్మడి హైకోర్టులో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టులో ఉద్యోగుల విభజన పూర్తికానప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన జీవో తమకూ వర్తిస్తుందని, 60 ఏండ్లు నిండే వరకు పోస్టుల్లో కొనసాగనివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆశ్రయించారు.


ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు ఉద్యోగులు తమ దరఖాస్తులను రిజిస్ట్రార్‌కు అందచేశారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న సిబ్బంది సైతం అదే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ రెండు రాష్ర్టాలకు కలిపి ఒక్కటే ఉమ్మడి హైకోర్టును కొనసాగించాలని పునర్వ్యస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం జారీచేసిన పదవీ విరమణ పెంపు జీవోతో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది.

హైకోర్టులో ఉద్యోగులు 58 ఏండ్లకు రిటైరైతే మిగతా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కానీ వయస్సు పెంపుతో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతుంది. సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నప్పటికీ, ఉద్యోగుల భర్తీ, కొనసాగింపు, వారిపై ఇతరత్రా చర్యలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో జరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధంలేకుండా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయస్సు పెంపుతో తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఉద్యోగులకు జరిగే అన్యాయంపై హైకోర్టు తెలంగాణ ఉద్యోగుల సంఘం, హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చింది. ఉమ్మడి హైకోర్టులో ఉద్యోగుల విభజన పూర్తికాలేదని, ఇప్పుడు ఆంధ్రప్రాంత ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచితే తాము ఆందోళనకు దిగుతామని తెలంగాణ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కృష్ణపట్నం పవర్‌పై ఆంధ్రా కిరికిరి...!

-ఎస్డీఎస్టీపీఎస్‌లో తెలంగాణకు వాటా లేదని వాదన
-వాటా ఇవ్వాల్సిందేనన్న తెలంగాణ డిస్కమ్‌లు
-రెండో యూనిట్ ఉత్పత్తిపై నీలినీడలు
రాష్ట్ర విభజనను సాకుగా చేసుకుని తెలంగాణ విద్యుత్‌వాటాలపై తొండి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిపై కొత్తగా మరో తిరకాసు కుట్రలకు తెరతీస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉమ్మడి వాటాలతో ఏర్పాటైన నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్) ఉత్పత్తిలో తెలంగాణకు మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ( కృష్ణపట్నం) గత ఏడాది ఆగస్టులో బాయిలర్ లైట్‌ఆప్ చేసి ఏపీజెన్‌కో సరికొత్త చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి ఏపీజెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) కింద ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) ఏర్పాటు చేశాయి. దీని ఆధ్వర్యంలో 2X800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించాలనేది వాటి లక్ష్యం. అందులో ఏపీజెన్‌కో 51 శాతం వాటా, నాలుగు డిస్కమ్‌లు 49 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. డిస్కమ్‌లలో సీమాంధ్రలోని రెండు డిస్కమ్‌లు (ఈస్ట్రన్, సదరన్), తెలంగాణలోని రెండు డిస్కమ్‌లు (సెంట్రల్, నార్తరన్) ఉన్నాయి. వీటికి వాటాలను కూడా గతంలోనే నిర్దేశించారు. ఈ పవర్ ప్రాజెక్టుకు ఒడిశాలోని తాల్చేరు నుంచి 70 శాతం శుద్ధిచేసిన దేశీయ బొగ్గు కేటాయింపులున్నాయి.

మిగతా 30 శాతం విదేశీ దిగుమతి బొగ్గును వినియోగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీదామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డిఎస్‌ఎస్‌సిటిపిఎస్)గా నామకరణం చేసింది. తొలి 800 మెగావాట్ల యూనిట్ బాయిలర్ కాంట్రాక్టును అమెరికాకు చెందిన ఆల్‌స్ట్రామ్ కంపెనీ చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేసింది. రెండవ యూనిట్ 800 మెగావాట్ల కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్ పొందింది. తొలి యూనిట్ గత ఏప్రిల్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రాంభించింది. ప్రారంభంలో 175 నుంచి 250 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. అయితే ఇది ఇన్‌ఫార్మ్ పవర్ పారంభంలో విద్యుత్తు కావడం వల్ల వెంటవెంటనే సమస్యలు వచ్చే అవకాశాలున్నందున దీనిని తెలంగాణ డిస్కమ్‌లు పట్టించుకోలేదు. ఇదే సమయంలో మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ డిస్కమ్‌లకు పంపకాలు (వాటా) చేయకుండా ఆంధ్రా సర్కారు కుట్రతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. 

పీపీఏల్లో వాటాల్లేవు

కృష్ణపట్నం పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లో తెలంగాణ డిస్కమ్‌లకు వాటాలు లేవు. కానీ, ఒప్పందాలకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో)లో డిస్కమ్‌ల వారీగా వాటాల పంపకాలున్నాయి. ఎస్‌డీఎస్‌ఎస్‌సీటీసీఎస్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నాలుగు డిస్కమ్‌లతో ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేని కారణంగా తెలంగాణలోని రెండు డిస్కమ్‌లకు ఆ ప్రాజెక్టులో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్రా సర్కారు వాదిస్తున్నది.

ఈ పవర్ స్టేషన్ యాజమాన్య హక్కులు కలిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) బోర్డు సమావేశం శనివారం విద్యుత్‌సౌధలో జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన రెండు డిస్కమ్‌ల సీఎండీలు ఎస్‌ఎం రిజ్వీ, కార్తికేయ మిశ్రా హాజరయ్యారు. ప్లాంటు పనుల పురోగతి, బొగ్గు నిల్వలు, ఖర్చులు వంటి అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వాటాపై ఇద్దరు సీఎండీలు ప్రస్తావించినట్లు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆదివారం, జులై 06, 2014

ఆంధ్రా పోలీసులవల్ల...మన పోలీసులకు...అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్లు?

-తెలంగాణ పోలీసు అధికారుల ఆవేదన
-ఏళ్లకేళ్లు లూప్‌లైన్‌లోనే తెలంగాణ అధికారులు
-స్వరాష్ట్రంలోనూ సీమాంధ్రులకే అందలం
-సర్కారును తప్పుదోవ పట్టిస్తున్న ఐపీఎస్‌లు
- సీఎం కేసీఆర్ దృష్టిసారించాలని వినతి
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు స్వరాష్ట్రం వచ్చినా తెలంగాణ పోలీసు అధికారులకు సీమాంధ్రుల బెడద తప్పడం లేదు. పోలీసు శాఖలో ఇప్పటికీ ఆంధ్రా ప్రాంత అధికారులకే పోలీస్ ఉన్నతాధికారులు ప్రాధాన్యత కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

policeఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లకేళ్లుగా లూప్‌లైన్‌లో ఉండిపోయిన తెలంగాణ అధికారులు తమకు అజ్ఞాతవాసం తప్పుతుందని భావించారు. అయితే అది అడియాసే అవుతున్నది. రాష్ట్రం ఏర్పడి నెల దాటినా పరిస్థితిలో మార్పు రాలేదు. మూడు, నాలుగేళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్‌పీ,ఏసీపీలు, అడిషనల్ డీసీపీ,ఎస్పీల పరిస్థితి అలాగే కొనసాగుతున్నది.

