గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

హైదరాబాదు నగరాన

హైదరాబాదు నగరాన నాధిపత్య
మును గొనలు సాఁగఁ జేయ సభను జెలంగి,
యల సమైక్యాంధ్ర నాట కాహ్వానితు లిడు
కల్లబొల్లి మాటలు పాటలెల్ల కల్ల! (1)


ఆ సమైక్యత యెట్టుల నాదరింత్రు?
కలిసి యుంద మనుట యెట్లు కలుగు నిచట?
నెటులఁ బిల్లియు నెలుక లొక్కటిగ నుండు?
నెటులఁ బీడకుల్ పీడితు లేకమగుట? (2)


అన్న దమ్ములు కారు వీ రణచఁ బడిన
వార లైరయ్య, పీడక బాధితులయ!
దోపిడీదారులుం గోర, దోచఁ బడిన
వార లెట్టుల కలియంగ వలతురయ్య? (3)


రక్తముం గ్రోల మరగిన రక్కసు లిటు
శాకములఁ దిందు మనఁగానె, సంబరపడి,
దరికిఁ జేరంగఁ బోదురే ధరణి జనులు?
నటులె సీమాంధ్ర, తెలగాణ నిటఁ గలుపుట! (4)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి