గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 14, 2015

ఏపీఎస్‍ఎఫ్‍సీ విభజన ప్రకటనలో... ఆంధ్రా డైరెక్టర్ల కుట్రలు...!ఏపీఎస్‍ఎఫ్‍సీలో
ఉద్యోగుల విభజనమ్ము
ఆంధ్రాప్రాంతమునకె లాభము
కలిగించేలా ఉన్నది!


తెలగాణకు అన్యాయము
జరుగునట్లు విభజనమ్ము
చేయుదురని  తెలుపుచుండ్రి
తెలంగాణ ఉద్యోగులు!


ఐక్యకార్యాచరణ స
మితి ప్రకటన పూర్తిగాను
అవాస్తవ సహితమనుచు
తెలుపుచుండ్రి ఉద్యోగులు!


బోర్డువారి మీటింగ్‍లో
విజయవాడ, గుంటూర్లలొ
భవనపు నిర్మాణములకు
ఇరవై కోట్లను కేటా
యించుటయే నిజము కాదె?


ఈ పాలక వర్గమందు
బోర్డాఫ్ డైరెక్టరులుగ
తెలగాణులు సమపాళ్ళలొ
లేకుండుట నిజము కాదె?


తెలంగాణ ప్రాతినిధ్య
మే లేకుండగ విభజన
ప్రణాళికల ఆమోదం
పొందుటయే నిజము కాదె?


న్యాయమ్మింతయు లేకయె
అక్రమముగ నిర్ణయములు
ప్రతిపాదనలను చేయుట
మీ యిష్టమ? మీ రాజ్యమ??


చట్టప్రకారమ్ముగాను
తెలంగాణ ఉద్యోగుల
తెలంగాణ వాటాలను
సక్రమముగ విభజనమ్ము
చేయవలెను! చేయవలెను!!


జాయింట్ డైరెక్టర్ టూర్‍లో
ఉండగానె బోర్డ్ మీటింగ్
ఏర్పాటును చేయుటేల?
తప్పుచేయు కొఱకె కదా!!


ఇకనైనా కుటిల బుద్ధి
ప్రదర్శించుటను మానియు
చట్ట ప్రకారమ్ముగాను
వర్తించుడు! వర్తించుడు!!జై తెలంగాణ!    జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి