TNN| Dec 5, 2015, 03.45 PM IST
ప్రఖ్యాత భారతీయ ఇతిహాసం మహాభారతంలోని కొన్ని అంశాలు సైన్స్ సూత్రాలకు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పవచ్చు. మన శాస్త్రవేత్తలు తెలియజేసిన అనేక విషయాలు కొన్ని శతాబ్దాల క్రితం రచించబడిన మహాభారతంలో ప్రస్తావనకు రావడమే అందుకు ఉదాహరణ. ఆ మహా ఇతిహాసాన్ని సైన్స్ కోణంలో నుంచి చూస్తే ఎన్నో ఘట్టాలు నిజంగానే మనల్ని ఆశ్చర్యపరుస్తాయనడంలో సందేహం లేదు.
అభిమన్యుడి జ్జానానికీ కారణాలున్నాయి - 'రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫాన్సీ' అనే పుస్తకంలో డాక్టర్ మకటో సిచిడా అనే శాస్త్రవేత్త తల్లి గర్బంలోని శిశువు మెదడు కొన్ని సందర్భాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుందని, బయటి శబ్దాలను వినగల శక్తిని కూడా కలిగుంటుందని విశదీకరించారు. దీనిని బట్టి చూస్తే సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యుడు కూడా ఇలాంటి శక్తి ద్వారానే అర్జునుడు చెప్పిన చక్రవ్యూహ రహస్యాలను విని ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
కౌరవుల పుట్టుకకు.. ఆ పేటెంట్‌కు సంబంధముంది - ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో సర్జన్‌గా పనిచేస్తున్న మాతాపుర్కర్ స్టెమ్ సెల్స్ మీద పరిశోధనలు చేస్తూ.. ఒకే పిండాన్ని అనేక పిండాలుగా విభజించే ఓ వినూత్న పద్ధతికి సంబంధించిన యూఎస్ పేటెంట్ తీసుకున్నారట. ద్వాపర యుగంలో ఈ పద్ధతి ద్వారానే వ్యాసుడి సూచన మేరకు గాంధారి పిండాన్ని 101 భాగాలుగా వైద్యులు విభజించి.. కౌరవులకు వూపిరి పోసిన విషయం విదితమే.
ద్రౌపది సందేశం 'టెలీపతీ' ద్వారా చేరిందా - 1882లో ఫ్రెడిరిక్ మేయర్స్ అనే శాస్త్రవేత్త ఒక ఆలోచనను మనిషి మరో ప్రాంతంలోని వ్యక్తికి మనో తరంగాల ద్వారా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ పద్ధతికే 'టెలీపతి' అని పేరు పెట్టారు. పాండవులు జూదంలో ఓడిపోయి..కౌరవులకు ద్రౌపదిని పణంగా పెట్టినప్పుడు..ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడికి ఆ సమాచారం టెలీపతి ద్వారానే చేరుంటుందని.. అందుకే ద్రౌపది రక్షణార్థం ఆయన పథకం రచించారని కొందరి భావన
ద్రోణాచార్యుడు చెప్పింది 'టార్గెట్ ఎనాలసిస్' సూత్రమేనా - అమెరికాలోని సెంట్రల్ అనాలసిస్ ఏజెన్సీ యుద్దానికి వెళ్లే సైనికులకు లక్ష్య నిర్దేశం చేసే దిశగా ప్రోత్సహిస్తూ..ఎప్పుడూ ఏకాగ్రత, అప్రమత్తత అత్యంత అవసరం అని తెలియజేస్తూ చెప్పే పాఠమే 'టార్గెట్ ఎనాలసిస్'. మహాభారతంలో ద్రోణుడు అర్జునుడికి ఒక పక్షి కన్నును మాత్రమే లక్ష్యంగా చేసుకొని బాణాన్ని ప్రయోగించమనప్పుడు..అతను దాని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి గురి చూసి బాణాన్ని వేస్తాడు. ఈ సూత్రం కొంతవరకు టార్గెట్ ఎనాలసిస్ సూత్రాన్నే పోలి ఉంటుంది.

(క్లిక్ చేయండి)
(తెలుగు సమయం సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి