గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఫిబ్రవరి 26, 2015

’రామసేతు’ను చూసినట్టుగా...’భద్రాచలం”ను చూడరా...???

images of bhadrachalam కోసం చిత్ర ఫలితంimages of bhadrachalam కోసం చిత్ర ఫలితం
images of bhadrachalam కోసం చిత్ర ఫలితంimages of bhadrachalam కోసం చిత్ర ఫలితం

సేతు సముద్రం ప్రాజెక్టు కోసం పది కిలోమీటర్ల శిలను తొలిస్తేనే,
పర్యావరణానికి ముప్పు అని, సముద్ర జలాలకు ఆవాసం లేకుండా
పోతుందని, ఔషధ మొక్కలు నాశనం అవుతాయని, అరుదైన జాతి జీవాలు, వృక్షాలు కనుమరుగు అవుతాయని గగ్గోలు పెట్టారు.
మరి లక్షల ఎకరాలు ముంచి పోలవరం కడితే పర్యావరణానికి ఎంత ముప్పు కలగాలి?
ఎంత మంది నిరాశ్రయులు కావాలి? ఎన్ని అరుదైన జాతులు అంతరించాలి?
 

’ఇది రామభక్తుల ప్రభుత్వం. జై శ్రీరాం నినాదాలు చేసే వారిది!’ అని కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు నితీష్ గడ్కరీ ఇటీవలే ప్రకటించారు. సంతానం విషయంలో, పీకే సినిమా విషయంలో కాషాయదండు నుంచి చాలా ప్రకటనలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనల లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్రం ప్రభుత్వం ఇటీవల చేస్తున్న కొన్నిపనులు, ప్రయత్నాలు తాము నిజమైన రామభక్తులమని, రాముడి చరిత్ర అవశేషాల పరిరక్షకులమని చాటే విధంగానే ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో అయోధ్య నుంచి నేపాల్ లోని జానక్‍పూర్‍కు ఓ రహదారి నిర్మించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసేందుకు చిత్రకూట్‍లోని అడవులకు ఈ మార్గం ద్వారానే వెళ్లారు కాబట్టి, ఈ దారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి నిర్మాణాలు, ప్రయత్నాలు గతంలో కూడా చాలానే జరిగాయి. అసలు రాముడి పేరు చెప్పుకునే బిజెపి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. రాముడిపై బిజెపికే పేటెంట్ హక్కు ఉందన్నట్లు ఉంటుంది ఆ పార్టీ ధోరణి. అందుకే రాముడి చరిత్రకు సంబంధించిన ఏ అంశానికైనా బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం సామాన్యులకు కలుగుతుంది. రాముడు పుట్టినట్లు చెబుతున్న అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ ప్రతీ ఎన్నికల్లో చెబుతూ వస్తుంది కూడా. సీతను అపహరించి బంధించిన లంకకు వెళ్లడానికి రామసేతును నిర్మించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని కూడా అలాగే పరిరక్షిస్తామని, రామసేతును ధ్వంసం చేసేది లేదని కూడా బిజెపి నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అవసరం ఉన్నా , లేకపోయినా ప్రతీ సారీ చెబుతూనే ఉన్నారు. కానీ, రాముడి చరిత్రకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలు, రాముడి జీవితంతో ముడిపడి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతాలన్నింటి విషయంలోనూ బిజెపి ఇదే వైఖరి కలిగి ఉందా? అనేది విశ్లేషించుకుంటే బిజెపి ద్వంద్వ వైఖరి బయటపడుతుంది.

రామసేతు విషయంలో హిందువుల మనోభావాల పేరుతో బిజెపి, సంఘ్ పరివార్ నాయకులు చేస్తున్న హంగామా దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. హిందూ మహాసముద్రం ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చే నౌకలు భారత్ చేరుకోవాలంటే ప్రస్తుతం శ్రీలంక అవతలి నుంచి రావాల్సి వస్తుంది. వేరే దేశం నుంచే కాదు, భారత దేశంలోని అరేబియా తీర ప్రాంతాల నుంచి ఇతర నగరాల నుంచి హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు నౌకలు చేరుకోవడానికి కూడా శ్రీలంక దేశం నుంచి తిరిగి రావడం ఆర్థికంగా, సమయపరంగా కూడా భారమే.
మలేసియా, తైవాన్, సింగపూర్‌తో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు, దేశంలోని ముంబాయి తదితర నగరాల నుంచి వచ్చే నౌకలు 424 నాటికల్ మైళ్లు(780 కిలోమీటర్లు) దూరం, 30 గంటల సమయం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తున్నది. మద్రాస్, తుతుకుడి, కన్యాకుమారి లాంటి ప్రాంతాలకు భారత పరిధిలోని సముద్ర జలాలలకు ఆనుకునే ఉన్నప్పటికీ, అక్కడ సముద్రంలో ఉన్న పర్వత శ్రేణులు, శిలల వల్ల నౌకల రాకపోకలు కుదరడం లేదు. రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాని వల్లే నౌకలు నేరుగా భారత్ చేరుకోవడం లేదు. ఇది సరుకు దిగుమతి చేసుకునే భారత్‍పై ఎంతో భారం పడే అంశం. ఈ దూరాన్ని, భారాన్ని తగ్గించడానికి సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి మొదలుకుంటే నేటి వరకు ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడం...ఏదో ఓ కారణం చేత ఆగిపోవడం...పరిపాటిగా మారింది. యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడు, అందులో డిఎంకె భాగస్వామిగా ఉన్నప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టు తెరమీదికి వచ్చింది. అప్పటి కేంద్ర షిప్పింగ్ మంత్రి టిఆర్ బాలు ఈ ప్రాజెక్టు కట్టి తీరాల్సిందే అనే పట్టుదల ప్రదర్శించారు. కరుణానిధి కూడా అండగా నిలిచారు. ధనుష్కొటి-శ్రీలంకల మధ్య సముద్ర జలాల్లో ఉన్న రాళ్ళను, గుట్టలకు ఓ పది కిలోమీటర్ల మేర తొలగిస్తే నౌకలు శ్రీలంక అవతలి నుంచి రావాల్సిన అవసరం ఉండదు.
కన్యాకుమారి పక్క నుంచే రావచ్చు. కానీ ఈ ప్రాజెక్టును బిజెపి, సంఘ్ పరివార్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ధనుష్కోటి-శ్రీలంకల మధ్య సముద్రంలో ఉన్న పర్వతం లాంటి ప్రాంతం సహజసిద్ధంగా ఏర్పడింది కాదని వాదించాయి. అది సీతను రావణాసురుడి చెరనుంచి విడిపించడానికి రాముడు వెళ్లడానికి నిర్మించిన వారధి అని రామాయణం వినిపించాయి. దాన్ని తొలగించడమంటే రాముని చరిత్ర ఆనవాళ్లను చెరిపేయడమే అని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ బండరాళ్లను ఆధారం చేసుకుని ఎన్నో జలజీవాలున్నాయని, ఔషధ మొక్కలున్నాయని, వాటిని రక్షించడం కూడా ముఖ్యమేనని చెప్పాయి. ఆ శిలలను తొలగిస్తే పర్యావరణానికి కూడా ముప్పు అని వాదించాయి. ఈ వాదనను డిఎంకె, మరికొన్ని పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అసలు రాముడి వారధి అని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదని, శిలలను తొలగించకుండా అడ్డుపడడమంటే అభివృద్ధికి అడ్డుపడడమే అని కూడా కరుణానిధి చెప్పారు. ఆ వాద, ప్రతివాదనల నేపథ్యంలో సేతుసముద్రం కెనాల్ ప్రాజెక్టు మూలన పడింది.
రాముడు అయోధ్యలో పుట్టాడని, చిత్రకూట్ లోని అడవుల్లో సంచరించాడని, లంకకు వారధి కట్టారని నమ్మే ప్రతీ ఒక్కరు...భద్రాచలం ప్రాంతంలో రాముడి అడుగు జాడలను కూడా నమ్ముతారు. వనవాసంలో భాగంగా రాముడు భద్రాచలం అడవుల్లో కూడా గడిపాడని రామాయణం నమ్మే వారంతా విశ్వసిస్తారు. దక్షిణ అయోధ్యగా కూడా భద్రాచలానికి పేరుంది. సీతారామచంద్రులు ఎంతో అన్యోఽన్యంగా, ప్రేమగా గడిపిన ప్రాంతంగా భద్రాచలాన్ని చెప్పుకుంటారు. ఈ ప్రాంత పరిసరాలన్నీ రాముడి కథతో ముడిపడి ఉన్నవే. వాల్మీకి మహర్షి వర్ణించిన ప్రస్రవణ పర్వతములనే ’పాపికొండలు’ అని పిలుస్తున్నారు. రామాయణ గాథ ప్రకారం... సీతమ్మను ఎత్తుకుపోతున్న సందర్భంలో పక్షిరాజు జటాయువు రావణాసురుడ్ని అడ్డగిస్తుంది. రావణుడితో పోరాడుతుంది. అప్పుడు రావణుడు కత్తితో జటాయువుపై దాడి చేస్తాడు. ఆ దాడిలో జటాయువు రెక్క విరిగి కింద పడుతుంది. ఆ రెక్కపడిన ప్రాంతమే నేటి ’రేకపల్ల”. మొండెం పడిన ప్రాంతమే ’శ్రీరామగిర”. ఆ జటాయువును రాముడు తండ్రితో సమానంగా భావించి పిండప్రదానం చేస్తాడు. ఆ ప్రాంతాన్నే ’జటాయుబండ’గా పిలుస్తున్నారు. చలికాలంలో సీతమ్మ స్నానం చేయడానికి రాముడు గోదావరి నది నీటిని తన ఆగ్నేయాస్త్రంతో వేడి చేస్తాడు. రెండు గుంటల్లో నీరు ఇప్పటికీ వేడిగా ఉంటుంది. వాటినే ఇప్పుడు ’ఉష్ణగుండాలు’గా పిలుస్తారు. 
భద్రాచలం చుట్టుపక్కల ఉన్న పర్ణశాల, రేకపల్లి, పాపికొండలు, జటాయుబండ, శ్రీరామగిరి, ఉష్ణగుండాలు.. ఇవన్నీ రాముడి కథతో సంబంధం ఉన్న ప్రాంతాలే. వీటిలో పర్ణశాల, భద్రాచలం తెలంగాణలో మిగిలిపోగా.. రేకపల్లి, పాపికొండలు, జటాయుబండ, ఉష్ణగుండాలు, శ్రీరామగిరి ఆంధ్రప్రదేశ్‍లో కలిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ప్రాంతాలన్నీ పోలవరం ప్రాజెక్టువల్ల ముంపుకు గురై, జలసమాధి కానున్నాయి. 
సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల దేశానికి ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ అది రాముడి వారధి కాబట్టి దాన్ని ముట్టుకోవద్దంటున్నారు.
మరి పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా రాముడి చరిత్రలో భాగమైన ప్రాంతాలన్నీ మునిగిపోనున్నాయి...కనుమరుగు కానున్నాయి.
బిజెపి ప్రభుత్వమే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, డబ్బులిచ్చి కట్టిస్తోంది.
మరి రామసేతుకు వర్తించిన నియమాలు భద్రాచలానికి, పోలవరానికి వర్తించవా?
సేతు సముద్రం ప్రాజెక్టు కోసం పది కిలోమీటర్ల శిలను తొలిస్తేనే, పర్యావరణానికి ముప్పు అని, సముద్ర జలాలకు ఆవాసం లేకుండా పోతుందని, ఔషధ మొక్కలు నాశనం అవుతాయని, అరుదైన జాతి జీవాలు, వృక్షాలు కనుమరుగు అవుతాయని గగ్గోలు పెట్టారు.
మరి లక్షల ఎకరాలు ముంచి పోలవరం కడితే పర్యావరణానికి ఎంత ముప్పు కలగాలి? ఎంత మంది నిరాశ్రయులు కావాలి? ఎన్ని అరుదైన జాతులు అంతరించాలి?
ఇది రామభక్తుల ప్రభుత్వమని కేంద్ర మంత్రులు చాటుకుంటున్నారు.
రామసేతు విషయంలో ప్రదర్శించిన రామభక్తిని భద్రాచలం విషయంలో ఎందుకు ప్రదర్శించడం లేదు.
రామభక్తి కూడా అవకాశవాదంలో భాగమేనా?
వీళ్ళు ’రామసేతు’ను చూసినట్టుగా...’భద్రాచలం’ను చూడరా???

-గటిక విజయకుమార్
(ఆధారంకై: రామసేతు...భద్రాచలం...పై నొక్కండి)

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


బుధవారం, ఫిబ్రవరి 25, 2015

ఇంటి దొంగలు 1,150 మంది...!!!

-ఇందిరమ్మ స్కాంపై సీఐడీ నివేదిక సిద్ధం
-రెండురోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ
-18 నియోజకవర్గాల్లో 36 గ్రామాల పరిశీలన
-రూ. 250 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తింపు
-ప్రభుత్వం అనుమతితో తదుపరి చర్యలు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అక్రమార్కుల చిట్టా సిద్ధమైంది. ఆరునెలలుగా దర్యాప్తు సాగిస్తున్న సీఐడీ ఇందిరమ్మ ఇండ్ల స్కాంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు.. ఇలా దాదాపు 1150 మందిని నిందితులుగా గుర్తించింది. అందులో భాగంగా హౌసింగ్ డీఈలు, ఏఈలు, ఎండీవోలు, ఎంఆర్‌వోలు, వీఆర్‌వోలు, వీఓలు, బ్రోకర్లు, డబుల్ బెనిఫిషియర్లను నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 నియోజకవర్గాల్లోని 36 గ్రామాల్లో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ, దర్యాప్తు చేసి నివేదిక రూపొందిస్తున్నది. రెండురోజుల్లో ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. అయితే కేవలం 36 గ్రామాల్లో జరిపిన ప్రాథమిక విచారణలో రూ.250 కోట్లవరకు నిధులు దుర్వినియోగం అయినట్టు అధికారులు తేల్చారు. ఇల్లు మంజూరై నిర్మించుకున్న విషయం అర్హత పొందిన వ్యక్తికి తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు.

ఇక ఇండ్లు కట్టకుండానే కట్టినట్టు ఫొటోలు సృష్టించారు. వాటికి డీఈలు, ఏఈలు, ఎండీవోలు, ఎంఆర్‌వోలు, వీఓలు.. బిల్లులు మంజూరు చేసి భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారు. దళారులు అర్హుడి పేరిట బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి తెలియకుండానే డబ్బులు కూడా డ్రా చేసినట్టు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.


దర్యాప్తు జరిపిన నియోజకవర్గాలు..రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో శాంపిల్ సర్వే పేరిట దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ప్రతి జిల్లాలో ఒక్కో కేసు నమోదు చేసింది. ఈ కేసులను విచారణ జరిపేందుకు జిల్లాకో బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇలా తొమ్మిది బృందాలు గ్రామస్థాయిలో దర్యాప్తు చేశాయి. ఇండ్ల స్కాంలో ఉన్న ప్రతి గ్రామాన్ని తిరగడం కష్టసాధ్యం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా 18 నియోజకవర్గాలను ఎంచుకుంది. జిల్లాకు రెండు నియోజకవర్గాలు, నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంచుకొని దర్యాప్తు ప్రారంభించింది. మండలాల్లోని ఎంపీడీవో, ఎంఆర్‌ఓ కార్యాలయాల నుంచి ఇండ్ల మంజూరు, నిధులు, వాటి లెక్కలకు సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది.

ఎంచుకున్న రెండు గ్రామాల్లోకి వెళ్లి ప్రతిఒక్క లబ్ధిదారుడిని ప్రశ్నించింది. అసలు ఇండ్లే కట్టకుండా లక్షల్లో నిధులు నొక్కేశారని సీఐడీ ఆధారాలతో సహా తేల్చింది. ఇలా నారాయణ్‌ఖేడ్, ఆందోల్, డోర్నకల్, భూపాలపల్లి, పాలేరు, అశ్వారావుపేట, ఎల్లారెడ్డి, బోధన్, మంథని, హుజురాబాద్, నాగార్జునసాగర్, దేవరకొండ, ఖానాపూర్, ఆసిఫాబాద్, కొడంగల్, అలంపూర్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిధులు పక్కదారి పట్టాయని స్పష్టంగా నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.



  1. (నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!!


మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

మహాత్ముడు...మహానేత...కేసీఆర్!!!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


అహింసే ఆయుధంగా.. తెలంగాణను నడిపించినవాడు!!

kcr-brithday2

కొందరు గుర్తించవచ్చు. కొందరు గుర్తించ నిరాకరించనూ వచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అషామాషీ కార్యక్రమం కాదు. ఏదో పుస్తకాల్లో.. ఎవరో రాసిన లేదా తయారు చేసిన నమూనాను తీసుకువచ్చి పదేపదే ప్రతి కార్యక్రమానికి ఆ పుస్తకాన్ని తిరగేసి మార్గదర్శనం పొందడం ద్వారా సాధించింది అంతకన్నా కాదు. తెలంగాణను.. ఇక్కడి మనుషులను..సమాజస్థాయిని.. ఇక్కడి ప్రభుత్వాన్ని.. దేశకాల పరిస్థితులను.. ప్రపంచవ్యాప్త ధోరణులను అన్నింటినీ అవపోసన పట్టి మేధోమథనం చేసి రూపకల్పన చేసిన గొప్ప ప్రణాళిక.

ఈ ప్రణాళికను అంచెలంచెలుగా అమలుచేసి అనుకున్నది సాధించిన వీరుడు కేసీఆర్. ప్రాంతాలు వెనుకబడి ఉండడం ద్వారా ప్రజల ఆలోచనలు కురచగా మారుతాయా? లేక మనుషుల ఆలోచనల కురచదనం వల్ల ప్రాంతాలు వెనుకబడతాయా? అనేది ఇదమిద్ధంగా చెప్పలేం కానీ.. ఇలాంటి సమాజాల్లో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా చాలా కష్టం. వేయి మంది వెనక్కి లాగే వారుంటారు. ప్రజలు సులభంగా విశ్వసించరు. నిందలు వేసేవారు వేనవేలు. అగ్నిపరీక్షలకు నిలబడాలి. త్యాగాలకు సిద్ధపడాలి. ఎదురైన ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పాలి. ఆ పరీక్షలన్నింటినీ కేసీఆర్ ఎదుర్కొన్నారు. అనుకున్న మార్గంలో ఉద్యమరథాన్ని నడిపి గమ్యాన్ని ముద్దాడారు.

Kcr-Cartoon

కొత్తమార్గం..: రాష్ట్రసాధనకు కేసీఆర్ ఎంచుకున్నది కొత్తపంథానే. పాపమో.. శాపమో కానీ మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా నెత్తురోడకుండా ఏర్పాటు కాలేదు. ఓం ప్రథమం ఆంధ్ర రాష్ట్రమే పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం.. అదుపు తప్పిన హింసలోంచి పుట్టుకు వచ్చింది. ఆ వేళావిశేషం అన్ని రాష్ర్టాలు హింసాత్మక వాతావరణాలనుంచే పుట్టాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆవిర్భవించిన చివరి మూడు రాష్ర్టాలు జార్ఖండ్, ఉత్తరాంచల్, వనాంచల్(ఛత్తీస్‌గఢ్)లకు కూడా హింసాత్మక ఉద్యమాల చరిత్ర ఉంది. ఇక తెలంగాణ ప్రజాఉద్యమాలకు రక్తసిక్త చరిత్ర ఉంది. ఇడ్లీసాంబార్ గోబ్యాక్‌నుంచి జై తెలంగాణ దాకా అన్నీ హింసను ఆశ్రయించుకున్నవే. ఫలితంగా అనేక మంది బిడ్డలను పోగొట్టుకున్న అనుభవం. ఆ మార్గాలు విజయం సాధించలేకపోవడం కండ్లముందున్న ఉదాహరణ. మహాశక్తి మంతమైన మదగజంకూడా అంకుశం పోటుకు లొంగిపోతుంది. ప్రభుత్వాలను వంచే అంకుశం పార్లమెంటు.

దాన్ని సాధించేది రాజకీయ ప్రజాస్వామ్య పంథా. తెలంగాణ సాధనకు కేసీఆర్ ఆ పంథాను ఎంచుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి అధికసీట్లు సాధించడం ద్వారా ప్రభుత్వాలను లొంగదీసి రాష్ర్టాన్ని సాధించడం.. 14 ఏండ్లపాటు సడలించకుండా జరిపిన నిరంతర ఉద్యమాలతో మదగజం తలొగ్గింది. తెలంగాణ సాకారమైంది. ఈ మధ్య కాలంలో ఎన్ని నిందలు? ఎన్ని ఆరోపణలు? ఎంతటి వెటకారాలు? ఎన్ని వెన్నుపోట్లు?... ఓట్లు సీట్లతో రాదన్నారు. పదవుల కోసమే తెలంగాణ అని నిందలు వేశారు. ప్రజాఉద్యమాలు మాత్రమే తెలంగాణ తెస్తాయని ప్రవచించారు. కానీ... సడలని నమ్మకం విజయం సాధించింది. రాజకీయ పంథాయే గెలుపు మార్గమైంది. మార్గాన్ని తెలిసిన వాడు మార్గదర్శకుడు.

కేసీఆర్..మార్గదర్శకుడు!! కలలు కన్నవాడు..


kcr-brithday

నాకో కల ఉంది... ఏదో ఒక రోజు ఈ దేశంలో నా నలుగురు పిల్లలూ వాళ్ల రంగును బట్టి కాకుండా వారి సామర్థ్యంతో గుర్తించబడతారని...నాకో కల ఉంది. ఒక రోజు అలబామాలో నల్లజాతి పిల్లలు, తెల్లజాతి పిల్లలు అన్నాతముళ్లు అక్కా చెల్లెళ్లలాగా చేతులు కలుపుతారని... 1963 ఆగస్టు 28న వాషింగ్టన్‌లో రెండు లక్షల మంది నల్లజాతి పౌరహక్కుల ఉద్యమకారులనుద్దేశించి మార్టిన్ లూథర్‌కింగ్ చేసిన చారిత్రక ఐ హావ్ ఏ డ్రీమ్‌ప్రసంగ మిది.

అచిరకాలంలోనే ఆయన కోరిక నేరవేరింది. జాతి విచక్షణ అంతం చేసే బిల్లును అమెరికా పార్లమెంటు ఆమోదించింది. కేసీఆర్ కూడా అలాంటి స్వాప్నికుడే. తెలంగాణ తప్పక సాకారమవుతుంది. ఎందుకంటే మాది ధర్మపోరాటం. మాది మాకు కావాలని అడుగుతున్నం. ఇంకొకల్లది కావాలని అంటలేం.... ఒక రోజు వస్తది. తెలంగాణ మొత్తానికి మొత్తం గిరిగీసి ఒక్క దిక్కు నిలబడతది. మా తెలంగాణ మాకు ఇవ్వాలని గర్జిస్తది. ప్రజలంతా ఒక్కతాటి మీదికి వచ్చినంక ఆ ప్రజాస్వామిక ఆకాంక్షను పార్లమెంటు కానీ కేంద్రం కానీ గుర్తించక తప్పదు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షను ఎంత గొప్ప ప్రభుత్వం కూడా బుల్డోజ్ చేయడం సాధ్యం కాదు.... తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలబడదనేది దుష్ప్రచారం. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటది. మీరు చూస్తూ ఉండండి... మేం రాష్ర్టాన్ని కడుక్కు తాగటానికి అడగడం లేదు. ఇక్కడ అద్భుతమైన వనరులు ఉన్నై. రేపటి రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి. నదుల నీళ్లు మళ్లించి బీడు భూములు సస్య శ్యామలం చేయాలి. ప్రపంచంలోనే అద్భుతమైన వాతావరణం తెలంగాణది.

ఇక్కడ పరిశ్రమలు వెల్లువెత్తాలి. ఇప్పటికే వరల్డ్ సీఈవోల సమావేశం హైదరాబాద్‌ను పరిశ్రమల స్థాపనకు ఉత్తమమైందని ప్రకటించింది. పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతం. ఇక్కడి నేలలు విత్తనాభివృద్ధికి ఎంతో అనుకూలం తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేస్తం. ఇక కేజీ టు పీజీ నాకున్న పెద్ద కల. ఒక జనరేషన్‌ను మనం తీర్చి దిద్దితే అనేక తరాలు బాగుపడతయ్..ఇది ఓ సీమాంధ్ర టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆవిష్కరించిన ఆయన స్వప్నం. ఇవాళ ఆ స్వప్నాన్ని పాలనలో తర్జుమా చేయడం చూస్తున్నాం.

శ్రీకృష్ణ కమిటీ నిరాశ పరిచిన వేళ...


kcr-victory

ఉద్యమ నేత ఉద్రేకాలు రేపటమే కాదు.. కష్టాల్లో అండగా ఉండి కన్నీళ్లు తుడవాలి. భరోసానివ్వాలి. తెలంగాణ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక యువకులు, విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బ తీసిన వేళ..బలిదానాలు పెరుగుతున్న వేళ కేసీఆర్ చేసిన ప్రసంగం వారికి కౌన్సెలింగ్. ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ చెప్పిన మాటలు వారిలో మనోధైర్యాన్ని కలిపించింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు..ఎట్లున్నదంటె ఇటున్నోడు ఇటు చెప్పుకోవచ్చు.. అటున్నోడు అటు చెప్పుకోవచ్చు. ఎవ్వనికి వాటమున్నట్టు వాడు చెప్పుకోవచ్చు. మేం సాఫ్‌సీదా మాట చెప్తున్నం.

kcr-ghandi

తెలంగాణకు వాటమున్నది ఏందంటె.. రివర్టింగ్ బ్యాక్ టు నైంటీన్ ఫిఫ్టీసిక్స్ అని అన్నరు.. మాకు గావల్సింది అదే...మేము అడుగుతున్నదిగూడగదె.. అని చెప్పి సాంత్వన కలిగించారు. కమిటీ నివేదికతో కథ ముగిసి పోలేదని చెప్పేందుకు అదే వేదిక మీద ఉద్యమ మార్గం ప్రకటించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో తిరిగి ఉద్యమం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. నిరాశపడ్డ యువతకు గుండెల్లో బాధ గాలిపింజల్లా తేలిపోగా ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగించాయి. అదే సమయంలో బలిదానాలు తన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కేసీఆర్ యువతకు సందేశం పంపిచారు.

నేను తెలంగాణ యువకులకు, తెలంగాణ విద్యార్థులకు దండం పెట్టి చెప్తున్న.. మీ కడుపుల తల పెట్టి చెప్తున్న.. మీరు మిమ్ములను మీరు కాల్చుకోని చచ్చిపోతె.. మేంగూడ ఇక్కడ సగం కాలిచచ్చిపోతం. కూలిపోతం. మానసికంగ దెబ్బతింటం. కాబట్టి దయచేసి ఎవ్వరుగూడ భయపడొద్దు. కచ్చితంగా తెలంగాణ వచ్చే కోసం వచ్చేవరకు మనం పోరాటం చేద్దాం. ఎనుకకు పోయె సమస్యే లేదు. మడమ తిప్పే ముచ్చటే లేదు. ఎవ్వరుగూడ దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇగ తప్పదనుకుంటె గిట్ట నేనే దీక్షకుపోత.. ఉంటె ఉంటా పోతెపోత. ఇగ ఎందాకైతె అందాక! అంటూ చెప్పిన ఆయన మాటలు యువత మనోధైర్యాన్ని రీచార్జి చేశాయి.

కేసీఆర్.. సాంత్వననిచ్చిన సమాజ వైద్యుడు !!
జాతికి ఔన్నత్యం గుర్తుచేసిన వాడు..


ఏ జాతి అయినా తన పూర్వీకులనుంచి.. వారసత్వంనుంచి స్ఫూర్థి పొందుతుంది. ఘనమైన వారసత్వం.. తిరిగి దాన్ని సాధించాలనే కాంక్షకు కారణమవుతుంది. కేసీఆర్‌కు ముందు తెలంగాణ ఔన్నత్యం గురించిన ప్రచారం లేదు. సీమాంధ్రపాలకుల పుస్తకాల్లో తెలంగాణలో అంధకారయుగం అన్నారు. ఆ అంధకారంలో ఉన్న తెలంగాణకు అత్యున్నత చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వం ఉందని ఊరూరా చాటింది కేసీఆర్. అలాగే మోహావేశ బంధనమైన తెలుగు తల్లి భావనకు బద్దలు కొట్టిందీ కేసీఆరే. తెలంగాణ తల్లికి రూపమిచ్చి ఊరూరా విగ్రహాలు సృష్టించింది ఆయనే. ఇక నిజాం వారసత్వం మీద తెలంగాణ చరిత్ర మీద జరిగిన దుష్ప్రచారాన్ని చీల్చి చండాడింది కూడా కేసీఆరే. ఒకనాటి హైదరాబాద్ రాష్ట్ర సిరిసంపదలు, వసతులు, వనరులు, వైభవాన్ని చరిత్రకారులు శోధించి వెలికితీయడం దానికి జత కూడింది. గొప్ప వారసత్వం ఉన్న జాతి జరిపిన ఏ పోరాటం విఫలమైన చరిత్ర లేదు. అది తెలంగాణలోనూ వాస్తవరూపం దాల్చింది.

కేసీఆర్.. ఒక స్ఫూర్తి ప్రదాత!!
గాంధీ మార్గంలోనే..


తెలంగాణ సాధనకు కేసీఆర్ నడిపిన ఉద్యమానికి స్వాతంత్య్రం కోసం గాంధీ నడిపిన ఉద్యమానికి అనేక పోలికలు కనిపిస్తాయి. రెండు ఉద్యమాల్లో ఎక్కడా ఏ దశలోనూ హింసకు తావునివ్వలేదు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా గాంధీ ఉద్యమం సాగితే, కేసీఆర్ అదే రీతిలో ఉద్యమాన్ని నడిపించారు. ఒక్క చుక్క నెత్తురు నేల రాలకూడదు అని జలదృశ్యంనాడు చెప్పిన మాట అక్షరాలా అమలు చేశారు. ఆ స్ఫూర్తినే ప్రజలు కూడా అందుకున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు నాయకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఏ దశలోనూ ఏ ఒక్క సీమాంధ్రునిపై చేయి వేసిన సందర్భం లేదు. నిరాశ కమ్మిన వేళ తమను తాము దహించుకున్నారే తప్ప దాడులకు దిగలేదు. బతుకమ్మలాటలు...తెలంగాణ సంబురాలు..వంటా వార్పు వంటి కార్యక్రమాలు ప్రజాగ్రహాన్ని సాంస్కృతిక రూపంలో వెలువరించేందుకు ఉపకరించాయి. ఆగ్రహం స్థానంలో సంయమనాన్ని పాదుకొల్పాయి. హింసను ఆశ్రయించరాదన్న కేసీఆర్ ధృఢ సంకల్పం విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల పాలననుంచి నల్లజాతిని విముక్తి చేసిన నెల్సన్ మండేలా కూడా ఇక్కడ మనకు గుర్తుకొస్తారు.

కేసీఆర్.. మొక్కవోని గాంధేయవాది!
నిరాహార దీక్ష...


kcr-nims

కేసీఆర్ పాటించిన అహింస, అగ్ని పరీక్షలకు ఇది పతాక సన్నివేశం. ఫలితం దైవాధీనం.. కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు. పార్లమెంటులో బలం లేదు. అసెంబ్లీలోనూ బలం లేదు. కేవలం ప్రజాబలాన్ని నమ్ముకుని దీక్ష ప్రారంభించారు. ఎన్నో వ్యంగ్యాలు.. వక్రీకరణలు..అయినా చెక్కు చెదరలేదు. ఫలితం తెలంగాణ ప్రకటన సాధన. తెలంగాణ రాష్ర్టాన్ని అనివార్యం చేసిన చారిత్రక ఘటన అదే. ఆ తర్వాత కేంద్రం వెనక్కిపోయినా ముందుకు పోయినా తెలంగాణ ఆవిర్భావానికి పునాది అదే. ప్రజలకు కొండంత ధైర్యాన్ని, సాధించగలమనే నమ్మకాన్ని కల్పించిందీ కూడా అదే. ఆ తర్వాత జరిగిన పోరాటాలన్నీ దానికి అనుబంధ ఘటనలే!

కేసీఆర్....చరిత్రకారుడు! జాతిపిత..


2009లోనే తెలంగాణ ప్రకటన రాగానే జనమంతా పలికిన ఒకే ఒక్కమాట. తెలంగాణ జాతిపిత... అది ఏదో తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఈ జాతికి దాని గొప్పతనాన్ని నూరిపోసిన వాడు.. తెలుగు తల్లి వంటి మోహావేశ బంధనాలను బద్దలు కొట్టిన వాడు.. విముక్తి ప్రణాళిక రాసిన వాడు..కష్టంలో సాంత్వన పలికిన వాడు...యుద్ధంలో ముందు నిలిచినవాడు..వెన్నంటి ధైర్యం చెప్పిన వాడు.. పోరాడి విజయపతాక ఎగురవేసిన వాడు..కాబట్టే కేసీఆర్ నిస్సందేహంగా తెలంగాణ జాతిపిత!!!

ఒక్క పిలుపుతో ...


నేను ఒక్కటే మాట మనవి చేస్తున్న. పట్టుదలతోటి ఉన్నం కాబట్టే ఇయాల ఇక్కడిదాక మనం రాగలిగినం. కేంద్రం మంచిమాటతోని వస్తె వస్తది. రాకపోతె కచ్చితంగా మహోగ్రమైనటువంటి తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరుగుతది. దానికి మీకు ఎప్పటికప్పుడు సందేశం వస్తది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరం కలిసి సత్యాగ్రహంనుంచి మొదలు పెడితే మహోగ్రరూపం దాల్చి పూర్తిగ ప్రభుత్వ పరిపాలనను కూడా స్తంభింప చేస్తం. భూకంపం పుట్టించి అయినా.. ఆకాశం బద్దలు కొైట్టెనా సరే.. తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలె.

దాం ట్ల మాత్రమే మనకు విముక్తి ఉన్నది తప్ప ఇంక దేంట్ల లేదు. మన దారి మనం చూసుకోవాలె.. ఉద్యమం చేయాలె.. పోరాటాలు చెయ్యాలె.. త్యాగా లకు సిద్ధపడాలె.. తెలంగాణ తెచ్చుకోవాలె మన సకల సమస్యలకు దాంట్లోనే పరిష్కారం ఉంది.- 25 లక్షల మంది హాజరైన వరం గల్ మహాగర్జనలో కేసీఆర్ సందేశమిది. ఈ సభ ద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎత్తు లోతు ప్రపంచానికి అర్థమైంది. భూగోళం మీద జరిగిన పది మహా ప్రదర్శనల్లో ఈ సభ చోటు చేసుకుంది. ఆ తర్వాత అంచెలంచలుగా ఉద్యమం నిర్మాణం జరగడం.. పతాక సన్నివేశంగా సకల జనుల సమ్మె ప్రభుత్వ స్తంభనకు దారితీసి ఇక తెలంగాణ ఇవ్వడం అనివార్యం అని కాంగ్రెస్ నిర్ణయానికి రావడం మనకు తెలుసు.

కేసీఆర్.. ప్రజా ఉద్యమకారుడు!
తనను తాను హింసించుకుని..


ఇక ఉద్యమం చల్లారుతున్న ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ టీఆర్‌ఎస్ ఉప ఎన్నికలు తెచ్చి అగ్నిపరీక్షలకు సిద్ధపడ్డారు. గాంధీ ఇలాంటి సందర్భాల్లో సత్యాగ్రహం, ఉపవాసాలతో ప్రజలతో చైతన్యం నింపేవారు. మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఉప ఎన్నికల పరీక్షకు నిలిచారు. వాటి ద్వారానే తెలంగాణ వాదాన్ని ప్రకటించగలమని ఆయన విశ్వసించారు. ఒకటి రెండు సార్లు ఇబ్బంది పడ్డా అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికలే కీలక పాత్ర వహించి తెలంగాణ వాడిని వేడినీ చాటి చెప్పాయి.

తొలిసారి 2006లో కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడడం ఒక సాహసం. వాస్తవానికి అప్పటి పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేవు. సీమాంధ్ర సీఎం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాగేసి పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మరోవైపు అయిన వాళ్ల ఆరళ్లు. ఏం సాధించావనే సాధింపులు. పదవుల కోసం తెలంగాణ వదిలేశాడన్న అపనిందలు.. అన్నింటికీ కేసీఆర్ ఇచ్చిన ఏకైక జవాబు ఉప ఎన్నిక. తనను తాను ఫణంగా పెట్టడం..30 ఏండ్ల రాజకీయ జీవితాన్ని కూడా మొత్తంగా ఒడ్డడం ఇందులో అంశం. ఎందుకు ఎన్నిక అవసరమో ప్రజలకు వివరించారు.

తెలంగాణకు ఇది రిఫరెండం అని ప్రకటించి ఘన విజయం సాధించారు. గాంధీ చేసిన ఉపవాసవ్రతంలాంటిదే ఇదికూడా. ఆ తర్వాత సాధారణ ఎన్నికలలోపలే మరో భారీ ఉప ఎన్నికల పర్వం. ఎదురుదెబ్బలు తాకినా లక్ష్యం నెరవేరింది. 2004లో కాంగ్రెస్‌తో కలిస్తే పడ్డ ఓట్లు ఎన్నో..టీఆర్‌ఎస్ సొంత ఓటు బ్యాంకు ఎంతో తేటతెల్లమైంది. ఆ ఓటు బ్యాంకు మీద ఆశ టీడీపీతో తెలంగాణ తీర్మానం చేయించింది. తెలంగాణకు శాశ్వతంగా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి కలిగించింది. తెలంగాణ ప్రకటన తర్వాత చేసిన రాజీనామాలు తద్వారా వచ్చిన ఉప ఎన్నికలు వాటిలో సాధించిన మెజారిటీ చరిత్రకే కొత్త భాష్యం చెప్పాయి. కొన్ని పార్టీల పతనానికి బీజం వేశాయి.

నలుగురు నాయకులు.. మార్గం ఒకటే!


Gandhi

స్వరాజ్య సాధన అంటే ఇతరులను చంపేసి సాధించడం కాదు. నిరంతర ఆత్మత్యాగాలతో కూడిన స్వచ్ఛంద ఉద్యమంతో సాధించేది. అహింస అనే ఆయుధంతోనే మనం పోరాడుతున్నాం.. పోరాడాలి కూడా. ఎందుకంటే మన దగ్గర సత్యం అనే దీక్ష ఉంది. సత్యాగ్రహం అనే మార్గం ఉంది


Martin_Luther_King

మనం మొట్టమొదటగా చెబుతున్నది.. మనం అమెరికన్ పౌరులం.. అలాగే మనం హింసను ప్రోత్సహించం. అమెరికా ప్రజాస్వామ్యం ఇచ్చిన అత్యుద్భుత ఆయుధం ఆందోళన చేసే హక్కు. దాన్నే వినియోగించి జాత్యహంకారాన్ని బద్దలు కొడదాం. ఈ మార్గంలో మనం విజయం సాధిద్దాం


మార్టిన్ లూథర్ కింగ్ మాంట్‌గోమరి ప్రసంగం


The-Dalai-Lama

ఆత్మాహుతులు అహింసకు ప్రతిరూపాలే. తమను తాము దహించుకుంటున్న బౌద్ధ సన్యాసులు వాస్తవానికి ఆత్మాహుతి దళాలుగా మారిఉంటే వందల మంది శత్రువుల ప్రాణాలు పోయేవి. కానీ వాళ్లు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారే తప్ప ఇతరుల ప్రాణాలు తీయడంలేదు. అహింసా మార్గంలో ఇది పరమపవిత్ర ఆచరణ


కేసీఆర్.....ఒక దార్శనికుడు!


తెలంగాణ ఉద్యమం పూర్తిగా అహింసాపద్ధతిలోనే నిర్వహిస్తం. నెత్తురు చుక్క రాలనివ్వం. హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా తీవ్రంగా వ్యతిరేకిస్తం. ఉద్యమం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా సాగుతుంది. సంకీర్ణయుగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని పార్లమెంటులో సీట్లు సాధించడం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తం..