తెలంగాణ కవిమిత్రులకు, రచయితలకు, ప్రజలకు
తెలంగాణ విలీన/విమోచన దినోత్సవ శుభాకాంక్షలు!
నిటులె యుందుము, విభజన లేవి వలదు!
విభజన మటన్న నుద్యోగ విధులు వీడి,
యుద్యమము సేతు"మని మీర లొఱల నేల? (1)
"పోవుచో మీరు పోపొండు; ముదముఁ గనుచు,
నిచట హైదరాబాదులో నేర్పు మీఱ,
దోపిడులు సేయుచును నుందు మోయి, పొ"మ్మ
నఁగ నిదియె నీదు తాతల నాణ్య ధనమె? (2)
ఇటకు వచ్చినదియె మీర; లిచటి వనరు
లెల్లఁ గొల్లఁగొట్టితి రీర; లిచటి కొలువు
లెన్నియో దొడ్డి దారిన నెటులొ పొంది,
"యిదియె మా నేల; మీరలే యెటకొ పొం"డ
టన్న నేతీరుగాఁ జూతు మన్న మిమ్ము? (3)
ఈ తెలంగాణమున నున్న యెట్టి యాంధ్ర
జనులు తాము దోపిడి సేయఁ జంకి రనిన,
వారి నెట్టి మాటయు మేము వల్కకుండ,
గౌరవముగాను జూతుము ఘనత నిడియు! (4)
దోపిడీ సేసి నట్లైన దుడ్డు కఱ్ఱ
చేఁతఁ బట్టియుఁ దఱుముచు శిక్ష వేసి,
న్యాయముగ నీది నీకును, నాది నాక
టంచుఁ బంచి, యంపెద మోయి యాంధ్ర జనుఁడ! (5)
6 కామెంట్‌లు:
Jai Te Langaa Naa
నీబొందకు సంస్కారీ...నీబొంద కుసంస్కారీ...అతితెలివితేటలే కొంపముంచాయి...అతితెలివితేట లేకొంపముంచాయి... ఇంకానా వెటకారాలు...ఇంకా నావెటకారాలు...
బుద్ధి మార్చుకో నాయనా...సంస్కారం నేర్చుకో...
Jaisa My Kya Andhra?
ఎక్సలెంట్ పొయెట్రీ
గుండు మధుసూధనార్యులు కూర్మి తోడ
ఎంత వేడిన నవ్వారి నేమి ఫలము?
ధూర్తు లెపుడైన విందురే దొడ్డ మాట?
అరవ రాజాజి న్యాయమే నవసరమగు!
ధన్యవాదమ్ములయ్య పద్యమ్మునందు
నాంధ్ర నైజమ్ముఁ దెలిపినయందు కిపుడు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి