-జోన్-6 పరిధిలో 130 మందికి స్థాన చలనం
-హైదరాబాద్‌కు క్యూ కడుతున్న ఉద్యోగులు
-మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పిన అధికారి
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 130 మందికి డిప్యుటేషన్ల పేరిట అనధికార బదిలీలు చేసి ఓ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉండడంతో అనేక మంది ఈ అధికారిని సంతృప్తి పరిచి దొడ్డిదారిన బదిలీలు చేయించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పని చేసే సదరు అధికారి తాను మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పి రూ.లక్షల్లో వెనకేసుకున్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు ఆదేశించినా అది నేటికీ ముందుకు సాగలేదు. అక్రమాలు అత్యధికంగా జరిగాయని ఆరోపణలు వచ్చిన నల్లగొండ జిల్లాలో డిప్యుటేషన్లన్నింటినీ జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని ఆదేశించారు. అదీ అమలు కావడం లేదు.
అసలేం జరిగిందంటే..హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కొందరు అధికారులకు వరంగా మారింది. అయితే బదిలీలపై నిషేధం ఉండటంతో మాజీ మంత్రి బంధువునని చెప్పుకునే ప్రాంతీయ కార్యాలయంలోని ఒక అధికారి ఆర్డీతో కుమ్మక్కు కావడంతో కాసుల పంట పడింది. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు 130 మందికి పైగా ఎంపీహెచ్‌ఎస్ సూపర్‌వైజర్లు , పీహెచ్ స్టాఫ్ నర్సింగులకు దొడ్డిదారిన స్థాన చలనం కల్పించారు. ఒక జిల్లాలో సిబ్బంది పనితీరు బాగాలేకుంటే సంబంధిత డీఎంహెచ్‌ఓ మెమోలు జారీ చేసి ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేయవచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని 130 మందిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌ఓలు ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేశారు. వారికి హైదరాబాద్, చుట్టుపక్కల పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 నుండి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
ఏదీ విచారణ?:ఈ తతంగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా దీనిపై విచారణకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారికి బాధ్యతను అప్పగించారు. ఇప్పటిదాకా విచారణ ముందుకు సాగలేదు. ఇదిలాఉంటే ఈ వ్యవహారం నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నల్లగొండ డీఎంహెచ్‌ఓకు హైదరాబాద్ ప్రాంతీయ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సరెండర్ చేయడం డిప్యుటేషన్‌పై మరో చోటికి వేయడం ఆయనకే దక్కాయి. అందువల్లే ఈ జిల్లాలోనే అత్యధికంగా ఈ దొడ్డిదారి బదిలీలు జరిగాయి.ఇదిగమనించి జిల్లా కలెక్టర్ వెంటనే వాటన్నింటినీ రద్దుచేయాలని కొన్నిరోజుల కిందట ఆదేశించారు.ఆ ఆదేశాలు అరకొరగానే అమలైనట్లు సమాచారం. ఇప్పటికీ చాలామంది యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఒకవైపు విచారణ కొనసాగకపోవడం, మరోవైపు ఒక జిల్లాలోనే నామమాత్రపు చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి