గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

కుటిల రాజకీయాలు మానండి!


టీబిల్లును పార్లమెంటు
లోన పెట్టగాను గొడవ
జరిగినచో నొప్పుకొనము
అని బీజేపీ పలికెను!

గొడవ జరుగునపుడు బిల్లు
చర్చ సేయ నొప్పుకొనము!
గొడవచేయు వారిని స
స్పెండుచేయ నొప్పుకొనము!

సకాలమున తెలంగాణ
బిల్లు పెట్టకున్న మేము
ఒప్పుకొనము మద్దతిడము
అని బీజేపీ పలికెను!

సీమాంధ్రులు పిచ్చి పట్టి
నట్లు ప్రవర్తించుచుండ్రి!
సభలో వారిని సస్పెండ్
చేయుటయే శరణ్యమ్ము!!

బిల్లు పెట్టగాను మేము
దౌర్జన్యము చేతుమనియు
పలికెడు సీమాంధ్రులకును
సస్పెండే శరణ్యమ్ము!

కాంగ్రెస్సే వారినిపుడు
దారిలోన పెట్టవలయు!
దానికి బీజేపీయే
యిపుడు తోడు పడగవలయు!!

బీజేపీ కాంగ్రెస్సులు
వారల కాపాడుచుండ్రి!
తెలంగాణ కన్యాయము
చేయగాను బూనుచుండ్రి!!

బీజేపీ అట్లనుటకు
వెనుక కారణములున్నవి!
చంద్రబాబు వెంకయ్యలు
చక్రము త్రిప్పుచు నుండిరి!!

సీమాంధ్రుల దుడుకు చేత
లకు కేంద్రము బ్రేకు వేయ
జాలకున్నదా యేమీ?
అదుపు చేయలేద యేమి??

తెలంగాణ సూచించిన
సవరణములు చేయకయే
బిల్లు పార్లమెంటులోన
పెట్టగాను ఏమనవలె?

దీని వెనుక సీమాంధ్రుల
కుట్ర దాగి యున్నదయా!
దీని వెనుక సీమాంధ్రుల
లాబి దాగి యున్నదయా!!

తెరచాటున సీమాంధ్రుల
కేంద్రము తలదాల్చుచునే,
బయటికి వ్యతిరేకించుట
నాటకమయ, బూటకమయ!

బిల్లుకు మద్దతు తెలుపుచు
కొర్రీలను పెట్టుచుంట,
బీజేపీ ద్వంద్వనీతి
చెప్పకయే చెప్పుచుండె!

అరువది యేడులనుండియు
మా కన్యాయము జరుగగ,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేతుమనుచు పలుకుటేల?

న్యాయము చేయగ వలసిన
వారికి అన్యాయమ్మును
చేయుచు, సీమాంధ్రులకును
న్యాయము చేతుమననేల?

ఎవరు దోపిడికి గురైరొ
వారలకన్యాయమిడియు,
దోచుకున్నవారలకే
న్యాయము చేతుమననేల?

ఆకలితోనున్నవాని
కాహారమ్మీయకుండ,
కడుపు నిండినట్టి వారి
కే తిండిని పెట్టనేల?

తక్షణమే షరతులేవి
విధియింపక తెలంగాణ
రాష్ట్రమ్మును ఏర్పరించి,
మా కిడుచో న్యాయమగును!

ఇట్లు జరుగకున్న మీరు
తెలంగాణలోన గెలుపు
సాధించుట కల్లయయ్య!
అధికారము పొందరయ్య!!

బీజేపీ టీడీపీ
కాంగ్రెస్సులు తెలిసికొనియు
మసలుకొనినచో నెగ్గుట
ఖాయమగును విజయమ్ములు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఫిబ్రవరి 10, 2014

రాష్ట్రం ఏర్పడే లోపే అందినంత దోపిడీ!


తెలంగాణ బిల్లు లోన
తెలగాణకు దోపిడియే!
రాష్ట్రమ్మున ముఖ్యమంత్రి
అప్పనముగ దోచుటయే!!

తెలంగాణ ప్రజలంతా
బిల్ సవరణలను కోరగ,
సీఎం తన ముల్లె తాను
కూడబెట్టసాగెనయ్య!

విభజనకై తెలంగాణ
ఎదురుచూచు చుండగాను,
సందట్లో సడేమియ్య
ముఖ్యమంత్రి అయ్యెనయ్య!

ఈ దిగువన ఇచ్చినట్టి
వార్తల బరిశీలించిన
ముఖ్యమంత్రి నిజరూపం
బహిర్గతమ్మగునయ్యా!

తెలంగాణపై ఎంతయొ
వగల ప్రేమ ఒలకబోసి,
తెలగాణను మోసగించి,
దోపిడులను చేయసాగె!

ఈ మోసమ్ముల తప్పక
ఎదిరింపగ వలెనయ్యా!
సీబీఐ ఎంక్వయిరీ
పెట్టింపగవలెనయ్యా!!

లింకులపై క్లిక్ చేయండి:




[నమస్తే తెలంగాణ పత్రికవారికి, అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పత్రిక వారికి ధన్యవాదములతో...]

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

తెలంగాణలో కాంగ్రెస్సూ, బీజేపీ, టీడీపీలు మట్టిగొట్టుకుపోవడం ఖాయం...


[తెలంగాణులు సూచించిన సవరణములు బిల్లులో చేయకపోవడం తెలంగాణకే అవమానకరం. తెలంగాణకు ఈ బిల్లు నష్టం కలిగించేదే...మళ్ళీ బానిసత్వంలోనికి నెట్టేదే! కాబట్టి ఏ ఆంక్షలు లేని తెలంగాణకై తక్షణమే తెలంగాణులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణులను ఉద్యమించే దాకా తెచ్చిన కాంగ్రెస్‍కూ, బీజేపీకీ, టీడీపీకీ తెలంగాణలో నూకలు చెల్లాయి! ఉద్యమమే శరణ్యం! జై తెలంగాణ! జై జై తెలంగాణ!]

తెలంగాణ బిల్లులోన
ఆంక్షలన్ని తొలగించియు
సంపూర్ణపు తెలగాణకు
సహకరించుచో నిలుతురు!

తెలంగాణ ప్రజల కాంక్ష
నెరవేరకపోయినచో
తెలంగాణలో వీటికి
మనుగడయే దుర్లభమగు!

తెలగాణను నష్టపరచు
అంశాలను తొలగించియు
సవరించినచో సరియే!
లేకున్నచొ ఉద్యమమే!!

అంతదాక తెచ్చినచో
కాంగ్రెసునకు పుట్టగతులు
తెలంగాణలో ఉండవు!
పుట్టి మునుగుటే ఖాయము!!

రాజకీయ ప్రయోజనాల్
ప్రక్కనిడియు నేతలంత
సంపూర్ణపు తెలంగాణ
సాధనకై పూనుకొనుడు!

క్షణమాలస్యము చేసిన
అవకాశము తొలగిపోవు!
తెలంగాణ శాశ్వతముగ
బానిసగా మిగిలిపోవు!!

పద పద పద, పద పద పద!
త్వర త్వర త్వర, త్వర త్వర త్వర!
ఉద్యమమే శరణ్యమ్ము!
ఉద్యమమే మన ఊపిరి!!

ఉద్యమించు, ఉద్యమించు!
రాష్ట్రముకై ఉద్యమించు!
సంపూర్ణపు తెలంగాణ
సాధించుటకై శ్రమించు!!

ఉద్యమింతుమనుమాటను
కేంద్రమునకు వినిపింపుము!
కేంద్రము దిగిరావలయును!
తెలంగాణమేర్పడవలె!!

తెలంగాణ అమరవీర
బలిదానమ్ముల ఫలితము
తెలంగాణ మేర్పడుటే!
ఉద్యమించు! ఉద్యమించు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మీరు చేసేది నమ్మడానికి, మేం చెవిలో పువ్వు పెట్టుకొన్నామా?


[కేంద్రం తెలంగాణ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి సహింపరానిది. అన్యాయం జరిగింది తెలంగాణకు. కేంద్రం బుజ్జగిస్తున్నది సీమాంధ్రను. గాయం ఒకచోట ఉంటే, మందు ఒకచోట పెడుతోంది కేంద్రం! తెలంగాణ నేతలు సూచించిన సవరణములు పక్కన పెట్టడమే దానికి నిదర్శనం. బిల్లులో సవరణలు చేయకుండా తెలంగాణ ఇవ్వడం వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదు. ఉత్తుత్తి తెలంగాణ ఇచ్చినట్టే! కాబట్టి సత్వరమే తాడో, పేడో తేల్చుకోవాలి. వ్యతిరేకంగా ఉంటే, ఉద్యమమే మన బాట! తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడుడే!! ]

కేంద్ర మిత్తునన్న దేమి?
తెలంగాణ మిత్తు మనెను!
ఎట్టి తెలంగాణ మదియె?
ఏదైతేం? తెలంగాణ!!

బీజేపీ ఏమి యనెను?
బిల్లు పెట్టు! మద్దతిత్తు!
ఎట్టి బిల్లు కిత్తుమనిరి?
ఏదైతేం? బిల్లు బిల్లె!!

కేంద్రము తెలగాణ మిడిన,
బీజేపీ మద్దతిడిన,
వోట్లకొరకె, సీట్లకొరకె
అని తోచుచు నున్నదయ్య!!

ముఖ్యమంత్రి వ్యతిరేకత
కేంద్రమెట్లు సహియించెను?
సీమాంధ్రలొ కాంగ్రెసును
నిలుపుకొనుట కొరకు కాదె?

దగాపడిన తెలగాణకు
వృద్ధి పథకముల గూర్చక,
సీమాంధ్రను బుజ్జగించు
ప్రయత్నాలు ఎందుకయ్య?

తెలగాణులు తెలిపినట్టి
సవరణములు ప్రక్కనుంచి,
సీమాంధ్రుల మెప్పులకై
యత్నించుట నేమనవలె?

తెలంగాణపై కేంద్రము
చిత్తశుద్ధి లేకయుండె!
తెలంగాణ నిత్తు మనియు
అణచివేయుచుండిరయ్య!!

సవరణములు చేయకున్న,
తెలంగాణ వ్యర్థమయా!
ఆంక్షలన్ని విధియించియు,
రాష్ట్రమిడిన వ్యర్థమయా!!

తెలంగాణ నాంక్షలతో
ఇచ్చుట సరికాదయ్యా!
తెలంగాణ ప్రజలుకోరు
తెలంగాణ మీయుడయా!!

