గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మార్చి 13, 2014

ఫైళ్ళకు కాళ్ళొచ్చాయ్...!


తెలంగాణ సీమాంధ్రల
విభజనమ్మునందు నేడు
ఆస్తి అప్పులును ఉద్యో
గుల విభజన కీలకమయె!

తెలగాణను విలువగలుగు
భూముల సంబంధించిన,
లబ్ధిని చేకూర్చునట్టి
డాక్యుమెంట్లు మాయమాయె!

ప్రైవేట్ వ్యక్తులను పెట్టి
కీలకమైనట్టి బాధ్య
తలను అప్పగించుటయే
అనుమానాలకు తావయె!

కీలక ఫైళ్ళను, రిఫరెన్స్
పత్రాలను చించివేసి
రనియు సమాచార మిట్లు
స్వైరవిహారముచేసెను!

సీమాంధ్రా అధికారుల
నిర్వాకము చూడగాను
తెలంగాణ కొంపముంచి
తరలునట్లు తోచుచుండె!

రాష్ట్రమేర్పడిన పిదపను
అక్రమాల గుట్టు రట్టు
చేయకుండ ఉండేందుకు
జరుపు కుట్రలివియయ్యా!

ముఖ్యమైన ఫైళ్ళెన్నో
బయటకు తరలించుచుండ్రి!
నిఘా లోపమును తమకే
అనుకూలము చేయుచుండ్రి!!

కార్యదర్శి ఆదేశాల్
బేఖాతరు చేసి, వారు
దుర్మార్గమ్మునకు నేడు
పూనుకొనియు తెగబడిరయ!

సచివాలయ అధికారుల
బరితెగింపు ఆపుటకును
నిఘా పెంచవలయునయ్య!
చర్య గైకొనగవలెనయ!!

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురించి:


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



బుధవారం, మార్చి 12, 2014

ఇదోరకం కొత్త వ్యాపార ప్రకటన!


విభజనమును జరుగకుండ
చేయుదునని ప్రతినబూని
ప్రగల్భాలు పలికినట్టి
కిరణ్ రెడ్డి కతలు కనుడు!

బెర్లిన్ గోడను పగులగ
గొట్టినట్లు, విభజనమను
గోడపగులగొట్టెదనని
ప్రగల్భాలు పలుకసాగె!

ప్రపంచ చరితము తెలియని
నల్లారియె అజ్ఞతతో
పలికిన మాటలు ఇవియని
పరిశీలించిన దెలియును!

తూర్పు జర్మనియె సోవియట్
పాలన నుండియు విముక్తి
నందినతరి ఆ గోడను
పగులగొట్టిరయ్య జనులు!

జర్మనీని విభజించియు
సోవియట్టు గోడకట్ట,
స్వతంత్రమ్మునందినట్టి
తూర్పు జర్మనియె చీల్చెను!

సామ్యవాద సిద్ధాంతము
మాటున సామ్రాజ్యవాద
కుట్రల ఛేదించి యెన్నొ
దేశాలే విడిపోయెను!

ఒక్కటియౌ జర్మనియే
తూర్పు పశ్చిమమ్ములుగా
విడదీసిన సోవియట్టు
కుట్ర గూల్చి ఒకటైనవి!

ఈ మెలికయె తెలియనట్టి
కిరణ్ రెడ్డి పిట్టకతను
విన్నవారు నవ్వెదరయ!
అజ్ఞానిగ తలిచెదరయ!!

తెలగాణకు సీమాంధ్రకు
ఇట్టి పోలికే లేదయ!
మోసముతో తెలగాణను
సీమాంధ్రతొ కలిపినారు!!

ఒక్కటియగు జర్మనీని
రెండుగ విడదీసినారు!
విడిగనున్న తెలగాణను
బలిమితోడ కలిపినారు!!

రెండింటికి పోలికయే
ఏమాత్రము లేకున్నను
ఉన్నదనియు పలుకునట్టి
కిరణ్ రెడ్డి అజ్ఞానియె!

తెలగాణకు సీమాంధ్రకు
నడుమ గోడ కట్టిరెవరు?
విడివిడిగా నున్నవాటి
నడుమ గోడ ఎక్కడిదయ?

మోసముతో తెలగాణను
సీమాంధ్రతొ కలిపి వారు
దోపిడియను చుట్టుగోడ
కట్టగ, తెలగాణ చీల్చె!

దోపిడీలు చెల్లవయా,
మోసమ్ములు చెల్లవయా,
సమైక్యమను ముసుగుతోడి
కుతంత్రాలు చెల్లవయా!

అరువదేండ్ల దోపిడీకి
మంగళ గీతిక పాడగ,
సమైక్యమను పాచిపండ్ల
దాసరి పాటయె యేలయ?

వేరుపరచబడినవారు
జర్మనీని తన్నుతన్ని,
ఒక్కటిగా మారి, స్వేచ్ఛ
గీతికనే పాడినారు!

