గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 24, 2013

నేను నీ తోడఁ గలసి యుండినను జెడుదు!


“నేను నీ తోడఁ గలసి యుండినను జెడుదు”
నంచు విడిపోవు వాని, దర్పించి లాగి
కొనుచుఁ దమతోడ నుండు మటనియు, దుష్ట
వర్తనము సేయ మెత్తురే? ధూర్తు లండ్రు! ()

కలసి యుండఁగ వలెనన్నఁ గరుణఁ జూపి,
ప్రేమ కుఱిపించి, కష్టాలఁ బ్రీతిఁ దొలఁగఁ
జేసి, నష్టాలఁ బూడ్చి, విశిష్ట రీతి
వర్తనము సేయఁగా వలె, పరహితులయి! ()

కలసి యున్నచోఁ గలవు సుఖమ్ములంచుఁ
బలుకఁగా సరిపోదు; ప్రవర్తనమును
మార్చుకోవలె; “సరియ నే మాఱితి” నని
పైఁకిఁ జెప్పి, దౌష్ట్యముఁ జూప ఫలిత మేమి? ()

ఐన నా స్థాయి దాఁటెఁ! బ్రధానముగను
రాష్ట్ర మేర్పాటుఁ జేయంగఁ బ్రార్థనమును
జేయఁ గేంద్రమ్ముఁ బ్రకటించె; స్థిరత రాష్ట్ర
మును గొనంగను వేచిరి జనులు నిచట! ()

కేంద్రమే కృత నిశ్చయ క్షిప్ర రాష్ట్ర
విభజన స్థితయుం గాఁగ; సభలు సేసి,
కృతక బుద్ధి సమైక్యాంధ్ర వ్రతముఁ బూని,
యుద్యమము సేయ నౌనె సయోధ్య మీకు? ()

కేంద్రమే పూనె విభజన కృత్యమునకు!
నెవ్వ రన్యాయమున మ్రగ్గి నెవ్వఁ గనిరొ;
యెవ్వ రన్యాయముం జేసి నెవ్వ నిడిరొ;
కేంద్రమునకుఁ దెలిసెఁ గాన క్షిప్ర మిడెను! (౬)

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chaala baagundhi. excellent

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

Thank you brother!

aditya చెప్పారు...

Complaint immediately to cyber cell and book a case against that fellow immediately.

అజ్ఞాత చెప్పారు...

Just stupidity to post obsene on a decent forum......
dont this guy has better language and culture .let him apologize immediately..........
Very sorry telugu brothers and sisters .......

Prasad చెప్పారు...

Why don't you moderate & delete (not publish) such comments, even without name?

కామెంట్‌ను పోస్ట్ చేయండి