గత నష్టాల్ పూడ్చునట్టి
తెలంగాణ మీయుడయా!
మరల నష్టపరచునట్టి
తెలంగాణ మెందుకయా?

తెలంగాణ బిల్లును పాస్
చేతుమనియు చెప్పుటేల?
పాసగుట సమస్యకాదు!
సవరింపక యౌ సమస్య!!

ఉమ్మడిగా రాజధాని
యేల యుండవలయునయ్య?
ఆ విశాఖపట్టణమును
తాత్కాలికముగ జేయుడు!!

రాష్ట్రాలిర్వదియెన్మిది
యెట్టి హక్కులను పొందెనొ,
అవియె తెలగాణకిండు!
హక్కులేని రాష్ట్రమేల?

ప్రత్యేకత వలయు ననగ,
పొత్తులేల పెడుదురయ్య?
హైకోర్టు గవర్నరు లిక
ఉమ్మడిగా మాకెందుకు??

పోలవర డిజైను మార్చ
కుండ, భద్రగిరిన ముంపు
గ్రామములను సీమాంధ్రకు
ఇచ్చుటేల? ఈయ వలదు!

అక్రమ ఉద్యోగస్థుల
పెన్షనర్ల వల్ల తెలం
గాణ నష్టపోయెనయ్య!
ఇంక నష్టపోవలెనా?

ఉద్యోగుల, పెన్షనర్ల
స్థానికతను గుర్తించియు
పంపకమ్ము చేయకుండ,
జనాభాను కొనుట యేల?

కామన్ ఎంట్రెన్స్ వలదయ!
ఏ రాష్ట్రము కా రాష్ట్రము
విడిపోయిన తరి విద్యా
లయములందు పొత్తేలయ?

నదుల నీటి పర్యవేక్ష
ణా బోర్డులవల్ల నష్ట
మొదవుచుండ, మరల యేల
నియమింతురు? నష్టమె కద!

ఢిల్లీలో నిజాంరాజు
నిర్మించిన భవనమ్మును
సీమాంధ్రుల కిచ్చుటేల?
తెలంగాణ దది కాదా??

ఇన్ని విధములుగ కేంద్రము
తెలగాణను నష్టపరచు
అంశమ్ములు సవరింపక
బిల్లు పాసు చేయుటేల?

సవరణములు చేయకున్న,
తెలంగాణ వచ్చి సున్న!
ఏ లక్ష్యముతో కేంద్రము
పూనెనొ, అది నెరవేరదు!!

ఆంక్షలేని తెలంగాణ,
సంపూర్ణపు తెలంగాణ,
స్వేచ్ఛయున్న తెలంగాణ
మాకు కావలయునయ్యా!

కంటి తుడుపు చర్య వలదు!
పై పై ప్రేమయె వలదయ!
వట్టి తెలంగాణ మాకు
వలదు వలదు వలదయ్యా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఫిబ్రవరి 08, 2014

పోలవరము వరమిడదు, ముంపు నిడును!

(నేను గతంలో దివి:21-11-2013 నాడు పోలవరము నిర్మిస్తే కలిగే నష్టాలను వివరిస్తూ పెట్టిన టపాను మరల ఈ క్రింద ఇస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భద్రాచలం ముంపుకే కానీ మంచికి కాదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భద్రాచలవాసులు దీన్ని ఎంత మాత్రం సహింపరు. అంతగా అవసరం ఐతే పోలవరం డిజైన్ మార్చి, ఎవరికీ ముంపులేని, నష్టం కలిగింపని, తెలంగాణ (భద్రాద్రి)లోని పూచిక పుల్లంత స్థలాన్నికూడా సీమాంధ్రలో కలుపని రీతిగా నిర్మించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ జోలికి వస్తే మాత్రం రణరంగమే!)


భద్రగిరిఁ బొంది, మీ పోలవరము నిచట
నిర్మితము సేయఁ గుట్రల నెన్నొ పన్ని,
"మేల్మి బంగారమే యయ్య మే" మటంచుఁ
బల్క, నమ్మెడి వారమే? వదరఁ బోకు!

ఇచటి భద్రాచలాలయ, మిచటి జనులు,
వీరిపై ప్రేమ నీ కున్న వేగిరముగఁ
బోలవరమందుఁ బ్రాజెక్టు పూన్కి నాపి,
ముంపు నీయక, భద్రాద్రి కింపు నిడుము!

పోలవర మిట నిర్మింప మునుఁగు నంచు
నమ్ముఁ డెనుఁబది మూఁడు శాతమ్ము గ్రామ
ములును! మూఁడు లక్షల జనములు నుపాధి
లేక నిర్వాసితులు నయి, లేమిలోనఁ
గూర్పఁ బడుదురు! బాధలఁ గోరఁ దగునె?

ఇరువదియు నైదు వేల యెకరములు గల
యటవి నీటను మున్గును! నటులె రెండు
నూర్ల డెబ్బది యైదగు నూళ్ళు మునుఁగు!
పాపికొండలు, పేరంట్ల పల్లి మునిఁగి,
నీటి కడుపున నివసించు నిజము సుమ్ము!

నేఁడు పదునేను నడుగుల నీటిమట్ట,
మది నలువదియు మూఁడడ్గు లటు పయిఁ జను!
భారి వర్షమ్ము వచ్చిన వరద హెచ్చ
రికయె నల్వదెన్మిది గంటలకును ముందె
జారి యగుచుండ, ప్రాజెక్టుఁ గోరి యిచట
నిర్మితముఁ జేయు తదుపరి నెట్టు లుండు
నో యటంచు నూహింపఁ గదోయి! యితర
ప్రాంత సంబంధముల్ తెగు! వైద్య, విద్య,
గిరిజనోపాధు లన్ని దుష్కరము లగును!

గిరిజనులఁ గావ మైదాన పరిధులకును
దీసికొని పోవ నేజన్సి వాస చట్ట
మెటులు వారికి వర్తించు? నేది దారి?

సరియె పోనిండు! భరత దేశమ్మునందె
మిగులఁ బ్రాచీన జాతిగ నెగడునట్టి
కొండ రెడ్ల తెగయె యిటనుండి తొలఁగు!

ఎనిమిదౌ గ్రామములు మున్గు నిచట యనియుఁ
బల్కి, "యొడిశా"యె పెట్టె నభ్యంతరమ్ము!

ఇన్ని భద్రాద్రి గ్రామా లవెట్టి దుఃఖ
మందఁగాఁ గోరు దీవు? తమంత తాము
వెలికి వచ్చి, భద్రాద్రినిం గలుపఁగ వల
దాంధ్రలోపల నంచును నార్తి తోడఁ
బల్కుచుండి రీ ప్రజ! పోలవరము నాపి,
జరుగఁ బోవు విలయమునుం జరుగకుండఁ
గావఁగా నాంధ్రుఁడా నీకుఁ గరుణ లేదె?
కర్కశుండవే? యిఁక నైన గాలి మాట
లాపి, భద్రాద్రి జోలికి రావలదయ!

పోలవరము ప్రాజె క్టదియేల నీకు?
ఎన్నొ దుష్పరిణామాలు నున్న దదియ!
నీదు బాగుకోసమె యిట, నాదు బాగు
నాశ మొనరింతువే? యన్యాయమునకు
నడుము కట్టెదవే? దుర్జనుఁడవె నీవు?

మంచివాఁడవు నీవైన, మాన్యతఁ గన,
భద్రగిరి జోలికే రావ వలదు! కోర,
పోలవరము వర మిడదు! ముంపు నిడును!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

(సీమాంధ్రులు అంతగా పోలవరం కావాలనుకుంటే, డిజైన్ మార్చి ఎవరికీ నష్టం కలగని విధంగా నిర్మించుకుంటే అభ్యంతరం ఉండదు. భద్రాచలంలోని భూభాగాన్ని కోరితేనే, భద్రాద్రిని ముంపునకు గురిచేయబూనితేనే తెలంగాణాకు అభ్యంతరం ఉంటుంది.)

ఇలా చేస్తేనే, బిల్ మాకు ఆమోదయోగ్యం అవుతుంది!


కేంద్రమిపుడు తెలంగాణ
రాష్ట్రమిడగ సంతోషమె!
కాని, గతపు అన్యాయాల్
పునరావృతి కారాదయ!!

గతంలోన తెలంగాణ
పొందిన అన్యాయాలకు
న్యాయమ్మును చేయు కొఱకు
కేంద్ర మిట్లు చేయవలెను!

1. ఉమ్మడి రాజధానికి పదేళ్ళు కాక, మూడేళ్ళ కాల పరిమితి చాలు.

రాజధాని పదేండ్లుంట
సమయమ్మెక్కువ అగునయ!
మూడేండ్లకు కుదించినచొ
న్యాయముగా సరిపోవును!!

ఉమ్మడిగా రాజధాని
మూడేండ్లకు మించవద్దు!
మించినచో సీమాంధ్రులు
ఇల్లంతా మాదందురు!!

జీహెచ్‍ఎంసీ పరిధిన
వలదయ్యా వలదయ్యా!
ఖైరతబాద్ వరకె దీని
పరిధి నుంచవలెనయ్యా!!

2. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలు గవర్నర్‍కు అప్పగించరాదు.

గవర్నరుకు శాంతిభద్ర
తలను అప్పగించరాదు!
రాష్ట్ర కైవసమున నుంట
అందరికీ మేలయ్యా!!

మానిటరింగ్ కమిటీనిట
నియమించిన సరిపోవును!
ఇతర రాష్ట్రముల కిచ్చిన
హక్కు రాష్ట్రమున కీయుడు!!

3. ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్ట్ ఆలోచనమాని, వేర్వేరుగా ఏర్పాటు చేయాలి.

గవర్నరును, హైకోర్టును
ఉమ్మడిగా ఉంచవలదు!
విభేదాలు మరల పుట్టు!
వేరుగానె ఉండవలయు!!

4. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో చేర్చడం కన్నా, డిజైనును మార్చడం మేలు.

పోలవరము ముంపు గ్రామ
ముల నేపీ జేర్చుకన్న,
దాని డిజైనును మార్చిన
నిరపాయమ్మగునయ్యా!!

గ్రామాలను ఏపిలోన
చేర్చుటయే సరికాదయ!
గ్రామస్థుల కన్యాయం
తప్పకుండ జరుగునయ్య!!

5. జనాభా ప్రాతిపదికగా కాక, స్థానికత ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను పంపకం చేయుట న్యాయం.

జనాభ ప్రాతిపదికగను
పంపిణీని చేపట్టిన
తెలంగాణకన్యాయము
కేంద్రమె చేసినయట్లగు!

గత అన్యాయములె తిరిగి
కేంద్రమిపుడు చేయరాదు!
స్థానికతయె ఆధారము
గా పంపిణి చేయవలయు!!

గతంలోన జరిగినట్టి
అన్యాయము సరిదిద్దగ
వలయునన్న మీకిప్పుడు
స్థానికతయె ఆధారము!

6. తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించడం అన్యాయం.

టీ విద్యాసంస్థల్లో
ఏపీ విద్యార్థులకును
స్థానము కల్పింపబూను
టన్యాయమె అగునయ్యా!

ఉన్నత విద్యారంగము
నుమ్మడి ఎంట్రెన్సు వలదు!
ఇట్లు చేసినచొ మరలను
తెలగాణకె నష్టమగును!!

7. హైదరాబాద్‍ను "తాత్కాలిక" ఉమ్మడి రాజధాని అని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.

హైద్రబాదు "తాత్కాలిక
రాజధాని" అని బిల్లున
పేర్కొనంగ వలయునయ్య!
సందేహము తొలగునయ్య!!

8. కృష్ణా గోదావరీ నదీజలాల గురించిన బోర్డు వగైరా ప్రతిపాదనలను తొలగించాలి.
 కృష్ణాగోదావరిజల
వినియోగము గూర్చి పర్య
వేక్షణ బోర్డులు ఎందుకు?
ప్రతిపాదన వలదయ్యా!!

9. ఏ.పీ. భవన్‍గా మార్చబడిన హైదరాబాద్ భవన్‍ను తెలంగాణకే అప్పగించాలి.

నిజాం రాజు నిర్మించిన
హైద్రబాదు భవనమ్మును
ఏపీ కీయంగ వలదు!
అది తెలగాణదె యయ్యా!!

***    ***    ***    ***    ***    ***    ***

పైన తెలిపినవి "తొమ్మిది
సవరణములు" తప్పకుండ
కేంద్రమిపుడు చేసినచో
తెలంగాణ శాంతించును!

సవరింపక తెలంగాణ
ఇచ్చినచో లాభమేమి?
ఇచ్చి, ఈయకున్నట్టులె!
కాన, వేగ సవరింపుడు!!

సవరణములు చేపట్టని
పక్షమందు తెలంగాణ
అగ్నిగుండమగునయ్యా!
పెనుతుఫాను రేగునయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

ఎవరి పిచ్చి వారికి...!


తెలంగాణ ఏర్పడుటయె
తథ్యమనియు తెలిసికూడ
అసత్యప్రచారములను
సీమాంధ్రులు చేపట్టిరి!

హస్తినలో జరుగునట్టి
బిల్ ఏర్పాటులను చూసి
కూడ నేడు సీమాంధ్రులు
పుకారులను పుట్టించిరి!

బిల్ తిరస్కరించిరనియు,
తెలంగాణమేర్పడదని,
నోటికొచ్చినట్టుగాను
పుకారులను పుట్టించిరి!

కాని కేంద్రయోచనములు
మరో విధముగానుండెను!
తెలంగాణకనుకూలము
గా యోచన లున్న వయ్య!!

బిల్లు యథాతథముగానె
మార్పులు చేర్పులు లేకయె
పార్లమెంటులోన పెట్టి
ఆమోదముకోరుదురట!

అడ్డుకున్న సస్పెండులు!
మూజువాణి వోటింగులు!
బిల్ తొందరగా నెగ్గుట!
ఇవియె కేంద్ర యోచనములు!!

ఇవి యన్నియు చూచుచునే
అసత్యంపు పుకారులను
సీమాంధ్రులు పుట్టించుట
కుట్రతోడి పిచ్చికాదె?

ఎవరి పిచ్చి వారలకును
ఆనందము కలిగించును!
తెలంగాణ ప్రజలారా,
నమ్మకుడయ పుకారులను!!

తెలంగాణ మేర్పడునయ!
కల సాకారమ్మగునయ!
తెలంగాణలోన దివ్య
కాంతి వెల్లివిరియునయ్య!!

జై తెలంగాణ!  జై తెలంగాణ!

గురువారం, ఫిబ్రవరి 06, 2014

ఉన్మాదచర్య!


హస్తినలో డ్రామాలను
ఆడునట్టి ముఖ్యమంత్రి!
నీ ఉన్మాదపు చేతల
సహింపదీతెలంగాణ!!

దొంగలెక్కలెన్నొచూపి,
అబద్ధాలనెన్నొఆడి,
కపటనాటకములాడుట
సహింపదీతెలంగాణ!

చెల్లని నీ తీర్మానము
అహంకార ధోరణితో
కేంద్రమునకు తెలుపగాను,
వారలు అజ్ఞానులా?

కలిసిఉండమనువారల
ఏకపక్ష వాదనతో
కలిసిఉండుమని చెప్పుట
నీ దురహంకారమగును!

రాజ్యాంగము ప్రకారమే
తెలంగాణ బిల్లు పంప,
ధిక్కరించినట్టి నీవు
రాజద్రోహివి కావా?

సంప్రదాయమును విడచియు
అడ్డగోలు తీర్మానము
చెల్లనట్టి తీర్మానము
చేయుట మూర్ఖత కాదా?

చర్చలు ముగిసిన పిమ్మట
చేసినట్టి తీర్మానము
చెల్లదనియు తెలిసికూడ
కేంద్రమెట్లు స్వీకరించు?

నీవు ఎంత యత్నించిన
ఫలితముండదని తెలిసియు
పిచ్చిపట్టినట్టి రీతి
నటియించుట సహియింపము!

తెలంగాణ నొక రీతిగ,
సీమాంధ్రను నొక రీతిగ
చూచునట్టి పక్షపాతి!
తక్షణమే దిగవయ్యా!!

సిగ్గు శరము లేక నీవు
ముఖ్యమంత్రి పీఠమ్మును
గబ్బిలమ్ము పట్టినట్టు
పట్టుకొనుట సహియింపము!

మూర్ఖమైన ముఖ్యమంత్రి
చేతలతో హస్తినలో
జంతరు మంతరు మ్రోలను
డ్రామాలాడగ తగునా?

నల్లికుట్ల వేషముతో
మూగదీక్ష బూను నిన్ను
వలదని వారింప వచ్చు
మంత్రుల నవమానింతువె?

రాష్ట్రానికి ముఖ్యమంత్రి
వయ్యు నీవు మహిళలపై
సెక్యూరిటి నుసిగొల్పియు
చోద్యము చూచుట తగునా?

మహిళా మంత్రులపైనను
నీవు చేయు దుష్కృత్యము
భరతజాతి క్షమియించదు!
ఇది ఒక ఉన్మాదచర్య!!

సాటి మంత్రిపైనను నీ
అహంకారమును జూపుట
క్షమార్హము కాదయ్యా!
ముఖ్యమంత్రిగా తగవయ!!

మహిళలకింతటి అవమా
నమ్ము చేసినట్టి నీవు
ఒక్క క్షణము కూడ మాకు
ముఖ్యమంత్రిగా తగవయ!

మహిళామంత్రులకింతటి
అవమానమ్మును జరుగగ
వాహనమ్మునుండి దిగని
నీవు ముఖ్యమంత్రివెట్లు?

మంత్రికి గౌరవమునిడవు,
ప్రజలనెట్లు పాలింతువు?
మంత్రులకే రక్ష లేదు,
ప్రజలనెట్లు రక్షింతువు?

మౌనదీక్ష పేరుచెప్పి,
కబుర్లతో గడిపినావు!
నీదొక మౌనపు దీక్షా?
అహంకారి దిగవయ్యా!!

ముఖ్యమంత్రి అర్హతయే
కోలుపోయినావు నీవు!
తత్క్షణమే దిగిపోనిచొ
సహింపదీ తెలంగాణ!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, ఫిబ్రవరి 05, 2014

ధర్మమేవ జయతే!


ఎంత విషం కక్కుచున్న,
ఎట్టి కుట్ర చేయుచున్న
తెలంగాణ రాష్ట్రమిపుడు
ఏర్పడుటయె ఖాయమయ్య!

దౌష్ట్యాంధ్రుల దౌర్జన్యాల్
అబద్ధాల ప్రచారాలు,
కేంద్రమ్మును మభ్యపెట్ట
జాలవింక ఎప్పటికీ!

సీమాంధ్రులు చేయునట్టి
దుడుకు చేతలను చూసిన
కేంద్రమునకు అర్థమాయె
తెలంగాణ వేదనమ్ము!

మందబలముతోడ తెలం
గాణ నణచి దోచినట్టి
అహంకార సీమాంధ్రుల
చర్య తేటతెల్లమాయె!

రాష్ట్రమ్మును విభజించుట
తప్పనిసరి కార్యమ్మని
కేంద్రమ్మే నిశ్చయించి
తెలంగాణ నీయ గడగె!

ఎన్ని పిచ్చి వేషాలను
వేసిన నిక నమ్మరయ్య!
ఎన్ని నీచ కుతంత్రాలు
పన్న, తిప్పికొడుదురయ్య!!

ఎట్టి పరిస్థితులలోను
తెలంగాణ రాష్ట్రమ్మున
కేర్పాటును చేయుటకై
కేంద్రమ్మే పూనెనయ్య!

తెలంగాణ రాష్ట్ర స్వప్న
సాకారమ్మగునయ్యా!
ధర్మపక్ష తెలంగాణ
ఉద్యమమే నెగ్గెనయ్య!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

పసలేని పిచ్చి కూఁతలు!


ముఖ్యమంత్రి కూతలెంత
పసయె లేని కూతలయా!
ముఖ్యమంత్రి చేతలెంత
పనికిరాని చేతలయా!!

1.అసెంబ్లీ తీర్మానమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రం.

సీమాంధ్రుల అహంకార
మును జూపెడి మాటలివియె!
బ్రహ్మాస్త్రమ్మిది కాదయ,
చివికినట్టి పుల్ల ఇదియె!!

నిబంధనలు పాటింపని
పనికిరాని తీర్మానం!
మేకపోతు గాంభీర్యము
ప్రదర్శించు తీర్మానం!!

బ్రహ్మాస్త్రమ్మిదియగుచో
ఢిల్లీలో "దీక్ష"యేల?
బ్రహ్మాస్త్రమ్మిదియగుచో
ఢిల్లీలో "లాబి"యేల?

2. అసెంబ్లీ తీర్మానం వట్టి తెల్లకాగితమే అయితే ఎందుకు భయపడుతున్నారు?

భయపడుటయె ఇది కాదయ
నీ అజ్ఞానము తెలుపుటె!
పిచ్చివాని చేతిరాయి
విసరుటలను ఆపుటే!!

3. దేశంలో ఇప్పటివరకూ అసెంబ్లీ తీర్మానం వీగిపోయాక కొత్తరాష్ట్రం ఏర్పడింది లేదు.

కండ్లు తెరచి చూడు మిదియె
సత్యమ్మేలేని కూఁత!
అది తీర్మానమా? సభా
మర్యాదల కూలద్రోత!!

ఏకపక్ష నిర్ణయమ్ము!
ముందు తెలుపనట్టి పదము!
ఎజెండలో లేని కృతము!
విలువలేని తీర్మానము!!

నీవు చూచుచుండగనే
ఏర్పడునయ తెలంగాణ!
రాదు రాదు అని నీవన
వచ్చితీరు తెలంగాణ!!

4. రాష్ట్రాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకే రాజ్యాంగంలో నిబంధన పెట్టారు.

భ్రమలోనే ఉన్నావయ,
భ్రమను వీడి తెలియుమయా!
మైనారిటి సభ్యులకది
ప్రాధాన్యము నిచ్చునయా!!

మెజారిటీ తీర్మానము
మైనారిటి శాపమగుచొ,
మైనారిటి కనుగ్రహము
నిడును ఇట్టి నిబంధనము!!

5. పదవులకోసం నేతలు వాదాలు, సిద్ధాంతాలు మార్చేసుకుంటున్నారు.

ఇది నీకే వర్తించును
నీ ప్రవర్తనమ్మిదియే!
కుక్కతోక వంకరండ్రు,
నీ బుద్ధిని ఏమనవలె?

కేంద్ర నిర్ణయమును తలను
దాల్తుననియు, తప్పలేదె?
పూటకొక్క మాటమార్చి,
పబ్బము గడుపుకొనలేదె??

6. "ఎందరో త్యాగాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు" అన్న విషయం మరచిపోవద్దు.

ఏ త్యాగం లేకుండా
తెలగాణను మోసగించి,
కలిపినట్టి మోసగాండ్ర
మాటలివియె, మరతుమెట్లు?

నీ ఆంధ్రకు ఒక త్యాగమె,
తెలగాణకు వేలమంది!
దురహంకారము మీదయ,
ఆవేదనమే మాదయ!!

తెలంగాణ నాశ్రయించి
కోట్లుకూడబెట్టినారు!
కృతజ్ఞతను చూపనట్టి
కృతఘ్నులే ఐరి మీరు!!

7. ఇష్టమొచ్చినట్లు చేస్తే తెలుగు ప్రజలు సహించరు.

ఎవరయ్యా? తెలుగు ప్రజలు
దైత్యులైన ద్రావిడులే!
దైవత్వమ్మున్నయట్టి
ఆర్యులయ్య తెలగాణులు!!

దితిపుత్రులు మీరలయ్య,
అదితి పుత్రులమ్మె మేము!
దేవదానవుల కలయిక
కల్ల గాక, నిజమౌనే?

తెలుగువారు మీరైతే
తెలంగాణులము మేమయ!
తామస గుణులే మీరలు,
సాత్త్విక గుణులమ్మె మేము!!

తెలగాణుల సరకుగొనని
మీ మాటకు విలువ లేదు!
మీ ఇష్టాల్ మా తలనిడి
కించపరుప వీలులేదు!!

నీ విట్టుల వదరినచో
తెలగాణులు సహియింపరు!
నీ చేతలు ముదిరినచో
తెలగాణులు ఊరుకొనరు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, ఫిబ్రవరి 03, 2014

హైదరాబాదులో సీమాంధ్రులు


ఉత్సాహము:
హైద్రబాదులోన మేము హాయిగాను బ్రతుకఁగన్
క్షుద్రరాజకీయములతొ కుట్రఁ జేయవద్దయా!
భద్రముగనె యుంటిమయ్య భద్రత యిఁక నేలకో?
నిద్రలోన నున్నవారె? నేతలార మానుఁడీ!

తే.గీ.
ఈ తెలంగాణ ప్రజలు మాకింతవరకు
నెట్టి హానియుఁ దలపెట్ట రిందువలన
హైద్రబాదునందున శాంతి భద్రతలను
నవ్యరాష్ట్రమ్మునకె యీయ న్యాయమయ్య!

ఆ.వె.
సీమనేతృవర్గ గోముఖవ్యాఘ్రాలు,
పెత్తనంపు వర్గ పీడకులును
హైద్రబాదులోన హైడ్రామ నడుపంగ,
శాంతిభద్రతలిటఁ జక్కఁబడునె?

కం.
తెలగాణ రాష్ట్రమేర్పడి
నిలకడతోఁ బాలన మిట నేతల కిడఁగన్
దులకించును శాంతి యెపుడు
వెలుఁగును మన హైద్రబాదు విశ్వములోనన్!

ద్విపద:
ఏప్రాంత నేతలు నాప్రాంతమందె
సప్రజాస్వామ్య ప్రశస్తి నెఱింగి,
పాలన సేసినఁ బరమశాంతులును
క్షేమమెసంగును శ్రేయమ్ముఁ గల్గు!
కుట్రకుతంత్రాలు కోపతాపాల
చట్రమున్ వదలిన శాంతిసౌఖ్యాలు
హైదరాబాదులో నద్వితీయముగ
మోదమ్ముతోడ నామోదమ్మునందు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

చిరంతన ప్రజాభీష్ట సాకారం...త్వరలోనే!


అరువదేండ్ల క్రింద తెలం
గాణ గొంతు నొక్కినారు!
అమాయకపు తెలంగాణ
నాంధ్రలోన కలిపినారు!!

ప్రజాభీష్ట మడుగకుండ
పెత్తందార్లయ్యారు!
వ్యతిరేకించినను గూడ
దుష్పాలన చేశారు!!

అన్నదమ్ములం అంటూ
అణచివేసినారయ్యా!
అండీ గిండీ అంటూ
తొండి జేసినారయ్యా!!

అన్యాయాలక్రమాలు
దోపిడీలు దౌర్జన్యాల్
ఎన్నొ చేసి తెలగాణను
పీల్చి పిప్పి చేసినారు!!

అరువదేండ్ల పోరాటం
తెలంగాణ కొరకు సాగె!
చిరకాలపు ప్రజాకాంక్ష
దినదినమ్ము పెరుగసాగె!!

పోరాటం ఫలితంగా
కేంద్రం తెలగాణానిడగ
సమ్మతించి బిల్లు పంప
నానా యాగీ చేసిరి!!

విషం కక్కినారయ్యా,
కుట్ర చేసినారయ్యా!
దుష్టమైన కుతంత్రాల
దౌర్జన్యం చేసిరయా!!

దైవం మన పక్షముండె,
ధర్మం మన పక్షముండె!
రాజ్యాంగం మనకిచ్చిన
అధికరణం మూడు ఉండె!!

సీమాంధ్రుల చేతలలో
న్యాయమ్మే లేదయ్యా!
సీమాంధ్రుల మాటలలో
న్యాయమ్మే లేదయ్యా!!

ఎన్ని కూతలను కూసిన,
వెర్రి చేతలను చేసిన,
న్యాయపక్ష తెలంగాణ
రాష్ట్రమ్మేర్పడునయ్యా!!

అనుభవజ్ఞు లనుచుండిరి
మేధావులు అనుచుండిరి
న్యాయమూర్తు లనుచుండిరి
తెలంగాణ మేర్పడునని!!

అన్యాయాంధ్రుల మాటలు
చెల్లవనుచు పలుకుచుండ్రి!
అన్యాయాంధ్రుల పాలన
సాగదనుచు పలుకుచుండ్రి!!

కేంద్రము సంకల్పించిన
మహాయజ్ఞమందు అన్ని
రాజకీయ పార్టీలిక
జతకట్టియు గెలిపింతురు!!

దుష్ట వాదనల బూచులు
యజ్ఞమందు నశియించును!
పసలేని కుతర్కమంత
మాడి మసై నశియించును!!

తెలంగాణ సోదరా,
బెంగ పడుట మానరా!
మన రాష్ట్రం మనకేర్పడి
చింత తొలగు నిజమురా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఫిబ్రవరి 01, 2014

అపర విష సర్పాలు!


పత్రికొక్కటి ఉన్నచో పది
వేల సైన్యమటంచు చెప్పుచు,
సత్యమును విడనాడి, విషమును
కక్కగానేలా?

వార్తయందున జగము నడచున
టంచు చెప్పిన కవుల సూక్తిని
సరకు సేయక నేడు విషమును
కక్కగానేలా?

ప్రజల కెప్పుడు యథార్థమ్మును
శీఘ్రగతితో తెలియజేయక,
ఆంధ్రమీడియ నేడు విషమును
కక్కగానేలా?

ఎలక్ట్రానికు, ప్రింటు మీడియ
లిపుడు చేయుచునున్న ధౌర్త్యము
వాటి నైజము బహిర్గతముగ
చేయుచున్నవయా!

ఇంత విషమును కక్కుటేలా?
అసత్యమ్ములు రాయనేలా?
తెలంగాణులు తమకు చేసిన
ద్రోహమేమిటయా??

"బిల్లు" విజయము ప్రక్కనుంచియు,
కపట నోటీస్ గెలిచెనంచును
తెలంగాణము పైన విషమును
కక్కగానేలా?

చర్చ ముగిసిన పిదప బిల్లును
ఎటు తిరస్కరణమ్ము చేతురు?
అనెడి జ్ఞానము తమకు లేకయె
విషము కక్కుదురా??

ఆర్టికలు మూడున కసెంబ్లీ
రూలు డెబ్బది ఏడునకును
ఎట్టి సంబంధమ్ముగలదో
తెలియదా తమకున్?

తెలిసి తెలిసి యసత్యవార్తలు
రాయుటకు మన సెట్టులొప్పెను?
అపర విషసర్పాల వలె మము
కాటు వేయుదురా?

అధర్మయుత సీమాంధ్ర పక్షము
జేరి వారల మెప్పుబడయగ
ధర్మపక్షులు తెలంగాణుల
మోసగింతురొకో?

ధర్మపక్షము నిలువుడయ్యా,
న్యాయమును కాపాడుడయ్యా,
విషముకక్కుట మానివేసియు
మెప్పుగొనుడయ్యా!!

వృత్తి ధర్మము నిర్వహించియు
ప్రజలలో ఘనకీర్తి పొందియు
పత్రికలె మన బలమటంచును
నిరూపింపుడయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!