సీమాంధ్రుల కబంధ హ
స్తమ్ములలో జిక్కినట్టి
తెలగాణము స్వేచ్ఛగొనియు
మంగళగీతిక పాడెను!

ఈ రెంటికి పోలికయే
లేకున్నను అజ్ఞానపు
కూతలతో మోసగించు
కిరణ్ రెడ్డి స్వార్థపరుడె!

"జై సమైక్య ఆంధ్ర" అనెడి
పార్టిపెట్టి ప్రజల చెవిని
పువ్వుపెట్టగాను దలచి
అతడాడెడి నాటకమిది!

ప్రజల నమాయకుల జేసి,
ఓట్లు సీట్లు కొల్లగొట్టి,
తన తమ్ముని మూట నింపు
నూతన వ్యాపారమ్మిది!

తూర్పు జర్మనీయె మరల
సోవియటున ఎట్లు కలియు?
స్వేచ్ఛగొనిన తెలంగాణ
సీమాంధ్రను ఎట్లు కలియు?

సీమాంధ్రుల పెత్తనమ్ము
సహియింపని తెలంగాణ
సమైక్యాంధ్రమనగానే
సీమాంధ్రను ఎట్లు కలియు?

దోచుకున్న వారలనే
నమ్మి యెట్లు దరిజేరును?
పగటికలలు కనినయట్టి
కిరణ్ రెడ్డి అజ్ఞానియె!

గౌరవప్రద తెలంగాణ,
స్వతంత్రయౌ తెలంగాణ,
బంగారపు తెలంగాణ
సీమ గలియు మాట కల్ల!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, మార్చి 11, 2014

కళ్ళముందే ఇంత దుర్మార్గమా?


పోలవరం నిర్మాణం వల్ల తెలంగాణ చారిత్రక, ఆధ్యాత్మిక, భౌగోళిక ఆధారాలు అంతరించిపోనున్నాయి. ఎంతో విలువైన అటవీ సంపద, కొండరెడ్లఆటవికజాతి నాశనమై, ఎంతో విలువైన భూమి, భూ అంతర్భాగంలో ఉన్న ఖనిజసంపద పనికిరాకుండాపోతుంది. పైగా తెలంగాణకు ఇది శాపంగానూ, పెద్ద గుదిబండగానూ మారుతుంది. దీనివల్ల నష్టాలేగానీ, లాభాలేవీఉండవు. ఇంతటి వినాశకారకమైన ఈ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నది సీమాంధ్ర పెట్టుబడిదారులేనన్న విషయం మరువరాదు. తద్వారా వారు లక్షలకోట్ల ధనార్జనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దీనివల్ల సీమాంధ్ర నాయకులకు ముడుపులు పెద్దఎత్తున ముడుతాయి. ఈ స్వార్థంతో తెలంగాణలోని భద్రగిరినే సర్వనాశనంచేయ సంకల్పించారు ఈ దుర్మార్గ సీమాంధ్రులు. అందుకని దీన్ని ప్రతి ఒక్క తెలంగాణుడూ వ్యతిరేకించి, ఉద్యమించవలసిన అవసరం ఉన్నది.

ఈ క్రింద ఈయబడిన వ్యాసం "మురళీరవం" శీర్షికన ఆంధ్రప్రభలో శ్రీ ఎన్. వేణుగోపాల్ గారు రాసిన వ్యాసం.

వ్యాసం చదవడానికి : దీనిపై క్లిక్ చేయండి

మరిన్ని వివరాలకు: దీనిపై క్లిక్ చేయండి

(శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

పోలవర నిర్మాణంతో భద్రగిరిజ(ను)ల సమాధి ఖాయం!


నేఁడు కేంద్రమ్ము పూనిన నీచమైన
చేఁతలకు ఘోరమైనట్టి స్థితియె కలుగు!
భద్రగిరిజనులును మఱి భద్రగిరియు
జలసమాధి యౌదురు సుమ్ము! సత్య మిదియె!

కుటిల సీమాంధ్ర నాయక కోటి నిపుడు
సంతసింపఁగఁ జేయంగఁ జాలినట్టి
పోలవరమును నిర్మాణము నిఁకఁ జేసి,
భద్రగిరి ముంపఁ బూనుట భద్రమగునె?

భద్రగిరి ముంపు గ్రామాలు వారల కిడి,
బిల్లు నామోద ముద్రతోఁ జెల్లుఁబాటుఁ
జేసి, యార్డినెన్సున నేఁడు చిత్రముగను
నేడు మండలమ్ముల నిడ నేమి కతము?

గిరులను, గిరిజనులను రక్షింపకుండ,
పోలవరమును నిర్మింపఁ బూనుటేల?
పోలవర గిరిజనులు సంపూర్ణమైన
మానవులు గారె? ముంపంగ మానుఁడయ్య!

పోలవర డిజైనును మార్చి, ముంపులేని
విధముగాఁ గట్ట వీలుండ, విడచి దాని,
ముంపుఁ గోరియు నిర్మాణము నిటుఁజేయఁ
గుట్రయే గాని మఱియొండు కోరి గాదు!

భద్రగిరిలోని మండలాల్ వశము సేసి
కొనెడి దుశ్చింత వారల కున్నదయ్య!
అదియె నెరవేరె నార్డినెన్సందఁజేయ!
మా తెలంగాణమిది యొప్పమానునయ్య!!

ఒకరి కన్యాయమునుఁ జేసి, యొకరి కిపుడు
సంతసముఁ గూర్పఁగాఁ బూన సఖ్యమౌనె?
ఆ డిజైనును మార్చియు నాదరించి,
మాకు నన్యాయమునుఁ జేయ మానుఁడయ్య!


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, మార్చి 09, 2014

గెజిట్‍లో మరో కుట్ర!


గెజిట్‍లోన తెలగాణకు
కేంద్రమ్మిడె మరో ఆంక్ష!
కేంద్రమె తెలగాణపట్ల
మరో మోసమును చేసెను!!

"కేంద్రమె తెలగాణమిచ్చె
మహాభాగ్యమిదెయయ్యా!

హైద్రబాదుగూడనిచ్చె
జన్మధన్యమాయెనయా!!

గెజిటుగూడ వెలువరించె
కొత్తచరిత మొదలయెనయ!"

ఇదియె సగటు తెలగాణుని
ఆనందమ్ముకు హేతువు!!

హైద్రబాదుపై ఆంక్షలు;
హైకోర్టును ఉమ్మడనుట;
విద్యగూడ కామననుట;
నదీజలంపై ఆంక్షలు;
శాంతిభద్రతలు, ఉద్యో
గాలును పదియేండ్ల వరకు
ప్రశ్నార్థకముగ నుంచియు,
మనను మోసగించెనయ్య!

గెజిట్టునే శ్రద్ధగాను
చదివిన నొక రహస్యమ్ము
బట్టబయలు అగునయ్యా!
మోసము విదితమ్మగునయ!!

ఇట ప్రభుత్వరంగ సంస్థ
లనుకూడ పదేండ్ల వరకు
తెలంగాణ చేతికిడక
చిల్లులు పొడిచెను కేంద్రము!

విస్మయమ్ము కలిగించెడి
విషయమ్మిది చూడగాను
ఈ సంస్థలు నూటయేడు
ఉమ్మడిగా కొనసాగును!

ఈ సంస్థలపై వత్సర
కాలము ఉమ్మడి అధికా
రమ్మును కట్టగబెట్టెను
కేంద్ర, మ్మిది వింతగాదె?

రెండు రాష్ట్రముల సంస్థలు
వేరువేరుగా చేతకు
గరిష్ఠకాలపరిమితిని
పదేండ్లుగా నిర్ణయించె!

విభజన కొరకయి ఏర్పా
టును చేసిన కమిటీయే
ఒక వత్సర కాలంలో
నివేదికను ఈయలేదె?

ఏడాది అనంతరమ్ము
వేరువేరు సంస్థలుగా
ఏర్పాటును చేసుకొనగ
వలసియుండ, షరతులేల?

గరిష్ఠ కాల పరిమితిని
పదియేండ్లకు విధియించుట
కేంద్రము బూనిన కుట్రయె!
ఇట్టి ఆంక్ష మనకెందుకు?

ఈ సంస్థలు తెలంగాణ
పాలనమున కీలకమగు
ప్రభావమ్ము జూపునవే!
ఇట్టి ఆంక్ష మనకెందుకు?

హైదరబాదు, హైకోర్టు,
విద్య, నదీజలాల్, శాంతి
భద్రత, లుద్యోగమ్ములు
కేంద్ర పెత్తనమున నుండె!

ఈ గెజిటు ప్రకార మిపుడు
ప్రభుత రంగ సంస్థలన్ని
కేంద్ర పెత్తనమునందున
పది యేడుల వరకుండును!

ఇంత మోసమును చేసిన
కేంద్రము మనకిడినదేమి?
అరచేతను స్వర్గమ్మును
జూపి మోసగించలేదె?

కాంగ్రెస్సే తెలగాణుల
చెవిని పువ్వు పెట్టినదయ!
తెలగాణుల నమాయకుల
జేసి మోసగించెనయ్య!!

ఇట్టి కాంగ్రెసును మనమిక
తలపై పెట్టుకొనగ వలెనె?
ఓట్లు గొనియు గెలుపొందెడి
అర్హత కోల్పోలేదా?

మన కష్టము బాపునట్టి,
మనకాసరనిచ్చునట్టి,
మనను ప్రేమ జూచునట్టి
పార్టీనే గెలిపింపుడు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, మార్చి 08, 2014

న్యాయమేవ జయతే!


అక్రమముగ తెలంగాణ
నోరునొక్కి, లాబీలతొ
పొత్తుగూడి, అరువదేండ్లు
పాలించియు దోచుకొనిరి!

వేరురాష్ట్రమేర్పడుటయె
న్యాయమనుచు కేంద్రమ్మే
రాష్ట్రమిడగ, సీమాంధ్రులు
న్యాయస్థానముకెక్కిరి!

న్యాయమ్మే తెలంగాణ
పక్షమ్మున నుండగాను,
అన్యాయము చేయుకొరకు
కోర్టుకెక్క, కోర్టు తన్నె!

అభియోగములేవియున్న
కేంద్రము వివరింపవలెను!
వివరణ పరిశీలించియు
విచారణము చేయుదుమనె!!

కేంద్ర వివరణమ్ము పిదప,
అవసరమని భావించుచొ,
రాజ్యాంగ ధర్మాసనముకు
బదిలీ చేయుదు మనియెను!

సీమాంధ్రులు ఎన్ని నాట
కములాడిన, స్టే కోరిన,
సరకు గొనక, స్టేను ఇడక,
తేదిలేని వాయిదిడెను!

న్యాయబద్ధమైన తెలం
గాణ రాష్ట్రమును ఎవ్వరు
ఆపలేరు, ఆపలేరు!
కుట్రలన్ని కూలిపోవు!!

ఆఖరి బాల్, బ్రహ్మాస్త్రము,
కొత్తపార్టి పిచ్చికూత,
తెలంగాణ రాష్ట్రమ్మును
ఆపలేవు, ఆపలేవు!

న్యాయమ్మీ తెలంగాణ,
ధర్మమ్మీ తెలంగాణ,
సత్యమ్మీ తెలంగాణ!
తెలంగాణ విజయమిదే!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, మార్చి 07, 2014

హనుమంతునికి తన బలం తెలియదు...


తెలగాణను స్వర్ణ తెలం
గాణముగా మార్చుకొరకు,
తెలగాణకు స్వీయబలము
టీఆరెస్సేనయ్యా!

తెలగాణకు వలసినట్టి
వనరులనార్థికబలముల,
కేంద్రముచే ఇప్పించెడి
పూర్తిబలము టీఆరెసె!

టీఆరెస్ స్వంతముగా
ఎన్నికలలొ అన్ని సీట్లు
గెలుపొందినచో తెలగా
ణకు ప్రయోజనమ్ము కలుగు!

పొత్తులవసరము లేదయ!
పొత్తున్నచొ బలము తగ్గు!
స్వంతముగా గెలుపొందెడి
శక్తియు టీఆరెస్‍కున్నది!!

హనుమంతునికున్న బలము
హనుమంతునికే తెలియదు!
టీఆరెస్‍కున్న బలము
టీఆరెస్‍కే తెలియదు!!

తెలగాణుల బానిసత్వ
మును బాపిన పార్టీగా,
టీఆరెస్‍పై ప్రజలిట
కృతజ్ఞులుగ నుండిరయ్య!

టీఆరెస్ లేకున్నచొ
తెలగాణము సాధ్యమౌనె?
కావున టీఆరెస్సును
తప్పక గెలిపింతుమయ్య!!

స్వీయ రాజకీయ శక్తి
తెలగాణముకుండవలెను!
ఆ శక్తియె టీఆరెస్!
దాని బలము ప్రజలేనయ!!

పొత్తులేవి లేకుండా,
స్వీయముగా పోటిచేయ,
అన్ని చోట్ల గెలిపింతుము!
తె.రా.స.నే వెలిగింతుము!!

సీట్లన్నియు గెలుచుకొనియు
తిరుగులేని శక్తి పొంది,
బంగరు తెలగాణమ్మును
టీఆరెస్ నిర్మించును!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, మార్చి 06, 2014

ఇప్పుడు న్యాయంజరుగుతుందని నమ్మవచ్చా?!


ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విభజనమున పంపకాలు
సక్రమముగ జరుగవనియు
అనుమానము కలుగుచుండె!

సచివాలయమందు ఉండ్రి
అధికారులు సీమాంధ్రులు
ఎనభై ఆరు శాతమ్ము!
తెలగాణులు పద్నాలుగు!!

విభజనమ్మునకు వ్యతిరే
కమ్ముగ పనిచేస్రి వారు!
వారలు రూపొందించిన
పట్టికలవి నమ్మదగునె?!

తెలగాణకు అన్యాయము
జరిపెను సీమాంధ్రప్రభుత!
సచివాలయ అధికారుల
శాతమందు మోసమాయె!!

అరువది సీమాంధ్రులకును
నలువది తెలగాణకు సరి!
అట్లుగాక, ఎనుబదారు,
పదునాలుగు న్యాయమౌనె?

ఇట్టి భేదముండె గాన,
తెలంగాణ ప్రాతినిధ్య
ముండు కొరకు ప్రతినిధులను
క్రాస్ చెకింగు కనుమతినిడి,

గవర్నరును, సెక్రెటరియు
తెలగాణకు అన్యాయము
జరుగకుండగాను పూని
న్యాయము జరిపింపవలెను!

అట్లుగానిచో తెలగా
ణకు నష్టము కలుగునయ్య!
పక్షపాత వైఖరితో
అన్యాయము చేతురయ్య!!

సచివాలయ అధికారులు
సీమాంధ్రకు తెలగాణులు
తగు నిష్పత్తిగ లేమికి
కారణమే ద్రోహచింత!

సీమాంధ్రుల పక్షపాత
మున కిదియే నిదర్శనము!
పక్షపాతమును ద్రుంచియు,
న్యాయము స్థాపింపవలెను!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, మార్చి 05, 2014

కాంగ్రెస్ పన్నాగం బెడిసికొట్టినట్టే...!


తెలగాణను ఇచ్చితిమని
తెలంగాణలో చెప్పియు
ప్రచారమ్ము చేసి వోట్లు
సీట్లు పొందు పన్నాగం!

సీమాంధ్రకు న్యాయమనుచు
పాటపాడి, తెలగాణకు
మొట్టికాయ వేసి, ఆంధ్ర
వోట్లు పొందు పన్నాగం!

ఈ పన్నాగములన్ని నేడు
బెడిసికొట్టినాయయ్యా!
నక్క జిత్తు కాంగ్రెసునకు
మొట్టికాయ ఖాయమయ్య!!

సీమాంధ్రలొ కొత్తపార్టి
లిపుడు కొన్ని పుట్ట, వోట్లు
చీలిపోయి, కుక్కచింపు
విస్తరివలె అగునయ్యా!

ఏ పార్టికి మెజారిటీ
రాదు రాదు రాదయ్యా!
కాంగ్రెస్సుకు సీమాంధ్రలొ
వోట్లు సీట్లు దక్కవయ్య!!

సీమాంధ్రను నమ్మి, ముంచె
తెలగాణను కాంగ్రెసిట్లు!
సీమాంధ్రులు కాంగ్రెస్సును
ముంచుటయే ఖాయమయ్య!!

తెలగాణను అరువదేండ్లు
ముప్పతిప్పలను బెట్టియు,
చివరి నిమిషమందు గూడ
కాంగ్రెస్సే నష్టపరిచె!

ఇన్నియు అగచాట్లు పడిన
తెలగాణులు కోరి కోరి
కాంగ్రెస్సును గెలిపింతురె?
సోనియమ్మ పిచ్చిగాని!

తెలంగాణ కోరినట్లు
బిల్ సవరణములు చేయుచొ,
దగాపడ్డ తెలగాణకు
న్యాయమ్మును జరిపించుచొ,

కాంగ్రెస్సును కండ్లకద్ది,
ఎదలో పదిలమ్ము చేసి,
వోట్లు వేసి, సీట్లనిచ్చి,
గౌరవమ్ము నిడకుందురె?

తెలగాణుల కష్టమ్ములు
తన కష్టముగా నెంచియు,
ఓదార్చియు, వెన్నుతట్టి,
బలమిచ్చెను టీఆరెస్!

శ్రామికులను, కార్మికులను,
విద్యార్థుల, ఉద్యోగుల,
విద్యాధికులందరినొక
త్రాటిపైన నడిపించెను!

కొన ఊపిరితో నుండిన
తెలంగాణ ఆశయమును
బ్రతికించియు, చేతనమిడి,
రాష్ట్ర హోద సాధించెను!

ఉద్యమములు నిర్వహించి,
దీక్షలెన్నొ చేపట్టియు,
సమ్మెలు, ధూం ధాం లెన్నియొ
ముందుండియు నడిపించెను!

అరెస్టులను లెక్కనిడక,
లాఠీఛార్జీలు మరియు
టియరు గ్యాసు, వాటర్‍క్యాన్
బాధలన్ని సహియించెను!

పార్లమెంటులోన తెలం
గాణ కోర్కి వినిపింపగ,
వివిధ పార్టి నాయకులను
సన్నద్ధము గావించెను!

తెలంగాణ సాధనకై
ఎక్కే గడప, దిగే గడప,
పలువురితో మంతనాలు
భేషుగ్గా సాగించెను!

తెలంగాణ సాధనకై
యిన్నిచేసినట్టి యిట్టి
తె.రా.స.నే మరచిపోయి,
కాంగ్రెస్సును గెలిపింతుమె?

టీఆరెస్ లేక తెలం
గాణ రాష్ట్ర మేర్పడెనే?
టీఆరెస్ లేక తెలం
గాణ స్వర్ణమయ్యెడినే??

మనకు అండగా నిలిచియు,
బంగరు తెలగాణ నిడియు,
మన బతుకులు పండించెడి
టీఆరెస్ గెలుపు నిజము!

ప్రలోభాలు దూరముంచి,
కులమతాలు ప్రక్కనుంచి,
టీఆరెస్‍కే విజయము
అందింపగ పూనుకొనుడు!

మన కోసం నిరాహార
దీక్ష చేయు కేసీఆర్
క్షణమాలస్యమ్మయినచొ
అమరుడు అగువాడె కదా!

ఇన్ని అనర్థమ్ములకును
మూలము కాంగ్రెస్సె కదా!
మరి ఎట్టుల కాంగ్రెస్సును
తెలంగాణ గెలిపించును?

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, మార్చి 04, 2014

ఇదీ మీ నిర్వాకం...!


రెండువేలనాలుగులో
తెలంగాణ ఇచ్చెదమని
నమ్మించియు ఓట్లు గొనియు
ఐదేండ్లుగ మోసగించ్రి!

రెండువేలతొమ్మిదిలో
తెలంగాణ రాష్ట్రమ్మును
ఇచ్చునదియు, తెచ్చునదియు
కాంగ్రెస్సే అని అనిరయ!

కేసీయార్ నిరాహార
దీక్షబూనగాను వేగ
తెలంగాణ నిత్తు మంచు
పలికియు, మాటను తప్పిరి!

ఆంక్షలేవి లేకుండా
తెలంగాణమిచ్చినచో
టీఆరెస్ విలీనమును
చేతుమనెను టిఆరెస్!

టీఆరెస్ వాగ్దానము
పెడచెవినిం బెట్టినారు!
ఆలస్యము చేసినారు,
నిర్లక్ష్యము చేసినారు!!

ఆలస్యము ఐనకొలది
ప్రజలలోన భయాందోళ
నమ్ములు వ్యాపింపంగను
ఆత్మహత్యలే జరిగెను!

వేయిమంది బలిదానము
చేసిన గని కేంద్రమునకు
సుంతయినను జాలి, కరుణ
కలుగలేదు, కఠినాత్ములు!

విద్యార్థులు, ఉద్యోగులు,
ప్రజాసంఘ ప్రభృతు లపుడు
ఉద్యమమ్మునందు దూకి,
సకల జనుల సమ్మె చేస్రి!

కాంగ్రెస్సిది లెక్కగొనక,
ఉద్యమమును అణగద్రొక్క,
పోలీసులనుసిగొల్పెను,
కేసులెన్నొ పెట్టించెను!

లాఠీ ఛార్జీలు మరియు
బాష్పవాయుప్రయోగములు,
రబ్బర్ బుల్లెట్లు ప్రయో
గించి, అణచ జూచినారు!

ఏ ప్రయోగములు చేసిన,
ఎన్ని కేసులను పెట్టిన
తెలంగాణ ప్రజ లెవ్వరు
ఉద్యమమును మానకుండ్రి!

కమిటీ లెన్నో వేసియు,
సూచనలెన్నొ పొందియు,
ఎంత కాలము గడిపియు
తెలంగాణ నీయరైరి!

ఇన్ని చేసినను కానని
కేంద్రమిపుడు కదలివచ్చె!
రకరకాల సర్వే ఫలి
తాలను గని కదలివచ్చె!!

ఎన్నికలే సమీపించ,
లబ్ధిపొందగాను దలచి,
తెలంగాణ రాష్ట్రమిచ్చు
మిషతో ఎర వేసిరయ్య!

తెలంగాణమును ఇచ్చుట
ప్రేమతోడ కాదు...కాదు,
జాలికూడ కాదు...కాదు,
మానవత్వముతో కాదు!

వోట్లకొరకు, సీట్లకొరకు
అధికారము పొందుకొరకు!
ఏదైతేనేమి మనకు
తెలంగాణ మిచ్చినారు!

ఎట్టి తెలంగాణ మిడిరి?
డొల్ల తెలంగాణ మిడిరి!
సీమాంధ్రకు న్యాయ మిడిరి,
తెలగాణకు ద్రోహ మిడిరి!!

టీఆరెస్ విలీనమును
జరుపనట్టి కోపముతో,
తెలంగాణపై కక్షను
బూని, ద్రోహమును చేసిరి!

తెలంగాణ నెప్పుడిత్తు
మని చెప్పిరొ, దాని దాటి,
అసమగ్రపు తెలగాణను
పదియేండ్లకు నిప్పుడిడిరి!

వేయిమంది బలిదానము
జరిగిన పిదపను నిచ్చిరి!
ఆంక్షలు వలదంటున్నా,
ఆంక్షలతోడనె యిచ్చిరి!!

తెలగాణులకును మిఠాయి
పొట్లమిడిరి ఖాళీగా!
మిఠాయిలను సీమాంధ్రకు
ఇడిరి మరీ భద్రంగా!!

ఇంతగొప్ప కాంగ్రెస్సును
ఎట్టుల గెలిపింతుమయ్య?
వేయి ఉసురులను దీసిన
కాంగ్రెసెట్లు గెలుచునయ్య??

బీజేపీ, టీడీపీ
వైయెస్సార్‍సీపిలట్లె
రాజకీయ లబ్ధికొరకు
వలవేసిరి, ప్రేమ గాదు!


తెలగాణకు అండయైన,
తెలగాణకు బాసటైన,
తెలగాణకు రక్షయైన
టీఆరెస్ మన ఊపిరి!

తెలంగాణ రాష్ట్రమ్మును
బంగరు తెలగాణగాను
మార్చబూను కేసియార్‍కు
బాసటగా నిలువుమయ్య!!

తెలంగాణ అస్తిత్వం
కాపాడగ బూనినట్టి
కేసీయార్ ఆశయమ్ము
వర్ధిల్లగ ప్రతిన గొనుము!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



ఇందుకే విలీనం చేయటంలేదు!


ఆంక్షలేమి లేనియట్టి
తెలగాణను ఇచ్చినచో
టీఆరెస్ విలీనమును
చేతుమనియె చెప్పిరయ్య!

ఆంక్షలతోడను ఇచ్చెడి
తెలగాణను కోరితిమా?
ఎంతటి ఆలస్యమ్మును
చేసినారొ యోచింపుడు!

బిల్ ఆలస్యము చేయగ
వేయిమంది బలిదానము
జరిగెను, నష్టమె తెలగా
ణకు కలిగెను  తీర్చగలరె?

బిల్ ఆలస్యము చేయగ
ప్రజలలోన భయాందోళ
నమ్ములు వ్యాపింపంగను
ఆత్మహత్యలే జరిగెను!

టీఆరెస్ సూచించిన
సవరణములు బిల్లులోన
చేయకపోవుటవల్లనె
విలీనమ్ము చేయలేదు!

పోలవరము ముంపునకును
గురియయ్యెడునట్టి గ్రామ
ములే కాక ఏడు మండ
లముల గుంజుకున్నారు!

ఉద్యోగుల పంపకమును
స్థానికతను గాక జనా
భాప్రాతిపదికగ చేయ
గాను పూనినారలిపుడు!

సీమాంధ్రను అక్రమముగ
చేపట్టిన ప్రాజెక్టుల
పేర్కొనియును తెలంగాణ
ప్రాజెక్టుల తెలుపలేదు!

ప్రాణహిత చేవెళ్ళను
జాతీయపు ప్రాజెక్టుగ
చేయమనగ వినకుండా
పెడచెవినిం బెట్టినారు!

సీమాంధ్రకు ఐదేండ్లకు
ప్రత్యేకపు ప్రతిపత్తిని
యిడియు, వెనుకబడినయట్టి
తెలగాణకు ఈయరేల?

సీమాంధ్రులు ప్రజలుగాని,
తెలగాణులు కారాయేం?
తెలగాణకు న్యాయమ్మును
జరిపింపక విడుచుటేల?

ఇన్ని కారణముల చేత
తెలగాణులు కాంగ్రెస్సును
ముందు ముందు గెలిపించుట
దుర్లభమ్ము, దుర్లభమ్ము!!

కేంద్రమునకు తెలగాణము
కనిపించక పోవుటయే
కాంగ్రెసునకు వినాశకము!
గెలువదయ్య, గెలువదయ్య!!

వోట్లకొరకె ఈ కాంగ్రెస్
ఇట్టి పనికి పూని మనకు
అన్యాయము చేసినదయ!
మనమెట్టుల సహియింతుము?

మనమంతా కలిసికట్టు
గాను కూడియుండి యిట్టి
కాంగ్రెసునకు బుద్ధిచెప్ప
వలెనయ్యా తప్పకుండ!

మన పక్షము టీఆరెస్
ఉన్నదయ్య భయమెందుకు?
తెలంగాణలోన అన్ని
చోటులందు గెలుపు మనదె!

ఒక్క సీటు కూడ ఇతర
పార్టీలకు దక్కరాదు!
మన శక్తిని, మన యుక్తిని
పెంచుకొనగవలెనయ్యా!

మనకన్యాయము చేసిన
కాంగ్రెసునకు ఈ రీతిగ
బుద్ధిచెప్పగాను ముందు
ముందు దారికిని వచ్చును!

మనమంతా సంఘటితము
అగుటచేతనే దీనిని
సాధించుట జరుగునయ్య!
మునుముందుకు రారండయ!!

ఐకమత్యమే మహా బ
లమను విషయమును స్మరించి,
అందరు ఒక్కటిగానై
సాధించగ రారండయ!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, మార్చి 03, 2014

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు!


సమైక్యాంధ్రనినదంతో
తెలంగాణ నణచివేసి,
పబ్బంగడుపుకొనంగను
యుక్తిపన్నె నల్లారియె!

తెలంగాణ నాపగాను
సాధ్యంకాదని తెలిసియు,
సమైక్యాంధ్ర నినదంతో
చెవినిపువ్వు బెట్టెనతడు!

పైకి చెప్పునదియొక్కటి,
లోన చేయునది యొక్కటి!
సమైక్యాంధ్రముసుగులోన
దోపిడి కొనసాగించెను!!

దీపముండగానె యిల్లు
చక్కబెట్టుకొనురీతిని,
పదవియుండగానె జేబు
నింపుకొనంగనుజొచ్చెను!

రాజినామ చేయకమును
ఫైళ్ళపైన సంతకములు
అదేపనిగ చేసి డబ్బు
సంచులెన్నొ నింపుకొనెను!

కిరణుహయామున బయటికి
వచ్చిన జీవోల పైన
దర్యాప్తును జేయవలయు,
అవినీతిని తేల్చవలయు!

ఎన్ని ఫైళ్ళపైన సంత
కములు చేసినాడొ అన్ని
చట్టబద్ధములు అగునో,
కావో మరి తేల్చవలయు!

సంతకములు కాని ఫైళ్ళు
తెలగాణకు చెందెననియు
ప్రక్కననిడి, సీమాంధ్రకె
మేలు చేయు కతమేమయ?

విచారణము సమగ్రముగ
జరిపించియు సీబీఐ
ముందునకడుగేయవలయు,
అవినీతిని ద్రుంచవలయు!

దొరుకనంత వరకు దొంగ
దొరగ చలామణియైనను,
విచారించి, దొరుకబట్టి,
దొంగను శిక్షింపవలయు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, మార్చి 02, 2014

పచ్చి మోసం...!!


తెలగాణకు సీమాంధ్రులు
మరో దగా చేసిరయా!
రాష్ట్రమ్మేర్పడనుండగ
పచ్చిమోసమును జేసిరి!!

నాల్గు రాష్ట్రములలోపల
ఏర్పరచగ దలచినట్టి
నేషనలిన్స్టిట్యూటాఫ్
డిజైన్ ఒకటి కొల్లగొనిరి!

కేంద్ర క్యాబినెట్ లోపల
సీమాంధ్రకు జెందినట్టి
మంత్రులు కుట్రలను పన్ని
ఎన్‍ఐడిని కొల్లగొనిరి!

ప్రధాని సాక్షిగ వారలు
తెలంగాణకును ప్రతిపా
దించినదానిని ఆంధ్రకు
తరలింపగ సమకట్టిరి!

అస్సామున జోర్హాట్‍లో,
ఎం.పి.లోని భోపాల్ లో,
హర్యానను కురుక్షేత్ర,
ఏ.పీ.లో హైద్రబాదు!

నాలుగు ప్రాంతములందున
భారీప్రాజెక్ట్సేర్పా
టును జేయగ బూనినతరి
యిట్టి మోసమును జేసిరి!

హైదరబాదున పెట్టెడి
ప్రాజెక్టును విజయవాడ
తరలిస్తూ నిర్ణయింప
బరితెగించినారు వారు!

టీకాంగ్ నేతలు చూచియు
నోరుమెదపకుండుటేమి?
బిల్లు సవరణములు లేవు,
భారీ ప్రాజెక్ట్సులేవు!

సీమాంధ్రా కేంద్రమంత్రి
బృందమిట్లు చేయగాను
వ్యతిరేకింపకయుండిన
టీ నేతల నేమనవలె?

క్షమియింపరు, క్షమియింపరు,
తెలగాణులు క్షమియింపరు!
ఈ ద్రోహము క్షమియింపరు!
కాంగ్రెస్సును క్షమియింపరు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


శనివారం, మార్చి 01, 2014

అసందర్భప్రలాపాలు!


"బిడ్డ పుట్టె, తల్లి చచ్చె"
అనుమాటకు అర్థమేమి?
సీమాంధ్రయు, తెలంగాణయు
తల్లీబిడ్డలు ఔదురె?

ఈ "ఆంధ్రప్రదేశ"మను
రాష్ట్రమ్మేర్పడక మునుపె
తెలంగాణమున్నదయా!
మరల పుట్టుటెట్లు జరుగు?

తల్లియె సీమాంధ్రమెట్టు
లగునో తెలుపంగవలయు!
సందిగ్ధపు మాటలున్న
విమర్శలను మానవలయు!!

సీమాంధ్రను చంపి మేము
తెలగాణను కోరితిమా?
సోదర రాష్ట్రాల్ రెండిక
కావలెనని కోరలేదె?

సీమాంధ్రులు, తెలగాణులు
సోదరులే అగుదురయ్య!
తల్లి బిడ్డలనుట తప్పు!
అవగాహన లేని మాట!!

అసందర్భ ప్రలాపాలు
ప్రజనాకర్షించుకొరకె!
ఓట్లు సీట్లు పొందుకొరకె!
అధికారమునందుకొరకె!!

సీమాంధ్రకు న్యాయమ్మును
అడిగినట్టివారలకును,
తెలగాణకు న్యాయమ్మును
చేయాలని తోచలేదె?

నీళ్ళలోన, నిధులలోన,
కొలువులందు, చదువులందు
గతంలోన అన్యాయమె,
మరల ఇపుడు అన్యాయమె!

న్యాయమేమిచేసిరయ్య
తెలగాణకు మీరలిపుడు?
పక్షపాతమును జూపెడు
మాటలు మాట్లాడుటేల?

మీతోడుగ వెంకయ్యను
చేర్చుకొనిన కారణాన,
మొగమోటముతోడ మమ్ము
బాధించుట యేలనయ్య?

న్యాయాన్యాయాల్ తెలియక,
వదరుటయే మీ పనియా?
తెలంగాణ మిమ్మెట్టులు
ఎన్నుకొనును నేతగాను?

అసందర్భప్రలాపాలు
మానుమయ్య నీ విప్పుడు!
తెలగాణకు వికటించిన
న్యాయముకై పూనుమిపుడు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!