సిటీలో ఆంధ్ర అధికారులదే హవా

రాష్ట్ర రాజధానిలో మొదటి నుంచి ఎస్‌ఐలు, సీఐలు, ఏసీపీలు, అడిషనల్ డీసీపీల్లో అంతా సీమాంధ్ర వారే అధికారం చెలాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఇన్‌స్పెక్టర్లను లూప్‌లైన్‌లోకి నెట్టేసి హైదరాబాద్‌ను సొంత జాగీరుగా ఏలుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారే అవే పోస్టుల్లో దర్జా వెలగబెడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీఐలను వెంటనే లూప్‌లైన్‌కు పంపించి తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐలు, ఏఎస్‌పీల్లో 65 శాతం సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. గతంలో ఫ్రీజోన్ సాకుతో దూరిన వీరు లాబీయింగ్‌తో మంచి పోస్టింగులు పొందారు. సైబరాబాద్ డివిజన్‌లో కూడా అధికారులు సీమాంధ్ర ప్రాంతం వారే. సిటీ నిండా వీరే తిష్ఠ వేయడంతో డీఎస్పీ ప్రమోషన్లు తీసుకున్న తెలంగాణ అధికారులు అప్పటినుంచి లూప్‌లైన్‌లోనే కొనసాగుతున్నారు. సీనియర్ డీఎస్పీలు కూడా సీఐడీ, ఇంటలిజెన్స్, ఎస్బీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్, సీసీఎస్ ఇలా అప్రాధాన్యత పోస్టుల్లో మిగిలిపోయారు. ఈ ప్రధాన పోస్టుల్లో కొనసాగినంత కాలం వీరెవరూ ఏపీ సర్కారుకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. ఇకనైనా ఈ ఈ ఏసీపీలు, డీఎస్పీలను తప్పించి తెలంగాణ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఉద్యమాన్ని అణిచేసినవారికీ అందలమా?

సిటీలో ఎస్‌ఐగా జీవితం ప్రారంభించి అడిషనల్ డీసీపీ స్థాయి ఎదిగిన అధికారుల లాబీయింగ్ చాలా పవర్ ఫుల్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయుగోళాలు ప్రయోగించి, కేసుల్లో ఇరికించిన అడిషనల్ డీసీపీలు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడం తెలంగాణ అడిషనల్ డీసీపీల్లో ఆగ్రహాన్ని రగులిస్తోంది. వీరు సిటీలో ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేశారు. ఎస్‌ఐగా, ఇన్‌స్పెక్టర్‌గా, ఏసీపీగా ఇప్పుడు అడిషనల్ డీసీపీలుగా అన్ని ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేసినా కోర్టులకు వెళ్లి మరీ పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. ఇలాంటి పలువురు అధికారులకు పోలీస్ ఉన్నతాధికారులు అండదండలు అందించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఇంకా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను ఐపీఎస్ అధికారులు పోత్సహించడం, ప్రభుత్వపెద్దలకు తప్పుడు సంకేతాలు పంపిస్తూ పోస్టింగ్‌లు ఇవ్వడం ఆందోళన కల్గిస్తోందని తెలంగాణ ప్రాంత పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు..

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని తెలంగాణ పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవినీతి సీమాంధ్ర అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ఐపీఎస్ అధికారులు ప్రయత్నాలుచేస్తున్నారని, వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని తెలంగాణ ఐపీఎస్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సీమాంధ్ర అధికారులను లూప్‌లైన్‌కు పంపించి, కోర్టు తీర్పు అడ్డుపెట్టుకొని పోస్టింగ్‌లు పొందే వారిపై అప్పీలుకు వెళ్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గోడు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మట్టి అంటగట్టి రూ.90 కోట్లు

- మిశ్రమ ఎరువుల మోసం.. నియంత్రణ లేని బయోప్రొడక్ట్స్
- 21 శాంపిళ్లలో 7 బోగస్.. తీసుకున్న చర్యలు శూన్యం
మట్టికి రసాయనాలు పూసి మిశ్రమ ఎరువులంటూ అమ్మేస్తున్నారు. వ్యాపారుల లాభాపేక్షకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన మిశ్రమ ఎరువుల వ్యాపారం విలువ వందకోట్లు. ఇందులో ఉత్తుత్తి ఎరువుల వ్యాపారం రూ. 90 కోట్లుగా అంచనా వేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. రైతుల అమాయకత్వం ఆసరాగా చేసుకుని మట్టికి రసాయనాలు పట్టించి మిశ్రమ ఎరువుల పేరుతో రైతులను కంపెనీలు దోచుకుంటున్నాయి.
projectsఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 2013-14లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే 10.734 మెట్రిక్ టన్నుల మిశ్రమ 17:17:17, 14:35:14 ఎరువుల ద్వారా రూ.10 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా మిశ్రమ ఎరువులు తయారుచేసే యూనిట్లు 243 ఉంటే మన రా్రష్ట్రంలో 27 వరకున్నాయి. తెలంగాణ ప్రాంతంలో రైతులు మిశ్రమ ఎరువులు అధికంగా ఉపయోగిస్తారు. ప్రతి ఏటా ఖరీఫ్‌లో డీఏపీ కంటే కాంప్లెక్స్‌లను అత్యధికంగా వాడుతుంటారు. దీనితో మార్కెట్లోకి ప్రఖ్యాతిగాంచిన కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు కూడా రంగప్రవేశం చేశాయి. సాధారణంగా రైతులు భాస్వరం,(డీఏపీ), నత్రజని(యూరియా), పోటాష్ ఎరువులను విడివిడిగా వాడుతుండేవారు. ఇటీవల ఈ మూడు కలిపిన మిశ్రమ ఎరువులు వస్తుండడంతో రైతులు ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనితో మార్కెట్లో వీటి వ్యాపారం జోరందుకుంది. లోగుట్టు ఏమిటంటే అనేక కంపెనీలు విక్రయించే ఎరువుల్లో బస్తాపై పేర్కొంటున్న షోషకాల్లో 25శాతం కూడా ఉండడం లేదని పరీక్షల్లో తేలింది. ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న బయోఫర్టిలైజర్స్, బయోకంట్రోల్ ఏజెంట్లు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకంటే అధిక ధరలకు ఉత్పత్తులు విక్రయించమే కాకుండా నాణ్యత పాటించడంలో పాతరవేస్తున్నారు. లైసెన్స్‌లు లేకుండా, వ్యవసాయ శాఖ నిర్వహించే టెండర్లలో పాల్గొన కుండానే ప్రైవేట్ కంపెనీల కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

projects01
చర్యలు నామమ్రాతం..

2013-14 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు వివిధ బయోపెస్టిసైడ్లకు సంబంధించి 21 శాంపిళ్లు మాత్రమే సేకరించారు. ఇందులో 7 మాత్రమే నాసిరకంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కానీ గతేడాది మొత్తం 36 బయోపెస్టిసైడ్స్ శాంపి ల్స్ సేకరించినా నామమాత్రపు చర్యలతో వదిలేశారు. ఇందులో 23 కంపెనీలు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 కంపెనీలు కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నాయి. అధికారులు14 కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను పరిశీలనకు కూడా పంపించలేదు. ఈ ఏడాది తెలంగాణలో 7 శాంపిల్స్ నాసిరకంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

బయోలోనూ సమస్యలున్నాయ్..

వాస్తవంగా బయోపెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్ల పెరిగే ఉల్లి, దానిమ్మ, గోధుమ, కూరగాయలు, ఆకు కూరలు నిల్వ చేయడానికి అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బయో ప్రొడక్ట్స్ నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అడపాదడపా నిర్వహించే తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ పురుగు మందులు బయటపడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా సేంద్రీయ సాగుపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో సేంద్రీయ (ఆర్గానిక్), జీవ (బయో) ఎరువులు, పురుగు మందుల వాడకంపై రైతులు మొగ్గు చూపుతున్నారు.

బయో ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ కలుపుతున్నారనే ఉద్దేశంతో గతంలో వ్యవసాయ శాఖ కమిషనర్ నిలుపుదల చేయించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. చట్టం పరిధిలోకి ఈ ప్రొడక్ట్స్ రావని కోర్టు స్పష్టం చేసింది. పురుగు మందుల తయారీ విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రిమి సంహారక రసాయనిక పురుగు మందుల చట్టం(ఇన్ సెక్టిసైడ్స్ యాక్ట్-1968)ని రూపొందించింది. దీని ప్రకారం తయారీ దారులు ముందుగా రిజిస్ట్రేషన్ కమిటీలో తమ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి. ఉత్పత్తుల తయారీకి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బయోలు ఈ చట్టంలోకి రావనే సాకుతో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బయోలను విక్రయిస్తున్న కంపెనీలు 264 రూ.400కోట్లనుంచి 500 కోట్ల పురుగులమందులను రైతులకు అంటగడుతూ వచ్చాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


విశ్వనగరానికి సూపర్ హైవే...మన హైదరాబాద్!


మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్
ఢిల్లీని మించిన జనాభా.. దేశ విదేశాలనుంచి తరలివచ్చినవారితో, సకల వ్యాపారాలతో విశ్వనగరంగా ఖ్యాతి. ఇది హైదరాబాద్ గతం! అడ్డదిడ్డమైన అభివృద్ధి మధ్య.. చినుకుపడితే చెరువులను తలపించే కూడళ్లు.. ముక్కు మూసుకుంటే తప్ప దాటివెళ్లలేని చెత్తకుప్పలు.. ఇరుకు గల్లీలు.. మురికివాడలు. కబ్జాల కథలు! ఇది వర్తమానం!! అదనంగా వచ్చి చేరే కోటిన్నర జనాభా.. అందుకు తగిన రవాణా వ్యవస్థ.. మరో రెండు విమానాశ్రయాలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ చుట్టూ మరిన్ని హైదరాబాద్‌లు. పచ్చటి.. పరిశుభ్రమైన ఓ అంతర్జాతీయ స్థాయి నగరం. ఇది రాష్ట్ర రాజధాని భవిష్యత్ చిత్రం!!

చెత్తబుట్టలా ఉన్న నగరం రూపురేఖలు మార్చేసి.. రానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుగులో నగరాన్ని న్యూయార్క్, షాంఘై, సిడ్నీ వంటివాటి సరసన విశ్వనగరంగా నిలిపేందుకు తెలంగాణ తొలి సర్కార్ తహతహలాడుతున్నది! రానున్న మూడు దశాబ్దాల కాలంలో నగర జనాభా మరో కోటిన్నర పెరుగనుందన్న అంచనాల నేపథ్యంలో ఆ స్థాయిలో అవసరాలకు ఇప్పటినుంచే పునాదులేస్తున్నది! నగరంపై పచ్చటి దుప్పటేసి.. పరిశుభ్రమైన.. భద్రమైన భాగ్యనగరాన్ని తెలంగాణకే కాదు.. మొత్తం భారతదేశానికే బహుమతిగా ఇచ్చేందుకు సంకల్పిస్తున్నది! అక్రమార్కులపై కొరడా ఝళిపించినా.. కబ్జా చేసి కట్టుకున్న కోటలను కూల్చేసినా.. అది బంగారు తెలంగాణ నిర్మాణానికే! ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకే!
hyd-plan


చినుకు పడితే నగరం నరకం. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు నీళ్ల మడుగు ఏర్పడుతుంది. గవర్నర్ నివాసం వద్ద కార్లు పడవల్లా తేలుతాయి. అసెంబ్లీ ముందు వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి. ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద వరద ఒక చెరువును తలపిస్తుంది. నీరు నిలిచే ఇటువంటి జంక్షన్లు నగరంలో 216దాకా ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి కారణంగా నగరమంతటా ట్రాఫిక్ స్తంభించి పోతుంది. సుమారు 230 కాలనీలు, బస్తీలు జలమయం అవుతాయి.

నగరం వరదనంతా తీసుకోగల స్వతస్సిద్ధమైన మూసీనది నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్నా బస్తీలు, కాలనీలు మునిగిపోవడం ఆగడం లేదు. నాలాలు, నదులు అన్నీ ఆక్రమించి నీటి ప్రవాహానికి అడ్డం పడితే ఏం జరుగుతుంది? ఇవి కాకుండా మురుగునీరు, మంచినీరు కలసిపోతున్నాయని ఫిర్యాదులు. బస్తీలు మొదలుకుని బంజారా హిల్స్‌వరకు డ్రైనేజీలు పొంగి రోడ్లమీద ప్రవహిస్తుంటాయి. అంతేకాదు నగరంలో 1476 నోటిఫైడ్ మురికివాడలు, 239 గుర్తించని మురికివాడలు ఉన్నాయి. ఇలా ఈ నగరాన్ని చెత్త బుట్టగా మార్చిందెవరు? ఇదేనా అభివృద్ధి? ఇదేనా ఆధునికత? ఇలాగే ముందుకుపోదామా?
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరం కావాలి.

పూర్తి నియంత్రిత, జీవనయోగ్యమైన, ఎక్కడికయినా తేలికగా ప్రయాణించడానికి వీలైన, భద్రత కలిగిన, పరిశుభ్రమైన, పచ్చని నగరం (గ్యులేటెడ్, సేఫ్, సెక్యూర్, లివబుల్, ఈజీ మొబిలిటీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ) కావాలి. ఇప్పుడున్న పరిస్థితులను ఏమీ మార్చకుండా ఈ నగరాన్ని బాగుచేయడం సాధ్యమేనా? అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్‌లు, ఆక్రమణలను పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు కేవలం ప్రణాళికలను రచిస్తూ పోతే అంతర్జాతీయ నగరం అవుతుందా? తెలంగాణకు ఎప్పుడయినా ఆర్థిక వెన్నెముక హైదరాబాద్ నగరమే.

హైదరాబాద్ అభివృద్ధే తెలంగాణ అంతటికీ వెలుగులను ప్రసరించాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించింది హైదరాబాద్ మహానగర సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులతోనే. గురుకుల ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడాన్ని, గోకుల్ ప్లాట్స్ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడాన్ని కొందరు రాజకీయ నాయకులు, వారికి తాళం వేసే మీడియా వక్రబుద్ధులు అదేదో కక్ష తీర్చుకోవడంకోసం చేస్తున్నట్టుగా అభివర్ణిస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు కేసీఆర్‍కు లేవు. ప్రాంత భేదాల ముచ్చట అసలే లేదు.

అక్రమార్కులు ఎవరయినా చట్టం ముందు నిలబడాల్సిందే అని ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఎవరి జోక్యానికీ వీలు ఇవ్వకుండా ఉండడంకోసమే ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి శాఖను తన వద్ద ఉంచుకున్నారని ఒక అధికారి చెప్పారు.

హైదరాబాద్‌లో జరిగిన సకల అక్రమాలకు, ఇక్కడ వేళ్లూనుకున్న సకల అవలక్షణాలకు అండదండలు అందించింది సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియానే. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో మండల రెవెన్యూ కార్యాలయాలు పదే పదే అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. రెవెన్యూ రికార్డులు తారుమారవుతాయి. చచ్చినోళ్ల పేరిట జీపీఏలు, పట్టా సర్టిఫికెట్లు పుడతాయి. యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతాయి.

ప్రతి ఐదేళ్లకోసారి ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, భవనాల క్రమబద్ధీకరణ, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ నగరంలో 60 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది అక్రమ లేఅవుట్‌లు ఉన్నాయి. వాటికి విద్యుత్ గ్యారెంటీ లేదు. తాగునీరు గ్యారెంటీ లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు. డ్రైనేజీ ప్రవహించే ఏర్పాట్లు ఉండవు. ఏం ఖర్మ? ఈ పరిస్థితి ఎంతకాలం? ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు ఇవేవీ పట్టించుకోవద్దు.. కళ్లు మూసుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు ఆశిస్తున్నాయి అని ముఖ్యమంత్రి వివరించినట్టు ఒక నగరాభివృద్ధి ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి ఒకరు చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలన్నదే ముఖ్యమంత్రి తాపత్రయమని ఆ అధికారి తెలిపారు. గత నాలుగైదేళ్లుగా ఒక్క ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధి గురించి సమీక్షించిన పాపాన పోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్నే ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించడం సంతోషంగా ఉంది అని ఒక అధికారి అన్నారు.

1931కి ముందు నుంచే హైదరాబాద్ కాస్మొపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నగరానికి రాజులు పునాదులు వేయడం, సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాలు దక్క రాజ్యానికి రాజధానిగా ఉండడం, దేశ, విదేశాల నుంచి అన్ని జాతులు, అన్ని మతాల ప్రజలు ఇక్కడ స్థిరపడడం ఈ నగరానికి విశ్వనగరంగా ఖ్యాతిని తెచ్చింది. ఇక్కడ అరబ్బులు, అఫ్ఘనీలు, పారసీలు మొదలు గుజరాతీలు, మార్వాడీలు, కాయస్థులు అందరూ కాలనీలు, స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో కలసిమెలసి హైదరాబాద్‌లో మిళితమైపోయారు.

హైదరాబాద్ పరిసరాలు సమశీతోష్ణ మండలంలో ఉండడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం కూడా ఇక్కడికి ఎక్కువమంది వచ్చి వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోవడానికి కారణం. కానీ సమైక్యాంధ్ర పాలనలో జరిగిన అస్తవ్యస్థ అభివృద్ధి హైదరాబాద్ పరిస్థితులను తారుమారు చేసింది. నగరం విస్తరించడంతోపాటు సకల అవలక్షణాలు, అక్రమాలూ విస్తరించాయి. ఇప్పడు ఆ అక్రమాలను సరిదిద్ది ఒక ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణానికి విధాన రచన చేయవలసి ఉంది అని ఒక అధికారి అన్నారు. పెరగబోయే జనాభాకు తగిన విధంగా విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రాపిడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ద్వారా అన్ని మార్గాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేని రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది.

భద్ర నగరంగా

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 1600 వాహనాలు, వందలాది బైక్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా పోలీసు ఫోర్సును తీర్చిదిద్దాలని యోచిస్తున్నాం అని ముఖ్యమంత్రి మరో సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

సమతుల అభివృద్ధి

నగరానికి అన్ని వైపుల సమతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. ఐదు జాతీయ రహదారులను ఆనుకుని ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల చుట్టూ పరిశ్రమలు, అత్యాధునిక వసతుల అనుబంధ నగరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు, వినోద కేంద్రాలు, పరిశోధనా సంస్థలు నెలకొల్పాలి.

మరో రెండు విమానాశ్రయాలు

నవ తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం మొదలుపెడితే నగరం విస్తరించడం వేగం పుంజుకుంటుంది. న్యూయార్క్, లండన్‌తోపాటు పలు పాశ్చాత్య నగరాల మాదిరిగా మరో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఉత్తర తెలంగాణవైపు షామీర్‌పేట-మేడ్చల్‌ల మధ్య, భువనగిరి-ఘట్‌కేసర్-హయత్‌నగర్‌ల మధ్య మరో రెండు విమానాశ్రయాలు అవసరం అవుతాయి. అదే విధంగా శివార్లలో అతిపెద్ద బస్ సర్క్యూట్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న మెట్రో కూడా భవిష్యత్తు అవసరాలను తీర్చలేదు. ఇంతకంటే మెరుగైన, పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాల్సి ఉంటుంది.

గ్రీన్ కవర్

నగరంలో వంద సరస్సులు మాయమయ్యాయి. మిగిలి ఉన్న సరస్సులను కాపాడాల్సి ఉంది. వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, మొక్కలు పెంచి, అక్కడి పరిసరాలను జీవనయోగ్యంగా మార్చాలి. నగరంలో ఈ ఏడాది నుంచి ఏటా మూడు కోట్ల మొక్కలు నాటాలి. వచ్చే మూడేళ్లలో మొత్తం పది కోట్ల మొక్కలు నాటి, వాటిని పెంచడానికి కృషి చేయాలి.

నగర వాతావరణంలో కాలుష్యాల శాతం తగ్గించాలంటే గ్రీన్ కవర్ పెంచడం ఒక్కటే మార్గం. అన్ని సంస్థలు, పరిశ్రమలు, నిర్మాణాల్లో మొక్కలు పెంచడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టాలి. బెంగళూరు తరహాలో ఇంటి నిర్మాణం చేసేవారు విధిగా కొన్ని మొక్కలు పెంచేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి అని సమీక్షా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు అధికారులు వివరించారు.

నేలపై కూరగాయలు అమ్మడం ఏమిటి?

నేలపై పెట్టి కూరగాయలమ్ముకుంటున్నాం. హైజీనిక్‌గా ఉండాల్సిన కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, మాంసం మార్కెట్లు ఇప్పటికీ ఈగల మోత, మురికి నీటితో సహజీవనం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారకుండా హైదరాబాద్‌ను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుదామంటే అర్థం ఉందా? కూరగాయల తాజాదనాన్ని కాపాడే కోల్డ్ చైన్ వ్యవస్థ కూడా నగరంలో అందుబాటులో లేదు. మార్కెట్‌లలో కూరగాయలు కచ్చితంగా పెట్టి అమ్మేవిధంగా వాటిని సంస్కరించాలి. ఈగలు, మురుగు, చెత్త చెదారానికి దూరంగా మార్కెట్లు ఉండాలి.

డంపింగ్ యార్డులు

ఇంత పెద్ద నగరానికి చెత్త డంపింగ్ చేయడానికి సరైన యార్డులు లేవు. ఉన్నవి కాస్తా జనావాసాలకు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు నిత్యం ఫిర్యాదులు, ఆందోళనలకు దిగవలసి వస్తున్నది. నగరం అన్ని వైపుల వెయ్యి ఎకరాల భూమిని గుర్తించి ఆధునిక డంపింగ్ యార్డులు వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటికి అనుబంధంగానే వైద్య, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ పరికరాల వేస్ట్ డిస్పోజల్‌కు తగిన ఏర్పాట్లు జరగాలి.

శ్మశానవాటికలు

నగరంలో చాలా కాలనీలకు, బస్తీలకు శ్మశానవాటికలు కూడా లేవు. ఎక్కడో దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి నివాస సముదాయానికి సమీపంలో విధిగా ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వంపై ఉంది. చాలా చోట్ల శ్మశానవాటికలు ఆలనా పాలనా లేకుండా కబ్జాలకు గురవుతున్నాయి.

మురికివాడలు లేని నగరం

మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మురికివాడల్లో వర్టికల్ భవంతులు నిర్మించి, ఎక్కడివాళ్లకు అక్కడే నివాసాలు కేటాయించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది. మిగిలిన స్థలాన్ని ఆ వాడ ప్రజలకే ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది.

population
ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తిగా అమలయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్), దాని చుట్టూ రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ల వెంట వందలాది భారీ పరిశ్రమలు రావలసి ఉంది. ఉద్యోగాలకు రెండు మూడు రెట్లు జనాభా పెరుగుతుంది. ఇవి కాకుండా సహజంగా వచ్చే వలసలు కూడా తోడవుతాయి. అంటే రానున్న రెండు మూడు దశాబ్దాల్లో నగర జనాభా రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంటుంది.


నగరానికి వచ్చిపోయే జనాభా (ఫ్లోటింగ్ పాపులేషన్) ఇప్పుడే రోజూ 10 నుంచి 15 లక్షలు ఉంటుంది. కనీసం మూడు లక్షల వాహనాలు రోజూ నగరానికి వచ్చిపోతుంటాయి. రైళ్లు, బస్సు, ఇతర వాహనాల్లో జనం వస్తుంటారు. జనాభా పెరిగితే అది కూడా రెండు మూడు రెట్లు పెరుగుతుంది. అంటే ఇట్లాంటి హైదరాబాద్‌లు మరో రెండు నగరం చుట్టూ అవతరించాల్సి ఉంటుంది. జనాభావృద్ధి, పారిశ్రామికాభివృద్ధిని దష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. జనాభాలో, విస్తృతిలో 1931కి ముందు వరకు హైదరాబాద్ ఢిల్లీ కంటే పెద్ద నగరం. 1901 నుంచి 1931 వరకూ జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

డిప్యూటేషన్ సీఐలకు త్వరలో పోస్టింగులు

-లాంగ్‌స్టాండింగ్ ఇన్‌స్పెక్టర్లకు స్థానభ్రంశం
-హైదరాబాద్‌తోపాటు మొత్తం జోన్ల నుంచి డిప్యూటేషన్‌కు అవకాశం

పోలీసుశాఖలో డిప్యూటేషన్లు పూర్తిచేసుకున్న సీఐలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం పోలీస్ అధికారులు కనీసం రెండేండ్లపాటు లూప్‌లైన్‌లో పనిచేయాలి. అలాకాకుండా ఏండ్లకేండ్లుగా లా అండ్ ఆర్డర్‌లోనే కొనసాగుతున్న సీఐలకు తర్వలోనే స్థానభ్రంశం చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ నిర్ణయించారు.

ci
నిబంధనల ప్రకారం రెండేండ్లు లూప్‌లైన్‌లో డిప్యూటేషన్ పూర్తి చేసుకున్న ఇన్‌స్పెక్టర్లకు లా అండ్ ఆర్డర్‌తోపాటు ఇతర విభాగాల్లో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సీఐడీతోపాటు ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌ఐబీలో దాదాపు వంద మంది సీఐలు రెండేండ్లపాటు డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రేంజ్ మినహా మిగిలిన రేంజ్‌ల్లో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కానీ హైదరాబాద్ రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్లకు మాత్రం ఇంతవరకు పోలీస్‌శాఖ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ రేంజ్‌లో 70 మంది ఇన్‌స్పెక్టర్లు రెండున్నరేండ్లు వివిధ విభాగాల్లో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నారు. వీరిలో 25 మంది ఇన్‌స్పెక్టర్లు విల్లింగ్ తీసుకొని రేంజ్ ఐజీకి రిపోర్ట్ చేశారు.

కానీ హైదరాబాద్ రేంజ్ ఐజీ ఇప్పుడు ఎక్కడా ఖాళీల్లేవని, పోస్టింగ్ సాధ్యంకాదని చెప్పడంతో సమస్య ఏర్పడింది. నిబంధనల ప్రకారం రేంజ్‌లో చాలాకాలంగా లా అండ్ ఆర్డర్‌లో ఉన్న సీఐలను బదిలీ చేయాలి. ప్రతి ఏడాది డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నవారు ఎంతమంది? లాంగ్ స్టాండింగ్ ఎంతమంది? మళ్లీ ఎంతమందిని ఈ ఏడాది డిప్యూటేషన్ కింద లూప్‌లైన్‌కు పంపించాలన్న నివేదికలు రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో రూపొందుతాయి. పని ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియను అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీనితో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న సీఐల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వడంలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదులందాయి. దీంతో మంత్రి ఇటీవల డీజీపీతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రేంజ్ ఐజీ, డీఐజీలతో సమావేశం ఏర్పాటుచేశారు.

లాంగ్ స్టాండింగ్‌లో ఉంటూ కేవలం లా అండ్ ఆర్డర్‌లోనే విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్లను డిప్యూటేషన్‌పై లూప్‌లైన్‌కు పంపించాల్సిందేనని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనితో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న అధికారులకు ఈ వారం చివర్లో పోస్టింగులు ఇచ్చేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ కసరత్తు ప్రారంభించారు. అలాగే హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న సీఐలను లూప్‌లైన్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ విధంగా తెలంగాణవ్యాప్తంగా 120 మందికిపైగా సీఐలు లూప్‌లైన్‌కు బదిలీ కానున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, జులై 05, 2014

ఆయన వృత్తి...వైద్యం! ప్ర‌వృత్తి...క‌బ్జా!


-మహానగరంలో భూ మాఫియా డాన్

-అడ్డదారుల్లో వేల ఎకరాలు స్వాధీనం
-పురావస్తు స్థలాలూ కబ్జా
-హస్మత్‌పేటలో రూ.420 కోట్ల భూమికి ఎసరు
-రెవెన్యూ, పోలీసు అధికారులూ ఆయన చేతిలోనే..
-గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్ భూ దందా
-స్థలాన్ని రక్షించాలని స్థానికుల డిమాండ్ 



ఎక్కడ ఖాళీ భూమి కనబడితే దానిపై ఆయన కన్నుపడుతుంది.. ఎక్కడ వివాదాస్పద జాగ ఉందని సమాచారం అందితే అక్కడ ఆయన మనుషులు వాలిపోతారు.. కబ్జాచేస్తారు.. బేరసారాలకు దిగుతారు.. రెవెన్యూ అధికారులను లోబర్చుకుంటారు.. ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేస్తారు.. నకిలీ పత్రాలను సృష్టిస్తారు.. ఏదో ఒక పేరుతో రాయించుకుంటారు. ఒక జాగానే ఇద్దరు,ముగ్గురు పేర్ల మీద విక్రయిస్తుంటారు. గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్‌గా, మానసిక వైద్యుడిగా చలామణి అవుతూ దానికి వెనక కబ్జాలు, సెటిల్‌మెంట్లతో భూ దందా సాగిస్తున్న పీఎస్ ప్రసాద్ వ్యవహారమిది. నిజాం కాలంనాటి చారిత్రక స్థలాలు, పురావస్తు భూములను సైతం వదలలేదు. ఇలా హస్మత్‌పేటలో వేల ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. వాటిని ప్లాట్లు చేసి విక్రయించాడు. దీనివల్ల ఎంతో మంది బాధితులు మోసపోయారు.



ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోకుండా ఆలయం, మసీదు కూడా కట్టించాడు. సిటీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న రాజకీయ పలుకుబడితో ఎన్ని అక్రమాలు, ఆరోపణలు వచ్చినా పోలీసులుగాని, రెవెన్యూ అధికారులుగాని కిమ్మనకపోవడంతో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ఇప్పటికైనా విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పీఎస్ ప్రసాద్.. వృత్తి డాక్టర్... ప్రవృత్తి కబ్జాలు, సెటిల్‌మెంట్లు, అక్రమ లావాదేవీలు... పేరుకు గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్... అది అక్రమాలకు ముసుగు మాత్రమే.. దాని ముసుగులో చేసేవన్నీ అక్రమ లావాదేవీలే. అమెరికాలో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నుంచి పారిపోయి వచ్చి, రాజధానిలో ఉంటున్న వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భూదందాల భాగోతం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! వందలాది ఎకరాల ఖాళీ, వివాదస్పద భూములను కొనడం, విక్రయించడం చూస్తుంటే, ఆ లావాదేవీలకు అంతటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికైనా అంతుచిక్కని విషయమే...తమ భూములను కబ్జాచేశారు...అక్రమంగా దక్కించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేసినా, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని పరిశీలిస్తే ఆయన వెనుక ఉన్న పవర్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.



ఈ అక్రమ భూతిమింగళంపై టీమీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం...
సికింద్రాబాద్ (కళ్లేపల్లి రవిచంద్ర)
శివారు ప్రాంతాల్లో ప్రసాద్ అనుచరుల కబ్జాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. హస్మత్‌పేట గ్రామంలోని సర్వే నెంబర్ 1, 7, 15, 57లలో 160 ఎకరాల ప్రభుత్వ స్థలముంది. ఈ స్థలాన్ని పురవాస్తుశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం 1953, జూన్ 11వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ స్థలం పురవాస్తు శాఖ ఆధీనంలో ఉంది. సర్వే నెంబర్ 1లోని పురాతన ఛత్రీ ఇప్పటికీ దర్శనమిస్తోంది.



ఈ ఛత్రీ నుంచి చార్మినార్‌వరకు నిజాం నవాబులు సొరంగ మార్గం నిర్మించారని పూర్వీకుల సమాచారం. కాగా ఈ స్థల వివాదం పురవాస్తుశాఖ, పైగా వంశస్తుల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. పురవాస్తుశాఖకు కేటాయించిన దాదాపు రూ.400 కోట్ల విలువైన 28 ఎకరాల స్థలంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అక్రమంగా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. పురాతన ఛత్రీని సైతం కూల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఈ స్థలంలో నుంచి 200 గజాల స్థలాన్ని ఓ మత (ఈద్గాకు) సంస్థకు మరో 250 గజాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అప్పజెప్పాడు. అదేవిధంగా 2 వేల గజాల స్థలాన్ని ముస్లిం శ్మశానవాటికకు కేటాయించాడు. అయితే ఆయా సంస్థలకు ప్రసాద్ స్థలాలను అప్పగించినప్పటికీ, వారిపేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించకపోవడం గమనార్హం.



అదే విధంగా హస్మత్‌పేట బస్టాప్ వద్ద ఉన్న దాదాపు రూ.20 కోట్ల విలువ గల 6200 గజాల స్థలాన్ని ప్రసాద్ తమ ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. ఈ స్థలం సైతం పురవాస్తుశాఖకు చెందినదే. గతంలో ఈ స్థలంలో పురావస్తు శాఖకు సంబంధించిన కార్యాలయం సైతం ఉండేదని స్థానికులు తెలియజేస్తున్నారు.. ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. దీంతో ఈ స్థలాన్ని గత 50 ఏళ్లుగా స్థానికులు మైదానంగా వాడుకుంటున్నారు. దసరా, వినాయక చవితి, ముస్ల్లిం సోదరులు తమ పండగలను ఈ మైదానంలోనే నిర్వహిస్తుంటారు. రెండేళ్ల ముందు వరకు ఈ మైదానంలో ఏ కార్యక్రమం చేపట్టినా పురవాస్తుశాఖ వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే గతేడాది ఈ స్థలంపై కోర్టు తనకు అనుకూలంగా అర్డర్ ఇచ్చిందంటూ ప్రసాద్ సోదరుడు పార్థసారథి మందిమార్బలంతో స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.



ముందు స్థానికులు ఆందోళన చేపట్టినా.. కొందరు నాయకులు భూకబ్జాదారుడి ఆమ్యామ్యాలకు లొంగిపోయి ప్రసాద్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారు. అయితే గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు రెవెన్యూ అధికారులు మ్యాటిషన్ చేయలేదు. పొజీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి ఫెన్సింగ్ నిర్మాణానికి గాను ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ భూమిని నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా క్రయ విక్రయాలు చేయించి తమకు అన్యాయం చేశారని బాధితులు బోయిన్‌పల్లి,అల్వాల్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా తనకున్న రాజకీయ పలుకుబడిని గొప్పగా చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ప్రలోభాలకు గురిచేసి, అక్రమ లావాదేవీలపై చర్యల నుంచి తప్పించుకుంటారని ఫిర్యాదులున్నాయి. 



జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు.. 
హస్మత్‌పేటలోని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జూన్ రెండవ వారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పురవాస్తుశాఖకు చెందిన రూ.400 కోట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు కేటాయించాలని ఆయన సూచించారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్‌కు అదేశాలు జారీ చేసినట్లు సమాచారం.



ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసినా.. 
నిజాం కుటుంబానికి చెందిన అత్యంత ఖరీదైన భూములను కూడా అక్రమంగా ప్రసాద్ గ్యాంగ్ రాయించుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఖుర్షీద్ జాహి ఎస్టేట్‌కు చెందిన రూ.40వేల కోట్ల రూపాయల విలువచేసే భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హమీద్ ఉన్నీసాబేగం గతంలో ముఖ్యమంత్రులను కలిసి ఫిర్యాదు చేసింది. సీబీఐ విచారణ జరిపించాలని కూడా కోరింది. దీనికి సంబంధించిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆయన పొందుపర్చి క్రయవిక్రయాలు జరిపినట్లు ఆమె వాపోయింది. ఖుర్షీద్ జాహీ ఎస్టేట్ భూములను ఈ విధంగా అన్యాక్రాంతం చేసినట్టుగా ఆమె సీబీఐ అధికారులకు కూడ పంపిన ఫిర్యాదులో పేర్కొంది.



మాజీ పీఎంకు సన్నిహితుడు..? 
అమెరికాలో రెండు బ్యాంకుల నుంచి బినామీ రుణాలు తీసుకొని 90 మిలియన్ డాలర్ల వరకు కుచ్చుటోపి పెట్టి, అక్కడ క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోయి అనధికారికంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పీ.ఎన్‌. ప్రసాద్ గత చరిత్ర చాలా పెద్దదిగానే ఉంది. అప్పట్లో ఓ కేంద్ర మంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతూ అమెరికాలో కేసు నుంచి బయటపడ్డారని చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో అడ్డూ, ఆదుపులేకుండా పెద్ద ఎత్తున భూకబ్జాలు, లావాదేవీలు చేస్తున్నారంటే ఆయనకు బలమైన రాజకీయ బంధమే వెన్నుదన్నుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రసాద్ 1990కు ముందు సొంత విమానాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.



అప్పట్లో ఓ మాజీ ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు అమెరికాలో విడిది చేసిన సమయంలో ప్రసాద్ విమానాన్ని సమకూర్చారని ప్రచారం జరిగింది. ఆ సాన్నిహిత్యం కారణంగానే దేశంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగిన పార్టీకి చెందిన ప్రముఖులకు ప్రసాద్ దగ్గరయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే గత పదేళ్ల కాలంలో ఆ పార్టీలో చెందిన ప్రముఖ నాయకుడితో స్నేహం పెరిగింది. ఆయన అండ చూసుకునే గ్రేటర్‌లో భూ దందాలకు ప్రసాద్ తెరలేపారని రాజకీయ వర్గాల్లో సైతం ప్రచారం జరుగుతోంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

స్థానికతను తేల్చడానికి...1956 నిబంధనే పక్కా...!

-విద్యార్థుల స్థానికతకు అదే కొలబద్ద
-వెనక్కి తగ్గరాదని సర్కార్ నిర్ణయం
-మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు
-తల్లిదండ్రుల్లో ఒకరు తెలంగాణలో పుట్టి ఉండాల్సిందే
అసలైన తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం దఢ నిశ్చయంతో ఉంది. ఇందుకోసం న్యాయ వివాదాలకు తావివ్వని రీతిలో పకడ్బందీ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ఫీజు చెల్లింపునకు 1956కు పూర్వమే ఇక్కడ నివసించి ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గరాదని నిర్ణయించింది. తెలంగాణ విద్యార్థుల ఫీజులు మాత్రమే భరిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల స్థానికతను గుర్తించే నిబంధనల విషయంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖ సలహాలు, సూచనలను సేకరిస్తున్నది.

table3ఈ బాధ్యతను సాధారణ పరిపాలనా శాఖ, ఉన్నత విద్యాశాఖపై ఉంచింది. ప్రధానంగా ముల్కీ నిబంధనలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనల్లో 1956కు ముందు విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒకరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఉండాలనే నియమం చేర్చాలని అధికారులు నిర్ణయించారు. దానికితోడు విద్యార్థి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా చదువుకుని ఉంటే వారి విద్యాపత్రాలు అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కనీసంగా విద్యార్థి తల్లిదండ్రులు తెలంగాణ ప్రాంతంలో ఇంటి స్థలమైనా కలిగి ఉండాలని నిబంధన చేర్చనున్నట్టు తెలిసింది. అప్పటినుంచి తెలంగాణ ప్రాంతంలోనే స్థిర నివాసం కొనసాగుతూ ఉండాలనేది కీలక అంశంగా చేర్చనున్నారు. రిజర్వేషన్ విధానాన్ని జనాభా ఆధారంగా ఎస్టీలకు 15 శాతం, ఎస్సీలకు 18శాతం, బీసీలకు 51 శాతం, మైనార్టీలకు 9 శాతం, ఇబీసీలకు 7 శాతం, వికలాంగులకు 0.04శాతం కేటాయింపులు చేయాలని అధికారులు తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు.

అర్హతలు..

బీసీ, ఇబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ఆయా విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. లక్ష మించకుండా ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఆదాయ పరిమితి రూ. 2 లక్షలుగా గత విధానాన్నే కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2013-14 సంవత్సరంలో రూ. 1889.61 కోట్లను రీయింబర్స్‌మెంట్‌కు, రూ. 525.91 కోట్లను మెయింటెనెన్స్ ఫీజులను తెలంగాణలోని 14 లక్షల 30వేల 445 మందికి చెల్లించారు.

table33
ఎంతమందిని లెక్కతేల్చారు...

తెలంగాణ రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఎంత భారమైనా ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇదివరకు ఉన్న నిబంధనల మేరకు ఫీజుల కేటాయింపు ఉంటుందని కూడా చెప్పింది. ఈ దిశలో ఇప్పటికే ఎంతమంది విద్యార్థులు అర్హులు అనే విషయంలో లోతైన అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి విద్యావిధానం కొనసాగనున్న నేపథ్యంలో మనవారెవరు? ఇతర రాష్ర్టాల వారెవరు? అనేది నిర్ణయించుకునేందుకు స్పష్టమైన లక్ష్మణరేఖ కోసమే నిబంధనలు రూపొందించాల్సి వస్తోంది. అది కొనసాగిస్తూనే విద్యాసంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అర్హులైన విద్యార్థుల లెక్కలు తీస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఉధృతమవుతున్న ముంపు ఉద్యమం...!

- ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం విజయవంతం
- కొనసాగుతున్న టీ జేఏసీ రిలే నిరాహార దీక్షలు
- 5,6,7 తేదీల్లో ఆంధ్రా బస్సుల నిలిపివేతకు నిర్ణయం
పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం విడుదల చేసిన ఆర్డినెన్స్ రద్దుకోరుతూ అఖిలపక్షం, టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో నిత్యం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు.

ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగులను ఆంధ్రాలో కలపడంతో ఆప్షన్‌లు కల్పించాలని కోరుతూ ఉద్యోగులు సైతం ఉద్యమిస్తున్నారు. ఆర్డినెన్స్ రద్దు కోరుతూ పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాటకమిటీ, టీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ముంపు మండలాల 48 గంటల బంద్ తొలిరోజు గురువారం విజయవంతంమైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంక్‌లు, ఐటీడీఏ, ఆర్డీవో, ఇంజినీరింగ్, కరెంట్, ఇరిగేషన్, వ్యవసాయ, అటవీశాఖ, ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయాలు బంద్ పాటించాయి.

ఈ సందర్భంగా ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వర్‌రావు, న్యూడెమోక్రసీ నేత కెచ్చల రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణదొరలు మాట్లాడారు. ఆర్డినెన్స్ రద్దు కోరుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం నిరాహార దీక్షలను తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెలంగాణ పంచాయతీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్నలు సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు.

మూడులక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకోవడం అన్యాయమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీలు చేపట్టిన ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 7న ముంపు ప్రాం తాల బాధితులతో భద్రాచలంలో నిర్వహించే ప్రదర్శన, సభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ముంపు ఆర్డినెన్స్ రద్దుచేయాలని కోరుతూ 5,6,7 తేదీల్లో 72 గంటలపాటు ఆంధ్రా బస్సులను నిలిపివేతకు పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ, అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఏపీఎన్జీవోల భూమి వాపస్...

-గోపన్‌పల్లిలో 189 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సర్కార్
-తెలంగాణ ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు
హైదరాబాద్ శివార్లలోని గోపన్‌పల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలాన్ని ప్రభుత్వం వాపసు తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు గురువారం సదరు స్థలాలను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రభుత్వ స్థల సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

APNGO-land
మొత్తం 189 ఎకరాల 11 గుంటల స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు స్థలం ఏపీఎన్‌జీవోలదంటూ గోడలపై రాసిన రాతలను తుడిచివేశారు. తెలంగాణ ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ మార్కింగ్ వేశారు. గోపన్‌పల్లిలోని 36, 37 సర్వే నంబర్లలోని 189 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు జారీ అయిన మెమో మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్‌పోద్దార్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో విద్యాసాగర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గురువారం అక్కడకు వచ్చి ఆ భూమిని ప్రభుత్వ కస్టడీలోకి తీసుకున్నారు. గోపన్‌పల్లిలోని భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం, నిర్ణీత సమయంలో ఉపయోగించకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలవల్ల వెనుకకు తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ కోసం 2004లో అప్పటి ప్రభుత్వం 189 ఎకరాలను కేటాయించింది. అయితే వివిధ రకాల వివాదాలవల్ల కొంతకాలానికే కేటాయింపును రద్దు చేసింది. తిరిగి 2008లో భూమిని అదే సొసైటీకి కట్టబెడుతూ నాటి వైఎస్ సర్కార్ మెమో జారీచేసింది. తర్వాత ఏపీఎన్జీవోలలో విభేదాల వల్ల సొసైటీ భూమిని అభివృద్ధి చేయలేకపోయింది. అశోక్‌బాబు, గోపాల్‌రెడ్డి వర్గాలు భూమి పంపకాలలో అవకతవకలు జరిగాయంటూ రచ్చకెక్కాయి. గతంలో ప్రభుత్వం సొసైటీకి కేటాయించినప్పటికీ హక్కును బదలాయించలేదు.

ఇప్పటివరకు మ్యూటేషన్ కూడా కాలేదు. దీంతో ఎలాంటి చిక్కులు లేకుండా సర్కార్ ఆ భూమిని వెనుకకు తీసుకోగలిగింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్థల స్వాధీనానికి మెమో జారీచేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది మొత్తం భూమి కొలతలు తీసుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు. రాయదుర్గలోని 83 సర్వే నంబర్‌లోని వివాదాస్పద ఏపీఐఐసీ భూములపై కూడా సర్వే జరుగుతోంది. ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శుక్రవారం, జులై 04, 2014

ఆంధ్రా సర్కార్‌కు మరోషాక్!

-సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా
-వినియోగం ప్రాతిపదికన కేటాయించాల్సిందే
-ఉత్పత్తి వివరాలు బెంగళూరుకు చెప్పాల్సిందే
-స్పష్టం చేసిన గోదావరి యాజమాన్య బోర్డు
విద్యుత్ వివాదంలో ఆంధ్రసర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గోదావరి బేసిన్‌లోని అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, డొంకరాయిలో ఉత్పత్తవుతున్న జలవిద్యుత్‌ను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వినియోగం ప్రాతిపదికన తెలంగాణకు కేటాయించాల్సిందేనని గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ మహేంద్రన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఇప్పటిదాకా బొగ్గు ఆధారంగా ఉత్పత్తవుతున్న థర్మల్ విద్యుత్‌లో మాత్రమే తెలంగాణకు కోటాను ఆంధ్ర సర్కార్ ఇస్తూ వస్తున్నది.

తాజా ఉత్తర్వుల్లో మూడు ప్రాజెక్ట్‌లలో ఉత్పత్తవుతున్న 725 మెగావాట్ల జలవిద్యుత్‌లో 53.89శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని గోదావరి రివర్ బోర్డు స్పష్టం చేసింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వివరాలను వెంటవెంటనే విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించే బెంగళూరులోని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి పంపాలని సూచించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు అంశంపై రాద్ధాంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ తర్వాతనుంచి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.

తెలంగాణకు విద్యుత్ కొరత సృష్టించడానికి ఆంధ్రా సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎన్ని కుట్రలు పన్నుతున్నా అవి క్రమంగా భగ్నమవుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు సమంజసం కాదని కేంద్రం, విద్యుత్‌నియంత్రణ మండలి, బెంగళూరులోని సదరన్ రీజియన్ పవర్ కమిటీ ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టారు. బెంగళూరులోని సదరన్ రీజియన్ పవర్‌కమిటీ సూచనను కూడా ఖాతరు చేయలేదు. పైగా మొన్నటి వరకు తెలంగాణలో అంతర్భాగమైన లోయర్ సీలేరు ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తెలంగాణకు రాకుండా అడ్డుపడ్డారు. గోదావరికి ఉపనది అయిన శబరిలో సీలేరు కలుస్తుంది.

శబరి కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. లోయర్‌సీలేరు వద్ద దాదాపు 450మెగా వాట్ల జలవిద్యుత్ ఉత్పత్తవుతోంది. పోలవరం ముంపుగ్రామాల ఆర్డినెన్స్ అమలులోకి వచ్చిన తర్వాత లోయర్ సీలేరు విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసినట్టయింది. ముంపుగ్రామాల వ్యూహంలో సీలేరు విద్యుత్‌ను ఆధీనంలోకి తీసుకునే కుట్ర దాగి ఉందని మొదటి నుంచి తెలంగాణ జలరంగనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చివరకు సీలేరును అధీనంలోకి తెచ్చుకున్న ఆంధ్ర సర్కార్ విద్యుత్ ఉత్పత్తిలో మరో తొండి మొదలు పెట్టింది.

ఎంత నీరు వాడుతుంది ఎంత విద్యుత్ ఉత్పత్తవుతుంది అనే విషయాన్ని చెప్పడంలేదు. విద్యుత్ కోసం ఎంతనీరు వాడుతున్నారు...ఎంత జలవిద్యుత్ ఉత్పత్తవుతుందో తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌సెక్రెటరీ అరవింద్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికారులకు, గోదావరి రివర్‌బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గోదావరి బోర్డు చైర్మన్ దీనిపై స్పందించి సీలేరు బేసిన్‌లో ఉత్పత్తయ్యే మొత్తం 725 మెగావాట్లలో తెలంగాణకు వినియోగం ఆధారంగా వాటాను కేటాయించాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తాగునీళ్లపేరుతో సాగుకై నీటి తరలింపు కుట్ర...!

-డెల్టా నారుమడులకు నీటికోసమే తాగు ముసుగులు
-పులిచింతలలో నిల్వనీరూ డెల్టా ఆయకట్టుకే
-డెడ్‌స్టోరేజీకి చేరుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం
-510 అడుగులకు తగ్గితే ఏఎమ్మార్పీ మోటార్లే నడవవు
-జంటనగరాలకు, ఫ్లోరైడ్ ప్రాంతాలకు కటకటే
సమైక్య సంకెళ్లను తెంచుకుని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా ఆంధ్రోళ్లు కుట్రలకు పదును పెడుతూనే ఉన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగునీటి ముసుగులో డెల్టా ఆయకట్టులో నారుమడులకు నీళ్లు మళ్లించుకున్న వలస పాలకులు, రాష్ట్రం విడిపోవడంతో కుట్రకోణాన్ని మార్చారు. విడిపోయాక కూడా కృష్ణాబోర్డును ఏపీ నేతలు ఆశ్రయించి తాగునీటి అవసరాలకు నీరుకావాలని, రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున వారంపాటు 3.6 టీఎంసీలు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయించారు. గత నెల 25 నుంచి ఈనెల 2 వరకు 3.6 టీఎంసీల నీరు వదిలారు. నీటిలో కేవలం 0.5 టీఎంసీలే ప్రకాశం బ్యారేజీకి చేరిందని, మధ్యలో పులిచింతల వద్దే నీరు ఆగిందని లెక్కలు చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురవ్వని ఈ తరహా అవాంతరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాతే తలెత్తడంలోనే కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తోంది.

dayam
ఈ సాకుతో మరో 3.6 టీఎంసీలు వారంపాటు రోజుకు 6వేల క్యూసెక్కులు ఇవ్వాలని అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సాగ ర్ ప్రధాన విద్యుత్ కేంద్రంతో 6015 క్యూసెక్కుల నీరు విద్యుత్తుత్పత్తి చేస్తూ వదలుతున్నారు. ఈ రకంగా నీరురాలేదనే సాకు చూపి 7.2 టీఎంసీలు తరలించుకుని పోవటంలో ఆంధ్రోళ్లు సఫలీకృతులయ్యారు. ఏటా తాగునీటి అవసరాలంటూ నారుమడులకు, నార్లు ముదిరాయని నాట్లకోసం తీసుకెళ్లటం రివాజుగా మారింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కారు కొలువుదీరటంతో కుట్రల రూపం మారుస్తున్నారు.


డెల్టా ప్రయోజనాల కోసమే పులిచింతల

సాగర్ ప్రాజెక్టుకు దిగువన 115 కి.మీ, ప్రకాశం బ్యారేజీకి ఎగువన 85 కి.మీ దూరంలో నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం వజినేపల్లి, గుంటూరు జిల్లా పులిచింతల మధ్యన పులిచింతల ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. 24 గేట్లకుగాను 18 గేట్లు పెట్టారు. క్రస్టుగేట్ల వరకు 4 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం పులిచింతల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. క్రస్టుగేట్ల లెవల్ 32.50 అడుగులు. ప్రస్తుతం 32.30 అడుగుల వరకు నీరుంది. 19, 20, 21, 22 స్లూయిస్ గేట్ల ద్వారా నీరు ప్రకాశం బ్యారేజీకి పోతోం ది. సాగర్ నుంచి 6 వేల క్యూసెక్కులు రాగా.. కిందికి 5 వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి. కష్ణా డెల్టాలో మూడో పంటకు సాగునీరు ఇచ్చేందుకు, అత్యవసరంగా నీటి అవసరం ఉన్నప్పుడు విడుదల చేసుకునేందుకే పులిచింతల ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టులోని చుక్కనీరు కూడా నల్లగొండ జిల్లాకుగానీ, తెలంగాణకు గానీ ఉపయోగపడదు. పులిచింతలలో నిల్వఉండే నీటిని అవసరాన్నిబట్టి ఎప్పుడైనా ప్రకాశం బ్యారేజీకి విడుదల చేసుకోవచ్చు. స్లూయిస్ గేట్ల ద్వారా పులిచింతలలోని పూర్తి నీటిని తీసుకెళ్లే వీలుంది. ఇదంతా దాచేసి పులిచింతల వద్ద నీళ్లు ఆగాయని, ప్రకాశం బ్యారేజీకి చేరలేదని కట్టుకథలు అల్లారు.
nirasana
భయపెడుతున్న సాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులు. డెడ్‌స్టోరేజీ సామర్థ్యం 510 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 515.10 అడుగులు (140.4917 టీఎంసీలు) నీరుంది. డెల్టాకు నీటి విడుదల పూర్తయ్యేసరికి నీటి మట్టం 513 అడుగులకు పడిపోనుంది. సాగర్‌లో 510 అడుగులకు నీటిమట్టం పడిపోతే ఏఎమ్మార్పీ మోటార్లు నడిచే పరిస్థితి లేదు. అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగునీరు వచ్చే పరిస్థితి ఉండదు. జూలై మొదటి వారం వచ్చినా వర్షాల జాడలేక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎగువన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన మేర లేకపోవటం.. వర్షాలు కూడా లేక శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో లేదు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటిని తరలించటంతో శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 834.30 అడుగుల నీరుంది. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులు ఉంచాల్సిందే. ప్రస్తుతం శ్రీశైలంలో 54.2498 టీఎంసీల నీరుంది. 1925 క్యూసెక్కుల నీరు విద్యుత్తుత్పత్తితో కిందికి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతినీటి బొట్టును సరిగా వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది.

నీటి విడుదల నిలిపేయాలని టీఆర్‌ఎస్ ఆందోళన

తాగునీటి పేరుతో కృష్ణా జలాలను కాజేయడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, కృష్ణాడెల్టాకు నీటి విడుదల నిలిపేయాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సాగర్ పైలాన్ కాలనీలోని విద్యుత్‌కేంద్రం గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. డెల్టాకు నీటి విడుదల చేయాలంటే సాగర్ ఎడమ కాల్వకు కూడా నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శివాలయం ఘాట్ వద్ద నీటిలోకి దిగి కృష్ణా డెల్టాకు నీటివిడుదల నిలిపేయాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పెద్దవూర మండల రూరల్ అధ్యక్షుడు రమేశ్‌జీ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!