గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 08, 2015

బాబు బుక్కయ్యాడు...!!!

-ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఏపీ సీఎం ముడుపుల ఫోన్ కాల్
-బాబే బాస్ అని ఏసీబీ నిర్ధారణ!
-స్టీఫెన్‌సన్ కాల్‌డేటాలో ఏపీ సీఎం బేరసారాలు
-కొనుగోళ్ల బాస్ చంద్రబాబేనని రేవంత్ వెల్లడి
-ఏసీబీ అధికారుల వద్ద 20 మంది కాల్‌డేటా
-లోకేష్, ఇద్దరు ఎంపీలు, ఓ కేంద్రమంత్రి పాత్ర
-చీకటి నిధుల మూలాల ఆచూకీ లభ్యం
-చంద్రబాబుకు నోటీసు జారీకి రంగం సిద్ధం
-గవర్నర్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ
-పచ్చ కుట్రకు సీమాంధ్ర మీడియా తాళం
-బాబు ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలు
-ఉమ్మడి రాజధానంటూ ఆంధ్రజ్యోతి సొల్లు పురాణం
-రాష్ట్రం మీద ఈగ వాలినా సహించబోమని తెలంగాణవాదుల హెచ్చరిక


బాస్ ఎవరో స్పష్టంగా తేలిపోయింది. పచ్చదొంగల గుట్టు బయటపడింది. ఏసీబీ చక్రబంధంలో రేవంత్ చేతులెత్తేశాడు. కొనుగోళ్ల బాస్ చంద్రబాబేనని కుండబద్దలు కొట్టాడు. మరోవైపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణలు బయటపడ్డాయి. 

మాయోపాయాలు, కుయుక్తులు, అడ్డదారులు, మీడియా మాఫియా అండతో సాగించిన నాటకాలకు తెరపడింది. ఎన్టీఆర్‌ను గద్దె దింపడం దగ్గరనుంచి దొంగ ఉద్యమాలతో తెలంగాణ ఆపడంకోసం జరిపిన యత్నాల దాకా అనేక కుట్రలు సాగించిన చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయాడు. పీకలదాకా కూరుకుపోయాడు. నిప్పులాగా బతికానని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు.. ఐదుకోట్ల ఆఫర్‌తో తనముఫ్ఫై ఏండ్ల రాజకీయానికి తానే నిప్పు పెట్టుకున్నాడు.


acb


ఓటుకు నోటు కుట్ర కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ చేతికి తిరుగులేని సాక్ష్యాధారాలు లభించాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కొనుగోలుకు తనను పురమాయించిన బాస్ చంద్రబాబేనని రేవంత్‌రెడ్డి ఆదివారం రెండోరోజు జరిగిన విచారణలో ఏసీబీముందు అంగీకరించారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు సైతం దీన్ని ధ్రువపరిచే వాంగ్మూలాలు ఇవ్వగా వీటితో పాటు సాక్షాత్తూ చంద్రబాబే నేరుగా స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల తాలూకు కాల్‌డేటా కూడా ఏసీబీకి చిక్కింది. 

అధికారుల విచారణలో ఈ కేసులో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు లోకేష్, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. చంద్రబాబు ఆదేశంతో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ ఒకరు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డబ్బులు సమకూర్చారని ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సమీపంలోని బ్యాంకులనుంచి ఈ డబ్బులు డ్రా చేసినట్టు ఏసీబీకి ప్రాథమిక ఆధారాలు లభ్యమైనాయి. పలు ఆధారాలు సమకూర్చుకున్న నేపథ్యంలో లాంఛనాలు పూర్తి చేసి చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రా త్రి తెలంగాణ అవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమం అ నంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో అరగంటపాటు సమావేశమయ్యారు.


acb1



బాస్ చంద్రబాబేనని అంగీకరించిన రేవంత్


ఈ కేసులో ఆదివారం రెండోరోజు రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ కీలక సమాచారం రాబట్టింది. మొదటినుంచి ఇదంతా తన వ్యక్తిగతం అంటూ వాదిస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డికి ఏసీబీ అధికారులు మైండ్‌బ్లాక్ అయ్యే అంశాలను చూపించారని తెలిసింది. స్టీఫెన్‌సన్‌తో 28వ తేదీన జరిగిన సంభాషణలో బాస్ అని , బాబు అని ప్రస్తావించిన రేవంత్ 31వ తేదీన డబ్బు చెల్లింపు రోజున మాత్రం పదే పదే చంద్రబాబు పూర్తి పేరును పలికినట్టు ఉన్న వీడియో ఫుటేజ్ చూపించినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనీసం 72సార్లు చంద్రబాబు అనే పేరును రేవంత్ పక్కాగా ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల ప్రకారం రికార్డు చేసిన వీడియో, ఆడియో ఫుటేజ్‌లను ఫోరెన్సిక్ విభాగానికి పంపగా వారి విశ్లేషణలో ఆ వాయిస్ రేవంత్‌రెడ్డిదేనని స్పష్టమైంది.


ఈ ఫుటేజ్ చూసిన అనంతరం పదే పదే మా బాస్ అంటూ ప్రస్తావించింది చంద్రబాబునేనని, ఈ కుట్రకు సూత్రధారి కూడా చంద్రబాబేనని రేవంత్ అంగీకరించినట్టు తెలిసింది. వాస్తవానికి బాస్ అంటే ఎవరన్నది సర్వత్రా తెలిసినా, ఇపుడు నిందితుడి వాంగ్మూలం ద్వారా దాన్ని రుజువు చేసినట్టు అయింది. రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో సైతం బాస్ కుట్ర వెల్లడైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.


స్టీఫెన్‌సన్‌తో బాబు సంభాషణల కాల్‌డేటా..


ఇదిలాఉంటే ఈ కేసులో మరో కీలక ఆధారం స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియోనుకూడా ఏసీబీ సంపాదించింది. చంద్రబాబు స్టీపెన్‌తో ఏమేమి మాట్లాడారో పూర్తి వివరాలు ఉన్నాయి. దీనితో ఓటుకు నోటు కుట్రలో బాస్ అలియాస్ చంద్రబాబు పాత్రను పూర్తిగా ఏసీబీ ధ్రువపరిచినట్టేనని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ కుట్ర జరుగుతున్న తరుణంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మిగిలిన ఇద్దరిని ఏసీబీ విచారించింది.


రేవంత్ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినప్పుడు చెప్పిన బాస్ వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడిన విషయాలను వారు ఏసీబీకి వివరించినట్టుతెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కూడా చంద్రబాబు తనతో మాట్లాడారని ఏసీబీ దర్యాప్తు బృందాలకు స్పష్టంగా వివరించారు. స్టీఫెన్‌తోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేసేందుకు యత్నించారని కూడా ఏసీబీ పక్కాగా ఆధారాలు సంపాదించింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వారి వాంగ్మూలాలను సైతం ఏసీబీ రికార్డు చేసిందని తెలిసింది.


బాబుకు బిగిసిన ఉచ్చు...


ఈ కేసులో బాబు పాత్రపై దాదాపు నాలుగు రకాల కీలక ఆధారాలను సంపాదించిన ఏసీబీ ఇప్పుడు బాస్ అలియాస్ బాబుపైనే దృష్టి సారించనుంది. ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు ఏసీబీ అధికారులు న్యాయనిపుణుల సలహాలను స్వీకరిస్తున్నారు. చంద్రబాబుకు సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆయనను విచారించే విషయంపై గవర్నర్ దృష్టికి తీసుకురానున్నట్టు తెలిసింది.


కాల్‌డేటాతో గుట్టురట్టు...


రేవంత్‌రెడ్డితో పాటు ఏసీబీ అధికారులకు దొరికిన సెబాస్టియన్, ఉదయసింహల ఫ్లోన్లను సీజ్ చేసిన అధికారులు వాటి కాల్‌డేటాను పరిశీలించినపుడే ఏపీ సీఎం చంద్రబాబు పాత్రమీద ఆధారాలు దొరికాయి. ఎమ్మెల్యే స్టీపెన్‌సన్ తనను కొనుగోలు చేయడానికి టీడీపీ నేతలు బేరాలుచేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి ముందు మూడు, నాలుగురోజులు ఆ తరువాత వారం పదిరోజుల కాల్‌డేటాను కోర్టు ఆదేశాల మేరకు విచారణాధికారులు తీసుకొని అసాంతం పరిశీలించారు.


ఇందులోనే ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఆధారాలు విచారణ అధికారులకు లభించాయి. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు బయటకు తీసిన కాల్‌డాటాలో 50 నుంచి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉంది. నోట్లతో ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేయాలనే కుట్ర పూరిత వ్యవహారంలో 15 నుంచి 20 మంది పాల్గొన్నారని అధికారులు అంచనాకు వచ్చారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు- సెబాస్టియన్‌ల మధ్య జరిగిన సంభాషణల్లో చాలా ఆధారాలు దొరికాయని పోలీస్ వర్గాల భోగట్టా. అవినీతి నిరోధక అధికారుల విచారణలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది.


రేవంత్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలించిన అధికారులకు ఆయన బ్లాక్ మెయిల్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ దందాలకు సంబంధించి ఆధారాలు లభించాయి. అధికారులు ఎవ్వరి ఫోన్లు ట్యాప్ చేయరని, ఒక వేళ ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఎమ్మెల్ల్యే స్టీపెన్‌సన్ ఫిర్యాదు ఇచ్చిన తరువాతనే నిఘా పెట్టినట్లు అధికారులు చెపుతున్నారు.


తాను తీసుకున్న గోతిలోనే...


తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని భావించి స్కెచ్ వేసిన చంద్రబాబు చివరకు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నిన చంద్రబాబునాయుడు నీతిమాలిన చర్యలకు పాల్పడి అడ్డంగా ఇరుక్కున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలు చేయాలనే ఆలోచనే తప్పని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే చంద్రబాబు తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొంటానంటే ఊరుకుంటారా? తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ఎమెల్యేలను కొంటానంటే ఆక్కడ ఊరుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.


వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడానికి కావలిసిన సంఖ్యాబలం కూడా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఎంఐఎం మద్దతుతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం 83కు చేరింది. టీడీపీ బలం కేవలం 11 మంది ఎమ్మెల్యేలే. బీజేపీ సభ్యుల మద్దతుతో 16కు చేరింది. అభ్యర్థి గెలువడానికి 17 మంది సభ్యులు అవసరం కాగా టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని నిలబెట్టిన తరుణంలో టీడీపీ గెలిచే అవకాశం లేదు. టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థి గెలువడానికి ఇద్దరు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ కాగా వైసీపీ మద్దతు తెలిపింది. దీంతో టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థికి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. అయినా టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడింది.


ఢిల్లీని లాగాలని ప్రయత్నాలు..


డబ్బులిచ్చి దొరికిపోయిన పచ్చగ్యాంగు ఇపుడు కేంద్రాన్ని ఈ వ్యవహారంలోకి లాగాలని యత్నిస్తున్నది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదుకు యత్నించారు. ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలపైన, ప్రభుత్వ పెద్దలపైన ఎలా కేసులు పెడతారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అణు ఒప్పందం సందర్భంగా బీజేపీ ఎంపీలను నోట్లతో కొనుగోలు చేయాలని చూసిన యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టిన బీజేపీ ఇపుడు చంద్రబాబు వ్యవహారాన్ని సమర్థించే అవకాశం లేదని భావిస్తున్నారు.


ఆంధ్రా పత్రికల సొల్లురాతలు...


హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ విచారణ చేసే అధికారం ఏపీ పోలీసులకు కూడా ఉంటుందని ఒక ఆంధ్రా పత్రిక రాస్తున్న రాతలను పలువురు తప్పుపడుతున్నారు. ఢీ అంటే ఢీ అని హెడ్డింగ్‌లు పెడుతూ ఏపీ డీజీపీ రాముడును ఎగదోస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ డీజీపీకి అధికారాలు ఉండవని, ఈ విషయాన్ని గుర్తించకుండా విచారణ చేపడితే ఏపీ డీజీపీ తెలంగాణలో అరెస్టు అవుతారని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ రాజధాని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంతా తెలంగాణ డీజీపీ చేతిలో ఉంటుంది తప్ప ఏపీకి హక్కు ఉండదు. వాళ్లు ఏమైనా ఫిర్యాదు చేయాల్సి వచ్చినా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.


వాస్తవానికి విభజన చట్టంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేండ్లు ఉండాలని ఎక్కడా లేదని, పదేండ్లు దాటకూడదని అని మాత్రమే ఉందన్నారు. పదేండ్లు మించకుండా హైదరాబాద్‌లో ఉండాలని ఉంది కానీ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధాని అని లేదని, ఈ విషయాన్ని కూడా ఆంధ్రా మీడియా గుర్తించాలని అంటున్నారు. డీజీపీ పదవి టెరిటోరియల్ పోస్టని, ఈ పోస్టుకు పరిధి ఉంటుందని వివరిస్తున్నారు. ఏపీ డీజీపీ పరిధి ఆంధ్రాలో ఉంటుంది కానీ తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓటుకు నోటు వ్యవహారంలో భాగంగా ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, రేవంత్ సహా మిగిలిన నిందితులకు సంబంధించిన ఫోన్ల కాల్‌డేటా వివరాలు,


సంభాషణలు సేకరించినపుడు స్టీఫెన్‌సన్, సెబాస్టియన్ డాటా సేకరణలో చంద్రబాబు వ్యవహారం బయటికొచ్చింది. చంద్రబాబు అండ్ కోతో పాటు ఆంధ్రజ్యోతి దీనిని పక్కదారి పట్టించేందుకు ఏపీ సీఎం ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులుగానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్ చేసిన సందర్భాలు లేవని, అవసరం కూడా లేదనేది అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ అంటూ గగ్గోలు పెడితే వ్యవహారం పక్కదారి పట్టొచ్చనే వెకిలి కుట్రకు తెర తీశారు.


అయితే తాము సీజ్ చేసిన ఫోన్ల కాల్‌డేటా తీగను లాగితే. అందులో చంద్రబాబు సంభాషణలు బయటపడ్డాయే తప్ప ప్రత్యేకంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగడం అవాస్తవమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో పీకల దాక ఇరుకున్న టీడీపీ నేత చంద్రబాబు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా చంద్రబాబును, రేవంత్‌ను కాపాడటం కోసం ఆంధ్రజ్యోతి అడ్డగోలు రాతలు రాస్తుందని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది.. తెలంగాణ సర్కారు జోలికి వచ్చినా.. తెలంగాణ ఎమ్మెల్యేలను ముట్టుకున్నా మసైపోతారని తెలంగాణవాదులు అంటున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దీనిని గుర్తించాలంటున్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణపై ఈగ వాలినా ఊరుకోమని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.


రూ. 150 కోైట్లెనా రెడీ..


ఓటుకు నోటు వ్యవహారంలో పచ్చపార్టీ ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయడానికీ రెడీ అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో 23 నుంచి 25 ఓట్లు సంపాదించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వాలని చంద్రబాబు కుట్ర పన్నారు. దీనికోసం ఎమ్మెల్యేలను కొనాలని టీటీడీపీ ఎమ్మెల్యేలను ఉసి గొలిపారు. మీకు ఎమ్మెల్యేలను కొనడం చాతకాదా? అంటూ వారిమీద చంద్రబాబు ఓ దశలో విరుచుకుపడ్డారని కూడా తెలిసింది. మీరు మేధావులా? మీకు కొనడం వస్తే నాకు ఇంత ఇబ్బంది ఎందుకు ఉంటుందంటూ ఓ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేను చంద్రబాబు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది.



ఈ వ్యవహారంలో రూ.150 కోైట్లెనా ఖర్చు పెడతా... ఖర్చుకోసం వెనకాడ వద్దంటూ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏపీకి చెందిన ఒక కేంద్రమంత్రి, రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలను కొనే బాధ్యతలు అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థికి 22 లేదా 23 ఓట్లు రావాలి.. కేసీఆర్ దిమ్మతిరగాలి అని ఆదేశించినట్టు తెలిసింది.


హైదరాబాద్ మీదనే కన్ను..


తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పలుసార్లు తనకు ఏపీ కంటే హైదరాబాద్ ముఖ్యమని ప్రకటించారు. చంద్రబాబు తనను నమ్ముకొని ఇక్కడ భూ దందాలు చేసిన వారిని కాపాడుకోవడానికి, వారి అక్రమాస్తులకు రక్షణ ఉండటానికే హైదరాబాద్‌పై రాజకీయ పెత్తనం కోసం యత్నిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో త్వరలో జరిగే ఎన్నికల్లో దెబ్బతీసే కుట్రలో భాగంగానే ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని బాబు అండ్ కో కుట్ర చేసింది.


హలో.. స్టీఫెన్‌సన్..


-ఏసీబీకి దొరికిన చంద్రబాబు ఫోన్ సంభాషణ ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రమేయం ప్రత్యక్షంగా ఉందనేందుకు బలమైన ఆధారాన్ని ఏసీబీ సంపాదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. ఆ సంభాషణ ఇలా ఉంది..


 
ట్రింగ్.. ట్రింగ్..
స్టీఫెన్‌సన్: హలో..
చంద్రబాబు తరఫు వ్యక్తి: బ్రదర్..
స్టీఫెన్‌సన్: హా సర్...
చంద్రబాబు తరఫు వ్యక్తి: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టూ యూ. స్టే ఆన్ ద లైన్.. 
(బాబుగారు మాట్లాడతారు... లైన్‌లో ఉండండి)
స్టీఫెన్‌సన్: యా థ్యాంక్యూ
చంద్రబాబు: హలో..
స్టీఫెన్‌సన్: సర్, గుడ్ ఈవినింగ్ సర్..
చంద్రబాబు: గుడ్ ఈవినింగ్ బ్రదర్... హౌ ఆర్‌యూ (ఎలా ఉన్నారు?)
స్టీఫెన్‌సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్(నేను బాగున్నాను సార్.. కృతజ్ఞతలు)
చంద్రబాబు: మనవాళ్లు.. బ్రీఫ్‌డ్ మీ..
(మనవాళ్లు నాకంతా చెప్పారు)
స్టీఫెన్‌సన్: ఎస్ సార్..
చంద్రబాబు: ఐయామ్ విత్‌యూ. డోంట్ బాదర్..
(నేను మీకు అండగా ఉంటా. ఆందోళన వద్దు.. నిశ్చింతగా ఉండండి)
స్టీఫెన్‌సన్: రైట్ సర్..
చంద్రబాబు: ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ విత్‌యూ.
వాట్ ఆల్ దె స్పోక్.. వీ విల్ హానర్ 

(అన్నింటికీ మీకు అండగా ఉంటా. మావాళ్లు ఏమైతే చెప్పారో వాటన్నింటినీ నెరవేరుస్తా)
స్టీఫెన్‌సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫ్రీలీ.. యూకెన్ డిసైడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్..(మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉండదు)
స్టీఫెన్‌సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫర్ యువర్ కమిట్‌మెంట్... వి వర్క్ టుగెదర్ (మీరు నిబద్ధతతో ఉంటే..మనమంతా కలిసి పనిచేద్దాం)
స్టీఫెన్‌సన్: రైట్.. థ్యాంక్యూ సర్
చంద్రబాబు: థ్యాంక్యూ



గన్‌మ్యాన్లు లేకుండా...


ఓటుకు నోటు కేసులో మూలాల నుంచి విచారణ చేస్తున్న ఏసీబీ రేవంత్‌రెడ్డి గన్‌మ్యాన్లతో పాటు మరికొంతమంది వాంగ్మూలాలను కూడా సేకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన తర్వాత పలుమార్లు రేవంత్‌రెడ్డి గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లినట్లు వెల్లడయ్యింది. ఒకసారి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కూడా గన్‌మెన్‌ను వదలి వెళ్లాడని ఇదే రీతిలో నోవాటెల్‌నుంచి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లేటప్పుడు కూడా గన్‌మెన్‌ను వదిలి వెళ్లారని గుర్తించారు. సొంత పనులు అని చెప్పి కనీసం మూడుసార్లు బయటకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆ సమయాన్ని ఓటుకు నోటు వ్యవహారాలకు వెచ్చించినట్టు తేలింది.


ఈ సమయంలో రేవంత్‌రెడ్డి 14 మందిని కలిశారని వివరాలు సేకరించిన ఏసీబీ వారి వాంగ్మూలాలను రికార్డు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా గన్‌మ్యాన్ల వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాగా ఎమ్మెల్ల్యే మిమ్మల్ని వదలి వెళుతున్నప్పుడు పై అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని గన్‌మ్యాన్లను ఏసీబీ ప్రశ్నించింది. తనకు కావాలని భద్రత కుదించారని ప్రభుత్వం మీద నిందలు వేసిన రేవంత్‌రెడ్డి అసలు గన్‌మ్యాన్లే లేకుండా చీకటి వ్యవహారాలు సాగించడం గమనార్హం.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



ఆదివారం, జూన్ 07, 2015

ఇదే నమస్తే తెలంగాణ ఔన్నత్యం...!!!

today's namasthe telangana epaper

విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే తెలంగాణ ఎంత సమున్నతంగా నిలబడగలదో ఆనాడే ఎలుగెత్తి చాటింది నమస్తే తెలంగాణ. విభజన సమయంలో, ఎన్నికల సమయంలో, విభజన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియా చేయని కుట్రలు లేవు, రాయని రాతలు లేవు.

వాళ్లే పక్కనే ఉన్న కర్నాటకకు ఫార్మా పరిశ్రమలు తరలిపోనున్నాయని రాస్తే, అది ఎంత అబద్ధమో తేల్చి చెప్పి పటాపంచలు చేసింది నమస్తే తెలంగాణ. వాళ్లు శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రకే చెందుతుందని రాస్తే...అది ఎంత పచ్చి అబద్ధమో ఆధార సహితంగా రాసి చెంపచెళ్లు మనిపించింది నమస్తే తెలంగాణ. తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా,తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తప్పుడు రాతలు, వక్రీకకరణలు చేస్తున్న ఆంధ్ర మీడియాను ఒంటిచేత్తో తూర్పారబడుతూనేవున్నది నమస్తే తెలంగాణ.

shekharreddy


నిజమే. నమస్తే తెలంగాణ పక్షపాతం వహించే మాట వాస్తవమే! నమస్తే తెలంగాణ...తెలంగాణ పక్షపాతి. తెలంగాణ ఉద్యమ పక్షపాతి. తెలంగాణ ప్రజాస్వామిక రాజకీయాల పక్షపాతి. తెలంగాణ కోసం అంకితమైన రాజకీయశక్తుల పక్షపాతి. తెలంగాణ దుఃఖం తన దుఃఖంగా భావించింది. తెలంగాణ బాధలు తన బాధలుగా భరించింది. తెలంగాణ ధర్మాగ్రహాన్ని తన ఆగ్రహంగా మల్చుకుంది. తెలంగాణ ద్రోహులకు కాలిలో ముల్లు, కంఠంలో గరళమైంది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి వ్యతిరేకంగా ద్రోహులు చేసే కుతర్కాలు, వితర్కాల పాలిట పాశుపతాస్త్రమైంది. తెలంగాణకు ఎవరు బంధువులో, ఎవరు రాబందులో గుర్తుపట్టేట్టు చేసింది. ఏవి తెలంగాణ వార్తలో, ఏవి వ్యతిరేక వార్తలో తెలుసుకునే చైతన్యాన్ని పంచింది. ఇంతకాలం తెలంగాణ ప్రజల మెదళ్లపై స్వారీ చేసిన పత్రికల రంగు, రుచి, రూపం బట్టబయలు చేసింది. 

"తెలంగాణ రాదు. వచ్చినా విఫలమవుతుంది. అప్పుల పాలవుతుంది. ఆగమవుతుంది. మీకు పాలించుకోవడం చేతకాదు. మీకు కష్టపడి పనిచేయడం తెలియదు. మీ ప్రాంతంలో పన్నులు కట్టరు. మీ వాళ్లు సోమరిపోతులు...అని ప్రచారం చేసిన ఆంధ్ర దురహంకార మీడియా ముక్కుదూలాలు బద్దలుకొడుతూ తెలంగాణ నిలుస్తుంది, గెలుస్తుంది, సమున్నత పతాకాలను ఎగరేస్తుంది...తెలంగాణ సంపన్న రాష్ట్రం...పేద రాష్ట్రం కాదు...పేదరికంలోకి నెట్టబడిన రాష్ట్రం...తెలంగాణ అదనపు సంపదను కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టారు...పాలనలో, నాయకత్వ పటిమలో, దీక్షాదక్షతల్లో తెలంగాణ ఆంధ్ర నాయకత్వాని కంటే ముందున్నది...తెలంగాణ విజయం సాధిస్తుంది!" అని నిత్యం మంత్రం పఠించిన పత్రిక నమస్తే తెలంగాణ. వాళ్లు మనకు గోతులు తీయాలని చూస్తే, నమస్తే తెలంగాణ ఆ గోతులపై వంతెనలు పరుచుకుంటూ వెళ్లింది. నమస్తే తెలంగాణకు ఇంతటి మనో ధైర్యాన్ని, ఆత్మిక బలాన్ని ఇచ్చింది నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.

వాళ్లు(ఆంధ్ర మీడియా) ’నై తెలంగా” అంటే నమస్తే తెలంగాణ ’జై తెలంగాణ’ అన్నది. వాళ్లు ’తెలంగాణ ఇక రానట్ట”...అంటే నమస్తే తెలంగాణ ’కొట్లాడి సాధించుకుంటా” అని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుల కరవాలమైంది. తెలంగాణకు జరిగిన అన్యాయాలను విప్పి చెప్పే కరదీపిక అయింది. వాళ్లు ఉద్యమానికి, నాయకులకు వంకలు పెడుతుంటే, నమస్తే తెలంగాణ మన నాయకులకు హారతులు పట్టింది. వాళ్లు ద్రోహులను కూడగట్టి, వారి వార్తలను పతాక శీర్షికల్లో పెట్టి ఉద్యమాన్ని ఆగం పట్టించాలని చూస్తే, నమస్తే తెలంగాణ అటువంటి శక్తులను చీల్చి చెండాడి ఉద్యమశ్రేణులకు సరైన మార్గదర్శనం చేసింది.

వాళ్లు కిరాయి కోటిగాళ్లను కేసీఆర్‌పైకి ఎగదోసినప్పుడల్లా, ఆ కోటిగాళ్ల నిజస్వరూపాలను తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పి, ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. వాళ్లు ’హైదరాబాద్ యూటీ అవుతుందోచ్’ అని చంకలు గుద్దు కుంటూ వార్తలు రాస్తే, అదెంత బోగసో బట్టబయలు చేసింది నమస్తే తెలంగాణ. ’హైదరాబాద్‍లో గవర్నర్ పాలనలో పెడతా’రని ఊదరగొడితే, అది ఎలా సాధ్యం కాదో చాటి చెప్పింది నమస్తే తెలంగాణ. ’విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుం’దని,’చీకట్లు కమ్ముకుంటా’యని, ’అరాచకం రాజ్యమేలుతుం’దని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే, తెలంగాణ ఎంత సమున్నతంగా నిలబడగలదో...ఆనాడే ఎలుగెత్తి చాటింది నమస్తే తెలంగాణ.

విభజన సమయంలో, ఎన్నికల సమయంలో, విభజన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియా చేయని కుట్రలు లేవు, రాయని రాతలు లేవు. వాళ్లే పక్కనే ఉన్న కర్నాటకకు ఫార్మా పరిశ్రమలు తరలిపోనున్నాయని రాస్తే...అది ఎంత అబద్ధమో తేల్చి చెప్పి పటాపంచలు చేసింది నమస్తే తెలంగాణ. వాళ్లు శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రకే చెందుతుందని రాస్తే...అది ఎంత పచ్చి అబద్ధమో ఆధార సహితంగా రాసి చెంపచెళ్లు మనిపించింది నమస్తే తెలంగాణ. తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తప్పుడు రాతలు, వక్రీకకరణలు చేస్తున్న ఆంధ్ర మీడియాను ఒంటిచేత్తో తూర్పారబడుతూనేవున్నది నమస్తే తెలంగాణ.

నాలుగేళ్ల క్రితం నమస్తే తెలంగాణ పుట్టిన రోజున చాలా మాటలు విన్నాం. ’మఘలో పుట్టింది పుబ్బలో పోతుంది’ అన్నారు. వాళ్ల ముఖం వాళ్లేం నడుపుతారన్నారు. తెలంగాణ వాళ్లకు పత్రికలు నడపడం చేతకాదన్నారు. మూన్నాళ్లకే మూతపడుతుంది చూడు అన్నారు. ఇవన్నీ ఆంధ్ర పత్రికా యాజమాన్యాల దురహంకార ఆలోచనల నుంచి జనించినవి. తాము తప్ప ఎవరూ ఏమీ చేయలేరన్న ఆధిపత్య భావన నుంచి పుట్టినవి. కానీ వాళ్లు తప్పని, వాళ్లను దాటుకుని ఐదో సంవత్సరంలోకి సమున్నతంగా ముందుకు దూసుకు వెళుతున్నామని ఈరోజు సగర్వంగా ప్రకటించుకుంటున్నాం. కేసీఆర్, దామోదర్‌రావు, సీఎల్ రాజం అనేక కష్టనష్టాలకోర్చి తెలంగాణకు అందించిన గొప్ప ఆయుధం నమస్తే తెలంగాణ.

తెలంగాణ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రల మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నప్పుడు తెలంగాణకు అందించిన మనోధైర్యమే నమస్తే తెలంగాణ. తెలంగాణలో ఇప్పటికీ చాలా మందికి అవేవో ఆంధ్రా పత్రికలు నిష్పక్షపాత పత్రికలని, నమస్తే తెలంగాణ రాజకీయ పత్రిక అని భ్రమలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న పత్రికలు లేవు. పచ్చ రంగు లేక మరో రంగు పూసుకోని పత్రికలు ఏవీ లేవు. నమస్తే తెలంగాణ తెలంగాణ రంగు పూసుకుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడేవారు ఏ పార్టీ అయినా నెత్తికెత్తుకుంటుంది. ఆంధ్ర ఆధిపత్యశక్తులకు ఏజెంట్లుగా మాట్లాడేవారిని చీల్చి చెండాడుతుంది. ప్రాప్తకాలజ్ఞత లేని పత్రికను ఎవరయినా ఈసడించుకుంటారు.

తెలంగాణ వచ్చి సరిగ్గా ఏడాది. దేశంలో ఏ రాష్ట్ర విభజన జరుగని విధంగా అనేక మెలికలు పెట్టి రాష్ర్టాన్ని విభజించారు. ఇంకా సిబ్బంది విభజన జరగలేదు. దాదాపు రెండు వందల ప్రభుత్వ సంస్థల విభజన కుంటినడకన జరుగుతున్నది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించడానికి ఏడు మాసాలు పట్టింది. హైకోర్టు విభజన జరుగలేదు. చంద్రబాబు ఇప్పటికీ అవరోధాలు కల్పించే ప్రయత్నాలు చేస్తూనేవున్నారు.

ఇన్ని ఇబ్బందులున్నా తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే తాను ఏమి చేయగలదో, ఎలా ప్రజల పక్షం వహించగలదో రుజువు చేసుకుంది. అయినా ప్రతిపక్షం కాబట్టి వంకరగానే మాట్లాడాలని భావించే వారిని, అయినదానికి కానిదానికి తొలి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేవారిని తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న వారిగా ఎలా నమ్మడం? అందుకే నమస్తే తెలంగాణ అటువంటి వారికి దూరం పాటిస్తున్నది. నమస్తే తెలంగాణ..తెలంగాణ పక్షం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఛత్రం.

చంద్రబాబు స్వయంకృతాలు:

చంద్రబాబునాయుడు ఇవ్వాళ ఉన్న దుస్థితికి తప్పు ఆయనదే. ఆయన ఇప్పటికీ కొన్ని వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణకు ఆయనకు సంబంధం లేదని ప్రజలు స్పష్టంగానే చెప్పారు. హైదరాబాద్‌లో పది సీట్లు గెలవొచ్చుగాక, ఆయన తెలంగాణతో సంబద్ధతను కోల్పోయారు. తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు వేరువేరు. నిత్యం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడేదో భవిష్యత్తులో తిరిగి పట్టాభిషేకం చేసుకుందామని ఆలోచించడం తెలివితక్కువతనమయినా కావాలి అతితెలివయినా కావాలి. ఇందులో అత్యాశ కూడా ఉండవచ్చు. 


అంతేకాదు తెలంగాణను ఇంకా కంట్రోలు చేయాలనుకోవడం, కేసీఆర్ తనకంటే తక్కువ అనుకోవడం, తెలంగాణ ఉన్నతిని చూసి అసూయపడడం, రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత కూడా నిరంతరం నష్టాల గురించి ఏడవడం ఆయన స్థాయిని దిగజార్చుతున్నాయి. అసూయ మనిషిని కుంగదీస్తుంది. తగులబెడుతుంది. పాజిటివ్ ఆలోచనలను చంపేసి, నెగెటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికీ అసూయతో రగిలిపోతున్నాడు. హైదరాబాద్‌ను వదులుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.

సుసంపన్నమైన తెలంగాణను వదులుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇప్పటికీ విభజన నష్టాలను గురించే పలవరిస్తున్నాడు. ఆయన కుంగిపోవడమే కాదు. ఆంధ్ర ప్రజలను కూడా కుంగదీస్తున్నాడు. ’ఈ అసూయతోనే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నా’రని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య అక్షరాలా నిజమనిపిస్తున్నది. ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా రెండు రాష్ర్టాల నేతల ఉపన్యాసాలు పోల్చి చూడండి.

కేసీఆర్ ఈ ఏడాదిలో ఏం చేశారో, తదుపరి కాలంలో ఏం చేయబోతున్నారో చెప్పారు. ఆవిర్భావదినాన్ని ఉత్సవంలా సంబురంలా నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. అదే చంద్రబాబు అక్కడ అక్కసు వెళ్లగక్కారు. విభజించి పాపం చేశారని కాంగ్రెస్‌ను తిట్టిపోశారు. రాజధాని లేకుండా చేసి వీథుల్లో పడేశారని రాగాలు తీశారు. తాను తీవ్ర మనోవ్యాకులతకు గురయి, మొత్తం ప్రజానీకాన్ని వ్యాకుల పరిచారు. పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్‌కు ఈ రెండు సన్నివేశాలు ప్రబల ఉదాహరణలు.

"చాలా బాధ కలుగుతున్నది. ఈయన ఏమి నాయకుడండి? ప్రజలకు మనోధైర్యాన్ని చెప్పాల్సిందిపోయి అస్తమానం ఈ ఏడుపు ఏమిటండి? ఇంకా ఎంతకాలం ఇది? అయినా ఆంధ్రకు ఏమి తక్కువని. చరిత్ర లేదా. సంస్కృతి లేదా. దేశంలోనే అతిపెద్ద కోస్తా తీరం. అన్నపూర్ణవంటి గోదావరి, కృష్ణా డెల్టాలు. తెలంగాణ, ఆంధ్రల మధ్య ద్వేషాలను సజీవంగా ఉంచి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నడు తప్ప మరోటి కాదు. గత ఏడాది కాలంలో అన్నీ మాట తప్పడమే. ఒకటి చెబుతాడు. మరొకటి చేస్తాడు. తెలంగాణకు మంచి నాయకుడు దొరికాడు. మా ఖర్మకు దివాలాకోరు దొరికాడు. విజయవాడ, గుంటూరుల్లో ఆయన ఉండడానికి ఇల్లే దొరకలేదా? ఒక్కటి ఆలోచించండి. ఆయన ఇక్కడకే వచ్చి ఓ ఇల్లు తీసుకుని, రాజధాని నిర్మాణం ప్రారంభించి, ఇక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ వడివడిగా పనులు చేస్తూ పోతే ఎంత బాగుంటుంది? కేంద్రం ఇప్పటివరకు 2200 కోట్ల దాకా ఇచ్చింది. ఇంకా సాయం అందిస్తూనే ఉంది. పది దాకా జాతీయ పరిశోధన, విద్యా సంస్థలు ప్రారంభించింది. కేంద్రం మోసం చేసిందని ఇక్కడ పోస్టర్లు వేయిస్తాడు. ఆంధ్రకు మేలు చేస్తున్నాడో కీడు చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. అంతా మా ఖర్మ!" అని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియరు రాజకీయ విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త చెప్పారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు గెల్చుకోవడానికి ఆయన చేసిన తప్పిదాలు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

"మాకు ఖర్చు చేయడానికి ఆయన తీవ్ర నొప్పులు పడుతుంటాడు. ఎమ్మెల్యేను కొనడానికి కోట్లు ఎలా వచ్చాయి?" అని రాజధాని ప్రాంత పౌరుడొకరు వేసిన ప్రశ్నకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? అసూయతో నిండిన మనసులో దృష్టంతా పక్కోని ఉన్నతిపై ఉంటుంది. ఆత్మతృప్తితో పనిచేసుకుపోయేవాడి దృష్టి...సాధించాల్సిన ప్రగతిపైన, నడవాల్సిన దూరంపైన ఉంటుంది. చంద్రబాబుకు, కేసీఆర్‌కు తేడా అదే....!!!
-kattashekar@gmail.com


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శనివారం, జూన్ 06, 2015

ఎన్నికల హామీలపై చేతులెత్తేసిన చంద్రబాబు...!!!

- సమైక్యరాష్ట్రంలో ఇచ్చిన హామీలను..
-ఇప్పుడు అమలుచేయటం కష్టమని ప్రకటన
- ప్రత్యేక రాష్ట్రంలో పరిస్థితులు మారాయని కబుర్లు
- ఏపీ విభజన 2014 మార్చి ఒకటినే పూర్తి...
-ఆ తర్వాతే ఎన్నికలు వాగ్దానాలు
- వాస్తవాలకు మసిపూసే ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం
- బాబు నిప్పుకాదు.. తుప్పు: రఘువీరా
ఎన్నికల హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించారు. ఏడాదిపాలనలో ఒక్కహామీని కూడా నెరవేర్చలేదన్న ప్రతిపక్షాల విమర్శలు నిజమేనని ఆయనే పరోక్షంగా ఒప్పుకొన్నారు. తాను ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చినవని, ప్రస్తుతం వాటన్నింటినీ నెరవేర్చటం సాధ్యంకాదని చేతులెత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నాడు చాలా హామీలిచ్చాను. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు మారిపోయాయి. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు అన్ని హామీలను నెరవేర్చటం కష్టం. మీరు నాపై నమ్మకంతో ఓట్లేశారు. అందువల్ల హామీలను నెరవేర్చటానికి ప్రయత్నిస్తా అని చెప్పారు.



ఓటుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచమిస్తూ ప్రత్యక్షంగా దొరికిపోయిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు గంభీర వచనాలు పలికారు. ఎవరికీ భయపడనని.. బుల్లెట్‌లా దూసుకెళ్తానని అన్నారు. రేవంత్ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఎత్తులను తిప్పికొడుతామని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబే అసలు సూత్రధారి అన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలపై ఏపీ సీఎం మండిపడ్డారు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో హామీలిచ్చారా?


ఉమ్మడి రాష్ట్రంలో హామీలిచ్చానన్న చంద్రబాబు ప్రకటనపై ప్రతిపక్షాలతోపాటు ఏపీ ప్రజలు కూడా ముక్కున వేలేసుకొంటున్నారు. నిప్పులాంటి నిజాలను కూడా బాబు ఎలా బూడిదతో కప్పేయగలననుకుంటారు అనే విషయం మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ 2014 ఫిబ్రవరి 18 ఆమోదముద్ర వేయగా, మరో రెండు రోజుల తర్వాత 20 రాజ్యసభ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో మార్చి ఒకటోతేదీన గెజిట్‌లో కూడా ప్రకటించారు. జూన్ 2న అపాయింటెడ్‌గా నిర్ణయించినా అప్పటికే రాష్ట్రం విడిపోయిన విషయం ప్రపంచానికంతా అర్థమయ్యింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 30, మే 7న రెండు దఫాలుగా జరిగాయి.

ఆ ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై విమర్శలు గుప్పించటం ద్వారానే చంద్రబాబు అధికారం సాధించారనే అభిప్రాయం కూడా ఉంది. బాబు మాటలు నమ్మి ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను నామరూపాలులేకుండా చేసి టీడీపీకి పట్టంగట్టారు. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆయన ముందూ వెనుకా ఆలోచించకుండా అధికార సాధనే లక్ష్యంగా ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన తర్వాత వాటిని అమలుచేయలేనంటూ అడ్డంగా బుకాయించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాబు మరోసారి తన బుద్ధిని బయటపెట్టుకున్నారని మండిపడుతున్నారు. ఏడాదిపాటు ఒక్క రాజధాని నిర్మాణంపై ఆయన అనేకానేక ప్రకటనలిస్తూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు సామాన్యులు తమసంగతేమిటని నిలదీసే పరిస్థితి వచ్చేసరికి చేతులెత్తేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

బాబు నిప్పుకాదు.. తుప్పు: రఘువీరారెడ్డి


టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముడుపుల కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఎదురుదాడిచేసినంత మాత్రాన తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాజకీయాల్లో నిప్పులా బతికానన్న బాబు వ్యాఖ్యలపై రఘువీరా మండిపడ్డారు. 

చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు అని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కేసులో తనకు ప్రమేయం ఉందో లేదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 66 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థ్యులను పోటీకి నిలిపటాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలే ఉన్నా ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలిపారని నిలదీశారు. రేవంత్ కేసులో చంద్రబాబు అప్రూవర్‌గా మారటం మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య సూచించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, జూన్ 05, 2015

ఇదెక్కడి పీడరా బాబూ.....!!! (నోట్లకట్టల కేసులో బాబు ఉక్కిరి బిక్కిరి)

-నిజాలు బయటికొస్తాయనే నిద్రలేమి?

-రేవంత్ చేష్టతో పరువుపోయిందంటున్న సొంత నేతలు
-బాబు-రేవంత్ ధోరణిపై ఏపీ సీనియర్ల కస్సుబుస్సు
-తెలంగాణ వ్యవహారాల్లో వేలెందుకంటున్న జనం
-బీద అరుపుల మధ్య కోట్ల కట్టలెక్కడివని నిలదీత
-రేవంత్‌రెడ్డిపై వేటుకు పలువురి డిమాండ్లు!
-ఎగదోసి.. చెడగొట్టారంటున్న రేవంత్ కుటుంబం
-ముప్పేట దాడిలో ఏపీ సీఎం చంద్రబాబు
-బాబు ప్రమేయంపై ఏసీబీ వద్ద ఆధారాలు?

babu


నామినేటెడ్ ఎమ్మెల్యేను నోట్ల కట్టలతో కొనే ప్రయత్నంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా బుక్కయిన వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సొంత పార్టీ నేతల కస్సుబుస్సుల నడుమ.. ఇక్కడి సంగతి చూడకుండా తెలంగాణలో పనికిమాలిన పనులు చేయడమేంటన్న జనాల సూటి ప్రశ్నలతో.. పరువుపోయిందని పార్టీ శ్రేణుల ఆవేదనాగ్రహాలతో.. ఏడాదిగా చచ్చీచెడీ నిలబెట్టుకొచ్చిన పార్టీని తెలంగాణలో పాడెపైకి పంపారంటున్న టీటీడీపీ నేతల ఆగ్రహావేశాలతో.. ఏమీ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వను అనే డైలాగ్‌ను పేటెంట్ చేసుకున్నారని చెప్పే చంద్రబాబు నోటి నుంచి.. నిద్ర రావడం లేదు.. మానసికంగా కూడా ఇబ్బందిగా ఉంది.. అన్న మాట రావడం ఆయనపై ముప్పేట దాడికి నిదర్శనాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో అసలే నిద్రలేమిని ఎదుర్కొంటున్న బాబుకు.. ఎమ్మెల్యే కొనుగోలుకు ఆయన ప్రోద్బలంతోనే రేవంత్ ప్రయత్నించారని నిరూపించే సాక్ష్యాలు ఏసీబీ వద్ద ఉన్నాయన్న సమాచారం నెత్తిన పిడుగు పడేస్తున్నది.


మండిపడుతున్న సీనియర్లు:
రేవంత్‌రెడ్డి దొరికిపోవడం టీడీపీ నాయకులకు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ.. రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి.. అసలు గుట్టు బయట పడేస్తూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆ పార్టీని, పార్టీ అధినేతను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిందని కోడెల శివప్రసాద్ స్థాయిలో ఉండే పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో విన్పిస్తున్నది. పొరుగు రాష్ట్రంలో.. అందునా గెలవడానికి అవకాశం లేని ఒక ఎమ్మెల్సీ స్థానంకోసం ఐదు కోట్లు వెచ్చించి.. ఇంతటి సాహసం చేయాల్సిన అగత్యమేంటన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. 


babu1


రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు చేసిన పనితో రెండు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పరువు మంటగలిసిందని సీనియర్ నేతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఒకవైపు జగన్ అవినీతిపై పెద్ద స్థాయిలో పోరాటం చేసి, ఇప్పుడు అదే జగన్‌కు చేజేతులా అస్ర్తాలు అందించినట్లయిందని అంటున్నారు. అవినీతి గురించి లెక్చర్లు ఇచ్చే నాయకుడే దాన్ని స్వయంగా ప్రోత్సహించి పార్టీ పరువు తీశారని పార్టీ సాధారణ కార్యకర్తలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల సంగతి సరే.. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ప్రజలవద్దకు వెళ్లాలని టీడీపీ తెలంగాణ నేతలు తలపట్టుకుంటున్నారు.


బీద అరుపుల బాబుకు కోట్లు ఎక్కడివి?


ఏపీలో సాధారణ జనం కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ర్టానికి డబ్బుల్లేవని చెప్తూ, రాజధానికోసం స్వాధీనం చేసుకున్న భూములకు పైసలు విదిలించేందుకూ కోటి బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు.. టీడీపీ గెలవలేని ఎమ్మెల్సీ స్థానం కోసం ఐదు కోట్లు ముట్టజెప్పేందుకు ఎలా సిద్ధపడ్డారని నిలదీస్తున్నారు. రాష్ట్రం విడిపోయి, సొంత రాజధాని కట్టుకునే పనిలో నిమగ్నం కావాల్సిన చంద్రబాబు.. తెలంగాణలో పనికిమాలిన పనులు ఎందుకు చేస్తున్నారని మండిపడుతున్నారు. సంబంధం లేని రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోవాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. దగ్గరుండి రాజధానిని నిర్మింపజేయాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటే తమకూ ధైర్యంగా ఉండేది కదా? అని నిట్టూర్చుతున్నారు. ఇవన్నీ వదిలేసి తెలంగాణ వ్యవహారాల్లో వేళ్లు పెట్టి కాల్చుకున్నారని అంటున్నారు.


రేవంత్ కుటుంబీకుల ఆగ్రహం


రేవంత్ కుటుంబంనుంచి కూడా చంద్రబాబుకు విసుర్లే ఎదురవుతున్నాయి. రేవంత్ అరెస్టు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లిన పలువురు టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. రేవంత్‌ను ఎగదోసి.. చెడగొట్టారని నేతలను పట్టుకుని దులిపేశారని తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డి ఆవేశపరుడు అయితే ఆయనను ఎందుకు ఆపలేదు? అరెస్టు అయిన తర్వాత ఏమీ ఎరగనట్లు ఉండటం ఏమిటి? అంటూ రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు నిలదీయడంతో టీడీపీ నేతలు బిక్కముఖం వేసినట్లు సమాచారం. రేవంత్ కుటుంబీకులు ఇంతగా ఆవేదన చెందటానికి మరో కారణంగా కూడా ఉంది. ఈ నెల 11న రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో రేవంత్ అరెస్టు కావడంతో తమ ఇంట్లో జరగాల్సిన శుభకార్యం పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు.


రేవంత్‌ను బలిపశువును చేస్తారా?


పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకుడొకరు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడొకరు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే ప్రశ్న ముందుకు వస్తే? ఇప్పుడు సరిగ్గా టీడీపీలో ఇదే సమస్య నెలకొంది. ఎమ్మెల్యేకంటే ముఖ్యమంత్రిని కాపాడుకోవడమే ముఖ్యమంటున్న ఒక వర్గం రేవంత్‌ను బలిపశువు చేసేందుకు ఇప్పటికే డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తున్నది. రేవంత్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందనే పేరుతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, మంచి పేరు తెచ్చుకుందామని అధినేత వద్ద పలువురు నేతలు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. 


అయితే.. రేవంత్‌ను పంపించింది చంద్రబాబేనని సంభాషణల వీడియోల్లో విస్పష్టంగా తేలిపోతున్నది. ఈ విషయం బయటపడిన తర్వాత కూడా తాను రేవంత్‌పై వేటు వేస్తే కార్యకర్తలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నానన్న అపప్రథ మూటగట్టుకోవాల్సి వస్తుందని బాబు మథన పడుతున్నారని మరో వర్గం నేతలు చెప్తున్నారు. ఈ పరిణామాలతోనే ఆయనకు నిద్ర రావడంలేదనుకోవచ్చన్నమాట!


పలకరింపు కాదు.. దులపరింపు!


చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్‌రెడ్డి బుధవారం తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతలతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీనికి వెనుక పెద్ద కథే ఉన్నదని తెలుస్తున్నది. మంగళవారం చంచల్‌గూడ జైల్లో రేవంత్ ఉన్నప్పుడు పలువురు టీడీపీ నేతలు కలిశారు. పలకరించేందుకు, ధైర్యం చెప్పేందుకు కలిసినట్లు బయట కలరింగ్ ఇచ్చినా.. నిజానికి అది పలకరింపు కాదని, దులపరింపని అంటున్నారు. 


రేవంత్ చేసిన పనికి ఆయనను వారు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఏడాదిపాటు తెలంగాణలో పార్టీని చచ్చీచెడి కాపాడుకుంటూ వస్తే.. ఉన్న పళాన దానిని చంద్రబాబుతో కలిసి నాశనం చేసిపారేశావని మండిపడ్డారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. రాజీనామా చేసి పార్టీ నుంచి తప్పుకోవాలని ఆగ్రహంతో అన్నారని సమాచారం. దీంతో కంగుతిన్న రేవంత్‌రెడ్డి ముఖం మాడ్చుకున్నారని, అందుకే బుధవారం తనను కలిసేందుకు వచ్చిన నాయకులతో మాట్లాడేందుకు ఇష్టపడలేదని అంటున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



2019లో టీడీపీ తెలంగాణలో రాజ్యమేలుతుందా...???


ప్రజలకు నిజాలు కావాలి. మీ సొంత ఎజెండాలు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణను ఏలుకోనివ్వాలి. వీలైతే నిర్మాణాత్మకమైన సలహాలిచ్చి ఓ చేయి వేయాలి. కానీ నడిచే కాళ్లల్లో కట్టెను పెట్టే పనులు చేయొద్దు. కావాలనే మీడియా గొంతు నొక్కితే...ఆ పాపం ప్రభుత్వాలను తప్పకుండా చుట్టుకుంటుంది. తెలంగాణ మీడియా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నది. ఎదగనీయాలి. పాత్రికేయ విలువలను కాపాడుతూ, బాధ్యతగల పాత్రను పోషిస్తూ రెండు రాష్ర్టాల ప్రజలను, వారి పాలనను ఒక్కలా చూడాలి. 


మే 27 నుంచి 29 దాకా మూడు రోజులు సాగిన మహానాడు సందర్భంగా.. చంద్రబాబు మాటలు, ఆయనకు వత్తాసు పలుకుతున్న పత్రికలు...అనటానికి సిగ్గులేదు, వినటానికి ఎగ్గులేదు, రాసెటోనికి బుద్ధిలేదు...అన్నట్లున్నాయి. ఆయన పలుకులు అంతంత పెద్ద అక్షరాలతో వేయడం వాటి పక్షపాత దోరణిని, దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి.ఆ మాటలన్నీ ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి ప్రయత్నమా? అసలు తెలంగాణ ప్రజలు ఏమాత్రమైనా టీడీపీని సహించే పరిస్థితిలో ఉన్నారా? హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్ర డబుల్ ఓటర్లు గత ఎన్నికల్లో కట్టబెట్టిన సీట్లతో మిడిసిపడితే ఎట్ల? ఊడ్చుకుపోయిన ఐదు జిల్లాలు, ఒక్కొక్క సీటు వచ్చిన రెండు జిల్లాలు గుర్తుకురావడం లేదా? 


పరాయి పాలనకు ఓటేసిన ఓటర్లతో తెలంగాణ ఓటర్లను జతకడితే అంచనా తప్పు అవుతుంది. అసలు టీడీపీ వెంట ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అయినా చంద్రబాబు ఆ మూడు రోజుల మాటల మూటలను నమ్ముతారా? టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ రాజకీయ నాయకులకు ఆ పార్టీ ఎలాంటి భవిష్యత్తును ఇవ్వలేదు. అది అసాధ్యం. ఏ పదవీ లేకుండా రాజకీయాలు సాగించడం, నియోజకవర్గ ప్రజలను కేడర్‌ను ఎంతకాలం కాపాడుకోగలరు? అసలు సమీప కాలంలో నమ్ముకున్న పార్టీ టీడీపీ ఏదైనా సాధించిపెట్టగలదని ఆశ ఉన్నదా? తెలంగాణ ప్రజలు ముందుముందు నమ్మితే కాంగ్రెస్‌ను నమ్ముతారేమోగానీ టీడీపీని దరిచేరనీయరు.


ఏది ఏమైనా.. ఓ ముఖ్యమంత్రి తనస్థాయిని, ఆ సీటు మర్యాదను మరచి మాటల కత్తులతో విషాన్ని వెడలగక్కడం, వాటికి పత్రికలు ప్రాధాన్యమివ్వడం చిల్లరగా ఉన్నది. చంద్రబాబు మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు వట్టి గొర్రెదాటు ప్రజలు, పూర్తిగా అమాయకులు. ఉత్తుత్తగానే మోసపుచ్చ వచ్చనే భ్రమలో ఆయన ఉన్నట్లనిపిస్తున్నది. ఆంధ్రుల ఆధిపత్య పాలనను కూలదోయడానికి దశాబ్దాల పాటు ఉద్యమించిన ప్రజలు ఇంకా ఆంధ్రులను, వారి పార్టీలను చేరదీస్తారనుకోవడం ఊహకైనా తప్పే. చంద్రబాబు మాత్రం తెలంగాణ ప్రజలకు గత్యంతరం లేదన్నట్లు మాట్లాడటం అహంకార పూరితమైనది. తెలంగాణ ప్రజల పచ్చిపుండు ఆరకముందే వారి రాజధాని హైదరాబాదులో ఈ డ్రామా వేయడం, వారినే తక్కువ చేస్తూ, వారి విజ్ఞత పట్ల అవగాహనలేని మాటలు మాట్లాడ్డం తెలంగాణ ప్రజల సహనానికి పరీక్ష పెట్టినట్లున్నది.


మొదటిరోజు ఓ పత్రిక శీర్షికవార్త- సంపదలు సృష్టించానని చంద్రుని వాక్కు. అదిసరిగా నిలబెట్టుకోవడం కేసీఆర్ పనట. అసలు సృష్టించేదేమిటీ? దాన్నో అపురూప వస్తువుగా జారిపోకుండా కాపాడుకునేదేంది! తానేదో దానం చేసినట్లు, దాన్ని తాగి తందనాలాడి తగిలేయద్దన్నట్లుంది ఆ మాట. ఎప్పుడో పదేళ్ల క్రితమే ప్రజలకు, పాలనకు దూరమైన టీడీపీ సృష్టించిన సంపద ఎవరికి దక్కిందో లెక్క లు చెబితే బాగుంటుంది. ప్రపంచ బ్యాంకుకు, అమెరికా కంపెనీలకు రాష్ర్టాన్ని తెగనమ్మడమే అభివృద్ధి, వారికి ప్రజాధనంతో సౌకర్యాలు కల్పించడమే సంపద అవదు. టీఆర్‌ఎస్‌కు టీడీపీ అంటే భయమట! ఆ భయపడ్డ వారెవ్వరో వారి లిస్టు ఇస్తే బాగుంటుంది. ఉల్టా చోర్... సామెత లాగుంది ఈ మాట. టీడీపీ తెలంగాణలో కరిగిపోతున్న మంచుగడ్డ. ఏనాడైనా ఆంధ్ర పెత్తనంలేని రాజకీయ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. ఆంధ్రుల మోసకారితనం, కుటిలనీతిని రుచి చూసిన తెలంగాణ ప్రజలు ఏనాడూ వారిని నమ్మరు.


మహానాడులోని చంద్రబాబు మాటలన్నీ నరుకుడే, బాతాల పోశెట్టి కోతలే! ఒక్కటీ అయ్యేది లేదు పొయ్యేది లేదు. 2019లో తెలంగాణలో టీడీపీ అధికారం అంటే పొల్లగాండ్ల మాటలా, ఆటలా! అసలు ప్రస్తుతం వెంట ఉన్న ఎమ్మెల్యేలను, తాబేదార్లను కాపాడుకోవడమే కనాకష్టం. మానసికంగా టీడీపీకి దూరమైన ప్రజల్లో న్యూనతాభావంతో తిరుగుతున్న వారిని ఊకదంపుడు ఆశగొలుపు మాట లు కట్టిపడేస్తాయన్న నమ్మకం లేదు. చంద్రబాబుకు అంతా తెలుసు. వెలవెల బోతున్న తెలంగాణ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఉత్తుత్త మాటలతోనైనా ఊరడించక తప్పదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో నాయకుడికే తెలుసు, ఆయన్నీ నమ్ముతున్నట్లు నటిస్తున్న వాళ్లకూ తెలుసు. 2019 దాకా వీరిని కాపాడుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి నిలబడే అభ్యర్థులే కరువవుతారు.


సెంటిమెంట్ ఎల్లకాలం ఉండదు అన్న చంద్రబాబు మాట తప్పుడు అంచనా. సెంటిమెంట్‌ను సరియైన కోణంలో అర్థం చేసుకోనట్టే. పరాయి పాలనను ఏ కోశానా అంగీకరించని తెలంగాణ ప్రజల సెంటిమెంటును ఇంత తక్కువగా అంచనా వేయడం తగదు. అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆంధ్రుల దోపి డీ పాలనపట్ల తెలంగాణ ప్రజలు తెలివికి వచ్చి పోరాడటం ఉత్త సెంటిమెంటేనా! అది గాలికి కొట్టుకుపోయే దుమ్ము ధూళియా! దారినపోయే మూర్ఖుడు నేను ఈ కారును కొంటా! ఈ బంగళా కొంటా! అంటుంటే చూసేవాళ్లు, వినేవాళ్లు నవ్వుకుంటారు. లేదా చిత్రంగా చూసేవాళ్లు, నవ్వుకుంటూ చూస్తూ పోతారేగాని, ఆ మాటలను ఏ మాత్రం విశ్వసించరు. 2019లో తెలంగాణలో టీడీపీ పాలన అన్న మాట కూడా అంతే.


ఏ పాలకుడికైనా రాజధాని నగరానికి రంగులద్ది, ఫ్రేముకట్టి చూడండహో అభివృద్ధి అని మెడలో వేసుకుతిరగడం రివాజైంది. కుంటుపడిన వ్యవసాయం, మూలకు పడిన చేతివృత్తులు, మాల్స్ చేతిలో మసిబారిపోయిన చిరువ్యాపారుల బతుకులు కానరావడం లేదు. వీరు మరిచినా ఓట్లేసేటప్పడు వారు నాయకులను మరువరు. బాబు అభివృద్ధి తీరునూ, దాన్ని భుజానేసుకుని తిరిగిన నాయకులను మరువరు. చంద్రబాబు అభివృద్ధినంతా గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల పాట తెల్లగోలు చేసింది. మరో తార్కాణం అవసరం లేదు.


ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏమవుతడో, ఆయనకు ఈయనగారు ఏం చేశారో జగమెరిగిన ముచ్చటే. ఆయనకు ఇవ్వాళ్ల ఎన్టీఆర్ అవతార పురుషుడు. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మలు, డైలాగులు తెలంగాణలో చెల్లని నాణాలు. ఆయన మాయలోంచి తెలంగాణ ప్రజలు ఏనాడో బయటపడ్డారు. టీడీపీ జాతీయపార్టీగా వీలైనన్ని రాష్ర్టాలకు విస్తరణ అనే మాట పెద్ద జోకు. ఇట్ల పంచుకున్నంత మాత్రాన, ఇంకోరి ఇంట్లో పాగా వేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? అసలు ఏం ఆధారం చేసుకుని తెలుగేతర రాష్ర్టాలకు టీడీపీ విస్తరణ అనడం జరిగిందో! జాతీయ పార్టీ అని చంకలు గుద్దుకోవడంలో అర్థమేమిటో వారికే తెలియాలి. 


ఎర్రబెల్లి, తదితరుల ఒత్తిడికి కక్కలేక మింగలేక రాష్ట్ర విభజన లేఖను రాష్ట్ర పతికి సమర్పించారు గానీ అసలు మర్మమంతా డిసెంబర్ 9ప్రకటన తర్వాత ఆంధ్రప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించడంతో బయటపడింది కదా! రాష్ట్ర విభజనకు ముందుగా లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఎర్రబెల్లి నోరునొచ్చేట్లు మొత్తుకున్నా.., పాసివాసనే.. మరోటి కాదు.


నిజానికి ఈ మహానాడు జరిగిన మూడు రోజులు చంద్రబాబు మాటలు తెలంగాణ ప్రజల మనసుల్లో బాధనే కలిగించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువల్ల నష్టపోయింది టీడీపీయే. ఎందుకంటే అది ఆంధ్రనాయకుల పార్టీ. అనవసరంగా గోబెల్స్ ప్రచారం చేపట్టి పత్రికలు చులకనవుతున్నాయి. అన్ని వార్తలు మంచిగనే ఉంటాయి. తెలంగాణ ముచ్చట అనగానే చిన్నచూపు, వక్రభాష్యం. పాలనపట్ల విపరీతమైన ధ్వేషం, అక్కసు. చంద్రబాబు అనగానే వార్తల హారతులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వేసే వార్తలు తెలంగాణ ప్రజలకెందుకు? తెలంగాణ పాలనపై తికమకపెట్టే చర్యలు, వీలైతే ఎల్లో జర్నలిజం స్థాయి వార్తలు పత్రికలకు శోభనియ్యవు. ఏది నిజమో తెలియక పాఠకులు అయోమయంలో పడిపోతున్నరు. 


కొత్త జేఏసీలు పెట్టే పని పత్రికలకెందుకు? రాజకీయ పార్టీల పాలనను పొగడడం, తెగడడం తెలుగు పత్రికా రంగంలో ఈ స్థాయిలో ఎన్నడూ లేదు. ప్రజలకు నిజాలు కావాలి. మీ సొంత ఎజెండాలు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణను ఏలుకోనివ్వాలి. వీలైతే నిర్మాణాత్మక సలహాలిచ్చి ఓ చేయి వేయాలి. కానీ నడిచే కాళ్లల్లో కట్టెను బెట్టే పనులు చేయొద్దు. కావాలనే మీడియా గొంతు నొక్కితే ఆ పాపం ప్రభుత్వాలను తప్పకుండా చుట్టుకుంటుంది. తెలంగాణ మీడియా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నది. 


ఎదగనీయాలి. పాత్రికేయ విలువలను కాపాడుతూ, బాధ్యతగల పాత్రను పోషిస్తూ రెండు రాష్ర్టాల ప్రజలను, వారి పాలనను ఒక్కలా చూడాలి. స్వార్థ చింతనతో సీమాంధ్ర నేతలను తెలంగాణలో ప్రతిష్ఠించాలని ఉబలాటబడుతున్న పార్టీని నెత్తికెక్కించుకుంటే క్రమక్రమంగా తెలంగాణలో వీటి ఉనికి కనుమరుగుకాకతప్పదు. ఆ రోజులు మొదలయినట్లే ఉంది పరిశీలిస్తుంటే..

- బి.నర్సన్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, జూన్ 04, 2015

విమర్శించేవాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి...!!

సీమాంధ్ర వలస పాలన సంకెళ్లను తెంచిన ఉద్యమ చైతన్యం ఇంకా ఇంకా కొనసాగాలి. స్వంత రాష్ట్రంలో స్వపాలన వేళ్లూనుకోవాలి. ఉద్యమ నాయకత్వం ప్రజల ఆశలు పండేదాక అదే పోరాట పటిమతో, త్యాగనిరతితో ముందుకు సాగాలి. ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలతో ఫలించిన ఏడాది పసిగుడ్డు వీర తెలంగాణను విమర్శలతో కాదు..దీవెనలతో ఎత్తి ముద్దాడుకుందాం రండి! నడక నేర్చి,పరుగు తీసి అగ్రభాగాన నిలిచేలా చేయిచేయి కలిపిచేయూతనిద్దాం రండి..

రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఉద్యమ కాలమంతా ఎన్నో అవమానాలు, వెక్కిరింతలు, వ్యంగ్యాల తర్వాత ప్రజలిచ్చిన విజయాన్ని కళ్ళకద్దుకొని ఉద్యమపార్టీ అధికారం చేపట్టింది. ఇంకా కాలు కుదురుకోని కొత్తరోజుల్లోనే గోల్కొండపై జాతీయజెండా ఎగురవేసి పాలన ఎంత విభిన్నంగా ఉండబోతుందో.. మూసపోతను పక్కనబెట్టి కొత్త దారులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి తెలంగాణవాదిలో నెత్తురు పొంగేలా.. ఉవ్వెత్తున ఆ రోజు ఎగిసిన ఆ జెండా ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న వాళ్లు కూడా లేచి నిలబడి శాల్యూట్ చేసిన ఆత్మగౌరవ జెండా అది. తరాలుగా ఎవరూ పట్టించుకోని గొల్లకొండ, విజయాన్ని భుజాల మీద మోస్తూ నిటారుగా నిలబడి నిలువెల్లా వెలిగిపోయిన విలువైన దృశ్యం అది. దీనిని కూడా విమర్శించిన మహానుభావులున్నారు! 

వాళ్ళు దేనిని విమర్శించలేదుగనక..!? నడవాలి అనుకొనే వాడికి లోకమంతా దారులే..! చెయ్యాలనుకొనేవాడికి చేతినిండా పనులే అంటారు. "ఏం చేశాడు కేసీఆర్? బోనాలు, బతుకమ్మ పండుగలు తప్ప!" అన్నారు తిట్టుకొనేవాళ్లు. పాలనలో పండుగలే కాదు.. ఉద్యమాన్ని ఉత్సవంలా నడిపించారు ఆయన. సకల జనుల సమ్మెలు, రోడ్లమీద వంటావార్పులు.. ఇవన్నీ అందరూ కలిసి ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేదననూ పంచుకొనే సామూహిక నెలవులు. ఒక కారణంతో పదిమంది కలిసిన చోట ప్రళయమైనా, కోపమైనా, ఆనందమైనా, ఉత్సాహమైనా పెల్లుబికి ప్రవహిస్తుంది. ఈ సూత్రం అర్థం చేసుకోవడం నాయకుడికుండే గొప్ప లక్షణం. మనుషులు ఉత్సాహంగా బతకాలనుకోవడం తప్పెట్లా అవుతుంది? సామూహిక పర్వాలు, ఉత్సవాలు మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్నీ, నా వెనుక ఇంతటి సమాజం వుందన్న భరోసాను కలిగిస్తాయి. దీన్ని గుర్తించి ప్రభుత్వమే జరిపించడం తప్పెలా అవుతుంది?

నీటి వసతులు లేని తెలంగాణలో ఊరికి జీవనాడి చెరువులే. దశాబ్దాల తరబడి పాలకులు కన్నెత్తి చూడక పూడుకుపోయిన చెరువులు.. మిషన్ కాకతీయతో ఊరి గొంతు తడపబోతుంటే.. దాంట్లోనూ తప్పులు వెదకడమే చేస్తున్నారు కొందరు. సహకరిం చి హుందాతనాన్ని నిలుపుకోవాల్సిన నాయకులు ప్రభుత్వాన్ని పలుచన చేయాలన్న రాజకీయం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు జరిగే పనులతో గత పాలనలో తమ చేతికానితనం బయటపడుతుందనే ఉక్రోషం తప్ప మరొక విషయం, ప్రయోజనం వుందా? ఇలా మాట్లాడే వాళ్లందరికీ వ్యక్తిగత ఎజెండానో, రాజకీయ ఎజెండానో వుండి తీరుతుంది. ఇలాంటి వాళ్లున్నప్పుడు, ప్రజాప్రయోజనం ముందు ఇవేమీ పట్టించుకోవాల్సిన పనిలేదు. 

ఒక చైనా సామెత వున్నది. విమర్శలు ఎంత తీవ్రంగా వుంటే నువ్వంత పని చేస్తున్నావని అర్థం. ఎవరూ నీ గురించి మాట్లాడటం లేదంటే నువ్వేమీ చేయడం లేదని పరమార్థం! నీ గురించి నోరు చించుకొనేవాళ్ళు ఎక్కువయిన కొద్దీ.. 
You are Rocking.. You are something Over here.. ! ఒక టీవీ ఛానల్‌లో కేటీఆర్ అన్నారు.. "తిట్లు" మాకు ఆశీర్వాదాలు అనుకొంటాం అని. కాదు.. కాదు.. ఆత్మవిశ్వాసాలు అనుకోవాలి. విమర్శలో అర్థం వుంటే తప్పక స్వీకరించి సరిదిద్దుకోవలసిందే. తిట్టడమే దినచర్యగా పెట్టుకొనేవాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకూ "తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన" నాకు తెలిసిన ఆంధ్రులు మళ్లీ అన్నారు.. "ఏం చేస్తాడు.. ఏమీ చెయ్యలేడు కేసీఆర్.." అని. అవకాశం ఇప్పుడేగా వచ్చింది. మరో ఆరు నెలల తర్వాత మాట్లాడండి అన్నాను. వాళ్లు పొలిటీషియన్స్ కాదు. ఈ మధ్య మళ్లీ కలిసినప్పుడు వాళ్లే అంటున్నారు.. "బాగా చేస్తున్నాడు.." అని. రాష్ట్రం విడిపోతే ఏదో జరిగిపోతుందన్నారు. బాగానే ఉందిగా అని పెద్దావిడ ఆశ్చర్యంగా మాట్లాడారు. సామాన్యులు ప్రభుత్వం పనితనాన్ని అంగీకరిస్తున్నారు.  వేసవిలో కరెంటు కోతలతో అల్లాడే ప్రజల అసంతృప్తులను రెచ్చగొట్టవచ్చని ఎదురుచూసిన వాళ్ల నోళ్ళు పడిపోయాయి. ఇది నిజంగా నిజం. ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారని మథనపడుతున్న వాళ్ల నోళ్లు ఆశ్చర్యంతో తెరుచుకుపోయాయి.

చిన్న రాష్ర్టాలు ఏర్పడితే అభివృద్ధి వుండదని అరిచి అరిచి బొంగురుబోయిన నోళ్ళు.. ప్రపంచ వ్యాప్తంగా చిన్న దేశాలు, చిన్న రాష్ర్టాలే త్వరితగతిన అభివృద్ధి చెందడం రుజువయిందన్న నిజాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు. చిన్నదా పెద్దదా అని కాదు.. చిత్తశుద్ధి ముఖ్యం. అరిచే ప్రతివాడికీ ఒక ఎజెండా వుంటుంది. అవసరమయింది విశాల దృక్పథం.. ప్రతి దాన్నీ విమర్శిస్తూ అరవడం కాదు! ఫాం హౌజ్‌లో పడుకోవడం గురించీ విమర్శే. విమర్శ సహేతుకంగా వుంటే సలాం కొట్టచ్చు. అక్కడేమయినా రేవ్‌పార్టీలు, క్లబ్‌డ్యాన్సులూ జరుగుతున్నాయా? చెట్టుకీ, పిట్టకీ, మబ్బుకీ, వానకీ దగ్గరగా ప్రకృతిలో గడపడం నేరమా? ప్రకృతి ఒడిని మనసారా ఆస్వాదించగలిగినవాడే మనుషుల మనసుల్ని గెలవగల సున్నితత్వం, సాన్నిహిత్యం గలవాడై వుంటాడు. ఇటువంటి వారికి రైతులాగే ఓపిక, సహృదయమూ అలవడతాయి. మరి ఒక నేత ఆ లక్షణాలతో ఉన్నప్పుడు ప్రజలకు మంచే జరుగుతుంది కదా!

ఎవరు ఎన్నుకుంటే ఏం.. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. నడక బలంగా ఉన్నప్పుడే.. కాలిముద్రలు చరిత్రలో నిలిచి వుంటాయి. ప్రజా జీవితాల్లో మన స్వపరిపాలన ముద్రల్ని మరింత బలోపేతం చేయాలి. పొరపాట్లు జరగొచ్చు.. అయితే యేం... చేస్తున్న వారికే కదా తప్పులు దొర్లేది. ఏమీ చేయని వారికి పొరపాట్లతో సంబంధమేముంది? తప్పుడు మాటలతో తప్ప! రాష్ట్రం ఒక సంవత్సరం ఎదిగిన పసిబిడ్డ. ఎత్తుకొని ఎదిగించాల్సిన బాధ్యత మోస్తున్న కేసీఆర్ ఆరోగ్యంపై అభిమానుల గుండెపగిలే పుకార్లు, కథలు ప్రచారం చేసిన వాళ్ల చెంపలు ఛెళ్లుమనిపించేలా... ప్రజల ఆశీస్సులతో వేగంగా... శక్తివంతంగా అడుగులేస్తూ ముందుకు సాగాలి. 

సీమాంధ్ర వలస పాలన సంకెళ్లను తెంచిన ఉద్యమ చైతన్యం ఇంకా ఇంకా కొనసాగాలి. స్వంత రాష్ట్రంలో స్వపాలన వేళ్లూనుకోవాలి. ఉద్యమ నాయకత్వం ప్రజల ఆశలు పండేదాక అదే పోరాట పటిమతో, త్యాగనిరతితో ముందుకు సాగాలి.ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలతో ఫలించి న ఏడాది పసిగుడ్డు వీర తెలంగాణను విమర్శలతో కాదు.. దీవెనలతో ఎత్తి ముద్దాడుకుందాం రండి! నడక నేర్చి, పరుగు తీసి అగ్రభాగాన నిలిచేలా చేయి చేయి కలిపి చేయూత నిద్దాం రండి..
- రావులపల్లి సునీత


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


బుధవారం, జూన్ 03, 2015

రేవంత్ రెడ్డి మాటల్లోని అంతరార్థం ఏమిటి...!!!

ఒక్కోసారి బయటకు కనబడుతున్న అంశాలకన్నా నిగూఢంగా ఉన్న వాటికే ప్రభావం ఎక్కువ ఉంటుంది. చిత్రంగా.. ప్రజలు, మీడియా కూడా పైపై అంశాలకు, అప్పటికప్పుడు సంచలనం అనుకున్న వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ హడావుడిలో లోపల దాగున్న అసలు విషయం చర్చకు రాదు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌లో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. బయటకు కనబడుతున్నదానికన్నా తీవ్రమైన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిపై పెద్దగా చర్చ జరగట్లేదు. దాని లోతుపాతుల్లోకి వెళితే మాత్రం భయంకరమైన దృశ్యం కనబడుతుంది.


రేవంత్ చర్య ఓ ఎమ్మెల్సీని గెలుచుకోవడం కోసం రాజకీయంగా దిగజారుడుగా సరిపెట్టుకోవచ్చు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా చేయవచ్చా అనుకున్నప్పుడు రాజకీయాల పరిస్థితే అలా తయారైందని సమాధానపడవచ్చు. ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించుకున్నప్పుడు, ఓటర్లను కొనుగోలు చేసే రాజకీయం మరింత పరిణతి చెందిందని మనల్ని మనం సముదాయించుకోవచ్చు. 


కానీ, అస్సలు సమాధానపడలేని సంగతులున్నాఇందులో. రేపట్నించి ఒక మనిషిని చూస్తే మరో మనిషి అనుమానపడే వాతావరణం కల్పించిన మాటలున్నాయి. కొన్ని కులాలు అనుమానపడేలా, కొన్ని కులాలపై అనుమానాలు కలిగేలా ఉన్నాయి. కొన్ని కులాలు ముఖ్యమంత్రి పదవి కోసమే పుట్టాయి అని భ్రమ కల్పించే విధంగా ఉన్నాయి. అన్నింటికి మించి తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్ర కోణం ఉంది. కేవలం తెలంగాణకు వ్యతిరేకంగానే కాదు. తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ద్రోహం తలపెట్టగలమనే సంకేతం ఉన్నది. 


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నామినేట్ చేసిన స్టీఫెన్ సన్‌తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ చేయడానికి ప్రేరేపించే సందర్భంలో జరిగిన సంభాషణలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మాటల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. మీకు ఇక్కడ(తెలంగాణ)లో ఇబ్బంది వస్తే అక్కడ(ఆంధ్రప్రదేశ్)లో ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తాం అన్నారు. నిజానికి నామినేటెడ్ ఎమ్మెల్యే అనే పదవి రాజ్యాంగంలో ఆంగ్లో ఇండియన్లకు కల్పించిన అవకాశం. ఇది రాజకీయ అవసరాల కోసం ఏర్పడే పదవి కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నియమించిన స్టీఫెన్ కూడా టీఆర్‌ఎస్ కార్యకర్త కాదు. అనేక క్రిస్టియన్ సంఘాలు, ఎన్జీవోలు, ఆంగ్లో ఇండియన్లు ఆయన పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దాని ప్రకారం ప్రభుత్వం ఆయనను ఎమ్మెల్యేగా నామినేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే చేయాలి. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆంగ్లో ఇండియన్ల ప్రతినిధిగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని రాజకీయ వ్యభిచారం చేసే వారికి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ఇక స్టీఫెన్ హైదరాబాదీ కాబట్టి, ఆయన తెలంగాణ వారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాని వారికి కూడా నామినేట్ పదవి ఇస్తుందట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కూడా నష్టం కాదా?


చంద్రబాబుకు హైదరాబాద్‌తోనే ఎక్కువ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి రాజకీయాలపై దృష్టి పెట్టాడు అని కూడా రేవంత్ సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏమి పని? ఉమ్మడి రాజధాని అనే అంశం కేవలం కార్యాలయాలకు సంబంధించిందే కానీ, పరిపాలనకు సంబంధించింది కాదు కదా. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని క్రియాశీలం చేసే పనిని తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఓ ఎమ్మెల్యే తన భుజాలమీదికి ఎత్తుకోవడం ఈ గడ్డకు ద్రోహం చేయడం కాదా? 


అన్నింటికి మించి, నేను రెడ్డి ప్రతినిధిని. రెడ్డిలకు ఆంధ్రలో ఛాన్స్ లేదు. కమ్మలంతా చంద్రబాబు వెంట, రెడ్డిలంతా జగన్ వెంట ఉన్నారు. అందుకే ఇక్కడ రెడ్డిని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. నాకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత రెడ్డిలకు, టీడీపీలోని రెడ్డిలకు నేనే ప్రతినిధిని. రాయలసీమ, ఆంధ్ర రెడ్డిలు గుంటూరు, కృష్ణాలో ఏమీ చేయలేరు (ఎందుకంటే అక్కడ కమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు) కాబట్టి వారు హైదరాబాద్ వస్తున్నారు. స్థిరపడుతున్నారు. వారికీ నేనే ప్రతినిధిని. నెల్లూరు, కడప, చిత్తూరు తదితర ఆరు జిల్లాల ఆంధ్ర రెడ్డిలు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వారికి కేసీఆర్ దగ్గర అప్రోచ్ ఉండదు. కాబట్టి నేనే దిక్కు...ఇలా సాగింది రేవంత్ రెడ్డి మాటల ప్రవాహం. ప్రజాస్వామ్యాన్ని కుల పంచాయితీగా మార్చేశారు. తెలుగుదేశాన్ని కమ్మల పార్టీగా, జగన్ పార్టీని రెడ్డిల పార్టీగా తేల్చేశారు. మరి తెలుగుదేశంలో ఉన్న రెడ్డిలు, జగన్ పార్టీలో ఉన్న కమ్మల పరిస్థితి ఏమిటి? వారు ఎప్పుడూ అపనమ్మకంగా ఉండాలా? లేక వారిపట్ల పార్టీ నాయకత్వం అపనమ్మకంతో ఉండాలా? ఆంధ్ర ప్రాంత రెడ్డిలకు అక్కడి రాజధానిలో చక్రం తిప్పే అవకాశం లేదని కూడా తేల్చేశారు ఇక్కడి రెడ్డి గారు. అందుకే వారు హైదరాబాద్ వస్తున్నారట. అంటే.. అక్కడ అధికారంలో భాగస్వామ్యం కాలేకపోయిన రెడ్డి వారిని రేవంత్ హైదరాబాద్ పట్టుకొచ్చి వారికి పెత్తనం ఇచ్చే బాధ్యత స్వీకరించినట్లా? ఆరు జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్ల సంక్షేమానికి కూడా ఈయనే బాధ్యత తీసుకుంటున్నారు. మరి ఆయన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల ప్రతినిధా? ఆంధ్ర సెటిలర్ల ప్రతినిధా?


కమ్మ కులానికి చెందిన చాలామంది వ్యాపార వేత్తలు హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నారు. రామోజీరావు, రవిప్రకాశ్, రాధాక్రిష్ణ (మీడియా సంస్థల యజమానులు) లాంటి వారు కూడా నాతో కంఫర్ట్‌గా ఉంటారు అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణలో రెడ్డికి నాయకత్వం అప్పగించాలని, అది కూడా కమ్మ వ్యాపారులకు కంఫర్ట్‌గా ఉండే తనకే అప్పగిస్తారని కూడా రేవంత్ చెప్పారు. రేవంత్ రెడ్డిగారు... రెడ్డి నాయకుడిగా ఎదిగి, కమ్మ వ్యాపారస్థుల ప్రయోజనం కాపాడే బాధ్యత కూడా తీసుకుంటారన్నమాట.


ఆంధ్రలో కమ్మలు తెలుగుదేశంలో, రెడ్డిలు జగన్‍తో ఉన్నారని తేల్చేశారు. తెలంగాణలో కూడా కులాల వారీగా పార్టీలు చీలిపోవాలని కోరుకుంటున్నారు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి వారంతా నా బంధువులే. వారి పని అయిపోయింది. రేపు వారి పిల్లలకు భవిష్యత్ కావాలి. జనరేషన్ గ్యాప్‌లో ట్రాన్స్ ఫార్మింగ్ చేసే బాధ్యత కూడా నాపైనే పెడుతున్నారు...అని కూడా రేవంత్ అన్నారు. అంటే తెలంగాణలోని రెడ్డిలంతా ఒకే గూటికిందికి రావాలని కోరుకుంటున్నారు. కుల, మత తారతమ్యం లేకుండా ఉంటున్న తెలంగాణ పౌరుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కాదా ఇది? రెడ్డిలంతా ఎక్కడున్నా ఒకటిగానే ఉంటారనే ప్రచారం ఎవరికి మేలు చేస్తుంది? ఇది తాను పుట్టిన కులానికి తానే ద్రోహం చేసుకోవడం కాదా? 

కులాల గురించి, రాజకీయ అధికారం గురించి రేవంత్ రెడ్డి ఇంత పచ్చిగా మాట్లాడిండు. అప్పుడు తెలుగుదేశం నాయకులు స్పందన ఎలా ఉండాలి. అది రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. దానితో మాకు సంబంధం లేదు అని ఒక్కరూ ఖండించడం లేదు. పైగా రేవంత్‌ను సమర్థిస్తున్నారు. లంచం ఇవ్వబోయి పట్టుబడిన వ్యక్తిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులు మరో తప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించకపోవడం అంటే సమర్థించినట్టే లెక్క. రేవంత్ చెప్పిన కుట్ర వ్యూహాలన్నీ తెలుగుదేశం పార్టీ వ్యూహాలుగానే భావించాల్సి వస్తుంది. కానీ తెలంగాణ సమాజానికి అలాంటి రాజకీయ వ్యవస్థ అవసరం లేదు. కులాల ఆధారంగా ఏర్పడే రాజకీయ వ్యవస్థను తెలంగాణ సమాజం ఎన్నడూ కోరుకోలేదు. అలా కోరుకునే వారిని కూడా క్షమించదు.

vijay


కమ్మలు పోతే రెడ్డిలు, రెడ్డిలు పోతే కమ్మలు. మధ్యలో మూడో క్యాస్ట్ ఎంటరయిందని కూడా రేవంత్ ఫీల్ అయ్యాడు పాపం. చంద్రబాబు అధికారంలోంచి వెళ్లిపోతే సీఎం పీఠం తమకే దక్కుతుందని రెడ్డిలు భావించారట. అలా జరగనందుకు బాధ పడుతున్నారు. అసలు సీఎం సీటు లేకపోతే రెడ్డిలు భరించలేరు అన్నట్లు మాట్లాడారు. అసలు సీఎం సీటు ఓ కులానికో, రెండు కులాలకో రిజర్వు చేసి పెడతారా? తమ కులస్తులకు సీఎం సీటు రాకుంటే రగిలిపోతారా? తెలంగాణకు అసలు అలాంటి చరిత్ర ఉన్నదా? అది ఆంధ్ర కల్చర్ అయివుండవచ్చు. దాన్ని తెలంగాణకు ఆపాదించే కుట్ర కాదా ఇది?


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, జూన్ 02, 2015

ఇందులో చంద్రబాబూ నిందితుడేనా...?

-రేవంత్ నోట.. పదేపదే బాబు మాట
-నిందితుడిగా చేర్చవచ్చన్న నిపుణులు
-న్యాయపరంగా అవకాశాలున్నాయని వ్యాఖ్య
-ఉదాహరణగా పీవీపై జేఎంఎం ముడుపుల కేసు
-నాటి ప్రధానికే శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు జడ్జి
-చట్టం తన పని తాను చేస్తే బాబు జైలుకే!
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓటుకు పచ్చ పార్టీ నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకూడా నిందితుడవుతారా? ఈ కేసులో చంద్రబాబు తన సంబంధాన్ని తప్పించుకోలేరా? ఆయన పేరును ఏసీబీ తన చార్జిషీట్లో చేర్చుతుందా? గతంలో ఇటువంటి ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతున్నది. పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు చెప్తున్న మాటలు ఏపీ సీఎంకు రానున్నది గడ్డుకాలమేనని తేల్చేస్తున్నాయి. ఈ కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల్లో మాటకు ముందు ఒకసారి, చివర ఒకసారి చంద్రబాబు పేరు ఉచ్చరించడంతోపాటు.. చంద్రబాబే తనను పంపించారని, కావాలంటే చంద్రబాబుతో నేరుగా మాట్లాడొచ్చని చెప్పారు. 

babu


నాయుడుగారు తల్చుకుంటే కోరుకున్నది రెండు గంటల్లో ముడుతుందని హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ వీడియోల్లో నిక్షేపంగా రికార్డయిపోవడంతో రేవంత్ పట్టుబడటమేకాకుండా.. చంద్రబాబు కొంప కొల్లేరు కాక తప్పదనే అభిప్రాయమూ బలంగా విన్పిస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు చేస్తున్నవి అడ్డగోలు, పసలేని వాదనలేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి కేసులలో ప్రత్యక్షంగా సీన్‌లో లేకపోయినప్పటికీ.. సూత్రధారులను సీబీఐ తదుపరి విచారణల్లో చేర్చిన ఉదంతాలను న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
జేఎంఎం ఎంపీల ముడుపుల కేసులో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు సైతం ఈ విధంగానే కోర్టు బోనెక్కిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధానికే శిక్ష పడగా లేనిది.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మినహాయింపు ఏముంటుందనే అభిప్రాయం విన్పిస్తున్నది. చంద్రబాబు పేరును పదేపదే తన సంభాషణల్లో రేవంత్ ప్రస్తావించిన నేపథ్యంలో బాబును నిందితుల జాబితాలో చేర్చేందుకు వందశాతం అవకాశాలు ఉన్నాయని పలువురు రిటైర్డ్ డీజీపీలు సైతం అభిప్రాయపడుతున్నారు. దీంతో ఓటుకు పచ్చ పార్టీ నోటు స్కాంను ఏసీబీ ఏ తరహాలో దర్యాప్తు చేయనుందనే అంశంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో జరిగిన అవినీతి కేసులలో సీబీఐ పాటించిన విధానాలను ఏసీబీ అనుసరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

సీబీఐ తరహాలో


అవినీతి, అక్రమాలు, కుట్రలు తదితర కేసులను సీబీఐ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంటుంది. దర్యాప్తు ముమ్మరం చేస్తూ.. మరిన్ని ఆధారాలు సేకరిస్తూ.. విచారణ సందర్భంగా నిందితులు ఇచ్చే సమాచారం మేరకు మరింత మంది పేర్లను చార్జిషీట్లలో చేర్చుతుంటుంది. వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులోనూ సీబీఐ ఇదే తరహాలో దర్యాప్తు కొనసాగించింది. ఆ కేసులో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు ముందుగా ఎఫ్‌ఐఆర్‌లోకి రాలేదు. కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో సేకరించిన వాంగ్మూలాలు, జారీ అయిన జీవోలు, రికార్డుల ఆధారంగా అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ కొత్తగా కొందరి పేర్లు చేర్చింది. ఇదే తరహాలో రేవంత్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు సాగే అవకాశం ఉందని చెప్తున్నారు.

పీవీపైనా అదే కేసు


తాజా ఘటనపై అవినీతి నిరోధక చట్టంలోని 12వ సెక్షన్‌తోపాటు.. ఐపీసీ 120(బీ), 34 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఇందులో క్రిమినల్ కాన్‌స్పిరసీ (నేరపూరిత కుట్ర) జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించి 120(బీ) సెక్షన్‌ను జోడించింది. ఇవే సెక్షన్ల కింద గతంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావును జేఎంఎం ముడుపుల కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. తెలివైన రాజకీయ నాయకుడిగా ఆయన అనుయాయులు కీర్తించుకునే చంద్రబాబు ఆపరేషన్ మునుపెన్నడూ ఇంత దారుణంగా విఫలమైంది లేదు. ఇంత నగ్నంగా దొరికిపోయిదీ లేదు.

ఈ నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకుపోతే చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రేవంత్ పట్టుబడిన కేసులో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో చంద్రబాబు ప్రధాన నిందితుడు అవుతాడని న్యాయ ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. తనను చంద్రబాబే పంపించారని రేవంత్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా నిందితుడు అవుతాడని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్‌లు కలకలం రేపుతున్నాయి. సెక్షన్ 120(బీ) (కుట్ర), 34 (కుట్రలో అందరిదీ ఒకే ఉద్దేశం)లలో చంద్రబాబు కచ్చితంగా నిందితుడు అవుతారని తెలుస్తున్నది. పలువురు మాజీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.

ఓటు నోటు కేసులో చంద్రబాబే ఏ1: శ్రీరంగారావు, సీనియర్ న్యాయవాది


రేవంత్ కేసులో చంద్రబాబు నిందితుడే. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్‌ల ఆధారంగా చంద్రబాబు నిందితుడిగా నమోదవతారు. ఈ వ్యవహరంలో ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని ఆధారాలు లభిస్తాయి. వాటి ఆధారంగా చంద్రబాబు నిందితుడుగా బుక్ అవుతారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారుతుంది. దీంతోపాటు చంద్రబాబు పంపిస్తేనే తాను వచ్చానని, ఆయనే తనను నేరుగా పంపారని రేవంత్‌రెడ్డి పదేపదే స్పష్టంగా చెప్పడం వీడియోల్లో రికార్డయింది. వాటిని ఆధారంగా చేసుకుని కూడా చంద్రబాబును నిందితుడిగా నమోదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.

చంద్రబాబు నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేరాల్సిందే: మాజీ డీజీపీ


రేవంత్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేరాల్సిందే. ఇప్పటికే ప్రాథమికంగా ఆధారాలు ఉన్నప్పటికీ విచారణలో నిందితులు ఇచ్చే వాంఙ్మూలంలో వెల్లడయ్యే అంశాలతో చంద్రబాబు అక్యూస్డ్‌గా నమోదవుతారు. దీంతోపాటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న 50 లక్షల నగదు ఎక్కడిదనేది తేలాల్సి ఉంది. ఆ నగదుకు సరైన లెక్కలు ఉన్నాయా? ఐటీ రిటర్న్స్‌లో ఈ నగదు వివరాలు ఉన్నాయా? అనే అంశాలు తేలుతాయి. ఈ నగదు చంద్రబాబు నుంచి వచ్చిందని నిర్ధారణైతే ఆయనకు కేసునునుంచి తప్పించుకునే అవకాశాలు ఉండవు. అతను విచారణను ఎదుర్కోవాల్సిందే.

అంతా కుట్ర పూరితమే: మాజీ ఐపీఎస్


ఓటు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రపన్నాడని వీడియో సంభాషణలు ఇప్పటికే స్పష్టంచేస్తున్నాయి. నిందితుడిగా నమోదుకు ఆధారాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి నిందితుల వాంగ్మూలంలో వెల్లడైయ్యే అంశాల ఆధారంగా చంద్రబాబు నిందితుడిగా దొరికిపోతారు. ప్రధానంగా నగదు వచ్చిన మార్గంతోపాటు పాటు వీడియో, ఆడియో ఫుటేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం ఈ కేసులో నిందితుడిగా నమోదవడంతో పాటు కేసు విచారణను ఎదర్కోవాల్సి వస్తుంది. ప్రజా సేవ ముసుగులో నలధనంతో రాజకీయాలు చేస్తున్న ప్రజాప్రతినిధులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం కలుషితం కాకుండా ఉంటుంది.

చంద్రబాబుకు దారేది?


తెలంగాణలో ఏదోవిధంగా పట్టు నిలుపుకోవాలన్న చంద్రబాబు తపన, రెడ్డి కులంలో ప్రముఖ నాయకుడిగా ఎదగాలన్న రేవంత్‌రెడ్డి అత్యాశ, 2019లో తెలంగాణలో అధికారం సాధించడంపై కన్ను.. ఇవన్నీ ప్రస్తుతం టీడీపీని కుడితిలో పడిన ఎలుకను చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నాయకుడికీ ఒక రోజు వస్తుంది. అదే సమయంలో ప్రతి నాయకుడికి ఒక ముగింపు అనేది కూడా ఉంటుంది. చంద్రబాబు తెలుసుకోనిది ఇదేనని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు ఇంత వరకూ నోరు విప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు ముందు రెండే మార్గాలున్నాయి. రేవంత్‌రెడ్డికి అండగా నిలిచి.. తాను కూడా కేసులో భాగస్వామి కావడం. లేదా రేవంత్‌ను పార్టీ నుంచి బహిష్కరించి.. ముడుపుల కేసుతో తనకు సంబంధం లేదని ప్రకటించుకోవడం! తప్పించుకోడానికి చంద్రబాబుకు వేరే మార్గంలేదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!