తెలంగాణ
ప్రజలకు రచయితలకు కవి పండితులకు
దసరా పండుగ శుభాకాంక్షలు!!
చండి!
భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి!
వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ!
వరదాయి! శుభప్రద! భద్రకాళి! పా
షండ
శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)
నేతల
నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము
గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ
జేసియున్;
చేతము చల్లనౌ
నటుల శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
యాతన డుల్చి, ప్రీతిఁ
గనుమమ్మ! దయామయి! సింహవాహనా! (2)
నిరతము నిన్ను
గొల్చెదము; నిక్కము!
నమ్ముము! మా మనోరథ
స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి దీక్షలు సేసి, తపించి పోవ, మా
చిరమగు వాంఛఁ
దీరిచి, విశేష
తమాంచిత హేమ రాష్ట్రమున్
కర మనురాగ
యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (3)
ఆత్రముతోడ
వేచితిమి, హర్ష
సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్క నొనర్చియు, వారలన్
సుహృ
న్మిత్రులుగాను
మార్చి, కరుణించియు, మమ్మిఁక
వేగిరమ్మె స
ద్గాత్రులఁ
జేసి, స్వర్ణ
తెలగాణము నీఁగదె సింహవాహనా! (4)
ప్రజలను నిత్య సత్య యుత వర్తన శీ
లురఁ జేసి, వారలన్
గుజనులు కాక యుంటకయి కూర్మినిఁ బంచి,
మహోత్తమాశయాం
బుజ ఘన శోభి తాత్మ నిడి, ప్రోచి,
ప్రశస్త సువృత్తతోన్మహా
యజనముఁ జేయు శక్తి సదయన్నిడు మో శివ!
సింహవాహనా! (5)
-:శుభం భూయాత్:-
1 కామెంట్:
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా విశిష్ట అతిథి
విశిష్ట అతిథి.. ప్రత్యేక అతిథి.. అంటూ సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు సంబోధించిన ఆ వ్యక్తి మరోవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.Read more
కామెంట్‌ను పోస్ట్ చేయండి