కవి పండితులకు, తెలంగాణ ప్రజలకు, వీక్షకులకు
వినాయక నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు!
(తెలంగాణ రాష్ట్రమును తొందరగా ఈయుమని దివి: సెప్టెంబర్ 18, 2013 నాడు నేను విఘ్నపతిని ప్రార్థిస్తూ వ్రాసిన పద్యములకు సంతసించిన ఆ విఘ్నేశ్వరుడు మనకు మన తెలంగాణ రాష్ట్రమును ప్రసాదించి మనను బానిసత్వమునుండి విముక్తులను చేసినాడు. అందులకు మరొక్కసారి ఆనాటి దినమును స్మృతికితెచ్చుకొంటూ ఆ పద్యాలను ఇక్కడ ప్రకటిస్తున్నాను. అప్పటి మన ఆకాంక్షలు ఎలా ఉన్నాయో మరొక్కసారి జ్ఞాపకము చేసుకొనండి సోదరులారా!)
హెచ్చు తగ్గులు లేనట్టి హిత మనమున,
దరికిఁ జేరనిచ్చితిమి యందఱనుఁ బ్రేమఁ
గుఱియ; స్వార్థ మేమాత్రమ్ముఁ గోర మయ్య;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (1)
దరికిఁ జేరనిచ్చితిమి యందఱనుఁ బ్రేమఁ
గుఱియ; స్వార్థ మేమాత్రమ్ముఁ గోర మయ్య;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (1)
మమ్ము బాధించినట్టి సీమాంధ్రులకును
మంచి బుద్ధిని దయసేసి, మమత గలుగు
వారలుగ మార్చి, దీవించి, వరము లిచ్చి,
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (2)
మాయ లేనట్టి వార; మమాయకులము;
కుడు మటన్నఁ బండు వటంచుఁ గూర్మి మీఱ,
సంతతము సంతసముఁ బూని, స్వాగతింప;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (3)
తెలుఁగు వారందఱును నొక్కటిగను నుండి,
ప్రాంతములుగాను విడిపోవ బాగటంచు,
వేడుచుంటిమి ప్రార్థించి, పేర్మి మీఱ;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (4)
ఆత్మ గౌరవోద్యమ మిది, యాదరించి,
యిష్టములఁ దీర్చి, యెడఁబాపి కష్టములను,
మమ్ముఁ గరుణింప వేడెద మనమునందు;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (5)
-: శుభం భూయాత్:-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి