రాజధాని శివారులో ఎక్కడ సర్కారు భూమి కనిపించినా ఆక్రమించుకున్న సీమాంధ్రులు రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలోని సర్కారు కంచె భూములతో ఆటలాడుకున్నారు. కంచె భూమిగా రికార్డుల్లో ఉన్నా దొంగ సర్వే నంబర్లతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేశారు. తమది కాని భూమిని అనేక నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా కోర్టు రద్దు చేసిన తర్వాత కూడా ఆ దందా యథేచ్ఛగా కొనసాగించారు. అంతటితో ఆగకుండా సదరు భూమినే బ్యాంకులో హామీగా పెట్టి రుణాలు తీసుకుని జెండా ఎత్తేశారు.
-పుప్పాల్‌గూడలో సీమాంధ్రుల దందా
-ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు..
-కోర్టు రద్దు చేసినా బేఖాతర్
-కుదువబెట్టి విదేశీ బ్యాంకుకు టోకరా
-ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు..
-కోర్టు రద్దు చేసినా బేఖాతర్
-కుదువబెట్టి విదేశీ బ్యాంకుకు టోకరా
ఈ పకడ్బందీ వ్యవహారంలో అధికారులంతా శక్తివంచనలేకుండా సహకరించారు. సీమాంధ్ర బాబులు అడ్డదారుల్లో కోటీశ్వరులైతే.. బ్యాంకులు అంతే స్థాయిలో దివాలా తీశాయి. కోట్ల రూపాయల విలువైన భూములు లిటిగేషన్లలో పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 452లో 190 ఎకరాల ప్రభుత్వ భూమి కథ ఇది. సేత్వారు రికార్డుల్లో ఈ భూమి 452/1 కింద 178 ఎకరాల 2 గుంటలు, 452/2 కింద మరో 15 ఎకరాల 37 గుంటల భూమి సర్కారు కంచె భూమిగా నమోదైఉంది.
ఈ ప్రభుత్వ భూమిమీద కన్నేసిన సీమాంధ్రబాబులు ఇక్కడ సర్వే నంబర్‌కు బై నంబర్లు ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని రకరకాల రికార్డులు సృష్టించారు. ఈ సర్వే నంబర్‌లోని 452/2 కింద ఉన్న 15 ఎకరాల 37 గుంటల భూమిని కాజేశారు. ఈ వ్యవహారంలో లేని భూమి ఉన్నట్లుగా, ఉన్న భూమిని లేనట్లుగా కనికట్టు చేశారు. వాస్తవానికి 452 సర్వే నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది.
నాటి సేత్వారురికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది. నాటి సేత్వారు రికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు ఈ 452/2 సర్వే నంబర్‌లోని 15.37 గుంటల భూమిని 452/3 అని కొత్త సర్వే నంబర్ సృష్టించి అనేక రకాలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. 1997 నుంచి మొదలైన ఈ రిజిస్ట్రేషన్లపర్వం 2009వరకు నిరాటంకంగా కొనసాగింది. 452/3పీ అనే కొత్త నంబరు పుట్టించి ఈ భూమిని గజాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేశారు.
ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2000లో డాక్యుమెంట్ నంబర్ 7090/2000 పేరుతో సర్వే నంబర్ 452/3 పేరున 15 ఎకరాల 37 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసే వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే ఈ భూమి పాత రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో స్థానిక దళితుల స్వాధీనంలో ఉంది. దళితులు ఈ భూమికి శిస్తుకూడా చెల్లిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమి పరాధీనం అవుతుందని గమనించిన దళితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కొత్త రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. ఈ మేరకు క్యాన్సలేషన్ డీడ్ 2004 జనవరి 22వ తేదీన రిజిస్టర్ అయింది.
కొత్త కుట్రలతో..ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో కొద్ది రోజులు గప్‌చుప్‌గా ఉన్న బడాబాబులు ఆ తర్వాత మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించారు. 452/3,452/2 అంటూ మళ్లీ రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ భూమికి రిజిస్ట్రేషన్స్ రద్దు అయిన విషయం వెబ్‌సైట్లో కూడా పొందు పరిచారు. అయినా అధికారులు మళ్లీ రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగించారన్నది ఎవరికీ అర్థంకాని చిదంబర రహస్యం. 2009 వరకు ఈ భూమిపై రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక భూమిని రిజిస్టర్ చేసే ముందు సబ్‌రిజిస్ట్రార్లు లింక్ డాక్యుమెంట్లను, ఈ భూమి యాజమాన్యాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్ల ఫ్లోను పరిశీలించాలి. ఆ తరువాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ అధికారులు దీన్ని పాటించలేదు. ఇలా ఈ భూమిపై మరో ఐదు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
బ్యాంకులకు బురిడీ..
ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఆనోటా ఈనోటా పొక్కుతుండడంతో ఇలా కాదనుకుని ఈసారి బ్యాంకుల మీద పడ్డారు. ఇందుకోసం లేని కంపెనీలను సృష్టించారు. కర్నూలు అడ్రసుతో రిజిస్టర్ అయిన కాకతీయ ల్యాండ్‌సేకప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2007లో తెరపైకి తీసుకు వచ్చారు. 2000 సంవత్సరంలో కోర్టు ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిందో అదే డాక్యుమెంటును హామీగా పెట్టి ఐడీబీఐ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000 తరువాత తాము అక్రమ పద్ధతుల్లో రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్లను కూడా ఈ అవగాహన ఒప్పందంలో చేర్చారు.
ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న వ్యక్తులు వేరు.. అవగాహన కుదుర్చుకున్న వారూ వేరు. అయినా ఈ డాక్యుమెంట్లతో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన సెక్యూరిటీ ట్రస్ట్ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్‌తో అప్పటి వరకు సీన్‌లో లేని పీవీ రమణారెడ్డి అనే వ్యక్తికి అవగాహన ఒప్పదం డాక్యుమెంటును రిజిస్టర్ చేశారు. ఇక ఈ అవగాహన ఒప్పందం డాక్యుమెంట్లను కుదువబెట్టి ఐడీబీఐనుంచి 13,400 వేల డాలర్ల(రూ.60 కోట్లు)కు గ్యారెంటీ తీసుకున్నారు. ఈ బ్యాంకు గ్యారెంటీని ముంబైలోని విదేశీ బ్యాంకు అయిన డ్రాయిష్ బ్యాంకు బ్రాంచ్‌లో కుదువబెట్టి అక్కడినుంచి ఆ మొత్తాన్ని వివిధ రూపాలలో కాజేశారు. ఇప్పుడు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన ఐడీబీఐ చిక్కుల్లో పడింది.
ఇలా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమితో విదేశీ బ్యాంకులకూ కన్నంవేశారు. తీసుకున్న ఈ రుణాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఏవిధంగా రుణ బకాయిని వసూలు చేసుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే 2007 సంవత్సరంలో ఇలా బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రబుద్ధులు నకిలీ పత్రాలతో ఈ భూమిమీద మరో రెండు రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇపుడు అంతా టోకున లబోదిబోమంటున్నారు.
ఇది వివాదాస్పద భూమి: రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్‌బాబు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్452/2 వివాదాస్పద భూమిగా 2010 నుంచి రికార్డులో ఉంది. ఈ మేరకు 28-05-2010లోనే అప్పటి జాయింట్ కలెక్టర్ ఇది వివాదాస్పద భూమిగా ఆదేశాలు ఇస్తూ నమోదు చేయించారు. దీనిపై వివాదాలుంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు లేవు. వాస్తవానికి ఈ భూమి అసల్ సేత్వారి రికార్డులో కంచె సర్కారీ అని రాసి ఉంది.
1950లో దేవరకొండ సాయన్న, వెంకయ్యలపేర్ల మీద పట్టా అయినట్లుగా రికార్డులో ఉంది. అయితే దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి 1954-55 కాస్ర పహణి, 1955-56 చేపాలా పహణిలు అందుబాటులో లేవు. ఈ భూమిపై అనేక లావాదేవీలు జరిగినట్లుగా రికార్డులో ఉంది. గతంలో ఈ సర్వే నంబర్ పేరు తప్పు పడింది. దీనిని ఆ తరువాత కరెక్టు చేశారు. ప్రస్తుతం ఈ భూమి ఖాళీగా ఉంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి